ఆర్టిస్ట్‌గా ఫెయిల్‌ అయిపోయానేమో అనుకున్నా: గెటప్‌ శ్రీను | Sakshi
Sakshi News home page

ఎప్పుడు నవ్వుతూ ఉండటం చాలా కష్టం : గెటప్‌ శ్రీను

Published Thu, May 23 2024 6:50 PM

Getup Srinu Talks About Raju Yadav Movie

‘రాజు యాదవ్‌’లో నేను పోషించిన పాత్ర చాలా కష్టమైనది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు ఒకానొక దశలో ఆర్టిస్ట్ గా ఫెయిల్ అయిపోయానేమో అనుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. షూటింగ్‌ అప్పుడు చాలా కష్టంగా అనిపించింది.  అయితే దర్శకుడు చాలా స్ఫూర్తిని ఇచ్చి ఈ పాత్ర చేయించారు’ అని అన్నాడు గెటప్‌ శ్రీను. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘రాజు యాదవ్‌’.  ఈ చిత్రం ద్వారా కృష్ణమాచారి దర్శకునిగా పరిచయం అవుతున్నారు.మే 24న ఈ చిత్రం విడుదల కాబోతంది. ఈ నేపథ్యంలో  తాజాగా గెటప్‌ శ్రీను మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

నేను హీరోగా చేయాలని ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటివరకూ నటనకు ఎక్కువ స్కోప్ వున్న పాత్రలని చేయడానికి ప్రయత్నించాను. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గానే స్థిరపడాలని అనుకున్నాను. రాజు యాదవ్ కథ విన్నాక ఫుల్ లెంత్ పెర్ఫార్మెన్స్ చేసే అవకాశం కలుగుతుందనిపించింది. అందుకే ఈ సినిమా చేశాను. నా వరకూ ఇది నేను చేస్తున్న ఫుల్ లెంత్ క్యారెక్టర్ గానే భావిస్తాను.

ఈ చిత్రంలో కామెడీతో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది. తల్లితండ్రులు తమ కొడుకు నుంచి ఏం కోరుకుంటున్నారు ? అలాగే కొడుకు కోణంలో తల్లితండ్రులు ఎలా ఉండాలి? తల్లితండ్రుల కలని సాకారం చేయడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకూడదనే అంశం ఈ కథకు మూలం.

దర్శకుడు కృష్ణమాచారి  నీది నాది ఒకే కథ, విరాట పర్వం, అలాగే ఒక స్పానిస్ సినిమాకి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆయన కథ చెప్పే విధానం చాలా నచ్చింది. చాలా సహజత్వంతో సినిమాని తీశారు. ఫన్ తో పాటు ఎమోషన్ ని చాలా అద్భుతంగా చూపించారు.

ఇది రియల్ స్టొరీనే. కానీ క్యారెక్టరైజేషన్ ఫిక్షనల్. బౌలర్ లక్ష్మీ పతి బాలాజీ గారికి చిన్నపుడు ముఖానికి ఓ సర్జరీ జరిగితే సర్జరీలో ఎదో తేడా జరిగి స్మైల్ ఫేస్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూ లో చెప్పారు. అక్కడ నుంచి మా దర్శకుడు స్ఫూర్తి పొంది ఈ పాత్రకు ఆ క్యారెక్టరైజేషన్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడూ నవ్వుతూ వుండటం మామూలు విషయం కాదు. ఈ పాత్ర చేయడం చాలా కష్టం అనిపించింది

టీవీ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్ధికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే టీవీకి ఎక్కువ డేట్లు కేటాయించడం వలన సినిమాల్లో చాలా మంచి పాత్రలని మిస్ వుతున్నానని తెలిసింది. ఇప్పుడు సినిమాలపైనే దృష్టి పెట్టాను. నా కెరీర్ పట్ల ఇంట్లో వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. నేను ఎదో సాధించానని ఆనందం ఇంట్లో వారికి ఉంది. అది నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement