Bigg Boss 6 Telugu: First Captaincy Task Begins Lets See Who Will Make It - Sakshi
Sakshi News home page

Bigg Boss 6 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటి కెప్టెన్‌ ఎవరంటే..

Published Fri, Sep 9 2022 1:32 PM | Last Updated on Fri, Sep 9 2022 3:35 PM

Bigg Boss 6 Telugu: First Captaincy Task Begins Lets See Who Will Make It - Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-6లో తొలిరోజు నుంచే గొడవలు మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాబోయే రోజుల్లో గొడవలు ఏ స్థాయికి వెళ్తాయా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే 21మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ షోలో కొందరు కంటెస్టెంట్లు చీటికిమాటికీ వాగ్వాదానికి దిగుతుంటే, మరికొందరు కంటెస్టెంట్లు మాకేం పట్టలేదంటూ సైలెంట్‌గా ఉంటున్నారు. ఇదిలా ఉండగా ఈ సీజన్‌లో మొదటి కెప్టెన్‌ కోసం బిగ్‌బాస్‌ కెప్టెన్సీ టాస్క్‌ నిర్వహించాడు. ఇందులో ఫైమా సంచాలకురాలిగా వ్యహరించింది.

కెప్టెన్సీ పోటీదారులుగా క్లాస్‌ సెక్షన్‌లో ఉన్న గీతూ, ఆదిరెడ్డి,నేహా చౌదరి సహా మాస్‌ సెక్షన్‌ నుంచి మెరానా-రోహిత్‌, ఆర్జే సూర్య, బాలాదిత్యలు కెప్టెన్సీ పోటీదారులుగా ఎన్నికయ్యారు. అయితే టాస్క్‌ జరుగుతున్నప్పుడు కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవ జరిగింది. చీటింగ్‌ చేస్తుందంటూ మెరీనా గీతుపై ఫైర్‌ అయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా విడుదల చేసింది.

మరోవైపు ఫైమా- నేహా చౌదరి మధ్య కూడా వాగ్వాదం జరిగినట్లు ప్రోమో చూసి అర్థమవుతుంది. ఇంతకీ ఈ గొడవకు కారణమేంటి? వీరిలో బిగ్‌బాస్‌ సీజన్‌-6 మొదటి కెప్టెన్‌ ఎవరన్నది తేలాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement