
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం సినిమాతో బాలనటుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు బాలాదిత్య. ఆ సినిమాలో పిసినారి తండ్రి రాజేంద్రప్రసాద్ కొడుకుగా పిసినారితనం చూపిస్తూ చేసిన బాలాదిత్య నటన అలరించింది.జంబలకిడిపంబ, హిట్లర్, అబ్బాయిగారు, బంగారు బుల్లోడు, హలో బ్రదర్, సమరసింహా రెడ్డి వంటి పలు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న బాలాదిత్య `చంటిగాడు` సినిమాతో హీరోగా మారాడు.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా సుమారు 40 సినిమాల్లో నటించగా, హీరోగా జాజిమల్లి, 1940లో ఒక గ్రామం, భద్రాద్రి సహా 10 సినిమాలు చేశాడు. 1996 లో వచ్చిన లిటిల్ సోల్జర్స్ సినిమాకు నంది పురస్కారం అందుకున్నాడు.ఆ తర్వాత యాంకర్‌గానూ గుర్తింపు పొందాడు. బుల్లితెరపై కూడా సత్తా చాటాడు. లక్ష్మీ మానస అనే అమ్మాయితో బాలాదిత్య వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఉంది. రీసెంట్‌గా మరో బుజ్జి పాపాయి కూడా పుట్టింది. మరి ఫ్యామిలీని వదిలి బాలాదిత్య ఎన్ని రోజులు ఉండగలడు చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment