Bhumipuja
-
న్యాయం మరింత బలోపేతం: చంద్రచూడ్
సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని విస్తరించడమంటే.. న్యాయాన్ని మరింత బలోపేతం చేయడమేనని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. భవిష్యత్తు న్యాయవ్యవస్థకు పునాదిరాయి వేయడమేనని పేర్కొన్నారు. సోమవారం రూ.800 కోట్లతో సుప్రీంకోర్టు విస్తరణ పనులకు సీజేఐ చంద్రచూడ్ భూమిపూజ చేసి కొబ్బరికాయ కొట్టారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్, జస్టిస్ బి.వి.నాగరత్న పాల్గొన్నారు. -
నేడు హైకోర్టు నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతోపాటు హైకోర్టు ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజేతో భేటీ సందర్భంగా హైకోర్టుకు నూతన భవన నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చిన విష యం తెలిసిందే. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవ నాన్ని నిర్మించి ఇస్తామని, త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను అదే రోజు ఆదేశించారు. అలాగే హైకోర్టును ఇక్కడి నుంచి తరలించినా.. ఇప్పుడున్న భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్‌గా పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటామని రేవంత్ చెప్పా రు. ఆ భవనాన్ని ఆధునీకరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టులకు వినియోగించుకునేలా చూస్తామని చెప్పిన విష యం విదితమే. ఆ తర్వాత మంత్రులు, న్యాయమూర్తులు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జీవో జారీ చేసింది. ఇదిలాఉండగా, బుధవారం శంకుస్థాపన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటుండటంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. -
ఎర్రనేలల్లో పసిడి పంట
తుగ్గలి(కర్నూలు): ఎర్ర నేలల్లో బంగారం పండనుంది. దాదాపు 45 ఏళ్లకు పైగా చేసిన సర్వేలు ఎట్టకేలకు ఫలించాయి. బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు మార్గం సుగమమైంది. ఈ మేరకు కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి–బొల్లవానిపల్లి మధ్య గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణానికి జియో మైసూర్ సర్వీసెస్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ చైర్మన్ చార్లెస్ డెవినిష్, మేనేజింగ్ డైరెక్టర్ హనుమప్రసాద్ శనివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు నిర్మాణ నమూనాను విడుదల చేశారు. అనంతరం చార్లెస్ డెవినిష్ మాట్లాడుతూ 30 ఎకరాల్లో దాదాపు రూ.200 కోట్లతో గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1945 తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి దేశంలో 1945 సంవత్సరం తర్వాత ఇలాంటి ప్లాంట్ నిర్మించడం ఇదే తొలిసారి అని చార్లెస్ డెవినిష్ తెలిపారు. రోజుకు 1,000 నుంచి 1,500 టన్నుల వరకు ముడి సరుకును ఈ ప్లాంట్‌లో ప్రాసెసింగ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద ప్రాసెసింగ్ చేస్తున్నామని, వచ్చే ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తయి పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభిస్తామని వివరించారు. ప్లాంట్ ఏర్పాటైన తర్వాత ఏడాదికి 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇప్పటికే కంపెనీలో 100 మందికి ఉపాధి కల్పించామని, మరో 200 మందికి ఉద్యోగాలు ఇస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు మానసబిశ్వాల్, హరికిరణ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, గోల్డ్ మైనింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్లాంట్ ఏర్పాటుతో తుగ్గలి ప్రాంతం అభివృద్ధి చెందుతుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
కేసీఆరే హ్యాట్రిక్ ముఖ్యమంత్రి
సాక్షి, వరంగల్: రాష్ట్రంలో నవంబర్ లేదా.. డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హ్యట్రిక్ ముఖ్యమంత్రి అయి మళ్లీ బాధ్యతలు చేపడతారని, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చెప్పే చిల్లరమల్లర మాటలను కార్యకర్తలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చా రు. వరంగల్ జిల్లా గీసుగొండ, సంగెం మండలాల పరిధిలో ఉన్న కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కులో కొరియాకు చెందిన యంగ్వన్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న యూనిట్‌కి భారత్‌లోని రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్ఈ చంగ్ జే బాక్‌తో కలసి శనివారం మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమల స్థాపనకు తెలంగాణలో అనుకూల వాతావరణం ఉందన్నారు. కేంద్రం కాపీ కొట్టింది.. వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్రం అమలుచేస్తున్న పీఎం మిత్ర పథకానికి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కే స్ఫూర్తి అని కేటీఆర్ అన్నారు. 2017లో మెగాటెక్స్‌టైల్ పార్కుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తే.. ఇప్పుడు కేంద్రం దానిని కాపీకొట్టి పీఎం మిత్ర తీసుకొచ్చిందన్నారు. ఫామ్ టు ఫ్యాషన్ అనే లక్ష్యంతో ఇక్కడే సమగ్రంగా వ్రస్తాలు తయారు కావాలన్న సంకల్పంతోపాటు గతంలో ఆజంజాహి మిల్లు ఉన్న సమయంలో వరంగల్‌కు ఉండే పేరు ప్రతిష్టలను మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పేలా సీఎం కేసీఆర్ కాకతీయ మెగాటెక్స్‌టైల్ పార్కుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇక్కడ తయారయ్యే దుస్తులు దేశం కోసమే కాదు.. అమెరికా, యూరప్, కొరియా వంటి ప్రపంచ మార్కెట్లోకి వెళతాయన్నారు. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ ఇన్ పరకాల, మేడ్ ఇన్ వరంగల్ పేరుతో ప్రపంచ మార్కెట్లలోకి అమ్మకాలు ఉంటాయని చెప్పారు. యంగ్వన్ ద్వారా 21,000, కిటెక్స్ ద్వారా 12,000, గణేశ ద్వారా 1,000 మందికి ఉపాధి కలుగుతుందని.. దీనికి రెట్టింపుగా పరోక్ష ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు. ఈ పరిశ్రమల్లో స్థానికులకే 99 శాతం ఉద్యోగాలు ఉంటాయని, ముఖ్యంగా మహిళలకు 80 నుంచి 85 శాతం ఉద్యోగాలు క ల్పించే దిశగా ఆయా కంపెనీలతో మాట్లాడామన్నారు. నిర్మాణం పూర్తి చేసుకుంటున్న కిటెక్స్ కంపెనీని సీఎం కేసీఆర్ సెపె్టంబర్ లేదా అక్టోబర్‌లో ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది తెలంగాణ నేడు ఆచరిస్తున్నది.. దేశం రేపు అనుసరిస్తదని మంత్రి కేటీఆర్ అన్నారు. కేంద్రం తీసుకొచ్చే చాలా పథకాలకు తెలంగాణనే దిక్సూచి అయిందన్నారు. అంతకుముందు కొరియా రాయబారి హెచ్ఈ చంగ్ జే బాక్ మాట్లాడుతూ.. వస్త్ర పరిశ్రమకు తెలంగాణ పెద్ద కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేశ్, పెద్ది సుదర్శ న్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, యంగ్వన్ కంపెనీ సీఈఓ కీహాక్ సంగ్ పాల్గొన్నారు. గిరిజనుల గుండెచప్పుడు కేసీఆర్ స్వరాష్ట్ర సాధన కల నెరవేర్చడంతో పాటు గిరిజనులు, ఆదివాసీల చిర కాల డిమాండు ‘మా తండాల్లో మా రాజ్యం’ అనే స్వయం పాలన కలను నెరవేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందని ] ుంత్రి కేటీ రామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా గిరిజనులకు శుభాకాంక్షలు తెలుపుతూ కేటీ ఆర్ ట్వీట్ చేశారు. గిరిజనుల గుండెచప్పుడు, ఆదివాసీల ఆత్మబంధువు కేసీఆర్ అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. -
సెప్టెంబర్ 11.. మానవత్వంపై దాడి
అహ్మదాబాద్: అగ్రరాజ్యం అమెరికాలో సరిగ్గా 20 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 11న జరిగిన ఉగ్ర దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానవత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. ఇలాంటి దారుణ ఘటనలు, విషాదాలకు మానవీయ విలువల్లోనే శాశ్వత పరిష్కార మార్గాలను కనుగొనాలని చెప్పారు. 1893 సెప్టెంబర్ 11న షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో స్వామి వివేకానంద భారతీయ మానవ విలువల ప్రాధాన్యతను వివరించారని గుర్తుచేశారు. అమెరికాలో జరిగిన సెప్టెంబర్ 11(9/11) దాడికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ శనివారం ఒక సందేశం ఇచ్చారు. అంతేకాకుండా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సర్దార్‌ధామ్ భవన్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. విద్యార్థులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువతకు ఇక్కడ వసతి కల్పిస్తారు. బాలికల హాస్టల్ అయిన సర్దార్‌ధామ్ ఫేజ్–2 కన్యా ఛత్రాలయ నిర్మాణానికి మోదీ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘సెప్టెంబర్ 11.. ప్రపంచ చరిత్రలో మర్చిపోలేని రోజు. మానవత్వంపై దాడి జరిగిన రోజుగా గుర్తుండిపోతుంది. ఆ రోజు మొత్తం ప్రపంచానికి ఎన్నో పాఠాలు నేర్పించింది’’ అని అన్నారు. ఇలాంటి భీకర దాడుల నుంచి నేర్చుకున్న పాఠాలను సదా గుర్తుంచుకోవాలి్సన అవసరం ఉందని సూచించారు. మానవీయ విలువలను కాపాడుకోవడానికి కృషి చేయాలన్నారు. సుబ్రహ్మణ్య భారతికి అంకితం తమిళ భాష అధ్యయనానికి బనారస్ హిందూ యూనివర్సిటీ(బీహెచ్‌యూ)లోని ఫ్యాకల్టీ ఆఫ్ ఆర్ట్స్‌లో ప్రత్యేక పీఠాన్ని నెలకొల్పుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ పీఠాన్ని తమిళ కవి సుబ్రహ్మణ్య భారతికి ఆయన వర్ధంతి సందర్భంగా అంకితమిస్తున్నట్లు తెలిపారు. ఏక్ భారత్.. శ్రేష్ట భారత్ అనే భావనను సర్దార్ పటేల్ ముందుకు తెచ్చారని, మహాకవి సుబ్రహ్మణ్య భారతి సాగించిన తమిళ రచనల్లోనూ ఇదే భావన స్పష్టంగా ప్రతిఫలించిందని పేర్కొన్నారు. సమాజానికి నూతన ఆత్మవిశ్వాసం బ్రిటిష్ పాలకులను తలవంచేలా చేసిన సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ స్ఫూర్తి, శక్తి నేడు ఐక్యతా శిల్పం రూపంలో మన ముందు ఉన్నాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. స్ఫూర్తి, దేశ ఐక్యత, ప్రజల ఉమ్మడి ప్రయత్నానికి ఈ శిల్పం ఒక ప్రతీక అని కొనియాడారు. మన సంపద దేశం కోసం నైపుణ్యాల వృద్ధి(స్కిల్ డెవలప్మెంట్)కి అధిక ప్రాధాన్యం ఇస్తూ నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చామని మోదీ చెప్పారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్‌కు, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా మన యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే ఈ విధానం ఉద్దేశమని వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లక్షలాది మంది యువత కొత్త అవకాశాలను అందిపుచ్చుకున్నారని వివరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ‘సబ్ కా సాత్, సబ్ కా విశ్వాస్, సబ్కా వికాస్’కు సబ్కా ప్రయాస్‌ను జత చేద్దామని చెప్పారు. విద్యార్థుల కోసం రూ.200 కోట్లతో సర్దార్‌ధామ్ భవన్‌ను నిర్మించిన విశ్వ పాటిదార్ సమాజ్‌పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. -
బాబు కూల్చిన ఆలయాల పునఃనిర్మాణం
సాక్షి, అమరావతి: టీడీపీ హయాంలో నాటి సీఎం చంద్రబాబు విజయవాడలో నిర్దాక్షిణ్యంగా పెద్ద ఎత్తున కూలగొట్టిన దేవాలయాల పునఃనిర్మాణ మహా క్రతువును రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. గత సర్కారు నగరంలో కూల్చివేసిన 9 గుడులకు సంబంధించి రూ.3.79 కోట్లతో తొలిదశలో పునఃనిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శుక్రవారం భూమి పూజ నిర్వహించనున్నారు. బెజవాడ కనకదుర్గమ్మ గుడి అభివృద్ధి, విస్తరణలో భాగంగా రూ.77 కోట్లతో చేపట్టిన మరో 8 పనులకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారు. ఆగమ పండితులు నిర్ధారించిన ప్రకారం రేపు ఉదయం 11.01 గంటల ముహుర్తానికి శనీశ్వర స్వామి ఆలయం నిర్మాణం చేపట్టనున్న ప్రాంతంలో రెండు వేర్వేరు శిలాఫలకాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. భూమి పూజ అనంతరం ముఖ్యమంత్రి జగన్ ఇంద్రకీలాద్రి కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ కార్యక్రమాలకు సంబంధించి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు బుధవారం ఆలయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థలాల ఎంపిక తరువాత మిగిలిన ఆలయాల పునఃనిర్మాణం గత సర్కారు హయాంలో కూల్చివేసిన వాటిల్లో ఆయా ప్రాంతాలలో ప్రస్తుతం స్థలం అందుబాటులో ఉన్న మేరకు తొలిదశలో 9 ఆలయాల పునఃనిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. మిగిలిన ఆలయాల పునఃనిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలాల కోసం దేవదాయ శాఖ అధికారులు అన్వేషిస్తున్నారు. స్థలాల ఎంపిక పూర్తి కాగానే మిగిలిన చోట్ల కూడా ఆలయాల పునఃనిర్మాణ పనులు చేపడతారు. దుర్గగుడి అభివృద్ధి, విస్తరణ రూ.77 కోట్లతో చేపడతుండగా అందులో రూ.70 కోట్ల నిధులు ప్రభుత్వం సమకూరుస్తోంది. మిగతా రూ.7 కోట్లను దుర్గ గుడి నిధుల నుంచి వెచ్చించనున్నారు. విజయవాడ అర్జున వీధి గోశాలలోని కృష్ణ మందిరం కూల్చి వేసిన దృశ్యం మతాల మధ్య చంద్రబాబు చిచ్చు మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకునే నాయకుడు చంద్రబాబు. 13 జిల్లాల పరిధిలో వివిధ రకాల ఘటనల కారణంగా ఇటీవల నష్టం జరిగిన ఆలయాల పునఃనిర్మాణానికి అన్ని చర్యలు తీసుకుంటాం. – వెలంపల్లి శ్రీనివాసరావు, దేవదాయశాఖ మంత్రి విజయవాడలో పునఃనిర్మాణం చేపట్టే ఆలయాలు ఇవీ.. 1. రూ.70 లక్షలతో రాహు–కేతు ఆలయం 2. రూ.9.50 లక్షలతో శ్రీసీతమ్మ పాదాలు 3. రూ.31.50 లక్షలతో దక్షిణాభిముఖ ఆంజనేయస్వామి ఆలయం (సీతమ్మ పాదాలకు సమీపంలో) 4. రూ. 2 కోట్లతో రాతితో శ్రీశనీశ్వర ఆలయం పునఃనిర్మాణం 5. రూ. 8 లక్షలతో బొడ్డు బొమ్మ.. 6. రూ.20 లక్షలతో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం (దుర్గగుడి మెట్ల వద్ద) 7. రూ. 10 లక్షలతో శ్రీసీతారామ లక్ష్మణ సమేత శ్రీదాసాంజనేయ ఆలయం 8 రూ. 10 లక్షలతో వీరబాబు ఆలయం (పోలీసు కంట్రోల్ రూం సమీపంలో) 9. కనకదుర్గ నగర్లో రూ.20 లక్షలతో శ్రీవేణుగోపాలకృష్ణ మందిరం, గోశాల. దుర్గ గుడి అభివృద్ది విస్తరణ పనులు ఇలా... 1. రూ.8.50 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణం 2. రూ. 5.60 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ పునః నిర్మాణం 3. రూ. 2 కోట్లతో మల్లేశ్వరస్వామి ఆలయ ప్రాకారం విస్తరణ 4.రూ. 23.60 కోట్లతో కేశఖండన శాల భవన నిర్మాణం 5.రూ. 19.75 కోట్లతో అన్నప్రసాదం భవన నిర్మాణం 6. రూ. 5.25 కోట్లతో కనకదుర్గ టోల్‌ప్లాజా (తిరుపతి అలిపిరి వద్ద ఉండే ద్వారం మాదిరిగా దుర్గ గుడి ఘాట్ ఆరంభం వద్ద నిర్మిస్తారు) 7. రూ. 6.5 కోట్లతో ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడకుండా మరమ్మత్తులు, పట్టిష్ట చర్యలు. 8. రూ.2.75 కోట్లతో ఆలయం మొత్తం ఎనర్జీ, వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ పనులు -
'ఆధునిక హంగులతో నాంపల్లి కొత్త పీఎస్'
హైదరాబాద్: నాంపల్లిలో అన్ని ఆధునిక హంగులతో పోలీస్‌స్టేషన్ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు తెలంగాణ హోంశాఖ మంత్రి నాయిని నరసింహరెడ్డి తెలిపారు. శనివారం ఉదయం పోలీస్‌స్టేషన్ కొత్త భవనానికి నాయిని నర్సింహారెడ్డి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయతోపాటు నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, ఇతర పోలీసులు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
రాజధాని భూమిపూజకు శ్రీకారం
- భూమిపూజ చేయనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య ఏర్పాట్లు సాక్షి గుంటూరు/తుళ్లూరు : నూతన రాజధాని నిర్మాణానికి మరికొన్ని గంటల్లో శ్రీకారం చుట్టనున్నారు. తుళ్లూరు మండలం మందడం-తాళ్లాయపాలెం గ్రామాల మధ్య శనివారం ఉదయం 8.49 గంటలకు భూమిపూజ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మందడం గ్రామ రెవెన్యూ 136 సర్వే నంబర్లోని బెజవాడ సత్యనారాయణకు చెందిన స్థలంలో శాస్త్రోక్తంగా పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ఏర్పాట్ల పరిశీలన.. భూమిపూజ జరిగే ప్రాంతంలో భద్రతపై అధికారులు దృష్టి సారించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, భద్రత అధికారి జోషి శుక్రవారం ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత సీఆర్డీఏ కార్యాలయంలో కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం సమన్వయంతో భూమిపూజకు అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. భూమిపూజకు అవసరమైన సామగ్రిని మందడం సర్పంచి ముప్పవరపు పద్మావతి, సుమారు కిలో వెండితో వెండిబొచ్చె, బంగారు పూత పూయించిన తాపీని అంగలకుదురుకు చెందిన రిటైర్డ్ జూనియర్ వెటర్నరీ అధికారి ఆలపాటి వెంకటరామయ్య కలెక్టర్‌కు అందజేశారు. నేడు సీఎం క్యాంపు కార్యాలయం ప్రారంభం సాక్షి, విజయవాడ : నగరంలోని జలవనరులశాఖ ప్రాంగణంలో సిద్ధం చేసిన సీఎం క్యాంపు కార్యాలయ భవనాన్ని చంద్రబాబు శనివారం ప్రారంభిస్తారని మంత్రి దేవినేని ఉమా తెలిపారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. శనివారం ఉదయం పది, పదకొండు గంటల మధ్యలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ప్రారంభిస్తారని వివరించారు. రాజధానికి భూమి పూజచేయనున్న నేపథ్యంలో అక్కడి ప్రజలను రెచ్చగొట్టేందుకే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరసన దీక్ష చేశారని మంత్రి ఉమా ఆరోపించారు. పూర్తికాని సీఎం క్యాంపు కార్యాలయ భవనం సీఎం క్యాంపు కార్యాలయం పూర్తిగా సిద్ధమయ్యేందుకు మరో మూడునెలలు పడుతుందని సమాచారం. లిప్టులు ఏర్పాటు, సీలింగ్, ఫ్లోరింగ్, మరమ్మతులు చేయాల్సి ఉంది. ప్రహరీ, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ప్రత్యేక విద్యుత్ దీపాల అలకరణ పనులు జరుగుతున్నాయి. సీఎం వ్యక్తిగత సెక్యూరిటీకి కేటాయించిన భవనాల మరమ్మతులు పూర్తికాలేదు. నేడు నగరానికి సీఎం రాక విజయవాడ : ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు శనివారం నగరానికి రానున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 7.15 గంటలకు విమానంలో బయలుదేరి 7.55 గంటలకు గన్నవరంలో దిగుతారు. అక్కడ్నుంచి 8 గంటలకు హెలికాప్టర్లో బయలుదేరి గుంటూరు జిల్లా మందడం వెళతారు. అక్కడ నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. 10 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 10.20 గంటలకు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో దిగుతారు. ఇరిగేషన్ కార్యాలయంలో నిర్మిస్తున్న సీఎం క్యాంప్ ఆఫీసును చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం హెలికాప్టర్లో గన్నవరం చేరుకుని విమానంలో వైజాగ్ వెళతారు. పోలీసులు గట్టి భద్రత చర్యలు తీసుకుంటున్నారు. పలుచోట్ల తనిఖీలు ముమ్మరం చేశారు. సీపీ ఎ.బి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. -
జగన్ దీక్షాస్థలికి భూమిపూజ
పశ్చిమగోదావరి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 31, ఫిబ్రవరి 1న చేపట్టబోయే రైతు దీక్షకు సంబంధించి మంగళ వారం భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని పార్టీ కేంద్ర పాలకమండలి పరిశీలకులు వంకా రవీంద్రనాథ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కానుమూరి వెంకట నాగేశ్వరరావు, గుంటూరు పార్టీ పరిశీలకులు లేళ్ల అప్పి రెడ్డి, తణుకు కన్వీనర్ చీర్ల రాధయ్య పర్యవేక్షించారు. -
శ్రీ మిత్ర వెంచర్లో భూమిపూజ
ఇబ్రహీంపట్నం రూరల్ : స్థానిక కేతనకొండలో శ్రీమిత్ర వెంచర్స్ వారి ‘ఇంద్రప్రస్థ’ భూమిపూజ ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా సినీనటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా పాల్గొన్నారు. ముందుగా కొబ్బరికాయకొట్టి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ చౌదరి మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో సకల సౌకర్యాలతో ఇంద్రప్రస్థ విల్లాలను నిర్మిస్తామని తెలిపారు. శ్రీకాంత్, తరణ్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు సాయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించి మ్యాచ్ నిర్వహిస్తామని, వచ్చే ఆదాయాన్ని తుపాను బాధితులకు అందజేస్తామని తెలిపారు. శివాజీరాజా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. డెరైక్టర్లు ఎం.తేజనివాస్, తేజాగోవింద్, శ్రీనివాస్‌పాల్గొన్నారు. -
రూ.67 కోట్లతో
బస్‌స్టేషన్ నిర్మాణానికి భూమిపూజ బెంగళూరు : నగరంలోని బీటీఎం లేఔట్లో రూ.67.62 కోట్ల వ్యయంతో అత్యాధునిక బస్టాండు నిర్మాణానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రెండెకరాల 18 కుంట్ల స్థలంలో నిర్మించే ఈ ఐదంతస్తుల బస్టాండ్ ఏడాదిలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ పరిధిలో 1,115 ఎకరాల ప్రభుత్వం స్థలం ఉందని, దానిని త్వరలోనే గుర్తించి బీఎంటీసీ బస్ స్టేషన్, ఉద్యోగులకు వసతి గృహాలు నిర్మిస్తామన్నారు. పీణ్యాలో నిర్మించిన బసవేశ్వర బస్ స్టేషన్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పరిష్కారానికి ఇద్దరు ప్రత్యేకాధికారులను నియమించామన్నారు. బెంగళూరు నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి సీఎన్జీ బస్సుల వినియోగం అవసరాన్ని కేంద్రప్రభుత్వానికి నివేదిక పంపామన్నారు. అనుమతి వచ్చిన వెంటనే వోల్వో బస్సులకు బదులు సీఎన్జీ బస్సులు ప్రవేశపెడతామని వివరించారు. బీఎంటీసీ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ ఏక్ రూప్ కౌర్ మాట్లాడుతూ... బీఎంటీసీ బస్సుల్లో మహిళలు, వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన సీట్లను వారికి కేటాయించకపోతే అపరాధ రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో బీబీఎంపీ ప్రతిపక్ష నాయకుడు మంజునాథ్‌రెడ్డి, కార్పొరేటర్లు ఉదయ్‌శంకర్, మురుగేష్ మదలియార్, జీఎన్ఆర్ బాబు, కోరమంగళ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చామరాజు రెడ్డి, బీఎంటీసీ అదికారులు హాజరైనారు.