
'పొలిమేర' రెండు సినిమాలు ఎంత సెన్సేషన్ సృష్టించాయో అందరికీ తెలిసిందే. తొలిభాగం ఓటీటీలో రిలీజై హిట్ కాగా.. తొలుత థియేటర్లలో రిలీజైన సీక్వెల్ అంతకు మించిన రెస్పాన్స్ అందుకుంది. ఈ చిత్రాలతో దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ విశ్వనాథ్.. మరో దెయ్యం మూవీతో వచ్చేస్తున్నాడు.
(ఇదీ చదవండి: ఈ రైతుబిడ్డ పెద్ద వెధవ, బికారిలా అడుక్కుని ఇప్పుడేమో..: అన్వేష్ ఫైర్)
కాకపోతే ఈసారి అనిల్ విశ్వనాథ్.. దర్శకుడి బాధ్యతలు తీసుకోలేదు. కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూనే షో రన్నర్ గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో అల్లరి నరేశ్ హీరోగా చేస్తున్నాడు. తాజాగా '12 ఏ రైల్వే కాలనీ' టైటిల్ పెట్టినట్లు టీజర్ రిలీజ్ చేశారు. 'ఈ స్పిరిట్స్, ఆత్మలు కొంతమందికే ఎందుకు కనబడతాయ్?' అనే డైలాగ్ ఆకట్టుకుంది.
టీజర్ బట్టి చూస్తే ఇందులో దెయ్యాలు, ఆత్మలు కనిపించే వ్యక్తిగా అల్లరి నరేశ్ కనిపించనున్నాడు. 'పొలిమేర' హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇందులోనూ సాయికుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవిలో విడుదల ప్లాన్ చేస్తున్నారు.
(ఇదీ చదవండి: రూ.100 కోట్ల ఖరీదైన ఇల్లు కొన్న నయన్?)
Comments
Please login to add a commentAdd a comment