టాలీవుడ్‌లో సత్యం సినిమాతో పాపులర్ అయిన నటుడు 'రాజేశ్'. ఈ సినిమాతో ఆయనకు మంచి గుర్తింపు రావడంతో సత్యం రాజేశ్‌గా ఇండస్ట్రీలో సత్తా చాటాడు. పొలిమేర సినిమాతో మరింత పాపులర్ అయ్యాడు. తాజాగా ఆయన నటించిన చిత్రం'టెనెంట్'. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన చిత్రం గత నెలలో థియేటర్లలోకి వచ్చింది. ఆపై జూన్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది.
వెండితెరపై టెనెంట్ చిత్రం పెద్దగా మెప్పించలేదు. కానీ, ఓటీటీ విషయంలో మాత్రం ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో కూడా 'టెనెంట్' ఎంట్రీ ఇచ్చింది. నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. వై.యుగంధర్ తెరకెక్కించిన 'టెనెంట్' చిత్రాన్ని ఎమ్.చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా ఉన్నారు. ఇందులో మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్ లాంటి వాళ్లు నటించారు.
'టెనెంట్' విషయానికొస్తే.. గౌతమ్, సంధ్య పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటారు. కానీ వీళ్ల జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. సంధ్య వింతగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆమెకు ఏమైందోనని గౌతమ్ తెలుసుకునేలోపే ఇంట్లోనే బెడ్‌పై శవమై కనిపిస్తుంది. అప్పుడే వీళ్లుంటున్న అపార్ట్‌మెంట్ పైనుంచి ఓ యువకుడు కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. అసలు సంధ్యది హత్య? ఆత్మహత్య? గౌతమే ఆమెని చంపేశాడా? చనిపోయిన కుర్రాడు ఎవరు? పోలీసుల దర్యాప్తులో బయటకొచ్చిన నిజాలేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.
Comments
Please login to add a commentAdd a comment