శ్రీ మిత్ర వెంచర్‌లో భూమిపూజ | Mr. Mitra venture bhumipuja | Sakshi
Sakshi News home page

శ్రీ మిత్ర వెంచర్‌లో భూమిపూజ

Published Mon, Oct 20 2014 2:00 AM | Last Updated on Sat, Sep 2 2017 3:06 PM

శ్రీ మిత్ర వెంచర్‌లో భూమిపూజ

శ్రీ మిత్ర వెంచర్‌లో భూమిపూజ

ఇబ్రహీంపట్నం రూరల్ : స్థానిక కేతనకొండలో శ్రీమిత్ర వెంచర్స్ వారి ‘ఇంద్రప్రస్థ’ భూమిపూజ ఆదివారం వైభవంగా జరిగింది. ముఖ్యఅతిథులుగా సినీనటులు శ్రీకాంత్, తరుణ్, శివాజీరాజా పాల్గొన్నారు. ముందుగా కొబ్బరికాయకొట్టి భూమిపూజ చేశారు. అనంతరం విలేకరులతో సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ చౌదరి మాట్లాడారు. నవ్యాంధ్ర రాజధాని విజయవాడ పరిసరాల్లో  సకల సౌకర్యాలతో ఇంద్రప్రస్థ విల్లాలను నిర్మిస్తామని తెలిపారు.  

శ్రీకాంత్, తరణ్ మాట్లాడుతూ   హుదూద్ బాధితులకు సాయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్‌ను సంప్రదించి మ్యాచ్ నిర్వహిస్తామని, వచ్చే ఆదాయాన్ని తుపాను బాధితులకు  అందజేస్తామని తెలిపారు. శివాజీరాజా మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంత సొమ్మును ప్రజాహిత కార్యక్రమాలకు వెచ్చించాలని కోరారు. డెరైక్టర్‌లు ఎం.తేజనివాస్, తేజాగోవింద్, శ్రీనివాస్‌పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement