వరల్ రికార్డ్సు సృష్టించడం కోసం చాలా మంది విభిన్న రకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది భారీగా టాస్క్‌లు పెట్టుకుని ఆశ్చర్యం కలిగిస్తే..కొందరూ భలే ఈజీగా మనం రోజూ చూసే వాటితో క్లిష్టమైన టాస్క్‌లను చేసి రికార్డులు సృష్టిస్తుంటారు. అలాంటి కోవకు చెందిందే బంగ్లాదేశ్‌కు చెందిన ఈ మహిళ. ఏం చేసి రికార్డు సృష్టించిందో వింటే ఆశ్చర్యపోతారు.
చైనా వాళ్లు ఆహారం తినేందుకు ఉపయోగించే చాప్‌స్టిక్స్‌తో బియ్యం గింజలు తిని ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఫిబ్రవరి 17, 2024న బంగ్లాదేశ్ మహిళ సుమైయా ఖాన్ బియ్యం గింజలను చాప్‌స్టిక్స్‌తో తినడం అనే ఛాలెంజ్‌ని స్వీకరించింది.
అయితే సుమైయా చాప్‌స్టిక్‌లతో జస్ట్ ఒక నిమిషంలో దాదాపు 37 గింజలు తిని టాస్క్‌ని పూర్తి చేసింది. టాస్క్ పూర్తి అయ్యిన వెంటనే ఆనందంగా సంబరాలు చేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రపంచ గిన్నిస్ వరల్డ్ రికార్డ్సు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా నెట్టింట షేర్ చేసింది. గతంలో ఈ రికార్డు కాలిఫోర్నియాకు చెందిన టెలాండ్ లా అనే వ్యక్తి పేరిట ఉంది. అప్పడు టెలాండ్ ఒక నిమిషంలో 27 బియ్యం గింజలు తిని రికార్డు సృష్టించగా..దాన్ని సుమైయా బ్రేక్ చేయడం విశేషం.
(చదవండి: అధునాత రాతి కోట..! దేనిపై నిర్మిస్తున్నారో తెలుసా..?)
Comments
Please login to add a commentAdd a comment