Maa Oori Polimera
-
డీ గ్లామర్ పాత్రలే కాదు బోల్డ్ సీన్స్‌లోనూ రచ్చచేసే బ్యూటీ (ఫోటోలు)
-
చిరంజీవితో సినిమానా..? నా వల్ల కాదబ్బా: డైరెక్టర్
కరోనా సమయంలో క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఓటీటీలో విడుదలై హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న సినిమా 'మా ఊరి పొలిమేర'. దీంతో దీని సీక్వెల్ 'పొలిమేర-2'ను భారీ స్థాయిలో తెరకెక్కించారు దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్. నవంబర్ 3న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్‌ను తెచ్చుకుని విజయవంతంగా రన్ అవుతుంది. ఇందులో సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో నటించగా.. గీతా ఆర్ట్స్‌కు చెందిన వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. పొలిమేర-2 చిత్రంతో కమర్షియల్ హిట్ కొట్టిన డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలని చాలా మంది డైరెక్టర్లకు కోరిక ఉంటుంది. ఆ అవకాశం వస్తే అదొక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పవచ్చు.. కానీ ఆ ఇంటర్వ్యూలో అనిల్ విశ్వనాథ్‌కు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. ఛాన్స్ వస్తే చిరంజీవితో సినిమా చేస్తారా? అని. అందుకు ఆయన ఇలా చెప్పుకొచ్చాడు.. మెగాస్టార్‌తో సినిమా నా వల్ల కాదు 'నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారికి పెద్ద అభిమానిని.. నన్ను మించిన అభిమాని ఆయనకు మరోకరు ఉండరేమో.. ఆయనంటే నాకు చెప్పలేనంత అభిమానం. నేను డైరెక్ట్ చేసిన సినిమాను చిరంజీవి గారు చూసి.. బాగుంది అని నన్ను అభినందిస్తే చాలు.. ఆ మాటతోనే సినిమాలు తీయడం ఆపేస్తాను. అదొక నాకు అచీవ్మెంట్. నాకు ఈ గౌరవం దక్కితే చాలు. ఏ అవార్డులు, రివార్డులు వద్దు. భవిష్యత్‌లో పొలిమేరకు మించిన సినిమా తప్పకుండా తీస్తాను. అప్పుడు నన్ను చిరంజీవి గారు గ్యారెంటీగా పిలిపించుకుని అభినందిస్తారు. ఆ నమ్మకం నాకు ఉంది. కానీ మెగాస్టార్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే.. నేను రిజెక్ట్ చేస్తాను. ఎందుకంటే..? డైరెక్టర్ అనేవాడు షూటింగ్ సమయంలో ఏదీ బాగుందో..? లేదో.. ? చెప్పాలి. కానీ చిరంజీవి గారి విషయంలో ఏది చేసినా నాకు నచ్చుతుంది. అలాంటప్పుడు కెమెరా ముందు ఆయన యాక్టింగ్‌ని చూసి నేను జడ్జ్ చేయలేను. కాబట్టి ఆయన అవకాశం ఇచ్చినా.. నేను చేయలేనని చెబుతాను. నాకు గ్యాంగ్‌లీడర్ సినిమా అంటే చాలా ఇష్టం.. ఇప్పటి వరకు ఆ సినిమాను 70 సార్లు చూశాను.' అని అనిల్ విశ్వనాథ్ చెప్పారు. -
పొలిమేర సినిమాలో ఉన్న గుడి ఎక్కడ ఉంది..? అసలు చరిత్ర ఇదే!
‘మా ఊరి పొలిమేర’కు కొనసాగింపుగా పొలిమేర-2 విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. పార్ట్-1లో మర్డర్ మిస్టరీకి చేతబడి అంశాన్ని జత చేసి అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన సినిమా ఇది. పార్ట్-2లో అన్నీ రివీల్ చేస్తాడు దర్శకుడు. జాస్తిపల్లి ఊరి పొలిమేరలో ఉన్న ఏకపాదమూర్తి గుడికి.. కేరళలో ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడికి.. లింక్ ఉందని.. అక్కడ నిధులు ఉన్నాయని కొమిరి చేసే క్షుద్రపూజల వల్ల వాటిని సొంతం చేసుకోవచ్చని ఇలా ఒక చక్కట కథాంశంతో దర్శకుడు చూపించాడు. సినిమాలో భాగంగా ఆ గుడి జాస్తిపల్లిలో ఉంది అని చెప్పారు.. కానీ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా వద్ద ఉన్న గండికోటలో ఉంది. మాధవరాయ దేవాలయం ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో గండికోట కోటలో ఉన్న 16వ శతాబ్దపు హిందూ దేవాలయం . అప్పట్లో కృష్ణుడి ప్రతిమ ఉండేది. దీనిని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు. భారత ప్రభుత్వం దీనిని జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించింది. ఈ గుడిలో రాధేశ్యామ్,సైరా నరసింహారెడ్డి, ఇండియన్-2,మర్యాద రామన్న వంటి చిత్రాలు ఇక్కడ షూటింగ్ జరిగాయి. గుడి చరిత్ర ఆలయంలోని కళ, నిర్మాణ లక్షణాల విశ్లేషణ ఆధారంగా చూస్తే దీనిని 16 వ శతాబ్దం మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు సూచిస్తుంది. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దపు శాసనాలలో కనుగొనబడింది. గండికోటలో విజయనగర కాలం నాటి రాజులు నిర్మించినట్లు ఆధారాలు ఉన్నాయి. 16వ శతాబ్దపు శాసనాలు ఆ గుడిలో కనుగొనబడ్డాయి. పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ (లార్డ్ కృష్ణుడు) దేవుడికి నమస్కరించి, దేవుడికి మాల ( తోమాల ) సమర్పించారని వీటిలో పేర్కొంది. ఆ గుడిలో నిధులు ఉన్నాయా..? మహ్మదీయుల దాడుల వల్ల ఈ గుడి పూర్తిగా కూలిపోయింది. ఆ సమయంలో గుడిలో ఉన్న విగ్రహాన్ని అక్కడి నుంచి కడప జిల్లాలోని మైదుకూరుకు తరలించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఈ గుడిలో దేవుడి విగ్రహం లేదు. ఊరికి దూరంగా ఉండటం వల్ల అసాంఘిక కార్యకలాపాలు జరిగే ఛాన్స్ ఉందని గుడికి లాక్ చేసి ఉంచుతారు. టూరిస్ట్‌లు వెళ్లిన సమయంలో గేట్లు తెరుస్తారు. స్థానికులు చెబుతున్న ప్రకారం ఆ గుడిలో ఎలాంటి నిధులు లేవని.. మహ్మదీయుల దాడుల సమయంలో వాటిని దోచుకున్నారని చెప్పుకొస్తున్నారు. కానీ గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన చిహ్నాలు ఉన్నాయి. -
పొలిమేర 3 ట్విస్టులు మీ ఊహకు అందదు
-
Polimera 2 Trailer: మా ఊరి పొలిమేర 2 ట్రైలర్ విడుదల వేడుక (ఫొటోలు)
-
మా ఊరి పొలిమేర 2 ట్రైలర్.. ఈసారి మరిన్ని ట్విస్ట్‌లు
'మా ఊరి పొలిమేర' కరోనా సమయంలో హాట్‌స్టార్ వేదికగా విడుదల అయిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ సినిమాకు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేంద్ మౌళి, బాలాదిత్య తదితరులు నటించారు. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రానికి డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. సత్యం రాజేశ్ కెరియర్లో ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. భారీ హిట్ కొట్టిన ఈ సినిమాకు సీక్వెల్‌గా 'మా ఊరి పొలిమేర 2' తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంటును హైదరాబాద్ - AAA సినిమాస్‌లో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా దర్శకుడు హరీశ్ శంకర్, నిర్మాత బన్నీవాసు, హీరో కార్తికేయ హాజరయ్యారు. వారందరి చేతుల మీదుగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) గ్రామీణ ప్రాంతాల్లో జరిగే క్షుద్రపూజల చుట్టూ తిరిగే ఈ కథలోని ట్విస్టులు ఆడియన్స్‌ను మెప్పిస్తాయి. మొదటి భాగంలో భారీ ట్విస్ట్‌తో సినిమా ముగుస్తుంది. ఇప్పుడు 'మా ఊరి పొలిమేర 2' సీక్వెల్లో ఇంకెన్ని ట్విస్ట్‌లు పెట్టారో ట్రైలర్లోనే తెలిసిపోతుంది. నవంబర్ 3న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈసారి మాత్రం ఈ సినిమాను థియేటర్‌కు వెళ్లే చూడాలి. ఆ తర్వాతే ఓటీటీలోకి విడుదల చేస్తారు. -
Maa Oori Polimera 2 : కవిత ఎలా బతికొచ్చిందో తెలిసేది ఆ రోజే!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోన సమయంలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ని చిత్రబృందం వెల్లడించింది. ‘మా పూరి పొలిమేర-2’ ఈ సారి డైరెక్ట్‌గా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. కవిత ఎలా బతికొచ్చింది? మొదటి భాగంలో కొమిరి(సత్యం రాజేశ్)..గర్భిణి కవిత(రమ్య) బంధువుల చెతిలో దెబ్బలు తిని, ఆమె చితిలోనే పడి చనిపోయినట్లు చూపించారు. అయితే చితిలో పడి చనిపోయింది కొమిరి కాదని ఆయన తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) గుర్తిస్తాడు. క్లైమాక్స్‌లో కొమిరి కేరళలో ఉన్నట్లు చూపించారు.అంతేకాదు చనిపోయిన కవిత కూడా బతికే ఉన్నట్లు, కొమిరితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ.. శుభం కార్డు వేశారు. అసలు చనిపోయిన గర్భిణి ఎలా బతికొచ్చింది? అనేది తెలియాలంటే నవంబర్ 2 థియేటర్స్‌లో ‘పొలిమేర-2’చూడాల్సిందే. అంచనాలకు తగ్గట్టే సీక్వెల్ మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత గౌరికృష్ణ అన్నారు. `గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించాం. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది’అని దర్శకుడు విశ్వనాథ్ అన్నారు. -
'మా ఊరి పొలిమేర'-2 పోస్టర్ రిలీజ్
‘‘మా ఊరి పొలిమేర’ పోస్టర్ బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. గౌరు గణబాబు సమర్పణలో డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో గౌరీకృష్ణ నిర్మించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య తారలు. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ‘‘మా ఊరి పొలిమేర’ చూసి ఎగ్జయిట్ అయ్యాను. ఆ సినివ సీక్వెల్‌ను మా బ్యానర్లో చేసినందుకు డా. అనిల్ విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు గౌరీకృష్ణ. -
మా ఊరి పొలిమేర 2 ఫస్ట్ లుక్ చూశారా?
సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, అక్షత, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. డా.అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్టర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు`` అన్నారు. నటుడు సత్యం రాజేశ్ మాట్లాడుతూ.. 'మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆదరించారు. దానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం' అన్నారు. దర్శకుడు డా. అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేయడం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్షకులందరూ బాగా ఆదరించారు. 'మా ఊరి పొలిమేర' చిత్రానికి సిక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి సమాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫస్ట్ లుక్ లాంఛ్ చేశాం. త్వరలోనే రిలీజ్ డేట్ వెల్లడిస్తాం` అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్రఫీః ఖుషేందర్ రమేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వర; కో-డైరక్టర్ః ఆకుల నాగ్; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైరక్టర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ః ఎన్.సి.సతీష్ కుమార్; నిర్మాతః గౌరి కృష్ణ; స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైరక్షన్ః డా.అనిల్ విశ్వనాథ్. చదవండి: సింగర్‌తో ఛత్రపతి డేటింగ్... ఎగిరి గంతేసిన నటి -
‘మా ఊరి పొలిమేర` సీక్వెల్ వచ్చేస్తుంది!
సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్లో డైరెక్టర్‌గా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. వాస్తవికతకు దగ్గరగా ఊహించని ట్వీస్టులతో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ‘ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో డా. కామాక్షి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.