Raju Yadav
-
ఓటీటీలోకి వచ్చేసిన గెటప్ శ్రీను సినిమా
గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. మే 24న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దర్శకుడు కృష్ణమాచారి ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు రాజు యాదవ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.రాజు యాదవ్ కథ విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది. -
ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?
మరో వారం వచ్చేసింది. ఈసారి ధనుష్ 'రాయన్', రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు', 'ఆపరేషన్ రావణ్' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఉన్నంతలో కొన్ని కొత్త మూవీస్ స్ట్రీమింగ్కి సిద్ధమైపోయాయి. ఓవరాల్‌గా 17 సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)ఓటీటీలో వచ్చే సినిమాల విషయానికొస్తే.. 'రాజు యాదవ్' అనే తెలుగు స్ట్రెయిట్ మూవీ ఒక్కటే ఉంది. ఇది కాకుండా భయ్యాజీ, బ్లడీ ఇష్క్, కాళ్ అనే ఇతర భాషా చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (జూలై 22 నుంచి 28 వరకు)నెట్ ఫ్లిక్స్క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూలై 25ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) - జూలై 25ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 26ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26అమెజాన్ ప్రైమ్ద మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మేన్లీ వార్ఫేర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25హాట్స్టార్బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) - జూలై 26చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) - జూలై 26జీ5భయ్యాజీ (హిందీ సినిమా) - జూలై 26ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) - జూలై 26ఆహాకాళ్ (తమిళ సినిమా) - జూలై 23గ్రాండ్ మా (తమిళ చిత్రం) - జూలై 23రాజు యాదవ్ (తెలుగు మూవీ) - జూలై 24ఆపిల్ ప్లస్ టీవీటైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24బుక్ మై షోవన్ లైఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25జియో సినిమావిచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 26(ఇదీ చదవండి: రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
ఓటీటీకి టాలీవుడ్ కమెడియన్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
కమెడియన్ గెటప్ శీను, అంకితా కారత్ జంటగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. రెండు నెలల్లోపే ఓటీటీల్లో సందడి చేయనుంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వెల్లడించింది.ఈనెల 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు ట్వీట్ చేసింది. ఈ మేరకు గెటప్ శ్రీనుతో ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేసింది.రాజు యాదవ్ కథేంటంటే..'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ. థియేటర్లలో చూడని వారు.. ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Raju yadav manodu, mee aha lo vasthunnadu!😎Yaadh maravakurri...ee month 24th na vasthundu🕺🏻The Crazy Entertainer #RajuYadav premieres July 24th only on aha!@getupsrinu3 @RocketRaghava @mirchihemant @iamankitakharat @actorchakrapani @PawonRamesh @PrashanthUttar1 pic.twitter.com/3ANM2lU4XF— ahavideoin (@ahavideoIN) July 18, 2024 -
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
'జబర్దస్త్' కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి గెటప్ శీను.. ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్గా 'రాజు యాదవ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వస్తుంది.'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్) -
ఆర్టిస్ట్‌గా ఫెయిల్ అయిపోయానేమో అనుకున్నా: గెటప్ శ్రీను
‘రాజు యాదవ్’లో నేను పోషించిన పాత్ర చాలా కష్టమైనది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒకానొక దశలో ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోయానేమో అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. షూటింగ్ అప్పుడు చాలా కష్టంగా అనిపించింది. అయితే దర్శకుడు చాలా స్ఫూర్తిని ఇచ్చి ఈ పాత్ర చేయించారు’ అని అన్నాడు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజు యాదవ్’. ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.మే 24న ఈ చిత్రం విడుదల కాబోతంది. ఈ నేపథ్యంలో తాజాగా గెటప్ శ్రీను మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..⇒ నేను హీరోగా చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటివరకూ నటనకు ఎక్కువ స్కోప్ వున్న పాత్రలని చేయడానికి ప్రయత్నించాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే స్థిరపడాలని అనుకున్నాను. రాజు యాదవ్ కథ విన్నాక ఫుల్ లెంత్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కలుగుతుందనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. నా వరకూ ఇది నేను చేస్తున్న ఫుల్ లెంత్ క్యారెక్టర్ గానే భావిస్తాను.⇒ ఈ చిత్రంలో కామెడీతో పాటు ఎమోషన్ కూడా ఉంటుంది. తల్లితండ్రులు తమ కొడుకు నుంచి ఏం కోరుకుంటున్నారు ? అలాగే కొడుకు కోణంలో తల్లితండ్రులు ఎలా ఉండాలి? తల్లితండ్రుల కలని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకూడదనే అంశం ఈ కథకు మూలం.⇒ దర్శకుడు కృష్ణమాచారి నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అలాగే ఒక స్పానిస్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన కథ చెప్పే విధానం చాలా నచ్చింది. చాలా సహజత్వంతో సినిమాని తీశారు. ఫన్ తో పాటు ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించారు.⇒ ఇది రియల్ స్టొరీనే. కానీ క్యారెక్టరైజేషన్ ఫిక్షనల్. బౌలర్ లక్ష్మీ పతి బాలాజీ గారికి చిన్నపుడు ముఖానికి ఓ సర్జరీ జరిగితే సర్జరీలో ఎదో తేడా జరిగి స్మైల్ ఫేస్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అక్కడ నుంచి మా దర్శకుడు స్ఫూర్తి పొంది ఈ పాత్రకు ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ వుండటం మామూలు విషయం కాదు. ఈ పాత్ర చేయడం చాలా కష్టం అనిపించింది⇒ టీవీ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్ధికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే టీవీకి ఎక్కువ డేట్లు కేటాయించడం వలన సినిమాల్లో చాలా మంచి పాత్రలని మిస్ వుతున్నానని తెలిసింది. ఇప్పుడు సినిమాలపైనే దృష్టి పెట్టాను. నా కెరీర్ పట్ల ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎదో సాధించానని ఆనందం ఇంట్లో వారికి ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. -
ఆ స్ఫూర్తితోనే ‘రాజు యాదవ్’ కథ రాశా: డైరెక్టర్ కృష్ణమాచారి
‘‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’లో అలీగారికి కోటి రూపాయిల లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపంతో కథ రాస్తే బావుంటుందనిపించి ‘రాజు యాదవ్’ స్క్రిప్ట్ రాశాను’’ అని డైరెక్టర్ కృష్ణమాచారి అన్నారు. గెటప్ శ్రీను హీరోగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఈ నెల 17న ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగులగారి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్’ నా తొలి చిత్రం. నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్’ రియలిస్టిక్‌గా ఉంటుంది. గెటప్ శ్రీను కెరీర్లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్‌గారు మా సినిమా కోసం ఓ పాట రాసి, పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు. -
హీరోగా జబర్దస్త్ కమెడియన్.. ఆసక్తిగా ట్రైలర్!
జబర్దస్త్ కమెడియన్ రాజు యాదవ్, అంకిత కారత్ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. యధార్థం సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గెటప్ శ్రీను తన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే క్రికెట్ ఆడుతుండగా శ్రీనుకు బాల్ తగలడంతో ముఖచిత్రం మారిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా ఫేస్ విచిత్రంగా తయారవుతుంది. దీంతో అతని నవ్వుతో పడే ఇబ్బందులను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌గా గెటప్ శ్రీను కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రంలో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. -
నిజానికి దగ్గరగా...
‘గెటప్’ శీను, అంకితా కరత్ జంటగా కృష్ణమాచారి దర్శకత్వంలో ప్రశాంత్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘రాజు యాదవ్’. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి సాగర్ కె. చంద్ర క్లాప్ ఇచ్చారు. వేణు ఉడుగుల, సుధాకర్ చెరుకూరి, తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ స్క్రిప్ట్‌ను కృష్ణమాచారికి అందించారు. సూడో రియలిజమ్ జానర్లో ఈ సినిమా ఉంటుందని చిత్రబృందం తెలిపింది. ‘కమర్షియల్ హంగులకు దూరంగా, వాస్తవికకు దగ్గరగా మా సినిమా ఉంటుంది’ అన్నారు కృష్ణమాచారి. ‘డిసెంబర్ మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు ప్రశాంత్ రెడ్డి. -
ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీలకు రాజు
బంజారాహిల్స్: నగరానికి చెందిన బాడీబిల్డర్ మానుక రాజు యాదవ్ మజిల్ మేనియా ప్రపంచ బాడీబిల్డింగ్ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడు. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఈ నెల 20 నుంచి 23 వరకు ఈ పోటీలు జరుగుతాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో సుమారు 25 దేశాలకు చెందిన బాడీబిల్డర్లు పోటీపడతారు. రాజు యాదవ్ 70 కిలోల కేటగిరీలో పాల్గొననున్నాడు. ఇప్పటి వరకు అతను 4 సార్లు వరల్డ్ బాడీబిల్డింగ్ పోటీల్లో సత్తా చాటాడు. 2010, 2013ల్లో కాంస్యం, 2011లో స్వర్ణం గెలిచిన రాజు 2012లో ఐదో స్థానంలో నిలిచాడు.