హైదరాబాద్ తల్వార్స్, టిసిఎ(తెలుగు సినిమా అకాడమీ) టీమ్‌లు ఇండో ఆఫ్రికా మీడియా కంపెనీ ఆధ్వర్యంలో క్రికెట్ ఆడనున్నారు. ఈ మ్యాచ్‌లో మన తెలుగుస్టార్స్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న తెలుగువాళ్ళతో కలిసి ఆడబోతున్నారు. మొత్తం రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మే17,18న మ్యాచ్‌లు జరుగుతాయి. 19న సాంస్కృతిక కార్యక్రమం జరుగుతుంది. అక్కడి ప్రజల్లో క్యాన్సర్ ఎవేర్‌నెస్ కలిగించటం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో వచ్చిన నిధులను ఆఫ్రికాలో ఉన్న చైల్డ్ హుడ్ క్యాన్సర్ అసోసియేషన్‌కు అందించనున్నారు.
ఈ సందర్భంగా హైదరాబాద్ లెమన్‌ట్రీ హోటల్‌లో విలేకరుల సమావేశంలో చైర్మెన్ రమేష్ మాట్లాడుతూ...ఇంత మంచి పని కోసం ముందుకు వచ్చిన టాలీవుడ్ స్టార్స్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు. క్యాన్సర్ నుంచి బ్రతికిద్దాం అన్న ఆలోచనే ఈ క్రికెట్ టాలీవుడ్ అసోసియేషన్ యొక్కముఖ్య ఉద్దేశం. బిజీ షెడ్యూల్‌ని కూడా పక్కన పెట్టి రావడం గ్రేట్. ఇప్పటి వరకు ఎప్పుడూ సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి కార్యక్రమాలు జరగలేదు. మొట్ట మొదటి సారి వీళ్ళు సౌత్ ఆఫ్రికా వచ్చి మన సంస్కృతిని వాళ్ళకు పరిచయం చేసి వాళ్ళ సంస్కృతి గురించి మనం తెలుసుకోవడం కోసం ఒక సాంస్కృతిక కార్యక్రమం లో హాజరు కాబోతున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు.
హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ...నేను ఒక్కడినే కెప్టెన్ కాదు నాతోపాటు ఇక్కడున్న వారందరూ కెప్టెన్సే. మొదటిసారి సౌత్ ఆఫ్రికాలో మ్యాచ్ ఆడటం అంటే అసలు జరుగుద్దో లేదో అనుకున్నా. కాని వాళ్ళ కాన్ఫిడెంట్ చూసి ముందుకు వెళుతున్నాం. క్రికెట్ ఆడటం ముందు స్టార్ట్ చేసిందే మా టాలీవుడ్ హీరోలు. చిరంజీవి, నాగార్జున వాళ్ళందరూ ముందు మొదలు పెట్టారు. ఇది కమర్షియల్‌గా ఆడే ఆట కాదు. ఒక మంచి పని కోసం ఈ కార్యక్రమానికి మేమందరం గ్రూప్ అయ్యాం. మే 16-17 దర్బార్‌లో దిగుతాం. 18న గేమ్ ఉంటుంది. 19న ఒక కల్చరల్ ప్రోగ్రాం ఉంటుంది. మీరందరూ మాకు తప్పకుండా సపోర్ట్ చెయ్యాలన్నారు.
హీరో తరుణ్ మాట్లాడుతూ... మొత్తం టీమ్ అందరికీ ముందుగా నా కృతజ్ఞతలు. ఇది మొదలు పెట్టి 3 ఏళ్ళు అయింది. ప్రతి ఆట ఒక మంచి పని కోసం ఆడతాం. సౌత్ ఆఫ్రికాలో మొట్టమొదటిసారి ఆడుతున్నాం. టిసిఎ, తల్వార్స్ కలిసి ఆడబోతున్నాం. సౌత్ ఆఫ్రికాని కూడా మనం గెలిచివద్దాం అన్నారు. ఈ ఈవెంట్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
అల్లరి నరేష్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఎన్నో మ్యాచ్‌లు ఆడాం కాని ఈ మ్యాచ్‌లో విశేషం ఏమిటంటే నేను సునీల్ ఓపెన్సర్స్‌గా ఆడుతున్నాం. మాకు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా ఆనందంగా ఉంది. రమేష్‌గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.
సునీల్ మాట్లాడుతూ... ఇండో ఆఫ్రికా నిర్వహిస్తున్న ఫస్ట్ డెబ్యూ మ్యాచ్ లో కష్టపడి మంచి పేరు తెచ్చుకుంటాను. టిసిఎ, తల్వార్స్ కలిసి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. అదే విధంగా ఆఫ్రికాలో ఏదైనా మూవీస్‌లో అవకాశం వస్తే నేను అక్కడే ఉంటాను అంటూ చమత్కారంగా మాట్లాడుతూ ముగించారు.
హీరో నిఖిల్ మాట్లాడుతూ... ముందుగా ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టిసిఎకి నా ప్రత్యేక అభినందనలు. ఈ సంస్థ 16 ఏళ్ళనుంచి ఉంది. ఇది ఎంతో మంచి సాంస్కృతిక కార్యక్రమం. ఈ కార్యక్రమం లైవ్ కూడా ఉంటుంది. మీరందరూ చూసి ఆదరించగలరని కోరుకుంటున్నాను అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రిన్స్, భూపాల్, శ్రీనివాస్ , కిషోర్ , సింగర్ కౌశల్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment