ఓటీటీకి టాలీవుడ్ కమెడియన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Getup Srinu Latest Movie Streaming On This Ott Platform Details Inside | Sakshi
Sakshi News home page

Getup Srinu: ఓటీటీకి వచ్చేస్తోన్న రాజు యాదవ్.. . స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Published Thu, Jul 18 2024 7:55 PM | Last Updated on Thu, Jul 18 2024 8:03 PM

Getup Srinu Latest Movie Streaming On This Ott Platform Details Inside

కమెడియన్ గెటప్ శీను, అంకితా కారత్ జంటగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు నెలల్లోపే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది.ఈనెల 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్వీట్ చేసింది. ఈ మేరకు గెటప్ శ్రీనుతో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.

రాజు యాదవ్ కథేంటంటే..

'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్‌ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ. థియేటర్లలో చూడని వారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement