‘మా ఊరి పొలిమేర‌` సీక్వెల్ వచ్చేస్తుంది! | Maa Oori Polimera Sequel Wraps Up Its shoot | Sakshi
Sakshi News home page

Maa Oori Polimera : ‘మా ఊరి పొలిమేర‌` సీక్వెల్ వచ్చేస్తుంది!

Published Sat, Feb 18 2023 1:27 PM | Last Updated on Sat, Feb 18 2023 1:27 PM

Maa Oori Polimera Sequel Wraps Up Its shoot - Sakshi

స‌త్యం రాజేష్‌, గెటప్‌ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా  డా.అనిల్ విశ్వ‌నాథ్‌ తెరకెక్కించిన ఈ  చిత్రం 2021 డిసెంబర్‌లో డైరెక్టర్‌గా ఓటీటీ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్‌ని సంపాదించుకుంది. వాస్తవికతకు దగ్గరగా ఊహించని ట్వీస్టులతో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది.

ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్‌..ప్రస్తుతం పోస్ట్‌  ప్రొడక్షన్స్‌ పనుల్లో బిజీగా ఉంది. ‘ఉత్త‌రాఖండ్‌, కేర‌ళ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఖ‌మ్మం, హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం’అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో  డా. కామాక్షి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement