సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం | celebrities cricket cup held in Ananthapuram | Sakshi
Sakshi News home page

సెలబ్రిటీల క్రికెట్ 'వార్' ప్రారంభం

Published Sun, Nov 5 2017 5:56 PM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

celebrities cricket cup held in Ananthapuram - Sakshi

సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా కేంద్రంలో ఆదివారం టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. స్థానిక నీలం సంజీవరెడ్డి స్డేడియంలో మ్యాచ్‌ ఆడేందుకు సినీతారలు రావడంతో స్టేడియానికి అభిమానులు పోటెత్తారు. శ్రీకాంత్, తరుణ్, అల్లరి నరేశ్, ఆదర్శ్, సంపూర్ణేశ్ బాబు సహా తదితర సెలబ్రిటీలను చూసేందుకు స్థానికులు రావడంతో స్డేడియంలో ఉత్సాహం ఉప్పొంగింది. అర్చన, ప్రణీతలు ప్రధాన ఆకర్షణగా నిలిచారు. సినీతారలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

2011 నుంచి అనంతపురం వేదికగా సినీతారల క్రికెట్ కప్‌ను సీసీసీ చైర్మన్ షకీల్ షఫీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి టోర్నీని ప్రారంభించారు. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. మ్యాచ్‌కు ముఖ్య అతిథిగా మంత్రి కాల్వ శ్రీనివాసులు వచ్చారు. టాస్‌ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు.

సినీతారలే ప్రధాన ఆటగాళ్లుగా తలపడనున్న మ్యాచ్‌లోని ఓ జట్టుకు టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీకాంత్ కెప్టెన్ కాగా, మరో జట్టుకు కెప్టెన్‌గా హీరో తరుణ్ వ్యవహరించారు. 36 మంది సినీ తారలతో పాటు ఎంఎల్ఎన్ అకాడమీకి చెందిన సింగర్స్ హాజరై క్రికెట్ ప్రేమికులకు వినోదాన్ని పంచనున్నారు.

(ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement