ఈ వారం ఓటీటీల్లో 17 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే? | Upcoming OTT Release Movies Telugu On July Last Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఒక్క వారంలో 17 మూవీస్.. ఏ ఓటీటీలో ఏదంటే?

Published Mon, Jul 22 2024 12:52 PM | Last Updated on Mon, Jul 22 2024 1:11 PM

Upcoming OTT Release Movies Telugu On July Last Week 2024

మరో వారం వచ్చేసింది. ఈసారి ధనుష్ 'రాయన్', రాజ్ తరుణ్ 'పురుషోత్తముడు', 'ఆపరేషన్ రావణ్' సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వీటిలో దేనిపైనా పెద్దగా బజ్ లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఉన్నంతలో కొన్ని కొత్త మూవీస్ స్ట్రీమింగ్‌కి సిద్ధమైపోయాయి. ఓవరాల్‌గా 17 సినిమాలు-వెబ్ సిరీసులు పలు ఓటీటీల్లోకి రాబోతున్నాయి.

(ఇదీ చదవండి: ఓటీటీలో భారతీయుడు 2.. అంచనాలు తప్పడంతో మార్పులు)

ఓటీటీలో వచ్చే సినిమాల విషయానికొస్తే.. 'రాజు యాదవ్' అనే తెలుగు స్ట్రెయిట్ మూవీ ఒ‍క్కటే ఉంది. ఇది కాకుండా భయ్యాజీ, బ్లడీ ఇష్క్, కాళ్ అనే ఇతర భాషా చిత్రాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ మూవీ స్ట్రీమింగ్ కానుందనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు (జూలై 22 నుంచి 28 వరకు)

నెట్ ఫ్లిక్స్

  • క్లియో సీజన్ 2 (జర్మన్ సిరీస్) - జూలై 25

  • ద డెకమెరన్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 25

  • టోక్యో స్విండ్లర్స్ (జపనీస్ సిరీస్) - జూలై 25

  • ఎలైట్ సీజన్ 8 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26

  • ఘోస్ట్ బస్టర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 26

  • ద డ్రాగన్ ప్రిన్స్ సీజన్ 6 (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 26

అమెజాన్ ప్రైమ్

  • ద మినిస్ట్రీ ఆఫ్ అన్‌జెంటిల్‌మేన్లీ వార్‌ఫేర్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25

హాట్‌స్టార్

  • బ్లడీ ఇష్క్ (హిందీ మూవీ) - జూలై 26

  • చట్నీ సాంబార్ (తమిళ సిరీస్) - జూలై 26

జీ5

  • భయ్యాజీ (హిందీ సినిమా) - జూలై 26

  • ఛల్తే రహే జిందగీ (హిందీ మూవీ) - జూలై 26

ఆహా

  • కాళ్ (తమిళ సినిమా) - జూలై 23

  • గ్రాండ్ మా (తమిళ చిత్రం) - జూలై 23

  • రాజు యాదవ్ (తెలుగు మూవీ) - జూలై 24

ఆపిల్ ప్లస్ టీవీ

  • టైమ్ బండిట్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూలై 24

బుక్ మై షో

  • వన్ లైఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జూలై 25

జియో సినిమా

  • విచ్ బ్రింగ్స్ టూ మీట్ యూ (ఇంగ్లీష్ మూవీ) - జూలై 26

(ఇదీ చదవండి: రాజమౌళి ఓ పిచ్చోడు.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement