గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘రాజు యాదవ్’. మే 24న థియేటర్స్‌లో విడుదలైన ఈ చిత్రానికి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దర్శకుడు కృష్ణమాచారి ఎంచుకున్న కాన్సెప్ట్ కొత్తగా ఉన్నా.. కథనం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. అలాంటి వారి కోసమే ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చేశాడు రాజు యాదవ్. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది.
రాజు యాదవ్ కథ విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.
ప్రథమార్థం సినిమా అంతా కూడా కథానాయకుడు, అతని స్నేహితులు, మధ్య తరగతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ తగిలాక కథనాయుకుడి ముఖ కవలికల్లో మార్పు రావడం, ఆ నేపథ్యంలో పండే హాస్యం కాస్త కాలక్షేపాన్ని పంచుతుంది. ధ్వితీయార్థం లోనే అసలు కథ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం కథానాయకుడు హైదరాబాద్ కి వెళ్ళి ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్ లో భాగంగా వచ్చే చివరి 20 నిమిషాల సన్నివేశాలతో మధ్య తరగతి కుటుంబం తాలూకు తండ్రి కొడుకుల మధ్య ఉండే భావోద్వేగమైన ఎమోషన్ తో కంటతడి పెట్టిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment