![Getup Srinu Movie Raju Yadav Trailer Out Now](/styles/webp/s3/article_images/2024/05/5/getup.jpg.webp?itok=x7AJNLDn)
జబర్దస్త్ కమెడియన్ రాజు యాదవ్, అంకిత కారత్ జంటగా నటించిన చిత్రం రాజు యాదవ్. యధార్థం సంఘటనల ఆధారంగా కృష్ణమాచారి దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. సాయి వరుణవి క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రశాంత్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. హనుమాన్ హీరో తేజ సజ్జా చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేశారు.
తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే గెటప్ శ్రీను తన నటన, కామెడీతో ఆకట్టుకున్నారు. ట్రైలర్ ప్రారంభంలోనే క్రికెట్ ఆడుతుండగా శ్రీనుకు బాల్ తగలడంతో ముఖచిత్రం మారిపోతుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండేలా ఫేస్ విచిత్రంగా తయారవుతుంది. దీంతో అతని నవ్వుతో పడే ఇబ్బందులను తెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్‌గా గెటప్ శ్రీను కనిపించనున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్ విడుదల చేయగా.. ఆడియన్స్ నుంచి విపరీతమైన ఆదరణ దక్కించుకుంది. కాగా.. ఈ చిత్రం మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా.. ఈ చిత్రంలో ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.
Comments
Please login to add a commentAdd a comment