ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా? | Maa Oori Polimera 2 OTT Release Date Goes Viral In Social Media | Sakshi
Sakshi News home page

నెల రోజుల్లోపే ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అక్కడేనా?

Published Wed, Nov 8 2023 6:01 PM | Last Updated on Wed, Nov 8 2023 6:26 PM

Maa Oori Polimera 2 OTT Release Date Goes Viral In Social Media - Sakshi

సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్‌ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్‌ హిట్‌గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు.

(ఇది చదవండి: బిగ్‌ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్‌.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్‌ డేట్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్‌ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్‌ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా  హాట్‌స్టార్‌‌లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. 

(ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్‌ బీ కామెంట్స్ వైరల్!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement