మా ఊరి పొలిమేర 2 ఫస్ట్‌ లుక్‌ చూశారా? | Satyam Rajesh Maa Oori Polimera 2 First Look Out | Sakshi
Sakshi News home page

Maa Oori Polimera 2: మా ఊరి పొలిమేర 2 ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌

Published Sat, May 6 2023 6:42 PM | Last Updated on Sat, May 6 2023 6:42 PM

Satyam Rajesh Maa Oori Polimera 2 First Look Out - Sakshi

స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకేందు మౌళి, అక్ష‌త‌, బాలాదిత్య‌, సాహితి దాస‌రి,  ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న చిత్రం మా ఊరి పొలిమేర 2. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బ్యానర్‌పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో  గౌరికృష్ణ నిర్మిస్తున్నారు. ఇటీవ‌లే  షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉంది.  శనివారం ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ రిలీజ్‌ చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ...``మా ఊరి పొలిమేర -2` పోస్ట‌ర్ చాలా బాగుంది. ఈ చిత్రానికి ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ నా శుభాకాంక్ష‌లు`` అన్నారు. న‌టుడు స‌త్యం రాజేశ్ మాట్లాడుతూ.. 'మా ఊరి పొలిమేర చిత్రాన్ని ఎంతో ఆద‌రించారు. దానికి  సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా ఆద‌రిస్తార‌ని న‌మ్ముతున్నాం' అన్నారు. ద‌ర్శ‌కుడు డా. అనిల్ విశ్వ‌నాథ్ మాట్లాడుతూ.. `మా సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ విడుద‌ల చేయ‌డం చాలా పాజిటివ్‌గా అనిపించింది. ఇది ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నా. `మా ఊరి పొలిమేర` చిత్రాన్ని ప్రేక్ష‌కులంద‌రూ బాగా ఆద‌రించారు.

'మా ఊరి పొలిమేర' చిత్రానికి సిక్వెల్ ఉందా? లేదా? అని చాలా మంది అడుగుతున్నారు. ఈ ప్ర‌శ్న‌కి స‌మాధానంగా `మా ఊరి పొలిమేర -2` ఫ‌స్ట్ లుక్ లాంఛ్ చేశాం. త్వ‌ర‌లోనే రిలీజ్‌ డేట్‌ వెల్లడిస్తాం` అన్నారు. ఈ చిత్రానికి సంగీతంః గ్యాని; సినిమాటోగ్ర‌ఫీః ఖుషేంద‌ర్ ర‌మేష్ రెడ్డి; ఎడిటింగ్ః శ్రీ వ‌ర‌; కో-డైర‌క్ట‌ర్ః ఆకుల నాగ్‌; పీఆర్వోః జికె మీడియా; ఆర్ట్ డైర‌క్ట‌ర్ః ఉపేంద్ర రెడ్డి చందా; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః ఎన్‌.సి.స‌తీష్ కుమార్;  నిర్మాతః గౌరి కృష్ణ‌;  స్టోరి-స్క్రీన్ ప్లే- డైలాగ్స్- డైర‌క్ష‌న్ః డా.అనిల్ విశ్వ‌నాథ్‌.

చదవండి: సింగర్‌తో ఛత్రపతి డేటింగ్‌... ఎగిరి గంతేసిన నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement