ఉత్సవంలో ... | Ram Charan Unveils New Game Changer Poster On The Occasion Of Ganesh Chaturthi, Goes Viral | Sakshi
Sakshi News home page

ఉత్సవంలో ...

Published Mon, Sep 9 2024 12:41 AM | Last Updated on Mon, Sep 9 2024 12:51 PM

Ram Charan Unveils New Game Changer Poster On Ganesh Chaturthi

‘జరగండి... జరగండి...’ అంటూ రామ్‌చరణ్‌ ఏ రేంజ్‌లో మాస్‌ స్టెప్పులేశారో ఆ పాట వీడియో చూసినవాళ్లకి తెలిసిందే. రామ్‌చరణ్‌తో కలిసి కియారా అద్వానీ కూడా జోష్‌గా డ్యాన్స్‌ చేశారు. ఈ ఇద్దరూ జంటగా శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలోని పాట ఇది. అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌ బ్యానర్స్‌పై ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మిస్తున్నారు.

ఈ నెలలోనే మరో పాటను రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం తెలియజేసి, ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఓ ఉత్సవం నేపథ్యంలో రామ్‌చరణ్, ఉత్సాహంగా డ్యాన్స్‌ చేసే పాట ఇది అని పోస్టర్‌ స్పష్టం చేస్తోంది. క్రిస్మస్‌ సందర్భంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఎస్‌. తిరుణావుక్కరసు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement