
కొన్ని సాంగ్స్ వింటే పదే పదే వినాలనిపిస్తుంది. అంతేకాదు డ్యాన్స్ కూడా చేయాలనిపిస్తుంది. అలాంటి పాటలు ఇటీవల తెలుగు సినిమాల్లో అభిమానులను అలరిస్తున్నాయి. ఈ ఏడాది రిలీజైన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి గోదారి గట్టు సాంగ్, అలాగే తండేల్ సినిమా నుంచి బుజ్జితల్లి సాంగ్ సినీ ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఎక్కడ చూసిన ఈ పాటలకు ఆడియన్స్ కాలు కదిరాపు. దీంతో ఈ రెండు పాటలకు ఓ రేంజ్‌లో క్రేజ్ వచ్చింది కొంతమంది ఏకంగా ఈ పాటలకు రీల్స్ చేస్తూ ఎంజాయ్ చేశారు. అలా ఇదే జాబితాలో మరో హిట్ సాంగ్ వచ్చి చేరింది. అదేనండి ఇటీవల సోషల్ మీడియాను ఊపేస్తోన్న కోర్ట్ మూవీ సాంగ్. ఇంకేంటీ మీకోసమే తాజాగా ఫుల్ సాంగ్ కూడా వచ్చేసింది. మరెందుకు ఆలస్యం చూసి ఎంజాయ్ చేయండి.
(ఇది చదవండి: బాక్సాఫీస్ వద్ద ‘కోర్ట్’ సంచలనం.. నాలుగో రోజు ఊహించని కలెక్షన్స్!)
ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం కోర్ట్(Court: State Vs Nobody). కంటెంట్ బాగుంటే చాలు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అలా ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మొదటి రోజే రూ. 8 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. పాజిటివ్ మౌత్‌టాక్‌తో వీకెండ్‌లో కలెక్షన్స్ భారీగా పెరిగాయి. కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 28.9 కోట్లు రాబట్టింది. చిన్న సినిమా అయినప్పటికీ కంటెంట్ వల్ల బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment