‘‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’లో అలీగారికి కోటి రూపాయిల లాటరీ తగులుతుంది. ఆ ఆనందంలో ఆయన నవ్వుతూనే చనిపోతారు. సినిమా అంతా నవ్వు ముఖంతోనే ఉంటారు. అలాగే క్రికెటర్ లక్ష్మీపతి బాలాజీకి జరిగిన సర్జరీ వల్ల ఆయన ముఖం ఎప్పుడూ నవ్వుతున్నట్లే కనిపిస్తుంది. ఇలాంటి లోపంతో కథ రాస్తే బావుంటుందనిపించి ‘రాజు యాదవ్’ స్క్రిప్ట్ రాశాను’’ అని డైరెక్టర్ కృష్ణమాచారి అన్నారు.
గెటప్ శ్రీను హీరోగా కె. ప్రశాంత్ రెడ్డి, రాజేశ్ కల్లెపల్లి నిర్మించిన చిత్రం ‘రాజు యాదవ్’. ఈ నెల 17న ఈ సినిమా రిలీజవుతున్న సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ– ‘‘15 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకి వచ్చాను. ‘నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం’ చిత్రాలకు దర్శకుడు వేణు ఊడుగులగారి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా చేశాను. దర్శకుడిగా ‘రాజు యాదవ్’ నా తొలి చిత్రం.
నాకు సహజత్వంతో కూడకున్న సినిమాలంటే ఇష్టం. ‘రాజు యాదవ్’ రియలిస్టిక్‌గా ఉంటుంది. గెటప్ శ్రీను కెరీర్‌లో ఇది గుర్తుండిపోయే సినిమా అవుతుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం, సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లాయి. చంద్రబోస్‌గారు మా సినిమా కోసం ఓ పాట రాసి, పాడటం సంతోషంగా ఉంది. సినిమా అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment