టెస్ట్‌ల్లో టీమిండియా పేరిట ఉండిన ఓ భారీ రికార్డును శ్రీలంక బద్దలు కొట్టింది. ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండింది. 1976లో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్క సెంచరీ కూడా లేకుండా 529 పరుగులు (9 వికెట్ల నష్టానికి) చేయగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక శతకం లేకుండా 531 పరుగులు (తొలి ఇన్నింగ్స్) చేసి భారత్ రికార్డును బద్దలు కొట్టింది.
న్యూజిలాండ్‌తో జరిగిన నాటి మ్యాచ్‌లో ఆరుగురు భారత ఆటగాళ్లు అర్ద సెంచరీలు సాధించగా.. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ ఆరుగురు లంక ఆటగాళ్లు అర్ద శతకాలు బాదారు. లంక ఇన్నింగ్స్‌లో కుశాల్ మెండిస్ (93), కమిందు మెండిస్ (92 నాటౌట్) సెంచరీలకు చేరువగా వచ్చారు.
మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో పర్యాటక శ్రీలంక పటిష్ట స్థితిలో ఉంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు ఆరుగురు అర్దశతకాలు సాధించడంతో 531 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటయ్యారు. నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ 92 (నాటౌట్) పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో షకీబ్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. మహ్మదుల్ హసన్ జాయ్ 21 పరుగులు చేసి లహీరు కుమార బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ కాగా.. జకీర్ హసన్ (28), తైజుల్ ఇస్లాం (0) క్రీజ్‌లో ఉన్నారు.
బంగ్లాదేశ్.. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 476 పరుగులు వెనుకంజలో ఉంది. కాగా, ఈ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచి శ్రీలంక 1-0 కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment