baladithya
-
ఓటీటీకి మా ఊరి పొలిమేర-2.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
సత్యం రాజేశ్, డా.కామాక్షీ భాస్కర్ల, గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మా ఊరి పొలిమేర 2’. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గౌరు గణబాబు సమర్పణలో గౌరీకృష్ణ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న థియేటర్లలో విడుదలైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం అదేస్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.10 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు తెలుస్తోంది. రెండేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్‌గా నిలిచిన మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కించారు. (ఇది చదవండి: బిగ్ బాస్ హౌస్‌లో లవ్ బర్డ్స్.. ఇక్కడే పెళ్లి చేసుకుందామన్న ప్రియాంక!) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్‌పై సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆడియన్స్ ఊహించని విధంగా ఈ నెలాఖరులోనే ఓటీటీకి రానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలా జరిగితే.. నవంబర్ 3న విడుదలైన ఈ సినిమా నెల కాకముందే ఓటీటీలోకి రానుంది. మరోవైపు డిసెంబర్ మొదటి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని మరో వార్త వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ రిలీజ్ తేదీపై కాస్తా సస్పెన్ష్ కొనసాగుతోంది. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ఈ మూవీని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే మా ఊరి పొలిమేర పార్ట్-1 ఇందులోనే స్ట్రీమింగ్ అవుతోన్న సంగతి తెలిసిందే. పార్ట్-2 కూడా హాట్‌స్టార్‌లోనే రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: 'నా జీవితంలో ఇలా మొదటిసారి చూశా'.. పుష్ప చిత్రంపై బిగ్ బీ కామెంట్స్ వైరల్!) -
Maa Oori Polimera 2 : కవిత ఎలా బతికొచ్చిందో తెలిసేది ఆ రోజే!
సత్యం రాజేశ్, బాలాదిత్య, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం కరోన సమయంలో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించింది చిత్రబృందం. తాజాగా ఆ సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ని చిత్రబృందం వెల్లడించింది. ‘మా పూరి పొలిమేర-2’ ఈ సారి డైరెక్ట్‌గా ఓటీటీలో కాకుండా థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. డా. అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 2న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. కవిత ఎలా బతికొచ్చింది? మొదటి భాగంలో కొమిరి(సత్యం రాజేశ్)..గర్భిణి కవిత(రమ్య) బంధువుల చెతిలో దెబ్బలు తిని, ఆమె చితిలోనే పడి చనిపోయినట్లు చూపించారు. అయితే చితిలో పడి చనిపోయింది కొమిరి కాదని ఆయన తమ్ముడు జంగయ్య(బాలాదిత్య) గుర్తిస్తాడు. క్లైమాక్స్‌లో కొమిరి కేరళలో ఉన్నట్లు చూపించారు.అంతేకాదు చనిపోయిన కవిత కూడా బతికే ఉన్నట్లు, కొమిరితో కలిసి ఉన్నట్లు చూపిస్తూ.. శుభం కార్డు వేశారు. అసలు చనిపోయిన గర్భిణి ఎలా బతికొచ్చింది? అనేది తెలియాలంటే నవంబర్ 2 థియేటర్స్‌లో ‘పొలిమేర-2’చూడాల్సిందే. అంచనాలకు తగ్గట్టే సీక్వెల్ మా ఊరి పొలిమేర` మొదటి పార్ట్ ఎంత పెద్ద హిట్టయిందో అందరికీ తెలిసిందే. సెకండ్ పార్ట్ పై ఇప్పటికే భారీ అంచానాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగా ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత గౌరికృష్ణ అన్నారు. `గ్రామీణ నేపథ్యంలో జరిగే మర్డర్ మిస్టరీకి బ్లాక్ మ్యాజిక్ అంశాన్ని జోడించి `మా ఊరి పొలిమేర-2` చిత్రాన్ని తెరకెక్కించాం. మొదటి పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ ఇంకా ఎంతో ఇంట్రస్టింగ్ గా ఉండబోతుంది’అని దర్శకుడు విశ్వనాథ్ అన్నారు. -
‘మా ఊరి పొలిమేర` సీక్వెల్ వచ్చేస్తుంది!
సత్యం రాజేష్, గెటప్ శ్రీను, బాలాదిత్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘మా ఊరి పొలిమేర’ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. శ్రీకృష్ణ క్రియేషన్స్ బ్యానర్ పై గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా డా.అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం 2021 డిసెంబర్లో డైరెక్టర్‌గా ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలై మంచి టాక్ని సంపాదించుకుంది. వాస్తవికతకు దగ్గరగా ఊహించని ట్వీస్టులతో సినిమా మొత్తం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది. ‘ఉత్తరాఖండ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఖమ్మం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తాం’అని చిత్ర యూనిట్ పేర్కొంది. గ్యాని సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో డా. కామాక్షి, రవివర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. -
Bigg Boss 6: షాకింగ్ ట్విస్ట్.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్..ఆ ఇద్దరు ఔట్
బిగ్‌బాస్ హౌస్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. ముఖ్యంగా ఎలిమినేషన్ విషయంలో గత రెండు వారాలుగా షాకుల మీద షాకులు ఇస్తూనే ఉన్నాడు బిగ్‌బాస్. ఎనిమిదో వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న సూర్య ఎలిమినేట్ చేయగా..తొమ్మిదో వారంలో ఎవరూ ఊహించని విధంగా గీతూని బయటకు పంపారు. ఇక పదో వారంలో కూడా ప్రేక్షకులకు భారీ షాక్ ఇవ్వబోతున్నాడట బిగ్‌బాస్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందట. ఈ ఎలిమినేషన్‌కు సంబంధించిన షూటింగ్ శుక్రవారమే పూర్తవ్వడంతో.. ఎప్పటి మాదిరే ఈ వారం కూడా ఎలిమినేట్ అయినవారి పేర్లు బయటకు వచ్చాయి. ఈవారం ఎలిమినేషన్లో ఇనయా, కీర్తి, ఫైమా, వాసంతి, బాలాదిత్య, మెరీనా, రేవంత్, ఆదిరెడ్డి, శ్రీహాన్ మొత్తం 9మంది ఉన్నారు. వీరిలో నుంచి బాలాదిత్య, మెరీనా ఈ వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఓటింగ్ లీస్ట్ లో బాలాదిత్య లాస్ట్‌లో ఉండగా.. మెరీనాను కూడా హౌజ్ నుంచి పంపించేందుకే డబుల్ ఎలిమినేషన్ పెట్టినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హౌస్‌లో బాలాదిత్య, మెరీనాకు మంచి పేరు ఉంది. వివాదాలకు దూరంగా ఉంటూ.. గేమ్‌ని గేమ్‌గానే ఆడారు. తమదైన ఆటతో తీరుతోప్రేక్షకుల్ని మెప్పించారు. ఒక్క సిగరేట్ల విషయంతో తప్పితే బాలాదిత్య విషయంలో నెగెటివ్ అనేదే లేదు. ఇక మెరీనాకి అయితే ఇన్ అండ్ ఔట్ క్లీన్ ఇమేజ్ ఉంది. మంచితనమే వీరికి మైనస్ అయినట్లు తెలుస్తుంది. -
Bigg Boss 6: సిగరెట్ కోసం ఇంత అవమానిస్తావా..సిగ్గుండాలి..గీతూపై బాలాదిత్య ఫైర్
బిగ్‌బాస్ హౌస్‌లో తొమ్మిదో వారం కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘మిషన్ పాజిబుల్’ రసవత్తరంగా సాగింది. ఈ టాస్క్ కోసం ఇంటి సభ్యులు రెండు టీమ్‌లుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఉంటే.. ఆదిరెడ్డి, రాజ్, ఇనయా, వాసంతి, రోహిత్, మెరినా, బాలాదిత్య బ్లూ టీమ్‌గా ఉన్నారు. ఒక టీమ్‌లోని సభ్యులను మరో టీమ్ సభ్యులు హత్య చేయాలి. దాని కోసం తమ ప్రత్యర్థి టీమ్ సభ్యుల భుజాలపై ఉన్న నాలుగు స్ట్రిప్పులను లాగేయాలి. చనిపోయిన సభ్యులు దెయ్యం అవుతారు. అయితే ఈ టాస్క్‌లో భుజ బలం మాత్రమే కాదు బుద్ది బలం కూడా చూపించాలి అని బిగ్‌బాస్ చెప్పడంతో గీతూ రెచ్చిపోయింది. బాలాదిత్య వీక్నెస్తో ఆడుకునేందుకు గీతూ-శ్రీసత్య-శ్రీహాన్ స్కెచ్ వేశారు. బాలాదిత్య సిగిరెట్లు, లైటర్ దాచేసి అతని వీక్నెస్ మీద దెబ్బకొట్టారు. అవి కావాలంటే నాలుగు స్ట్రిప్పులు కావాలని అడిగింది గీతూ. దీంతో బాలాదిత్య ఎమోషన్ అయిపోయాడు. 'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా? సిగ్గుండాలి’ అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అయినప్పటికీ గీతూ మాత్రం సిగరేట్, లైటర్ ఇవ్వలేదు. మాటకు మాట సమాధానం ఇస్తూ.. గట్టిగానే ఉంది. సిగరేట్ కోసం సిగ్గుండాలి అంటాడా అంటూ ఆదిరెడ్డితో చెబుతూ బాధపడింది. ఈ టాస్క్ సగంలో ఉండగానే.. నిన్నటి ఎపిసోడ్ ముగిసింది. మరి ఈ ‘మిషన్ పాజిబుల్’టాస్క్‌లో ఎవరు గెలిచారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
ఎంతలా దిగజారుతున్నావో అర్థమవుతుందా? గీతూపై బాలాదిత్య ఫైర్
బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటాదారుల టాస్క్ హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. అయితే టాస్క్ అవుతుండగానే గీతూ మళ్లీ ఎమోషన్స్‌తోనే ఆడుకుంది. ఎదుటివాళ్ల వీక్నెస్ పాయింట్ మీదే దెబ్బకొట్టాలని చూసింది. టాస్క్‌లో గెలవడం కోసం బాలాదిత్య లైటర్‌ను దాచేసింది. అప్పటికే బాలాదిత్య వచ్చి అడగ్గా.. గేమ్‌లో రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తాం అంటూ గీతూ, సత్యలు అన్నారు. దీంతో మరింత ఫైర్ అయిన బాలాదిత్య ఆటలో గెలవాలి కానీ ఇదేం పద్దతి అంటూ కోప్పడ్డాడు. అయినా సరే గీతూ.. రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తా.. ఇంకో రెండు స్ట్రిప్‌లు ఇస్తే సిగరెట్ ఇస్తా అంటూ మరింత రెచ్చిపోయింది. ఇంక ఆ మాటలకు బాలాదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు.. 'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా?? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా?అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు. -
బిగ్‌బాస్-6 మొదటి కెప్టెన్‌గా మిస్టర్ కూల్.. జైలుకు వెళ్లిన గీతూ
బిగ్‌బాస్ సీజన్-6 మొదటి కెప్టెన్‌గా బాలాదిత్య గెలిచాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా నీళ్లలొ వేసిన తాళం చెవిని నోటితో తీసి, వాటితో బాక్సులను ఓపెన్ చేసి, అందులో ఉన్న కారు నెంబర్ ను చూడాలి. ఆ నెంబర్ ప్లేటులోని అక్షరాలు, నెంబర్లను వెతికి కార్లకు అతికించాలి. ఈ టాస్కులో మెరీనా అండ్ రోహిత్, నేహా చౌదరి, గీతూ రాయల్,బాలాదిత్య, ఆర్జే సూర్య, ఆదిరెడ్డిలు పోటీపడగా చివరికి బాలాదిత్య విజేతగా నిలిచాడు. ఇక ఆ తర్వాత ఇంట్లో అసలు రచ్చ మొదలైంది. ఈ కెప్టెన్సీ టాస్కులో వరస్ట్ పర్ఫార్మర్ ఎవరో చెప్పాలని బిగ్‌బాస్ ఇంటి సభ్యులను ఆదేశించాడు. ఇందులో రేవంత్ గీతూని నామినేట్ చేయాలనుకున్నట్లు భావించినా ఆమెకు పీరియడ్స్ కావడంతో జైలుకు పంపడం ఇష్టం లేదని, దీంతో ఆదిరెడ్డిని నామినేట్ చేశాడు. ఇక సుదీప గీతూకి గట్టిగానే ఇచ్చిపడేసింది. ‘నాకు నచ్చినట్టు నేనుంటా, నేను నా ఇంట్లో ఉండే ఎవరూ ఒప్పుకోరు’ అని చెప్పి ముఖంపై రెడ్ మార్క్ వేసింది. చలాకీ చంటి కూడా గీతూకే ఓటేశారు. ఆ తర్వాత రాజశేఖర్, ఇనయా. శ్రీసత్య, ఆరోహి, ఆర్జే సూర్య, వాసంతి, నేహా, మెరీనా జంట, అర్జున్‌లు గీతూకే వరస్ట్ పెర్ఫార్మర్గా ఓటేశారు. అయితే గీతూ మాత్రం తను చేసిందే కరెక్ట్ అంటూ సమర్థించుకుంది. అంతేకాకుండా గేమ్ కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉన్నానని, ఇంట్లో ఒకవేళ తన పేరెంట్స్‌ని తీసుకొచ్చినా వాళ్లని వెనక్కినెట్టి తాను గెలవాలని కోరుకుంటానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బిగ్‌బాస్‌లో ఉన్నంతమాత్రానా మీరంతా నా ఫ్యామిలీ కాదు. జస్ట్ కో పార్టిసిపెంట్స్ అంటూ ఇతర కంటెస్టెంట్లని ఉద్దేశించి గీతూ తన ఓపీనియన్ చెప్పింది. ఇక హస్మేట్స్లో దాదాపు ఎక్కువ ఓట్లు గీతూకే వచ్చినందుకు చివరికి ఆమె జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అయితే ఆమెకు పీరియడ్స్ ఉండటంతో ఈ ఒక్కసారికి ఆమెను క్షమించాలని బాలాదిత్య రిక్వెస్ట్ చేసినా బిగ్‌బాస్ నుంచి ఆదేశాలు రాకపోవడంతో గీతూని జైలుకి పంపారు. -
అసలైన ఆట మొదలైందిగా.. బిగ్‌బాస్ సీజన్-6 తొలి కెప్టెన్ ఎవరంటే
బిగ్‌బాస్ సీజన్-6లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గొడవలు ఏ స్థాయికి వెళ్తాయా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 21మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో కొందరు కంటెస్టెంట్లు చీటికిమాటికీ వాగ్వాదానికి దిగుతుంటే, మరికొందరు కంటెస్టెంట్లు మాకేం పట్టలేదంటూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్లో మొదటి కెప్టెన్ కోసం బిగ్‌బాస్ కెప్టెన్సీ టాస్క్ నిర్వహించాడు. ఇందులో ఫైమా సంచాలకురాలిగా వ్యహరించింది. కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్ సెక్షన్లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి,నేహా చౌదరి సహా మాస్ సెక్షన్ నుంచి మెరానా-రోహిత్, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. అయితే టాస్క్ జరుగుతున్నప్పుడు కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. చీటింగ్ చేస్తుందంటూ మెరీనా గీతుపై ఫైర్ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది. మరోవైపు ఫైమా- నేహా చౌదరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమో చూసి అర్థమవుతుంది. ఇంతకీ ఈ గొడవకు కారణమేంటి? వీరిలో బిగ్‌బాస్ సీజన్-6 మొదటి కెప్టెన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. Captaincy task modhalaindhi...Who will make it? 👀 Find out on @StarMaa tonight, streaming 24/7 on @DisneyPlusHSTel.#BiggBossTelugu6 #BBLiveOnHotstar#StarMaa #DisneyPlusHotstar pic.twitter.com/N2ihSMTABY — starmaa (@StarMaa) September 9, 2022 -
బిగ్‌బాస్‌కి వచ్చేముందే కూతురు పుట్టింది : బాలాదిత్య
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్ కొడుకుగా పిసినారితనం చూపిస్తూ చేసిన బాలాదిత్య నటన అలరించింది.జంబలకిడిపంబ, హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలాదిత్య `చంటిగాడు` సినిమాతో హీరోగా మారాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుమారు 40 సినిమాల్లో నటించగా, హీరోగా జాజిమల్లి, 1940లో ఒక గ్రామం, భద్రాద్రి సహా 10 సినిమాలు చేశాడు. 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు.ఆ తర్వాత యాంకర్‌గానూ గుర్తింపు పొందాడు. బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. లక్ష్మీ మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. రీసెంట్గా మరో బుజ్జి పాపాయి కూడా పుట్టింది. మరి ఫ్యామిలీని వదిలి బాలాదిత్య ఎన్ని రోజులు ఉండగలడు చూడాల్సి ఉంది. -
బాలాదిత్య, కౌశిక్ ల ఫాథర్స్ డే చిట్ ఛాట్
-
30 ఇయర్స్ అంటోన్న బాలాదిత్య
‘‘నా 30 ఏళ్ల ప్రయాణంలో ఎందరో గొప్ప దర్శక–నిర్మాతలతో, మహానటులతో పని చేసే అవకాశం లభించడం ఆనందంగా ఉంది’’ అన్నారు బాలాదిత్య. ‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’తో బాలనటుడిగా పరిచయమైన బాలాదిత్య ‘అన్న’, ‘లిటిల్ సోల్జర్స్’, ‘బంగారు బుల్లోడు’, ‘హిట్లర్’ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ‘చంటిగాడు’తో హీరోగా పరిచయం అయ్యారు. నటుడిగా 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బాలాదిత్య మాట్లాడుతూ – ‘‘ఎదురింటి మొగుడు పక్కింటిపెళ్ళాం’ చిత్రంలో తొలిసారి చైల్డ్ ఆర్టిస్టుగా చేశాను. దివంగత ప్రముఖ దర్శకులు దాసరిగారు ఈ సినిమాకి క్లాప్ ఇచ్చారు (13–6–1991). అలా నటుణ్ణి అయి 30 ఏళ్లయింది. ఈ చిత్రంలో ‘స్టాంప్గాడి’గా పేరు పొందిన నేను ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, వ్యాఖ్యాతగానూ మారాను. సపోర్ట్ చేసిన అందరికీ ధన్యవాదాలు’’ అన్నారు. ప్రస్తుతం ‘పొలిమేర’, ‘విరహం’ చిత్రాలతో పాటు ఓ పీరియాడికల్ మూవీ చేస్తున్నారు బాలాదిత్య. -
ఈ సినిమా నా కెరీర్లో ఓ మైలురాయి
సీనియర్ నటి అన్నపూర్ణ, మాస్టర్ రవితేజ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. బాలాదిత్య, అర్చన జంటగా, సీనియర్ నటి జమున ముఖ్య పాత్రలో నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఓవర్సీస్లో అమెజాన్ ప్రైమ్ ద్వారా ఇటీవల విడుదలైంది. థియేటర్స్ ప్రారంభించగానే ఇండియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో అన్నపూర్ణ మాట్లాడుతూ– ‘‘45 ఏళ్ల కెరీర్లో ఎన్నో చక్కటి పాత్రలు పోషించాను. అయితే నా పేరుతో కూడిన టైటిల్ పాత్రను ఇంతవరకు చేయలేదు. ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’ నా కెరీర్లో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది’’ అన్నారు. ‘‘సీనియర్ నటీనటులతో కలసి నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు మాస్టర్ రవితేజ. ‘‘హృదయాలను కదిలించే సన్నివేశాలతో పాటు భావోద్వేగాలున్న పాత్ర నాది’’ అన్నారు అర్చన. ‘‘అమెరికాతో పాటు ఓవర్సీస్లో విడుదలైన మా సినిమా విజయం సాధించడం ఆనందంగా ఉంది’’ అన్నారు శివనాగు. ‘‘మా చిత్రం దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు ఎం.ఎన్.ఆర్.చౌదరి. ఈ కార్యక్రమంలో నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్నకుమార్, నిర్మాత ఆచంట గోపీనాథ్, దర్శకుడు వి. సముద్ర, విలన్ పాత్రధారి శ్రీహర్ష, అమెజాన్ ప్రతినిధి రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. -
అన్నపూర్ణమ్మగారి మనవడు రెడీ
సీనియర్ నటి అన్నపూర్ణమ్మ, మాస్టర్ రవితేజ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. మరో సీనియర్ నటి జమున ప్రధాన పాత్రలో నటించగా బాలాదిత్య, అర్చన జంటగా నటించారు. జాతీయ అవార్డుగ్రహీత నర్రా శివనాగేశ్వరరావు (శివనాగు) దర్శకత్వం వహించారు. ఎం.ఎన్.ఆర్. ఫిలిమ్స్ పతాకంపై ఎం.ఎన్.ఆర్. చౌదరి నిర్మించిన ఈ సినిమా ఆదివారం (అక్టోబర్ 25న) ఓవర్సీస్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఓ చిన్న సినిమా ఒకేసారి ఓవర్సీస్లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. అమేజాన్ ప్రైమ్‌లో విడుదలవుతున్న మా సినిమాని ఇండియాలో మాత్రం థియేటర్లు ప్రారంభించాక విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి అభిరుచిగల దర్శకుడు శివనాగు ఈ చిత్రాన్ని ఎంతో బాగా మలిచారు. పాటలు చాలా బావున్నాయి’’ అని అతిథిగా విచ్చేసిన సంగీత దర్శకుడు కోటి అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజ్ కిరణ్, కెమెరా: గిరికుమార్. -
సెలబస్: పాటల కోకిలపై మాటల కువకువలు
బాల నటుడిగా అలరించి, హీరోగా ఎదిగిన బాలాదిత్య... నటుడిగానే అందరికీ తెలుసు. కానీ అతడిలో ఒక కవి కూడా ఉన్నాడు. ఓ పక్క నటుడిగా కొనసాగుతూనే ఆదిత్య అక్షరాలతో చెలిమి చేశాడు. పాటలల్లాడు. కవితలు రాశాడు. అలా రాసిన కొన్ని కవితల్లో ఇదొకటి. గానకోకిల సుశీలమ్మపై అతడికున్న అభిమానానికి అక్షర రూపమిది. నటుడిగానే కాక కవిగా కూడా పేరు తెచ్చుకోవాలని తపిస్తోన్న బాలాదిత్య... త్వరలో తన కవితా సంకలనాన్ని వెలవరించాలని ఆశిస్తున్నాడు! విశాలమైన ఈ సినీగీతాల జగత్తులో సుశీలగారిదో ప్రత్యేక స్థానం... అది మరపురాని గానం ఆ కంఠం వినగా వైకుంఠమే కనవచ్చు ఆమె స్వరం కొరకై స్వర్గవాసులే దిగి వచ్చు పాత పాటకి పసిడి పూత - ఆ స్వర మాధుర్యం పాట పాటకీ నవనీత - ఆమె గళ చాతుర్యం ‘చిటపట చినుకు’ల పలుకులు విన్నా... ‘నీవని నేనని’ ఈవిడ అన్నా... అతి మధురం ప్రతి గీతం - మన మదికే నవనీతం ‘జననీ శివకామిని’ అంటూ స్తుతించి ఆ దేవిని జనులందరి జేజేలొందెను సుతిమెత్తని గాయని ‘సఖియా వివరించవె’ అన్నా - ‘హిమగిరి సొగసు’లనే కన్నా ‘నీవు లేక వీణ’ను విన్నా - ‘గోదారి గట్టుంది’ అన్నా ఆ గాత్రం తనకే సొంతం - తను మాత్రం అందరి సొంతం తెలుగువారింటి ఆడపడుచుగా - తమిళ నాట్ట్కే వీట్ట్ పొన్నుగా - కన్నడ గడ్డే కన్న తీరుగా - కేరళ కోరిన గళము వీరుగా ‘ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై’ అని తానీ దేశంలోనే ఉత్తమ గాయనై అమ్మయై ‘వటపత్ర సాయికి’ లాలిని కొమ్మపై కోయిలై ‘ఇది మల్లెల వేళయని’ ‘గుడివాడ వెళ్లాను’ అని కొంటెగ కూతపెట్టి ‘నిను వీడని నీడను నేనే’నని భయపెట్టి ‘శ్రీరస్తు - శుభమస్తు’ అని జంటలను కలిపి ‘అహ నా పెళ్లంట’ అంటూ తను పలికి సాక్షాత్తూ సావిత్రి స్వరమే అన్నట్టుగా నిజముగా జమునయే పాడేస్తున్నట్టుగా వాణిశ్రీ నుండి మాలాశ్రీ దాకా గాత్రంతో పాత్రలకే ప్రాణం పోసేసి ఎందు పాడినా అందరికీ ఓ బంధువు భావన కలిగించి విందు చేసె మన డెందముకి స్వరబంధము తానే కల్పించి ఒకటుందా రెండున్నాయా ఆమె నోటి పాటలు చెబుతున్నా సరిపోతాయా ఆమె గూర్చి మాటలు ప్రతి పాట నాటుకుపోయే జనుల గుండె గూటిలో ఎంచమంటె మంచివి తరమా... ఇన్ని వేల వీటిలో సినీ సీమ నిర్మించేను సుశీలమ్మ పాటల హారం సుశీలమ్మ నిర్మించేను శ్రోతలకో సాగర తీరం ఆవిడకి పాటే జీవితం - ఆవిడ జీవితం పాటకే అంకితం అందుకే... ఆవిడ పాట శాశ్వతం.