'జబర్దస్త్' కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి గెటప్ శీను.. ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్‌గా 'రాజు యాదవ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్‌కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)
గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వస్తుంది.
'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్‌లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్‌గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.
(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్)
Comments
Please login to add a commentAdd a comment