సాక్షి, హైదరాబాద్ : బియ్యపుగింజలపై కేవలం 150 గంటల్లోనే భగవద్గీత రాసి యువతి రికార్డ్ సృష్టించింది. హైదరాబాద్‌కు చెందిన రామగిరి స్వారిక అనే లా స్టూడెంట్ ఈ అరుదైన ఘనతను సాధించి అందరి ప్రశంసలు అందుకొంటుంది. భగవద్గీత 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలను మొత్తం 36,378 అక్షరాలతో కూడిన 9,839 పదాలతో 4,042 బియ్యపు గింజలపై రాశారు. చిన్నతనం నుంచే తనకు కళలపై ఆసక్తి ఎక్కువని గత కొన్నేళ్లుగా మైక్రో ఆర్ట్ చేస్తున్నానని వివరించింది.
2017లో ఒకే బియ్యపు గింజపై ఆంగ్ల అక్షరమాల రాసినందుకు గాను అత్యత్తుమ మైక్రో ఆర్టిస్ట్‌గా అంతర్జాతీయ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్వారిక చోటు సంపాదించుకున్నారు. స్వారిక ప్రతిభకు గానూ గతేడాది నార్త్ దిల్లీ కల్చరల్ అసోసియేషన్ రాష్ట్రీయ పురస్కార్‌ను ప్రధానం చేసింది. ఇప్పటివరకు వెయ్యికి పైగా మైక్రో డిజైనింగ్ చేసి పలు సత్కారాలు అందుకొంది.
Telangana: A law student & a micro artist in Hyderabad has written 'Bhagavad Gita' on 4,042 rice grains.
— ANI (@ANI) October 19, 2020
Ramagiri Swarika, artist says, "It took me 150 hrs to complete this. I've created over 2,000 micro artworks. I also do milk art, paper carving, drawing on sesame seeds etc." pic.twitter.com/KYYVRVsDks
Comments
Please login to add a commentAdd a comment