బిగ్‌బాస్ సీజన్-6లో కెప్టెన్సీ పోటాదారుల టాస్క్ హాట్‌హాట్‌గా జరిగింది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు రెండు టీమ్స్‌గా విడిపోవాల్సి ఉంటుంది. అయితే టాస్క్ అవుతుండగానే గీతూ మళ్లీ ఎమోషన్స్‌తోనే ఆడుకుంది. ఎదుటివాళ్ల వీక్‌నెస్ పాయింట్ మీదే దెబ్బకొట్టాలని చూసింది. టాస్క్‌లో గెలవడం కోసం బాలాదిత్య లైటర్‌ను దాచేసింది.
అప్పటికే బాలాదిత్య వచ్చి అడగ్గా.. గేమ్‌లో రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తాం అంటూ గీతూ, సత్యలు అన్నారు. దీంతో మరింత ఫైర్ అయిన బాలాదిత్య ఆటలో గెలవాలి కానీ ఇదేం పద్దతి అంటూ కోప్పడ్డాడు. అయినా సరే గీతూ.. రెండు స్ట్రిప్‌లు ఇస్తే లైటర్ ఇస్తా.. ఇంకో రెండు స్ట్రిప్‌లు ఇస్తే సిగరెట్ ఇస్తా అంటూ మరింత రెచ్చిపోయింది. ఇంక ఆ మాటలకు బాలాదిత్య బాగా ఎమోషనల్ అయ్యాడు..
'ఆఫ్ట్రాల్ సిగరెట్ కోసం.. ఎంత దిగజారుతున్నావో నీకు తెలుసా?? నన్ను ఇంత దారుణంగా అవమానిస్తావా?అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రపంచం మొత్తం దాన్ని నమ్మొద్దు అని చెప్పినా నేను వినలేదు. దాన్ని బంగారం అని మాట్లాడాను.. కానీ నా ఎమోషన్స్‌తో ఆడుకుంటుంది' అంటూ బాలాదిత్య ఫైర్ అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment