![Ram Gopal Varma Assistant Vinay Gonu Na LOve Story Movie Poster Released](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/14/lovestory.jpg.webp?itok=mmmWegW8)
మోహిత్ పెద్దాడ హీరోగా నటిస్తున్న చిత్రం నా లవ్ స్టోరీ. వినయ్ గోను దర్శకత్వం వహిస్తున్నారు. మహీర క్రియేషన్స్, సుప్రియ ఆర్ట్స్ బ్యానర్లపై దొమ్మరాజు అమరావతి, శ్రీకాంత్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నా లవ్ స్టోరీ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను 'మంగళవారం' చిత్ర దర్శకుడు అజయ్ భూపతి లాంచ్ చేశారు. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ... ఈ చిత్ర దర్శకుడు వినయ్ గోను, నేను ఆర్జీవీ గారి దగ్గర అసిస్టెంట్స్‌గా వర్క్ చేశాం.
ఈ వాలంటైన్స్ డే సందర్బంగా ఈ సినిమా పోస్టర్‌ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. పోస్టర్ చాలా కొత్తగా ఉంది. వినయ్ గోను ఈ సినిమా ద్వారా పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. దర్శకుడు వినయ్ గోను మాట్లాడుతూ.."మా పోస్టర్ లాంచ్ చేసిన అజయ్ భూపతికి ధన్యవాదాలు" అని చెప్పారు. సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ మాట్లాడుతూ.."ఏం మాయ చేసావే లాంటి మ్యూజిక్ లవ్ స్టోరీకి సంగీతం అందించాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/nalovestory.jpg)
అలాంటి నాకు డైరెక్టర్ వినయ్ గారు ఈ సినిమా ద్వారా అవకాశమిచ్చారు. ఈ అందమైన ప్రేమ కథకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తాను. మళ్లీ వచ్చే ప్రేమికుల రోజున ఇందులోని పాటలు అందరూ రింగ్ టోన్ పెట్టుకునేలా ఉంటాయన్న నమ్మకం ఉంది అన్నారు. మార్చి నెల మొదటి వారం నుంచి ఈ చిత్రం తొలి షెడ్యూల్ ప్రారంభిస్తామని నిర్మాతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment