ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్‌ | Khadgam Movie Re Release Press Meet | Sakshi
Sakshi News home page

ఖడ్గంలో నన్ను తీసుకోవద్దన్నారు: శ్రీకాంత్‌

Published Sun, Oct 6 2024 12:18 AM | Last Updated on Sun, Oct 6 2024 12:18 AM

Khadgam Movie Re Release Press Meet

‘‘ఖడ్గం’ సినిమాలో నన్ను తీసుకోవద్దని నిర్మాత మధు మురళిగారు అన్నారు. కానీ కృష్ణవంశీ ధైర్యం చేసి, ఆయన్ని ఒప్పించి నన్ను తీసుకున్నారు. నా జీవితంలో ఈ సినిమాని మర్చిపోలేను. తరాలు మారినా దేశభక్తి చిత్రాలన్నింటిలో ‘ఖడ్గం’ గొప్ప చిత్రం. ఈ మూవీ మళ్లీ విడుదలవుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని శ్రీకాంత్‌ అన్నారు. రవితేజ, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, శివాజీ రాజా, షఫీ, సోనాలీ బింద్రే, సంగీత తదితరులు ప్రధానపాత్రల్లో నటించిన సినిమా ‘ఖడ్గం’. కృష్ణవంశీ దర్శకత్వంలో సుంకర మధు మురళి నిర్మించిన ఈ సినిమా 2002 నవంబర్‌ 29న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

కాగా ఈ నెల18న ఈ సినిమా రీ రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ – ‘‘భారతీయ జెండా ఒక ఖడ్గం అనే ఉద్దేశంతో ఈ సినిమాకి ఆ టైటిల్‌ పెట్టాను’’ అని చెప్పారు. ‘‘ఖడ్గం’లో నేను చేయనని చెప్పాను. కానీ, ఇప్పటివరకు నేను చేసిన సినిమాలన్నిటిలో నాకు మంచి పేరు వచ్చింది మాత్రం ఈ సినిమాతోనే’’ అన్నారు శివాజీ రాజా. ‘‘నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామాలో చదివి ఏడేళ్లుగా అవకాశం కోసం వేచి చూస్తున్న సమయంలో నాకు దొరికిన అవకాశం ‘ఖడ్గం’. ఈ సినిమాలో చాన్స్‌ ఇచ్చి నా వనవాసం ముగింపునకు కారణమైన కృష్ణవంశీగారికి కృతజ్ఞతలు’’ అని నటుడు షఫీ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement