గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్ | 'The Rise Of Ashoka' Motion Poster Out Now | Sakshi
Sakshi News home page

గూస్ బంప్స్ తెప్పించేలా ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ఫస్ట్ లుక్

Published Sun, Jan 12 2025 8:56 AM | Last Updated on Sun, Jan 12 2025 9:22 AM

'The Rise Of Ashoka' Motion Poster Out Now

అభినయ చతుర సతీష్ నీనాసం నటించిన ‘ది రైజ్ ఆఫ్ అశోక’ ప్రాజెక్ట్ మీదున్న అంచనాలు అందరికీ తెలిసిందే. కన్నడ, తమిళం, తెలుగు భాషలలో విడుదల కానున్న ఈ మూవీని వృద్ధి క్రియేషన్‌, సతీష్‌ పిక్చర్స్‌ హౌస్‌ బ్యానర్‌ల మీద వర్ధన్‌ నరహరి, జైష్ణవి, సతీష్‌ నీనాసం నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వినోద్ దొండలే దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తయింది.

ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ మోషన్ పోస్టర్‌ను చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవాల్సిందే. బ్యాక్ గ్రౌండ్‌లో వినిపించే ఆ పాట, బీజీఎం, హీరోని చూపించిన విధానం, ఆ రక్తపాతం చూస్తుంటే నెవ్వర్ బిఫోర్ అనే ఎక్స్ పీరియెన్స్‌ను ఇవ్వబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. టాకీ సీక్వెన్స్‌లు, పాటల్ని త్వరితగతిన షూట్ చేసేందుకు టీం రెడీ అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌లో సతీష్ నీనాసం బోల్డ్ అండ్ ఇంటెన్స్ లుక్ అదిరిపోయింది. కత్తులు పట్టుకుని ఊచకోత కోస్తున్న హీరో లుక్ సినిమా మీద అంచనాలు పెంచేస్తోంది.

ఫిబ్ర‌వ‌రి 15న షూటింగ్‌ని పునఃప్రారంభించ‌డానికి షెడ్యూల్ ఫిక్స్ చేశారు. ది రైజ్ ఆఫ్ అశోక మూవీ సతీష్ నీనాసం కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలవబోతోందని టీం ఎంతో నమ్మకంగా ఉంది. సతీష్ కెరీర్‌లో ఇదొక డిఫరెంట్ ప్రయోగం అని చెబుతున్నారు. ఈ సినిమాలో బి. సురేష్‌, అచ్యుత్‌ కుమార్‌, గోపాల్‌ కృష్ణ దేశ్‌పాండే, సంపత్‌ మైత్రేయ, యశ్‌ శెట్టి తదితరులు నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా లవిత్, ఆర్ట్ డైరెక్టర్‌గా వరదరాజ్ కామత్, సంగీత దర్శకుడిగా పూర్చంద్ర తేజస్వి SV పని చేస్తున్నారు.  డా. రవివర్మ, విక్రమ్ మోర్ యాక్షన్ సన్నివేశాలను కంపోజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను మను షెడ్గర్‌ నిర్వర్తిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement