Roshan
-
కోర్ట్‌లో హీరో ఎవరో చెప్పడం కష్టం: నాని
‘‘కోర్ట్’ చాలా అందమైన సినిమా. ప్రియదర్శి, రోషన్, శ్రీదేవి అద్భుతంగా నటించారు. డైరెక్టర్ జగదీష్ బాగా తీశారు. ఈ సినిమా చూశాను... ఇందులో హీరో ఎవరో చెప్పడం కష్టం. ఈ సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అని హీరో నాని చెప్పారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్, శ్రీదేవి ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘కోర్ట్’–స్టేట్ వర్సెస్ ఏ నోబడీ’. రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మార్చి 14న హోలీ పండగ సందర్భంగా విడుదల కానుంది.ఈ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రెస్మీట్లో నాని మాట్లాడుతూ– ‘‘ఈ కథ సున్నితమైనది. చాలా జాగ్రత్తలు తీసుకొని చేశాం. జగదీష్ చాలా పరిశోధన చేశారు. ఇది అద్భుతమైన కోర్టు రూమ్ డ్రామా. గొప్ప సందేశం ఉంటుంది. ఈ సినిమా పూర్తయ్యాక ప్రేక్షకులు నిలబడి క్లాప్స్ కొడతారు... ఇందుకు నాదీ గ్యారెంటీ.ఇలాంటి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇండస్ట్రీ, ఆడియన్స్ ఒక అడుగు ముందుకేసినట్లే’’ అన్నారు. ‘‘నాని అన్న బ్యానర్లో సినిమా చేయడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని ప్రియదర్శి చెప్పారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన నానీగారికి థ్యాంక్స్. ఒక్క డౌట్ లేకుండా స్క్రిప్ట్‌ని నమ్మి ఆయన సినిమా నిర్మించారు’’ అని రామ్ జగదీష్ తెలిపారు.‘‘నాని, ప్రశాంతి ప్రోడక్షన్ హౌస్‌లో కథ నచ్చితే ఎంత అయినా ఖర్చు పెడతారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు సహ నిర్మాత దీప్తి గంటా. ‘‘ఇలాంటి మంచి సినిమాలో చాన్స్ ఇచ్చిన దర్శక– నిర్మాతలకు కృతజ్ఞతలు’’ అని రోషన్, శ్రీదేవి పేర్కొన్నారు. -
టాలీవుడ్ డైరెక్టర్ ఎంగేజ్మెంట్.. సుమ తనయుడు రోషన్, హర్ష చెముడు సందడి
-
సలార్‌లో లేనిది ‘బబుల్గమ్’లో ఉంది: దర్శకుడు
‘సలార్ సినిమాకి హిట్ టాక్ రావడం సంతోషంగా ఉంది. వచ్చేవారం(డిసెంబర్ 29) 'బబుల్గమ్' సినిమా రిలీజ్ కాబోతుంది. సలార్‌లో లేని కంటెంట్ మా సినిమాలో ఉంది. మా సినిమాలో లేని కంటెంట్ సలార్‌లో ఉంది(నవ్వుతూ..). కాబట్టి ప్రభాస్ సినిమా థియేటర్స్‌లో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆడియన్స్‌కి నచ్చితే రెండు సినిమాలను చూస్తారు. ‘బబుల్గమ్’ అందరికి కనెక్ట్ అయ్యే సినిమా. కచ్చితంగా ప్రేక్షకులను నచ్చుతుందనే నమ్మకం మాకు ఉంది’ అని దర్శకుడు రవికాంత్ పేరేపు అన్నారు. ఆయన దర్శకత్వంలో ప్రముఖ యాంకర్ సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న తాజా చిత్రం ‘బబుల్గమ్’. మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 29న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రవికాంత్ పేరేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► ‘క్షణం’ తర్వాత కృష్ణ అండ్ లీల చేశాను. నిజానికి కృష్ణ అండ్ లీల థియేటర్స్ లో రిలీజ్ కావాల్సింది. కానీ కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఓటీటీలో విడుదలయింది. లాక్ డౌన్ కారణంగా యాక్టర్స్ షెడ్యుల్స్ మారిపొయాయి. చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఎక్కువైపోయాయి. ఈ క్రమంలో కొత్తవాళ్ళతో చేయడానికి 'బబుల్గమ్' కథ రాశాను. రోషన్ నాకు ముందే తెలుసు. తను హీరోగా పరిచయం అవుతున్నారని తెలిసి రోషన్ కలిశాను. ఈ కథకు తను పర్ఫెక్ట్ ఫిట్ అనిపించాడు. తర్వాత మా జర్నీ మొదలైయింది. ► ఇది కొత్తవాళ్ళతోనే చేయాల్సిన కథ. 22 ఏళ్ల తర్వాత కాలేజ్ పూర్తి చేసుకొని రియల్ వరల్డ్ లోకి అడుగుపెడతాం. అప్పటి వరకూ మన ఫ్యామిలీ, పేరెంట్స్ మనల్ని ప్రోటక్ట్ చేస్తారు. ఒక్కసారి మన ప్యాషన్ ని వెదుక్కుంటూ బయటికి వెళ్ళినపుడు అంతా కొత్తగా అనిపిస్తుంది. ఈ క్రమంలో ఎలాంటి కెరీర్ ని ఎంచుకోవాలి ? డబ్బులు వుంటే సరిపోతుందా ? మనకి ఇష్టమైనది చేయాలా? ఇలా చాలా కన్ఫ్యుజన్స్ వుంటాయి. ఇలాంటి సమయంలో అనుకోకుండా జీవితంలో ప్రేమ వస్తే ఎలా డీల్ చేస్తాం.. ఇలాంటి కథకు కొత్తవాళ్ళు వుంటేనే బెటర్ అనిపించింది. ► ఇది ప్రధానంగా ప్రేమకథ. ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఇది రాక్ స్టార్ లా ఉంటుందా ? లేదా ఒక మ్యుజిషియన్ ఫిల్మ్ లా వుంటుందా అని అడిగారు. అయితే ఇది ప్రేమకథ ప్రధానంగా వుండే రిలేషన్ షిప్ డ్రామా. ► రోషన్ ఫెంటాస్టిక్. ట్రైలర్ లో చూసింది పది శాతమే. సినిమాలో చాలా అద్భుతంగా చేశాడు. రోషన్, మానస ఇద్దరూ చాలా చక్కగా నటించారు. అలాగే ఇందులో నటించిన మిగతా నటీనటులు కూడా చక్కని ప్రతిభ కనపరిచారు. ► మానస తెలుగమ్మాయి. చాలా అద్భుతంగా నటించింది. తనకి తెలుగు అర్ధం కావడం వలన మన రైటింగ్ లోని సబ్ టెక్స్ట్ కూడా తనకి అర్ధమౌతుంది. దీంతో మరింత ఈజీ అయ్యింది. ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్స్ గా వస్తున్నారు. దీంతో నేటివిటీ ఇంకొంచెం బిలీవబుల్ గా వుంటుంది. ►ప్రస్తుతానికి నా దృష్టి 'బబుల్గమ్' విడుదలపై ఉంది. ఈ సినిమా విడుదల తర్వాత కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెడతాను. -
రాజీవ్ కనకాల- జూనియర్‌కు మధ్య దూరం నిజమేనా?.. అసలు నిజం చెప్పిన రోషన్!
టాలీవుడ్ యాంకర్ అనగానే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు సుమ. ఆమె తర్వాతే ఎవరైనా అన్నవిధంగా సుమ తెలుగు ఇండస్ట్రీలో అంతలా పేరు తెచ్చుకుంది. కేరళకు చెందిన సుమ టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాలను పెళ్లి చేసుకుని తెలుగమ్మాయిగా స్థిరపడిపోయింది. ప్రస్తుతం రాజీవ్ కనకాల వారసుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రాజీవ్ -యాంకర్ సుమ దంపతుల తనయుడు రోషన్ కనకాల బబుల్ గమ్ చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 29న విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రోషన్.. రాజీవ్ కనకాల, జూనియర్ ఎన్టీఆర్ ఫ్రెండ్షిప్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. రోషన్ మాట్లాడుతూ.. 'ఫ్రెండ్షిప్ అనేది ఒక బంధం. వీరిద్దరి రిలేషన్ స్టూడెంట్ నెం-1 మూవీ నుంచి ఉంది. నాకు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. అలాంటి స్నేహితున్ని వదులుకోకూడదు. తారక్ అన్నను చూసి డ్యాన్స్ నేర్చుకోమని నాన్న ఎప్పుడు చెప్పేవారు. ఆయన స్థాయికి చేరుకోవాలనేది నా కోరిక. రాజీవ్, జూనియర్‌కు మధ్య దూరం పెరిగిందన్న వార్తలపై రోషన్ స్పందించారు. అలాంటిదేం జరగలేదు. నాకు తెలిసి ఎప్పుడు వాళ్లు ఇప్పటికీ కలిసే ఉన్నారు. ఎప్పుడు ఎవరు అలా ఫీలవ్వలేదు. అసలు జరిగితేనే కదా ఫీలయ్యేది.' అని అన్నారు. సుమ కుమారుడు కాబట్టి చిరంజీవి సపోర్ట్ చేశారనేది నిజమేనా? అని యాంకర్ ప్రశ్నించారు. ఆయన ఎప్పుడలా సపోర్ట్ చేయరు. ఆయనకు టీజర్ నచ్చింది. సాంగ్ కూడా నచ్చిందని చెప్పారు. నువ్వు కూడా పాట పాడావా?అని అడిగారు. నా వాయిస్ చాలా బాగుందన్నారు. దీంతో చిరంజీవి మాటలకు నాకే ఆశ్చర్యమేసింది' అని రోషన్ అన్నారు. ఆ తర్వాత ఈ సినిమాలో లిప్ లాక్ సీన్స్ చేయడం కోసం దాదాపు 150 టేక్స్ తీసుకున్నారా? అంటూ రోషన్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి కాస్తా కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన రోషన్.. హీరోయిన్ మానస చౌదరిని తీసుకొచ్చాడు. ఎన్ని టేకులు తీసుకున్నానో చెప్పు అంటూ ఆమెను అడిగారు. అయితే ఇదంతా ఫన్నీ కోసమే చేసినా సీరియస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు రోషన్. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 29న థియేటర్లలో సందడి చేయనుంది. -
క్రికెట్ బోర్డులో అవినీతి? నన్ను చంపేస్తారంటూ సంచలన ఆరోపణలు
శ్రీలంక క్రికెట్ బోర్డు ప్రక్షాళన కోసం తపించి తాను ప్రాణం మీదకు తెచ్చుకున్నానంటూ ఆ దేశ ‘క్రీడా మంత్రి’ రోషన్ రణసింఘే సంచలన వ్యాఖ్యలు చేశారు. బోర్డులో అవినీతి నిర్మూలిద్దామని భావిస్తే తనను చంపేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో శ్రీలంక జట్టు దారుణ వైఫల్యం మూటగట్టుకున్న విషయం తెలిసిందే. ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు మాత్రమే గెలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచి విమర్శలు మూటగట్టుకుంది. వరల్డ్‌కప్‌లో పరాభవం ఈ నేపథ్యంలో ప్రపంచకప్ జట్టు ఎంపిక, అనుసరించిన వ్యూహాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన క్రీడా మంత్రి రోషన్ రణసింఘే బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేశారు. మాజీ కెప్టెన్ అర్జున్ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో బోర్డు సభ్యులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టిన కోర్టు లంక క్రికెట్ బోర్డును పునురద్ధరించింది. అయితే, ఈ పరిణామాలను తీవ్రంగా పరిగణించిన అంతర్జాతీయ క్రికెట్ మండలి కఠిన నిర్ణయం తీసుకుంది. లంక బోర్డుకు షాకిచ్చిన ఐసీసీ క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ లంక బోర్డు సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఈ క్రమంలో తాజాగా రోషన్ రణసింఘే సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు. క్రికెట్ బోర్డులో జోక్యం వల్లే తనను మంత్రివర్గం నుంచి తొలగించారంటూ ఆయన ఆరోపించారు. నడిరోడ్డు మీద హత్య చేసే అవకాశం! ఈ మేరకు.. ‘‘క్రికెట్ బోర్డులో అవినీతిని నిర్మూలించాలనుకున్నందుకు నన్ను చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్డు మీదే నన్ను హత్య చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ నాకు ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు అధ్యక్షుడు, అతడి చీఫ్ స్టాఫ్ మాత్రమే బాధ్యులు’’ అని రోషన్ రణసింఘే వ్యాఖ్యానించారు. భారీ ఆదాయానికి గండి! కాగా మంత్రి వర్గం నుంచి రోషన్ సస్పెన్షన్‌పై అధ్యక్షుడి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. అయితే, ఆయన ఆరోపణలపై మాత్రం ఇంతవరకు ఎవరూ స్పందించలేదు. కాగా ద్వీపదేశంలో ధనిక క్రీడా సంస్థగా లంక క్రికెట్ బోర్డు కొనసాగుతోంది. క్రికెట్ ద్వారా దేశానికి పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తోంది. గతంలో వరల్డ్‌కప్ గెలిచిన ఘనతతో పాటు పటిష్ట జట్టుగానూ ఆ టీమ్‌కు పేరుంది. అయితే, గత కొంతకాలంగా ఘోర పరాభవాలతో ప్రతిష్టను మసకబార్చుకుంటోంది శ్రీలంక జట్టు. ఇలాంటి పరిస్థితుల్లో ఐసీసీ సస్పెన్షన్ మరింత దెబ్బ కొట్టగా.. అధ్యక్షుడు విక్రమసింఘే నిషేధానికి గల కారణాల అన్వేషణకై విచారణ కమిటీ వేసినట్లు తెలుస్తోంది. చదవండి: Virat Kohli: తమ్ముడంటే ప్రేమ! మనుషులు దూరంగా ఉన్నా.. కోహ్లి తోబుట్టువు భావనా గురించి తెలుసా? -
యాంకర్ సుమ కొడుకు మూవీ టీజర్ చూశారా?
ప్రముఖ యాంకర్ సుమ కనకాల తయనయుడు రోషన్ హీరోగా మారాడు. ఆయన నటించిన తొలి చిత్రం ‘బబుల్గమ్’. 'క్షణం' ఫేమ్ రవికాంత్ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హేశ్వరీ మూవీస్ - పీపుల్ మీడియా సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్ర టీజర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ‘ప్రేమ అనేది బబుల్గమ్ లాంటిదని, ముందు తియ్యగా ఉన్నా ఆ తర్వాత అంటుకుంటుందంటూ’ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమతుంది. ఆ తర్వాత హీరోయిన్ను పబ్‌లో చూసి ప్రేమలో పడడం.. ఆ తర్వాత హీరో గురించి హీరోయిన్‌కి నిజం తెలిసి గొడవ పడడం ఇందులో చూపించారు. సముద్రం ఒడ్డున హీరోహీరోయిన్ లిక్లాక్తో బబుల్గమ్ సినిమా టీజర్ ముగిసింది. లవ్,రొమాన్స్, యాక్షన్.. ఇలా అన్ని అంశాలతో యూత్ఫల్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. డిసెంబర్ 29న ఈ చిత్రం విడుదల కానుంది. -
వృషభ.. మళ్లీ ఆ రేంజ్లో యాక్షన్ సీన్స్!
మోహన్‌లాల్, రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ద్విభాషా (తెలుగు, మలయాళం) చిత్రం ‘వృషభ’. ‘ది వారియర్ అరైజ్’ అనేది ఉపశీర్షిక. ఈ చిత్రంలో జహ్రా ఖాన్, శనయ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రా నిర్మాతలు. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘‘తండ్రీకొడుకుల మధ్య సాగే ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ఉంటుంది. ‘మన్యం పులి’ తర్వాత మోహన్‌లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్లో ఆ తరహా యాక్షన్ సీన్స్ అలరిస్తాయి. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో మా సినిమాకు వర్క్ చేస్తున్నారు’’ అని యూనిట్ పేర్కొంది. శ్రీకాంత్ మేకా, రాగిణి ద్వివేది తదితరులు కీలక పాత్రల్లో తెలుగు, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లో 2024లో రిలీజ్ కానుంది. -
వృషభ నాకో అందమైన జర్నీ
‘మూన్ లైట్ (2016), త్రీ బిల్ బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ’ (2017) వంటి పలు హాలీవుడ్ చిత్రాలకు నిర్మాతగా, సహనిర్మాతగా వ్యవహరించిన నిక్ తుర్లో తొలిసారి భారతీయ భాషా చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. మోహన్ లాల్, రోషన్ మేక తండ్రీ కొడుకులుగా, శనయ కపూర్, జహ్రా ఖాన్ కీ రోల్స్‌లో నటిస్తున్న ‘వృషభ’ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు నిక్. ఈ సందర్భంగా నిక్ మాట్లాడుతూ – ‘‘వృషభ’ నా ఫస్ట్ ఇండియన్ మూవీ. నేను చేస్తున్న తొలి బహు భాషా సినిమా కూడా ఇదే. ‘వృషభ’ నాకో అందమైన జర్నీ అవుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నంద కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహి పరేఖ్ మెహతా, శ్యామ్ సుందర్, ఏక్తా కపూర్, శోభా కపూర్, వరుణ్ మథూర్, సౌరభ్ మిశ్రాలు నిర్మిస్తున్నారు. తెలుగు, మలయాళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ రిలీజ్ కానుంది. -
హీరో శ్రీకాంత్ ఇంట్లో పెళ్లి సందడి!
హీరో శ్రీకాంత్ ఈ మధ్య మళ్లీ బిజీ అవుతున్నాడు. 'అఖండ'లో విలన్‌గా ఆకట్టుకుని, పలు భాషల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు. ఈ మధ్యే మలయాళ మూవీ 'వృషభ'లోనూ ఛాన్స్ సొంతం చేసుకున్నాడు. ఇలా కెరీర్ పరంగా బిజీ బిజీగా ఉన్న శ్రీకాంత్.. రీసెంట్గా తమ్ముడి కూతురి పెళ్లిలో ఫ్యామిలీతో కలిసి కనిపించాడు. శ్రీకాంత్ తమ్ముడు అనిల్ కూడా ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. హీరోగా, నిర్మాతగా తలో మూవీ చేశాడు కానీ పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు ఆయన కూతురు పెళ్లి జరగ్గా.. శ్రీకాంత్ తోపాటు అతడి భార్య ఊహ, పిల్లలు రోహన్, రోషన్, మేదా కనిపించారు. చాలారోజుల తర్వాత శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి కనిపించగా, ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. (ఇదీ చదవండి: ఇక్కడ 'బేబీ'.. కన్నడలో ఆ చిన్న సినిమా!) -
రోషన్ లీడ్ రోల్లో వృషభ షురూ
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, రోషన్ లీడ్ రోల్లో నటిస్తున్న ద్విభాషా చిత్రం (తెలుగు, మలయాళం) ‘వృషభ’. నందకిశోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, రాగిణి ద్వివేది, జహ్రా ఎస్ ఖాన్ , షానయ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అభిషేక్ వ్యాస్, ఏక్తా కపూర్, విశాల్గుర్నాని, జుహీ పరేహ్ మెహతా, శ్యామ్ సుందర్, శోభాకపూర్, వరుణ్ మాథుర్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటి ఊహ క్లాప్ కొట్టారు. మోహన్ లాల్, రోషన్ పాల్గొనగా కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట నందకిశోర్. తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. తెలుగు, మలయాళంతో పాటు తమిళం, కన్నడం, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది. -
రోషన్ చేతిలో రెండు పాన్ ఇండియా చిత్రాలు
‘నిర్మలా కాన్వెంట్’ (2016)లో లీడ్ రోల్ చేసి, ‘పెళ్లి సందడి’ (2021)తో హీరోగా మంచి మార్కులు తెచ్చుకున్నారు నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా. ఇప్పుడు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో హీరోగా సినిమాలు సైన్ చేశారు. రోషన్ ఒకేసారి రెండు పాన్ ఇండియా చిత్రాలు అంగీకరించడం విశేషం. కన్నడ దర్శకుడు నందకిశోర్ దర్శకత్వంలో రోషన్–మోహన్‌లాల్ కాంబినేషన్లో రూపొందనున్న పాన్ ఇండియా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ఆరంభం కానుంది. తండ్రీ–కొడుకుల అనుబంధం నేపథ్యంలో పీరియాడికల్ యాక్షన్ మూవీగా రూపొందనుంది. రోషన్ నటించనున్న మరో పాన్ ఇండియా చిత్రం వైజయంతీ మూవీస్–స్వప్నా సినిమా బేనర్లపై రూపొందనుంది. నూతన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. -
ఈ సినిమాలో ఆరుగురు హీరోయిన్స్
-
హీరోగా మారిన యాంకర్ సుమ కొడుకు.. ఫస్ట్‌లుక్ అవుట్.. డైరెక్టర్ ఎవరంటే
స్టార్ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల తనయుడు రోషన్ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత చదువులపై ఫోకస పెట్టాడు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. త్వరలో రోషన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. అయితే అది ఏ మూవీ, ఏ ప్రోడక్షన్ అనేది సస్పెన్స్‌లో ఉంది. ఈ క్రమంలో మార్చి 15న రోషన్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇచ్చారు మేకర్స్. చదవండి: అనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ‘చిన్నారి పెళ్లి కూతురు 2’ నటి అంతేకాదు హీరోగా డెబ్యూ ఇస్తున్న రోషన్ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న రవికాంత్ పేరేపు.. రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తున్నాడు. మహేశ్వరి మూవీస్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. పి విమల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ పోస్టర్లో రోషన్ డిజేగా కనిపించాడు. తనయుడు లుక్‌ను షేర్ చేస్తూ సుమ మురిసిపోయింది. ‘ఎట్టకేలకు నీ కల నిజమైంది రోషన్’ అంటూ సుమ తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. కాగా త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు, నటీనటుల గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. Team @maheshwarimovie wishes #RoshanKanakala a very Happy Birthday 💥 #ProductionNo1 pic.twitter.com/KTmKFsMme6 — Ravikanth Perepu (@ravikanthperepu) March 15, 2023 View this post on Instagram A post shared by Suma Kanakala (@kanakalasuma) చదవండి: ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని -
వైజయంతీ మూవీస్‌తో శ్రీకాంత్ కొడుకు నెక్ట్స్ మూవీ.. త్వరలోనే ప్రారంభం
‘నిర్మలా కాన్వెంట్’(2016), ‘పెళ్లిసందడి’ (2021) చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరో రోషన్. ప్రస్తుతం తన తర్వాతి ప్రాజెక్ట్స్ కోసం కథలు వింటున్నారు. అయితే రోషన్ నెక్ట్స్ మూవీ వైజయంతీ మూవీస్‌లో చేస్తున్నాడు. అలాగే వేదాన్షన్ పిక్చర్స్ పతాకంపై కూడా మరో చిత్రంలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ రెండు సినిమాలు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ సినిమాల దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణల పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. తన తదుపరి సినిమాలు ప్రఖ్యాత నిర్మాణ సంస్థలలో రాబోతున్నాయి అని యువ నటుడు రోషన్ చాలా ఉత్సాహంగా వెల్లడించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ కుటుంబం..
Actor Srikanth Visits Tirumala Temple With His Family: సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ ఉన్నారు. వీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ కుటుంబాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం బయటకు వచ్చిన శ్రీకాంత్, రోషన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎరుపురంగు లంగావోణీలో మేధ, సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాంత్, రోషన్, రోహన్ ఆకర్షించారు. కాగా తెలుగు చిత్రసీమకు మొదట విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ ఒకరు. 'పీపుల్స్ ఎన్కౌంటర్' సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ వన్ బై టు మూవీతో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 1997లో సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు -
ఎట్టకేలకు ఓటీటీలోకి పెళ్లి సందD, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో గౌరి రోనంకి తెరకెక్కించిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించింది. గతేడాది అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఎంఎం కీరవాణి సంగీతం అందించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలో అందుబాటులోకి రాబోతోంది. 'పెళ్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్, అందరూ ఆహ్వానితులే..' అంటూ జీ5 స్ట్రీమింగ్ డేట్‌ను ప్రకటించింది. ఇది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మొత్తానికి పెళ్లి సందడి ఈ శుక్రవారంనాడు ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఇక ఓ పట్టు పట్టాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. పెల్లి సందD చేయడానికి రెడీనా?? మా సినిమా రేడీ! ముహుర్తం: 24 జూన్ అందరూ ఆహ్వానితులే#PelliSandaDonZEE5 #PelliSandaD@Ragavendraraoba @mmkeeravaani @arkamediaworks @Shobu_ @boselyricist pic.twitter.com/17nMnoTzD6 — ZEE5 Telugu (@ZEE5Telugu) June 21, 2022 చదవండి: బికినీ ఫొటోలు నాన్న చూడకూడదని అలా చేస్తా.. బుల్లితెర నటి తింటున్న టైంలో వచ్చి ముక్కు కోసేశాడు, ప్లేటంతా రక్తమే.. -
యాంకర్ సుమ కొడుకు జోరు, అప్పుడే రెండో సినిమాను కూడా లైన్లో పెట్టేశాడు!
Anchor Suma Son Roshan 2nd Movie With Two Directors: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణంలో రోషల్ హీరోగా ఓ సినిమా చేయడబోతున్నాడు. ఇప్పటి వరకు అయితే ఈ మూవీ సెట్స్‌పైకి రాకముందే రోషన్ తన రెండో సినిమాను లైన్లో పెట్టినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు. చదవండి: ఏడో తరగతిలో అలా చేయడం.. అదే తొలిసారి, చివరిసారి: దీపికా పదుకొణె అంతేకాదు కొడుకును ఎప్పుడెప్పుడు సినిమాల్లో తీసుకుద్దామని సుమ, రాజీవ్‌లు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో ఇప్పటికే విజయ్ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్న రోషన్ ఈ మూవీ ఇంకా స్టార్ట్ కాకుండానే తాజాగా రెండో సినిమాకు చర్చలు జరుపుతున్నట్లు వినికిడి. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను తన రెండో సినిమా కోసం లైన్లో పెట్టాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను: చిరంజీవి
‘‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా. పెద్ద మనసుతో చూస్తే, మిమ్మల్ని (ప్రేక్షకులు) రంజింపజేస్తుంది. నా మాట నమ్మి వెళ్లినవాళ్లకి నష్టం జరగదని భరోసా ఇస్తున్నా’’ అని చిరంజీవి అన్నారు. తాప్సీ ప్రధాన పాత్రలో రోషన్, భానుప్రకాశ్, జై తీర్థ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకత్వం వహించారు. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 1న విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి చిరంజీవి మాట్లాడుతూ– ‘‘ఆచార్య’ తీస్తున్నప్పుడు నిరంజన్, అవినాష్‌కి ఎప్పుడు సమయం కుదిరిందో తెలియదు కానీ ‘మిషన్ ఇంపాజిబుల్’ తీశారు. తాప్సీ, స్వరూప్ వంటి మంచి కాంబినేషన్లో ఈ సినిమా తీయబట్టే, ప్రీ రిలీజ్‌కి రావాలని నిరంజన్ అడగ్గానే వస్తానని చెప్పాను. ఈ సినిమా చూశాను.. అద్భుతంగా ఉంది. తాప్సీ, ముగ్గురు పిల్లలు చాలా బాగా నటించారు. విషయం, పరిజ్ఞానం, ప్రతిభ ఉన్న డైరెక్టర్ స్వరూప్. ‘మిషన్ ఇంపాజిబుల్’ చిన్న సినిమా అంటున్నారు కానీ రిలీజ్ అయ్యాక పెద్ద సినిమా అవుతుంది’’ అన్నారు. నిర్మాతలు ఇన్వాల్వ్ కావాలి: కథలో ఏదైనా ప్రత్యేకత ఉంటే కాని నిరంజన్ ఓకే చెప్పడు. ‘ఆచార్య’ కూడా తను ఓకే అన్నాకే మా వద్దకు వచ్చింది. కథలో, కథల ఎంపికలో నిర్మాతల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. నిర్మాత అనేవాడు ఓ క్యాషియర్, ఫైనాన్స్ సపోర్ట్ చేసేవాడు అనేట్లుగా పరిస్థితి మారింది. దానికి కారణం నిర్మాతలు కాదు.. నిర్మాతలను కథల ఎంపికలో ఇన్వాల్వ్ చేయాలి. నా నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్, కేఎస్ రామారావు, దేవీ వరప్రసాద్.. ఇలా ఎంతోమంది పూర్తిగా కథ, సంగీతం.. ఇలా అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. దానివల్ల డైరెక్టర్స్‌తో పాటు నటీనటులకు ఒక భరోసా ఉంటుంది. ఆ భరోసా ఇప్పుడు నిర్మాతల చేతుల్లో నుంచి ఇతరుల చేతుల్లోకి వెళ్లిపోతుండటం బాధగా ఉంది. ఇలాంటి రోజుల్లో అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్న నా నిర్మాత నిరంజన్ అని చెప్పుకోవడం గర్వంగా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు వెళ్లానా అనిపిస్తోంది ‘ఝుమ్మంది నాదం’ అప్పుడు తాప్సీని చూసి ‘వావ్.. ఎంత బాగుంది.. యాక్టివ్‌గా ఉంది’ అనుకున్నాను.. అప్పుడు నేను రాజకీయాల్లోకి వెళ్లి, తనతో సినిమా చేసే అవకాశం అందుకోలేకపోయాను. ఒక్కోసారి తాప్సీలాంటి వాళ్లని చూసినప్పుడు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్లానా అని రిగ్రేట్ ఫీలవుతుంటాను. ‘మెయిన్ లీడ్‌గా తను నాతో చేసే అవకాశం నువ్వు ఎందుకు ఇవ్వకూడదు (నవ్వుతూ).. తనని కమిట్ చేయిద్దాం.. నిర్మాత నువ్వే అవ్వాలి. స్టేజ్‌పై ఉన్న ఈ యంగ్ డైరెక్టర్స్‌లో లాటరీ వేసి ఒక్కర్ని ఓకే చేయ్’ అని నిరంజన్‌ని ఉద్దేశించి అన్నారు చిరంజీవి. ఇంకా చిరంజీవి మాట్లాడుతూ – ‘‘ఆర్ఆర్ఆర్’ తెలుగు, భారతీయ చిత్రపరిశ్రమ గర్వించే సినిమా అయింది. ఇక ‘మిషన్ ఇంపాజిబుల్’ లాంటి సినిమాలను ఆదరించినప్పుడే ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్, యంగ్ యాక్టర్స్‌కి ప్రోత్సాహంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘మిషన్ ఇంపాజిబుల్’ స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నాను. మంచి డైరెక్టర్స్‌కి మంచి నటీనటులు తోడైతే ‘మిషన్ ఇంపాజిబుల్, ఆచార్య’ వంటి సినిమాలొస్తాయి’’ అన్నారు నిరంజన్ రెడ్డి. తాప్సీ మాట్లాడుతూ– ‘‘హిందీ సినిమాలతో బిజీగా ఉన్నాను. ఇప్పుడెందుకు తెలుగు సినిమాలు చేస్తున్నారు? అని కొందరు అడుగుతున్నారు. మన ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైందో అది మరచిపోకూడదు. నా ప్రయాణం తెలుగు సినిమాలతోనే ప్రారంభమైంది.. అందుకే తెలుగు సినిమాలు చేస్తా.. చేస్తూనే ఉంటా’’ అన్నారు. -
గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా
డార్జిలింగ్/కోల్‌కతా: ప్రత్యేక గూర్ఖాల్యాండ్ రాష్ట్ర సాధన కోసం దాదాపు 15 ఏళ్లుగా పోరాడుతున్న గూర్ఖా జనముక్తి మోర్చా(జీజేఎం) ఎట్టకేలకు తన ప్రధాన డిమాండ్‌ను విరమించుకుంది. నేపాలీ మాట్లాడే గూర్ఖాలు అధికంగా నివసించే పశ్చిమబెంగాల్లోని పర్వత ప్రాంత సమ్మిళిత అభివృద్ది కోసం ‘రాజకీయ’ పరిష్కారం చూపాలని జీజేఎం ప్రధాన కార్యదర్శి రోషన్ గిరి డిమాండ్‌చేశారు. ‘ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను వదులుకుంటున్నాం. బెంగాల్ రాష్ట్రంలో గూర్ఖాలు ఇకపై మమేకం అవుతారు. పర్వత ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తారు’ అని రోషన్ చెప్పారు. ఉత్తర బెంగాల్ పర్యటనలో ఉన్న సీఎం మమతా బెనర్జీతో హమ్రో పార్టీ సభ్యులతో కూడిన జీజేఎం ప్రతినిధి బృందం భేటీ అయింది. జీజేఎం నిర్ణయాన్ని అధికార తృణమూల్ కాంగ్రెస్ సహా పలు పార్టీలు స్వాగతించాయి. ప్రజా మద్దతు కోల్పోయే జీజేఎం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని, ప్రత్యేక డార్జిలింగ్ రాష్ట్ర సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని కుర్సేంగ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ప్రసాద్ శర్మ అన్నారు. జీజేఎంకు ఆయువుపట్టు లాంటి డార్జిలింగ్ ప్రాంతంలో హమ్రో పార్టీ హవా పెరిగిందని, ముఖ్యంగా డార్జిలింగ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఆ పార్టీ గెలవడంతో జీజేఎం పంథా మారిందని శర్మ వ్యాఖ్యానించారు. -
యాంకర్ సుమ కొడుకు ఇలా మారిపోయాడేంటి?
యాంకర్ సుమ, రాజీవ్ కనకాల తనయుడు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్‌తో కలిసి ‘నిర్మల కాన్వెంట్’ అనే చిత్రంలో నటించాడు. ఆ తర్వాత పై చదువుల కోసం యూఎస్ వెళ్లాడు. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన రోషన్.. మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టాడు. తమ తనయుడి కెరీర్‌ని గాడిలో పెట్టేందుకు సుమ, రాజీవ్ బాగానే ప్రయత్నిస్తున్నారు. సొంతంగా ఓ సినిమాను కూడా నిర్మిస్తున్నారు. గతేడాదిలోనే ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా రోషన్ ఫోటోలు నెట్టింట్ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుమ.. రోషన్ బర్త్‌డే(మార్చి 15)సందర్భంగా మంగళవారం తన ఇన్‌స్టా ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తమ కుమారుడికి బర్త్‌డే విషెస్ చెబుతూ షేర్ చేసిన ఆ ఫోటోలను చూసి నెటిజన్స్ షాకవుతున్నారు. అతను రోషనేనా? ఇలా మారిపోయాడేంటి? అప్పుడే అంత పెద్దొడు అయిపోయాడా? అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే రోషన్, సుమ తల్లీకొడుకుల్లా కాకుండా అక్క, తమ్ముడిలా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు. రోషన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ ఫొటోలో రోషన్ చాలా పొడవుగా, క్యాజువల్ లుక్స్‌తోనే అందరినీ ఆకట్టుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Suma K (@kanakalasuma) -
పేరు మార్చుకున్న శ్రీకాంత్ కొడుకు రోషన్
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు. న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లాజిక్ రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే. -
'సలార్' ప్రొడక్షన్ బ్యానర్లో శ్రీకాంత్ కొడుకు రోషన్ సినిమా
Hero Srikanth Son Roshan Next Film With Vyjayanthi Movies: నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందD సినిమాలో నటించాడు. కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వస్తున్నా ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నాడు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నేషనల్ అవార్డు విన్నర్ ప్రదీప్ అద్వైతం ఈ సినిమాకు దర్శకత్వం వహించనుండగా, స్వప్నా సినిమాస్ ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని ఆదివారం(మార్చి13)న రోషన్ బర్త్‌డే సందర్భంగా వైజయంతి మూవీస్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. ఈ మేరకు ట్విట్టర్లో పోస్ట్ షేర్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. We are delighted to announce our Production No.9 with #Roshann, Directed by National Award Winning Director @PradeepAdvaitam. Wishing 'Roshann' a very Happy Birthday.@SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/NEpCwzhJHl — Vyjayanthi Movies (@VyjayanthiFilms) March 13, 2022 -
పెళ్లి సందD హీరోయిన్‌కు పుష్కలంగా అవకాశాలు..
Pelli SandaD Heroine Sreeleela New Movie With Roshan: బెంగళూరు బ్యూటీ శ్రీలీల పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది. 'పెళ్లి సందD'సినిమాతో హీరోయిన్గా పరిచయం అయిన ఈ భామ రాఘవేంద్రరావు హీరోయిన్గా అందరి దృష్టిని ఆకర్షించింది. తొలి సినిమా 'పెళ్లి సందD'అనుకున్నంత సక్సెస్ కాకపోయినా ఈ అమ్మడికి మాత్రం పుష్కలంగా అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో చాన్సులు కొట్టేసినట్లు టాక్ వినిపిస్తుంది. వీరితో పాటు తొలిసారి తనతో జోడీ కట్టిన రోషన్‌తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తెలుస్తుంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వైజయంతి మూవీస్ బ్యానర్లో త్వరలోనే ఈ సినిమా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. -
శ్రీకాంత్ కొడుకు స్పీడు.. బడా బ్యానర్స్‌లో సినిమాలకు సైన్
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రోషన్. ఈ చిత్రం అనంతరం కొంత గ్యాప్ తీసుకొని పెళ్లి సందడి సినిమాతో మరోసారి అలరించాడు ఈ యంగ్ హీరో. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ఆశించకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో వరుస ఆఫర్లు వరిస్తున్నాయి. తాజాగా వైజయంతి మూవీస్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి సన్నాహకాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాతో పాటు సితార బ్యానర్‌లోనూ ఓ చిత్రానికి రోషన్ సైన్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఈ రెండు చిత్రాలకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. -
పెళ్లి సందD సినిమా రివ్యూ
టైటిల్: పెళ్లి సందD నటీనటులు: రోషన్, శ్రీలీలా, బ్రహ్మానందం, రావు రమేశ్, రాజేంద్రప్రసాద్, ప్రకాశ్‌రాజ్, తదితరులు దర్శకత్వం: గౌరీ రోనంకి నిర్మాణ సంస్థ: ఆర్కా మీడియా వర్క్స్, ఆర్కే ఫిలిం అసోసియేట్స్ బ్యానర్ నిర్మాతలు: మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి ఎడిటర్: తమ్మిరాజు విడుదల తేదీ: అక్టోబర్ 15, 2021 దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పర్యవేక్షణలో రూపొందిన చిత్రం పెళ్లి సందD. ప్రముఖ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, యువ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించారు. గౌరి రోణంకి దర్శకత్వం వహించారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. ఎప్పుడూ తెర వెనుక ఉండే రాఘవేంద్రరావు ఈ సినిమాలో నటించడం విశేషం. దసరా కానుకగా అక్టోబర్ 15న థియేటర్లలో రిలీజైందీ చిత్రం. మరి ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టిందా? లేదా? అనేది తెలియాలంటే రివ్యూ చదివేయాల్సిందే! కథ: వశిష్ట(రోషన్) ఫుట్‌బాల్ ప్లేయర్‌గా కనిపిస్తాడు. అతడి తండ్రి పాత్రలో రావు రమేశ్ నటించాడు. ఎవరో చూసిన సంబంధం కాకుండా మనసుకు నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు వశిష్ట. తన సోదరుడి వివావహంలో సహస్ర (శ్రీలీల)ను చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు.ఆమె కూడా అతడి మీద మనసు పారేసుకుంటుంది. అలా ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతారు. ఇంతలో వీరి ప్రేమ అనుకోని మలుపులు తిరుగుతుంది. దాన్ని హీరో ఎలా ఎదుర్కొన్నాడు? తన ప్రేమను, ప్రియురాలిని ఎలా సొంతం చేసుకున్నాడు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే! విశ్లేషణ: హీరో శ్రీకాంత్‌కు జనాల్లో ఎంతటి గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విభిన్నమైన కథలతో, విలక్షణమైన నటనతో జనాల్లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడీ హీరో. అతడి తనయుడు పెళ్లి సందD సినిమా చేస్తున్నాడనగానే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే నటనతో మెప్పించాడీ హీరో. రెండో సినిమాకే పాత్రలో ఒదిగిపోయిన విధానం మనల్ని ఆశ్చర్యపరచక మానదు. హీరోయిన్ శ్రీలీల గ్లామర్‌తో ఆకట్టుకుంది. అయితే కథ, కథనం చాలా వీక్‌గా ఉంది. విజువల్స్ రాఘవేంద్రరావు స్టైల్‌కు తగ్గట్టుగా ఉంటాయి. కానీ కథలో బలం లేకపోవడంతో అవన్నీ తేలిపోతాయి. సెకండాఫ్‌లో డ్రామా ఎక్కువైనట్లు అనిపిస్తుంది. చాలా సీన్లు బోరింగ్‌గా అనిపిస్తాయి. అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు వాటికి ఉపశమనం కోసం పెట్టినట్లు అనిపించక మానదు. ఎమోషన్స్ పండించేందుకు ఆస్కారం ఉన్నా డైరెక్టర్ దాన్ని పెద్దగా పట్టించుకోనట్లు అనిపించింది. సినిమాను ఆసక్తికరంగా మలచడంలో విఫలమైనట్లు కనిపిస్తోంది. టెక్నికల్‌గా.. బలమైన ఎమోషన్స్‌ను పండించడంలో డైరెక్టర్ కొంత తడబడ్డట్లు అనిపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. అందమైన లొకేషన్లను కెమెరాల్లో బంధించి మంచి విజువల్స్ రాబట్టడంలో కెమెరామన్ కొంత మ్యాజిక్ చేశాడు. సినిమా ప్రారంభంలోని సన్నివేశాలతో పాటు సెకండాఫ్‌లోని కొన్ని సీన్లను చాలా అందంగా చూపించాడు కీరవాణి సంగీతం మెప్పించింది. నిర్మాణ విలువలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎడిటింగ్ బాగోలేదు. నటీనటులు: రోషన్ ఎంతో అనుభవం ఉన్నవాడిలా నటించాడు. సినిమాను సేవ్ చేసేందుకు అతడు చాలానే ప్రయత్నించాడు. నటన, డైలాగులు, డ్యాన్స్.. ఇలా అన్నింటినీ ఉపయోగించాడు, కానీ వర్కవుట్ కాలేదు. హీరోయిన్ గ్లామర్‌గా కనిపిస్తూ అందరినీ ఆకర్షించేందుకు ప్రయత్నించింది కానీ ఆమె పాత్రకు పెద్దగా నటించే స్కోప్ ఇవ్వలేదు. రావు రమేశ్, రఘుబాబు తమ పాత్రలతో కామెడీ పండించే ప్రయత్నం చేశారు. రాఘవేంద్రరావు నటన సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది చివరగా.. సందడి ఎక్కువ అలజడి తక్కువ అన్నట్లు ఉందీ పెళ్లి సందD. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా కూడా ఎందుకో మెప్పించలేదనిపించింది. -
పెళ్లి సందD ట్విటర్ రివ్యూ
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, కన్నడ బ్యూటీ శ్రీలీల హీరోహీరోయిన్లు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చదవండి: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్విటర్ రివ్యూ దసరా పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకులకు ఏమేర వినోదం అందించింది మరికొద్ది సేపట్లో పూర్తి రివ్యూ రానుంది. ఆలోపు ప్రీవ్యూస్ చూసిన నెటిజన్లు ఈ మూవీ గురించి ఏమంటున్నారో తెలుసుకుందాం. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. రోషన్, శ్రీలీల పర్ఫామెన్స్, పాటలు, విజువల్స్ గురించి ఎక్కువగా హైలెట్ అవుతున్నాయి. Addicted #MadhuraNagarilo song 👌👌👌👌👌#PellisandaD @mmkeeravaani garu kummio 🎵🎶🎵 — Aarya (@pradeepASSRR) October 14, 2021 మినిమమ్ టాక్ వచ్చినా ఫ్యామిలీ మొత్తం థియేటర్లకు క్యూ కడుతుందని చెబుతున్నారు. అయితే కథపై అంతగా మాట్లాడుకోవడం లేదు కానీ, రోషన్, శ్రీలీలా జోడి, ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం మూవీకి హైలెట్‌గా చెప్పొచ్చు అంటున్నారు. ముఖ్యంగా మధురా నగరి పాట చాలా అద్భుతంగా ఉందని, ఈ పాట తెగ ఆకట్టుకుంటోందంటున్నారు. సీనియలర్ నటులు బ్రహ్మనందం, రావు రామేశ్, రాజేంద్ర ప్రసాద్‌ల పాత్రలు బాగున్నాయని, ఇది ఒక పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని, రోటీన్ స్టోరీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి నాటి పెళ్లి సందడికి సీక్వెల్‌గా వచ్చిన నేటి పెళ్లి సందD పాజిటివ్ టాక్‌నే తెచ్చుకుంటోందని చెప్పకోవాలని, సినిమా ఏ మాత్రం బాగుందని టాక్ వచ్చిన పండుగకు ఫ్యామిలీకి పర్ఫెక్ట్ చిత్రం అవుతుందంటున్నారు. All the best to #PelliSandaD Team..!! Minimum talk vachinda family Q kattestaru..!! Craze kuda families lo bagane undi. — Shannu (@Shannu_S3) October 14, 2021 -
శ్రీవారిని దర్శించుకున్న ‘పెళ్లి సందD’ హీరోహీరోయిన్
పెళ్లి సందD హీరో రోషన్, హీరోయిన్ శ్రీలీలాతో పాటు మూవీ టీం తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ రోజు(గురువారం) ఉదయం వీఐపీ దర్శనం ద్వారా చిత్రం బృందం స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు పెళ్లి సందD హీరోహీరోయిన్ను, చిత్ర బృందాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా హీరో రోషన్ మీడియాతో మాట్లాడుతూ.. రేపు సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో శ్రీవారి ఆశీర్వాదం కోసం వచ్చామని చెప్పాడు. శ్రీనివాసుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఇక హీరోయిన్ శ్రీలీలా మాట్లాడుతూ.. సినిమా బృందం మొత్తం శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చిందన్నారు. ఇది పూర్తిగా ఫ్యామిలీ మూవీ అని, కుటుంబంతో కలిసి అందరూ చూడవచ్చని దర్శకురాలు గౌరీ రోణంకి పేర్కొన్నారు. -
నన్ను ఎవరు గుర్తు పట్టడంలేదు, అందుకే ఈవెంట్స్‌కి రావట్లేదు: రవళి
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన చిత్రం ‘పెళ్లి సందD’. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో నిన్న(అక్టోబర్ 10) పెళ్లి సందD ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరి వెంకటేశ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే 25 ఏళ్ల శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ ప్రధాన పాత్రలో కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిచిన నాటి పెళ్లి సందడి హీరో, హీరోయిన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చదవండి: రకుల్ పెళ్లి చేసుకోబోయే ఈ జాకీ భగ్నానీ ఎవరో తెలుసా! ఈ వేడుకలో ఒకప్పుటి హీరోయిన్ రవళిని చూసి అందరూ షాక్ అయ్యారు. అలాగే అతిథులుగా వచ్చిన చిరు, వెంకటేశ్‌లు సైతం ఆమెను చూసి అవాక్కయ్యారు. తన అందం, అభినయంతో 90లలో హీరోయిన్గా చక్రం తిప్పిన రవళి ఎంతోమంది ప్రేక్షకులను సొంతం చేసుకున్నారు. అంతేగాక తన క్యూట్ ఎక్స్ప్రెషన్తో అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె ఇప్పుడు ఓవర్ వెయిట్‌తో బొద్దుగా ఎవరూ గుర్తు పట్టలేనంతగా మారిపోయారు. ఈ కార్యక్రమంలో ఆమె స్టేజ్‌పై మాట్లాడుతూ ముందుగా ‘నా పేరు రవళి’ అంటూ చిరంజీవి, వెంకటేశ్‌లకు తనని తాను పరిచయం చేసుకున్నారు. అంతేగాక తనని గుర్తు పట్టి ఉండరేమో.. అందుకే పరిచయం చేసుకుంటున్నాను అంటూ సరదాగా చమత్కరించారు. చదవండి: త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోన్న రకుల్!, వరుడు ఎవరంటే.. ఆ తర్వాత రవళి మాట్లాడుతూ.. ‘చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం సంతోషంగా ఉంది. సాధారణంగా నేను ఈ మధ్య ఎలాంటి ఫంక్షన్స్‌కు, మూవీ ఈవెంట్స్‌కు రావడం లేదు. రావొద్దని కాదు కానీ.. వచ్చిన నన్ను ఎవరూ గుర్తుపట్టడం లేదు. అందుకే ఈవెంట్స్‌కు రావడం మానేశాను. అయినా రాఘవేంద్ర రావు పిలిచిన తర్వాత రాకుండా ఉండలేను, ఏ స్టేజ్‌లో ఉన్నా.. ఎలా ఉన్నా వస్తాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. అనంతరం ఆమె పెళ్లి సందD హీరో రోషన్, శ్రీలీలా, మూవీ టీంకు ఆమె అభినందనలు తెలిపారు. కాగా కె రాఘవేంద్రరావు దర్శక పర్యవేక్షణలో గౌరి రోనంకి ఈ మూవీని రూపొందించారు. ఇందులో కన్నడ బ్యూటీ శ్రీలీలా హీరోయిన్గా నటించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘పెళ్లి సందD’ నుంచి మరో రొమాంటిక్ సాంగ్
సీనియర్ నటుడు శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్ళిసందD’. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కన్నడ భామ శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, ట్రైలర్లకు ప్రేక్షకులను విశేష స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో రొమాంటిక్ సాంగ్‌ను పాటను విడుదల చేశారు మేకర్స్. మాస్ మహారాజా రవి తేజ చేతుల మీదుగా విడుదలైన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యంగా అందించగా.. ఎమ్ఎమ్ కీరవాణి స్వరాలను సమకూర్చారు. శ్రీనిధి, కాలభైరవ, నయన నాయర్ ఆలపించారు. చదవండి: పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయకండి: దిల్ రాజు ‘మధుర నగరిలో..’ అంటూ సాగే ఈ పాట కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పాటతో దర్శకేంద్రుడు మరోసారి తన మార్క్ చూపించారు. కాగా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాఘవేంద్రరావు చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు. ఈ సినిమాకు ఆయన దర్శకత్వ పర్యవేక్షణ అందించడమే కాకుండా ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ కెరీర్లో మైలురాయిగా నిలిచిన ‘పెళ్ళిసందడి’ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా మరీ రోషన్‌కు ఎంత మేర సక్సెస్‌ను తెచ్చిపెడుతుందో చూడాలి. చదవండి: Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్ అదిరిందిగా.. -
తెలుగులోగిళ్లలో మరోసారి ‘పెళ్లి సందD’ మూవీ స్టిల్స్
-
Pelli SandaDI : పెళ్లి సందD ట్రైలర్ అదిరిందిగా..
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న చిత్రం పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని సూపర్ స్టార్ మహేశ్ బాబు విడుదల చేశాడు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపాడు మహేశ్. ఇక ఈ సినిమాను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు..పెళ్లి సందడి’ సినిమాకి పనిచేసిన కీరవాణి – చంద్రబోస్ ఈ సినిమాకి కూడా పనిచేయడం విశేషం. పాతికేళ్ళ క్రితం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన పెళ్ళిసందడి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా సూపర్ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఈ పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తాయి. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. -
ఆకట్టుకుంటున్న పెళ్లి సందD టీజర్
Pelli SandaD Movie Teaser : శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా, దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న సినిమా 'పెళ్లి సందD'.శ్రీ లీల ఈ చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. 'సహస్రకు పెళ్లి నాతోనా.. లేక నువ్వు తెచ్చిన తొట్టిగ్యాంగ్ లీడర్‌తోనా' అంటూ రోషన్ చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. రాఘవేంద్ర రావు మార్క్ ప్రతి ఫ్రేములో స్పష్టంగా కనిపిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. గౌరి రోణంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్న టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూతురు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే చాలా మంది వారసులు ఉన్నారు. నిజం చెప్పాలంటే టాలీవుడ్లో 80 శాతం వరకు వారసులదే హవా కొనసాగుతుంది. అయితే ఈ వారసుల్లో ఎక్కువ వరకు మగవారే ఉండడం గమనార్హం. చాలా తక్కువ మంది హీరోలు తమ కూతుళ్లును సిల్వర్ స్క్రీన్కు పరిచయం చేస్తున్నారు. వారిలో సక్సెస్ రేట్ కూడా తక్కువే. ప్రస్తుతం ఉన్న స్టార్ కిడ్స్‌లో మంచులక్ష్మీ, నిహారిక, శివాత్మిక, శివాణి ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి హీరో శ్రీకాంత్ కూతురు మేధ కూడా చేరబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 17 ఏళ్ల మేధ త్వరలోనే హీరోయిన్గా సిల్వర్ స్క్రీన్‌పై మెరువబోతుందనే వార్త టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రస్తుతం ఆమె భరత నాట్యంలో శిక్షణ తీసుకుంటుందట. ఇక కూతురు ఎంట్రీ గ్రాండ్‌గా ఉండేలా మంచి కథలను సెలక్ట్ చేసే పనిలో ఉన్నారట శ్రీకాంత్, ఊహ. ఇప్పటికే కొన్ని కథలను కూడా విన్నారట. అన్ని కుదిరితే వచ్చే ఏడాదిలో శ్రీకాంత్ వారసురాలిని మనం సిల్వర్ స్క్రీన్‌పై చూడొచ్చు. మరోవైపు శ్రీకాంత్ కొడుకు రోషన్ ‘నిర్మల కాన్వెంట్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కుర్ర హీరో కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ‘పెళ్లి సందD’అనే సినిమా చేస్తున్నాడు. (చదవండి: 'పుష్ప' విలన్ వచ్చేశాడు... గుండుతో ఫహద్.. లుక్ అదిరిందిగా) -
Pelli SandaD: టైటిల్ సాంగ్ వచ్చేసింది.. వింటే ఫిదా కావాల్సిందే
దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న పెళ్లి సందD. ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్ బ్యానర్స్‌పై కె.కృష్ణ మోహన్ రావు సమర్పణలో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు అందిస్తున్న ఈ చిత్రానికి గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ సినిమాలో రాఘవేంద్రరావు కీ రోల్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల చేసింది చిత్రయూనిట్. ‘పట్టుచీరల తళతళలు.. పట్టగొలుసులా గలగలలు’అంటూ సాగే ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ అందించగా, కీరవాణి అద్భుత సంగీతాన్ని సమకుర్చాడు. ఈ పాటను హేమచంద్ర, దీపు, రమ్యబెహ్రా ఆలపించగా, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను అలరిస్తోంది. -
నటుడిగా మారిన రాఘవేంద్రరావు.. వీడియో వైరల్
ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు నటుడిగా మారారు. వందకు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ఆయన తొలిసారి 'పెళ్లి సందD' సినిమాతో వెండితెరపై కనిపించబోతున్నారు. రాఘవేంద్రరావు పర్యవేక్షనలో గౌరీ రోనంకి దర్శకత్వంలో 'పెళ్లి సందD' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాలో రాఘవేంద్రరావు 'వశిష్ట' అనే పాత్రలో నటిస్తున్నారు. తాజాగా రాఘవేంద్రరావు పాత్రకు సంబంధించి ఇంట్రడక్షన్ వీడియోను డైరెక్టర్ రాజమౌళి సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘సుమారు 100కి పైగా చిత్రాలకి దర్శకత్వం వహించిన మన మౌనముని తొలిసారి కెమెరా ముందుకు వచ్చారు’ అని రాజమౌళి పేర్కొన్నారు. ఈ వీడియోలో రాఘవేంద్రరావు లుక్ ఆకట్టుకుంటుంది. సూటు, బూటు ధరించి గాగుల్స్ పెట్టుకొని యమ స్టైలిష్‌గా కనిపించారాయన. ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండగా మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇంత కాలం...కెమెరా వెనుక ఉండి చూపించిన దర్శకేంద్రుడి మాయ ఇప్పుడు కెమెరా ముందు చూడబోతున్నాం... 🙏....@Ragavendraraoba గురూజీ....మళ్ళీ ఈ "పెళ్లి సందడి" మరో సంచలనం అవ్వాలని కోరుకుంటున్నాను 😍🎉🎉🎉 All the best to whole team ....💐💐 https://t.co/lV3Y6oT4UD — Anil Ravipudi (@AnilRavipudi) July 30, 2021 -
రెండు నెలల్లో శ్రీకాంత్ తనయుడి పెళ్లి సందడి
Pelli Sandadi: శ్రీకాంత్ హీరోగా కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ పేరుతోనే ఓ చిత్రం తెరకెక్కింది. కె. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా ఆయన శిష్యురాలు గౌరీ రోణంకి దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. శ్రీలీల హీరోయిన్. కె. కృష్ణమోహన్ రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్, ఆర్.కె ఫిలిం అసోసియేట్స్‌పై మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. గౌరీ రోణంకి మాట్లాడుతూ– ‘‘పెళ్లి సందడి’ అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. రోషన్, శ్రీలీల జోడీ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చింది. లవ్ ట్రాక్, ఎమోషన్స్, కామెడీ.. అంశాలతో సినిమా అందర్నీ మెప్పించేలా ఉంటుంది. ఈ ‘పెళ్లి సందడి’ ద్వారా కీరవాణిగారు తన సంగీతంతో శ్రోతలను మరోసారి మెస్మరైజ్ చేయడం ఖాయం. సెప్టెంబర్‌లో మా సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సునీల్ కుమార్ నామా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెలమూడి. కార్తీక్, శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు పాల్గొన్నారు. -
‘పెళ్లి సందD’ కి క్రేజీ ఆఫర్... ఓటీటీలో విడుదలకు సిద్దం!
కరోనా సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లు మూతబడడంతో సినీ ప్రియులకు ఓటీటీ వేదికలు కీలకమైన ప్రత్యామ్నాయాలుగా మారాయి. కరోనా ముందు ఓటీటీ వేదికలు ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో ఒక ఓటీటీ వేదికలో సభ్యత్వం తీసుకుని ఇంట్లో కూర్చొని హాయిగా సినిమాలు చూస్తున్నారు. ప్రేక్షకుల అభిరుచి తగ్గట్లుగా ఓటీటీ సంస్థలు ఢిపరెంట్, ఢిపరెంట్ కంటెంట్‌ని అందుబాటులోకి తీసుకోస్తుంది. ఇక థియేటర్లు ఇప్పట్లో తెరిచే పరిస్థితి లేకపోవడంతో చిన్న, మీడియం సినిమాలు మెల్లిమెల్లిగా ఓటీటీ బాట పడతున్నాయి. ఇప్పటికే ఈ వారంలో ‘ఏక్ మినీ కథ’, ‘అనుకోని అతిథి’లాంటి సినిమాలు ఓటీటీలో విడుదలయ్యాయి. తాజాగా మరో టాలీవుడ్ మూవీ ఓటీటీలో విడుదల కాబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న ‘పెళ్లి సందD’ఓటీటీ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందని సమాచారం. రెండు ప్రముఖ ఓటీటీ సంస్థలు ‘పెళ్లి సందD’ని కొనేందుకు ముందుకు వచ్చాయని, అవి ప్రకటించిన ఆఫర్లు కూడా నిర్మాతకు లాభాన్ని తెచ్చిపెట్టేలా ఉన్నాయని, ఎప్పుడైనా ఈ డీల్ ఓకే అయిపోవొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. మరి నెట్టింట వినిపిస్తోన్న ఈ వార్తలు చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇక ‘పెళ్లి సందD’ విషయానికొస్తే... శ్రీకాంత్ హీరోగా నటించిన పెళ్లి సందడికి సీక్వెల్ ఇది. శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీలా జంటగా నటిస్తున్న ఈ సినిమాని కె.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి తెరకెక్కిస్తున్నారు. -
బుజ్జులు.. బుజ్జులు...
రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘పెళ్లి సందడి’ సినిమా ఎంత హిట్టో తెలిసిందే. తాజాగా రాఘవేంద్రరావు పర్యవేక్షణలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ‘పెళ్లి సందడి’ సినిమా రూపొందుతోంది. ఆదివారం (మే 23) న రాఘవేంద్రరావు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలోని రెండవ పాట ‘బుజ్జులు.. బుజ్జులు’ను విడుదల చేశారు. గౌరి రోణంకి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. కె. కృష్ణ మోహన్‌రావు సమర్పణలో మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు. ‘‘పాలకుండ నెత్తినెట్టి పంజగుట్ట పోతవుంటే.. బుజ్జులు.. బుజ్జులు కొనిపెడతా బంగరు గజ్జెలు...’’ అని సాగే పాటను రిలీజ్ చేశారు. గౌరి మాట్లాడుతూ – ‘‘డైరెక్టర్‌గా ఈ సినిమా నాకో ఛాలెంజ్. రాఘవేంద్రరావు, కీరవాణిగార్ల హిట్ కాంబినేష¯Œ లో రూపొందుతోన్న ఈ చిత్రంలోని ప్రతి పాట అలరిస్తుంది’’ అన్నారు. ‘‘ఏడు రోజులు ప్యాచ్‌వర్క్ ఉంది. లాక్డౌన్ ముగిశాక పూర్తి చేసి, జూ¯Œ లేదా జూలైలో సినిమా రిలీజ్ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సాయిబాబా కోవెల -
శ్రీకాంత్ కొడుకు'పెళ్లి సందD' మూవీ స్టిల్స్
-
పెళ్లి సందడి@25.. రాఘవేంద్రరావు ఎమోషనల్ ట్వీట్
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా సినిమాల్లో ‘పెళ్లి సందడి’ ఒకటి. ఈ చిత్రంలోని పాటలు ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘సౌందర్య లహరి.. స్వప్న సుందరి’, ‘నవ మన్మథుడా.. అంతి సుందరుడా’, ‘హృదమనే కోవల తలుపులు తెరిచే తాళం ప్రేమ’ లాంటి పాటలు వింటే ఇప్పటికీ ఏదో అనుభూతి కలుగుతుంది. శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ హీరోయిన్లుగా అశ్వనీదత్, అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా జనవరి 12,1996లో విడుదలైంది. బుధవారం నాటికి ఈ చిత్రం 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాఘవేంద్రరరావు ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ‘పెళ్లిసందడి. నేటికి సినిమా విడదల అయ్యి 25 ఏళ్ళు అయింది. నా కెరీర్ లో, శ్రీకాంత్ కెరీర్ లోనే కాకుండా తెలుగు సినిమా చరిత్రలోనే నిలిచిపోయేలా చేసిన ప్రేక్షకాభిమానులకు, కీరవాణి కి, చిత్ర నిర్మాతలు అశ్వినీదత్, అల్లు అరవింద్, జగదీష్ ప్రసాద్ లకు నమస్కరిస్తున్నాను’ అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు. అలాగే ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పెళ్లి సందD సినిమా హీరోయిన్ పేరును తెలియజేస్తూ మరో ట్వీట్ చేశారు. ఈ పాతికేళ్ల పెళ్లిసందడి సంబరాలను రెట్టింపు చేయడానికి పెళ్లిసందD సినిమా ని శ్రీకాంత్ వారసుడు రోషన్, శ్రీ లీల తో చేస్తున్నాము.. నా దర్శకత్వ పర్యవేక్షణ లో నా సహాయ దర్శకురాలు గౌరీ దర్శకత్వం చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరిస్తున్నాం... త్వరలో థియేటర్లో కలుద్దాం. అని ట్విటర్ ద్వారా తెలియజేశారు. కాగా అమెరికాలో పుట్టి పెరిగిన శ్రీ లీల.. కిస్ అనే కన్నడ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ విడుదల అవ్వకుండానే శ్రీమురళి నటిస్తోన్న భారతే అనే మూవీలో అవకాశం సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు పెళ్లిసందDతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. -
ఫ్యాన్స్‌కి ఖుషీ?
మూడేళ్ల విరామం తర్వాత కొత్త చిత్రాన్ని ప్రకటించారు దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వం వహించిన సూపర్ హిట్ చిత్రం ‘పెళ్లి సందడి’ టైటిల్‌నే ఈ కొత్త సినిమాకు పెట్టారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని టాక్. అలాగే హీరోయిన్గా శ్రీదేవి చిన్న కుమార్తె, జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కనిపించే అవకాశం ఉందట. హీరోయిన్స్ పేరు ప్రస్తావనలో ఖుషీ కపూర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అనేక బ్లాక్‌బస్టర్స్‌లో కనిపించారు శ్రీదేవి. ఆమె కెరీర్లో ముఖ్యమైన దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. తెలుగులో శ్రీదేవి ఓ ప్రత్యేకమైన స్థానం. ఖుషీ తెలుగు తెరకు పరిచయం అయితే శ్రీదేవి అభిమానులు ఖుషీ అవుతారు. మరి ఖుషీ ఇస్తారా? చూడాలి. ఒకవేళ ఈ సినిమా అంగీకరిస్తే ఇదే ఖుషీ కపూర్‌కి తొలి సినిమా అవుతుంది. ఇంకా హిందీలో కూడా ఆమె నటించలేదు. ఇదిలా ఉంటే... ప్రస్తుతం ‘పెళ్లి సందడి’కి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. -
పెళ్లి సందడి మళ్లీ మొదలు
దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన వందకు పైగా చిత్రాల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలున్నాయి. మ్యూజికల్ హిట్స్ ఉన్నాయి. ఆయన బెస్ట్ సినిమాల్లో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్ చిత్రం ‘పెళ్లి సందడి’ ఒకటి. శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సంచలనాత్మక విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ‘పెళ్లి సందడి’ టైటిల్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు ఆయన. ‘మ్యూజికల్ సిట్టింగ్స్ ప్రారంభం అయ్యాయి, నటీనటుల వివరాలు త్వరలో చెబుతాం’ అని ఓ వీడియో ద్వారా ప్రకటించారు. మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. -
పెళ్లికి రెడీ అవుతోన్న 'దృశ్యం' నటుడు
తిరువనంతపురం: 'దృశ్యం' నటుడు రోషన్ బషీర్‌కు పెళ్లి ఘడియలు దగ్గరపడ్డాయి. కేరళలో తన ప్రేయసి, మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి దగ్గరి బంధువైన ఫర్జానాను ఆగస్టు 5న వివాహం చేసుకోనున్నారు. కేరళ ప్రభుత్వం నియమ నిబంధనల మేరకు కేవలం ఇరు కుటుంబాల సమక్షంలోనే ఈ వివాహం జరగనుంది. కాగా ఎప్పటినుంచో ప్రేమ ఊసులు చెప్పుకుంటున్న వీరిద్దరినీ పెళ్లి బంధంతో ఒక్కటి చేసేందుకు పెద్దలు నిర్ణయించుకోవడంతో జూలై 5న వీరి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. దీనికి సంబంధించిన ఫొటోలను రోషన్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఫర్జానా న్యాయవిద్యను అభ్యసిస్తున్నారు. (సెలబ్రిటీల పెళ్లిపై మాధవీలత విసుర్లు) రోషన్ బషీర్ "ప్లస్ టూ" చిత్రంతో మలయాళీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. 'ఇన్నను ఆ కల్యాణం', 'బ్యాంకింగ్ అవర్స్', 'రెడ్ వైన్' వంటి పలు సినిమాల్లో కనిపించారు. కానీ అతనికి మంచి బ్రేక్‌నిచ్చింది మాత్రం 'దృశ్యం' సినిమానే. మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో రోషన్ నెగెటివ్ పాత్రలో మెరుగైన నటన కనబరిచారు. ఈ సినిమా బంపర్ హిట్ సాధించడంతో ఎన్నో భాషల్లో రీమేక్ అయింది. తెలుగులో వెంకటేశ్ (దృశ్యం), తమిళంలో కమల్ హాసన్ (పాపనాశనం), కన్నడంలో రవిచంద్రన్ (దృశ్య), హిందీలో అజయ్ దేవగన్ (దృశ్యం) హీరోలుగా రీమేక్ చేశారు. అంతేకాదు.. సింహళీ (శ్రీలంక)భాషలో ‘ధర్మయుద్య’గా రీమేక్ అయింది. చైనీస్‌లోనూ ‘షీప్ వితౌట్ ఏ షెపర్డ్’ టైటిల్‌తో రీమేక్ అయింది. (భారీ వ్యూస్ సాధించిన ‘గడ్డి తింటావా’ సాంగ్) -
‘లవర్స్ డే’ మూవీ రివ్యూ
టైటిల్ : లవర్స్ డే జానర్ : లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : రోషన్, ప్రియా ప్రకాశ్ వారియర్, నూరీన్ షరీఫ్ సంగీతం : షాన్ రెహమాన్ దర్శకత్వం : ఒమర్ లులు నిర్మాత : ఎ.గురురాజ్, సి.హెచ్. వినోద్ రెడ్డి ఒక్క కన్నుగీటుతో కుర్రకారుకు నిద్రపట్టకుండా చేసింది ప్రియా ప్రకాష్ వారియర్. ఇక ముద్దు గన్నును పేల్చి ఎన్నో కోట్ల హృదయాలకు గాయం చేసిన ఈ అమ్మడు సోషల్‌మీడియా క్వీన్‌గా మారిపోయింది. ప్రియా వారియర్ పైనే ‘లవర్స్ డే’ మూవీ ఆధారపడి ఉందంటేనే ఎంతటి క్రేజ్‌ను సంపాదించిందో తెలిసిపోతోంది. మరి ప్రియాకు వచ్చిన క్రేజ్.. ఈ మూవీని గట్టెక్కేలా చేసిందా? ప్రేమికుల రోజున వచ్చిన ‘లవర్స్ డే’ చిత్రం ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఓ చూసారి చూద్దాం.. కథ : కాలేజ్.. స్నేహితులు.. ప్రేమ.. కుళ్లు జోకులు.. సింపుల్‌గా చెప్పాలంటే ఈ మూవీ కథ ఇదే. రోషన్.. ప్రియ.. గాధ.. ల మధ్య జరిగే కథే ఈ చిత్రంలో ప్రత్యేకం. రోషన్.. గాధ స్నేహితులుగా మొదలై ప్రేమికులుగా మారిపోతారు. అయితే వారి ప్రేమను వ్యక్త పరిచాలనుకునే సమయానికి అనుకోని సంఘటన జరుగుతుంది. (సాక్షి రివ్యూస్) అనుకోని ఆ సంఘటన ఏంటి.. అసలు ఈ కథ లో వింక్ గర్ల్ ప్రియ వారియర్ పాత్ర ఏంటి అనేది మిగతా కథ. నటీనటులు : కాలేజ్ కుర్రాడిగా రోషన్.. అతని స్నేహితులు బాగానే నటించారు. ముఖ్యంగా రోషన్ లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచేస్తాడు. ఇక ప్రియ తనకు బాగా పేరు తెచ్చిన.. కన్ను గీటే సీన్.. ముద్దు గన్ను సీన్స్‌తో థియేటర్లో విజిల్స్ కొట్టిస్తుంది. టీజర్, ట్రైలర్లను చూసి ప్రియానే మెయిన్ లీడ్ అనుకుంటే పొరపాటే. (సాక్షి రివ్యూస్) గాధ పాత్రలో నటించిన నూరిన్ షరీఫ్.. ప్రియా కంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది. అందం.. అభినయంతోనూ నూరీన్ ఆకట్టుకుంది. ఇక హీరో స్నేహితులు, ప్రిన్సిపాల్, లెక్చరర్, ప్యూన్ పాత్రలు నవ్విస్తాయి. విశ్లేషణ : ఇలాంటి కథలు మనం ఎప్పుడో చూసేసాం. గతంలో వచ్చిన చిత్రం, నువ్వు నేను, సొంతం లాంటి ఎన్నో సినిమాల్లో ఈ కాన్సెప్టే మనకు కనబడుతుంది. లెక్చరర్లు స్టూడెంట్స్ మధ్య వచ్చే కుళ్లు జోకులు.. ప్రేమ.. ఆకర్షణ.. స్నేహితులు.. వీటి చుట్టే తిరిగే ఈ కథ.. ఓ వయసు వారిని మాత్రం ఆకట్టుకుంటుంది. అయితే సినిమా అంతా సరదాగా వెళ్తూ ఉంటే.. మరీ నాసిరకంగా ఉంటుందేమో అనో.. లేక ముగింపు ఎలా ఇవ్వాలో తెలియక దర్శకుడు విషాదంతో సినిమాను ముగించేశాడు. (సాక్షి రివ్యూస్) ప్రేమకు ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను అర్థం చేసుకుని తను నిజంగా ప్రేమిస్తున్న అమ్మాయికి తన ప్రేమను చెప్పే సందర్భంలో ఆ పాత్రను ముగించి.. అసలు దర్శకుడు ప్రేక్షకులకు ఏం చెప్పదలుచుకున్నాడో అర్థం కాలేదు. ఇక సంగీతం కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తుంది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టు ఉన్నాయి. బండ కళ్యాణ్, ఇంటర్నెట్ డెస్క్. -
ప్రేమించడానికి అర్హతలేంటి?
రోషన్, అనూష జంటగా నాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘నువ్వెందుకు నచ్చావె శైలజ’. అనుపమ ఆర్ట్స్ పతాకంపై వి.రామకృష్ణ నిర్మిస్తోన్న ఈ సినిమా సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత సి.కల్యాణ్ క్లాప్ ఇవ్వగా, కొమర వెంకటేశ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కృష్ణమోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘ఇదొక యాంటీ లవ్ స్టోరీ. ఎలా ప్రేమించాలి.. ఎలా ప్రేమించకూడదన్న కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ప్రేమించాలంటే ఉండాల్సిన అర్హతలను ఇందులో చూపిస్తున్నాం. నాలుగు పాత్రల మధ్య ఇంట్రెస్టింగ్ కథనంతో ఈ సినిమా ఉంటుంది. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు. ‘‘మా తొలి సినిమానే ఇలాంటి మంచి కథతో చేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’ అన్నారు రోషన్, అనూష. ‘‘కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నా. మంచి టీమ్ కుదిరింది’’ అన్నారు నిర్మాత రామకృష్ణ. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సాయాజీ షిండే, ఆశిష్ విద్యార్థి, ధనరాజ్, కాదంబరి కిరణ్, సన, మణిచందన, మణి, సూరజ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం: సాయి కార్తీక్, కెమెరా: యం.జోషి. -
ప్లస్ వన్ ఏజ్‌లో...
‘‘యువతరం అనగానే అల్లరి చిల్లరగా తిరుగుతుంటారనే భావన ఉంటుంది. అయితే, సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అన్నది ఈ తరానికి బాగా తెలుసు. ఆ విషయాన్నే ఈ చిత్రంలో చూపిస్తున్నాం’’ అన్నారు అళహరి. రోషన్, ఆర్తి జంటగా ఆయన దర్శకత్వంలో విశ్వాస్.హెచ్ నిర్మించిన చిత్రం ‘ప్లస్ వన్’. జయసూర్య స్వరపరచిన ఈ చిత్రం పాటల సీడీని రేష్మీ ఠాకూర్ విడుదల చేసి, నిర్మాత ప్రతాని రామకృష్ణ గౌడ్‌కి ఇచ్చారు. ‘‘వినోదం, సందేశం ఉన్న కథ ఇది’’ అని దర్శకుడు అళహరి అన్నారు. ‘‘ప్లస్ ఒన్ ఏజ్‌లో యువత మనస్తత్వం ఎలా ఉంటుందని ఈ చిత్రంలో చూపించాం. ఈ నెల 30న విడుదల చేస్తున్నాం’’ అన్నారు విశ్వాస్. -
ప్రేమ లేని ప్రేమ కథ
రోషన్, ఆర్తి జంటగా తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘ప్లస్ వన్’. అళహరి దర్శకత్వంలో సచేతా డ్రీమ్ వర్క్స్ పతాకంపై విశ్వాస్.హెచ్ నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ– ‘‘ప్రేమలేని ప్రేమ కథ ఒక వైపు.. ప్రేమ ఉన్న ప్రేమ మరోవైపు. ఈ అంశాలను, స్వీట్ 16 వయసును దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేశాం. తెలియని పొరపాటు వల్ల జరిగిన తప్పుని ఒప్పుగా చేసుకునేందుకు ఓ జంట ఏం చేశారన్నదే కథ’’ అన్నారు. ‘‘నల్గొండలో షూట్ మొత్తం పూర్తి చేశాం’’ అని నిర్మాత చెప్పారు. తేజారెడ్డి, పూర్ణిమ, సరయు, ప్రతాని రామకృష్ణగౌడ్ తదితరులు నటించారు. -
స్నేహమేరా జీవితం
‘‘జీవితంలో డబ్బు ముఖ్యం కాదు. స్నేహం అంతకంటే విలువైంది’’ అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘మనీ ఈజ్ హని’. జె.వి. నాయుడు, రోషన్, ఎం.ఆర్, వెంకీ, అభిషేక్, రచనా స్మిత్, రష్మిజా, బాబు పోకల ముఖ్య పాత్రల్లో జనార్ధన్ శివలంకి దర్శకత్వంలో జాలె వాసుదేవనాయుడు నిర్మించారు. జి.వసంత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత సి.కల్యాణ్ విడుదల చేసి, మరో నిర్మాత రాజ్ కందుకూరికి అందించారు. ట్రైలర్‌ను కల్యాణ్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘మంచి కథ తయారు చేసుకున్న తర్వాత నిర్మాత కోసం వెతకడం మొదలుపెట్టా. ఆ టైమ్‌లో మా గురువు వాసుదేవనాయుడుగారు సినిమా చేస్తానని ముందుకొచ్చారు. నా తొమ్మిదేళ్ల కష్టమే ఈ చిత్రం. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించాం’’ అన్నారు. సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
వాట్సాప్ ఐడియా !
ఇంటి వద్దకే పూల సరఫరా రైతు వినూత్న ఆలోచన బొమ్మనహళ్లి : రైతు తాను పండించిన పంటలకు తానే మార్కెట్‌ను సృష్టించుకోవడం వల్ల మంచి లాభా లను పొందవచ్చు అన్నదానికి నిదర్శనం ఈ యువ రైతు. తాను పండించిన బంతిపూలకు మార్కెట్లో సరైన లాభాలు లేక పోవడంతో నిస్సహాయ పడకుండ తన తెలివితో వాట్సాప్ ద్వారా ఆ పూలను అమ్ముతూ మంచి లాభాలను పొందుతున్నాడు రైతు రోషన్. ఇప్పటికే సరాసరి ఒక టన్ను బంతి పూలను కొనుగోలు చేసుకోవడానికి బుక్ చేసుకున్నారు. భాగలకోటకు చెందిన యువ రైతు రోషన్ వైజాపుర తన తెలివి తేటలతో బంతిపూలను వా ట్సాప్ ద్వారా పూలను అవసరమున్నవారికి ఇంటి వద్దకే రవాణా చేస్తున్నాడు. పూల తోటలో సాగు చేసిన పూలను వాట్సాప్ ద్వారా ఫొటోలు తీసి బు కింగ్ ఓపెన్ అని పెట్టి మెసేజ్ పంపిస్తున్నాడు. కేవలం గంట వ్యవధిలోనే 900 కిలోల బంతిపూల కొనుగోలుకు పలువురు ముందుకు వచ్చారు. వినియోగదారులు ఇచ్చిన చిరునామా ఆధారంగా పూలను సకాలంలో అందజేస్తూ వారిచేత శభాష్ అనిపించుకుంటున్నాడు. రోషన్ మాట్లాడుతూ... పండుగ రోజుల్లో కిలో బంతిపూలు రూ. 100పైనే ధర ఉంటుందని, కొన్ని రోజుల క్రితం కిలోకు రూ. 15లు పలికేదని, సాగుచేసినా లాభాలు వచ్చేవి కావని రోషన్ తెలిపాడు. వాట్సాప్ ద్వారా పూలను ఎటువంటి అనవసర వ్యయం లేకుండా ఆర్డర్ ఇచ్చిన వారి ఇంటికే వెళ్లి అందజేస్తున్నట్లు చెప్పాడు. వాట్సాప్ ఐడియా తనకు లాభాలను తెచ్చిపెడుతోందని రోషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. -
నయా... ఆగయా
ఇటీవల హీరోలుగా పరిచయమైన రోషన్, నిఖిల్‌కుమార్.. ఇద్దరిదీ పెద్ద బ్యాగ్రౌండే. మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ మనవడు, కర్ణాటక మాజీ సీయం హెచ్.డి. కుమారస్వామి తనయుడు నిఖిల్ ‘జాగ్వార్’ ద్వారా తెలుగు, కన్నడ భాషల్లో పరిచయమయ్యాడు. మొదటి సినిమా కాబట్టి అద్భుతంగా నటిస్తాడని ఆశించలేం. అయితే బాగా కసరత్తులు చేస్తే మంచి మాస్ హీరో అనిపించుకుంటాడని సినీ పండితుల విశ్లేషణ. తండ్రి శ్రీకాంత్‌కి జిరాక్స్ కాపీలా ఉన్నాడు రోషన్. మొదటి సినిమాతోనే ఆకట్టుకోగలిగాడు. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మతాబులు విరజిమ్మే కాంతులను చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. కొత్తగా తెరపైకొచ్చే కథానాయికలు కూడా మతాబుల్లాంటి వాళ్లే. ఈ ఏడాది ఇప్పటివరకూ డజను మంది కథానాయికలు పరిచయమయ్యారు. వీళ్లల్లో మలయాళ తారలు ఎక్కువగా ఉండటం విశేషం. థౌజండ్‌వాలా పేల్చినప్పుడు గుండె ఎలా అదురుతుందో ఈ అందగత్తెలను చూసి అబ్బాయిల గుండెలు అలానే అదిరాయి. మనసు మతాబులా విచ్చుకుంటే.. కళ్లు కాకరపువ్వొత్తులా కాంతులీనాయి. దీపావళి టపాసుల్లో చిచ్చుబుడ్డులకు స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రేజ్‌నే ఈ నాయికలు సంపాదించుకున్నారు. ‘నేను శైలజ’ ద్వారా పరిచయమైన కీర్తీ సురేశ్ మంచి కీర్తినే సంపాదించుకున్నారు. ‘అఆ’తో పరిచయమైన మలయాళ మతాబు అనుపమా పరమేశ్వరన్ ఇటీవల విడుదలైన ‘ప్రేమమ్’లోనూ భేష్ అనిపించుకున్నారు. ఇదే చిత్రం ద్వారా పరిచయమైన మరో మలయాళ టపాసు మడోన్నా సెబాస్టియన్ కూడా బూరెబుగ్గలతో భేషుగ్గానే కనిపించారు. ‘జెంటిల్మన్’లో నివేదా థామస్ అందచందాలు, అభినయం రెండూ పేలాయి. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ మెహరీన్ కొంచెం పుష్టిగా.. బాగా మందుతో కూరిన మతాబులా ఆకట్టుకుంది. ‘ఒక మనసు’ అంటూ మెగావారసులు నిహారిక కొణిదెల మంచి గుర్తింపు తెచ్చుకోగలిగారు. మలబార్ తీరం నుంచి వచ్చిన నాయికల్లో ‘మజ్ను’తో పరిచయమైన అనూ ఇమ్మాన్యుయేల్ కూడా భేష్ అనిపించుకున్నారు. మరో మలయాళీ బ్యూటీ నమితా ప్రమోద్ ‘నైస్’ అనిపించుకున్నారు. నిక్కీ గర్లానీ, లారిస్సా బొనేసి, సోనమ్ బజ్వా, అదితీ ఆర్య వంటి న్యూ హీరోయిన్స్ కూడా తమ టాలెంట్‌ని చూపించుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా పది నెలల్లో 12 మంది నాయికలు పరిచయం కావడం అంటే... మన తెలుగు పరిశ్రమ పరభాషలవాళ్లను ఏ రేంజ్లో ప్రోత్సహిస్తోందో ఊహించుకోవచ్చు. సంవతర్సం మొదటి రోజున విడుదలైన ‘నేను శైలజ’ రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలా పాజిటివ్ సైన్‌తో కొత్త సంవత్సరం మొదలైంది. ఆ తర్వాత ఫెస్టివల్ టైమ్‌లో రిలీజ్ కాకపోయినా విజయ విహారంతో పండగ చేసుకున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అవి ‘ఆఆ’, ‘జనతా గ్యారేజ్’, ‘శ్రీరస్తు శుభమసు’్త, డబ్బింగ్ మూవీ ‘బిచ్చగాడు’. ‘ఆఆ’ని దాదాపు రూ.35 కోట్లతో తీస్తే.. అంతా కలిపి రూ.50 కోట్లకు పైగానే దక్కించుకుంది. సుమారు రూ.60 కోట్ల ఖర్చుతో తీసిన ‘జనతా గ్యారేజ్’ అన్నీ కలుపుకుని దాదాపు రూ.80 కోట్లకు పైగా వసూలు చేసి, ఎన్టీఆర్ కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అల్లు శిరీష్ కెరీర్‌కి శుభమస్తు అయింది ‘శ్రీరస్తు శుభమస్తు’. ఇది కూడా ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ కిందే లెక్క. ఇక.. ‘బిచ్చగాడు’ అయితే సూపర్. ఈ చిత్రం తెలుగు అనువాద హక్కులు రూ.50 లక్షల రూపాయలు. అయితే.. రూ.20 కోట్లు వసూలు చేసి, రికార్డ్ సృష్టించింది. వరుస విజయాలతో దూసుకెళుతున్న నాని ఈ ఏడాది నాని కెరీర్ తారాజువ్వలా పైపైకి ఎగిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’, ‘జెంటిల్మన్’, ‘మజ్ను’... ఈ మూడు చిత్రాలూ మామూలు బడ్జెట్‌తో రూపొందినవే. కానీ, వసూళ్లు మాత్రం భారీగానే దక్కించుకున్నాయి. ముచ్చటగా మూడు విజయాలు అందుకుని, నాలుగో రిలీజ్‌కి రెడీ అవుతున్నాడు నాని. తన తాజా చిత్రం ‘నేనో రకం’ క్రిస్మస్కి రిలీజ్ కానుంది. -
'నిర్మలా కాన్వెంట్' మూవీ రివ్యూ
టైటిల్ : నిర్మలా కాన్వెంట్ జానర్ : రొమాంటిక్ డ్రామా తారాగణం : నాగార్జున, రోషన్, శ్రియా శర్మ, ఎల్బీ శ్రీరామ్ సంగీతం : రోషన్ సాలూరి దర్శకత్వం : జి. నాగ కోటేశ్వరరావు నిర్మాత : అన్నపూర్ణా స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ విలన్, హీరోగా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్న టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన సినిమా నిర్మలా కాన్వెంట్. ఇప్పటికే బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన శ్రియా శర్మ ఈ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఇమేజ్ను పక్కన పెట్టి స్పెషల్ క్యారెక్టర్లకు కూడా రెడీ అయిన కింగ్ నాగార్జున అతిథి పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది..? ఈ సినిమాతో రోషన్ హీరోగా సెటిల్ అవుతాడా..? కథ : చదువు, పుస్తకాలు తప్ప మరో ప్రపంచం తెలియని తెలివైన కుర్రాడు శామ్యూల్ (రోషన్). నిర్మలా కాన్వెంట్లో చదువుకునే శామ్యూల్‌కు ఏ విషయాన్నైనా క్షుణ్ణంగా తెలుసుకోవటం అలవాటు. అదే కాన్వెంట్లో శామ్యూల్‌తో పాటు చదువుకుంటుంది శాంతి( శ్రియా శర్మ). కాన్వెంట్ అబ్బాయిలందరికీ శాంతి డ్రీమ్ గర్ల్. కానీ శాంతి మాత్రం శామ్యూల్ వెంట పడుతుంటుంది. శామ్యూల్ కూడా శాంతిని ఇష్టపడతాడు. అన్ని ప్రేమ కథలలాగానే వీరి కథకు కూడా పేదరికం అడ్డు వస్తుంది. దానికి తోడు పెద్ద వాళ్ల గొడవలు కూడా ఈ చిన్నారి ప్రేమికులను దూరం చేస్తాయి. శాంతిని ప్రేమించాడన్న కోపంతో వాళ్లనాన్న శామ్యూల్‌ను కొట్టి వాళ్ల పొలం లాగేసుకుంటాడు. నా అంతా ఆస్తి, పేరు సంపాదిస్తే.., నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తానని సవాల్ చేస్తాడు. దీంతో డబ్బు, పేరు సంపాదించటం కోసం హైదరాబాద్ శామ్యూల్ వస్తాడు. మరి శామ్యూల్ అనుకున్నట్టుగా డబ్బు, పేరు సంపాదించాడా..? ఈ ప్రేమికులకు నాగార్జునకు సంబందం ఏంటి.? అన్నదే మిగతా కథ. నటీనటులు : తొలిసారిగా వెండితెర మీద హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ ఆకట్టుకున్నాడు. ఎక్కడ ఇది రోషన్ తొలి సినిమా అన్న భావన కలగకుండా అద్భుతంగా నటించాడు. లుక్స్ పరంగా కూడా రోషన్‌కు మంచి మార్కులు పడ్డాయి. అందంతో అభినయంతో ఆకట్టుకున్నాడు. బాలనటిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉన్న శ్రియా శర్మ హీరోయిన్గా అలరించింది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంది. అతిథి పాత్రలో నటించిన నాగార్జున తనదైన నటనతో సినిమాకు హైప్ తీసుకువచ్చాడు. తన ఇమేజ్ను పక్కన పెట్టి గెస్ట్ అపియరెన్స్ ఇచ్చిన కింగ్, సినిమా స్థాయిని పెంచాడు. ఇతర పాత్రల్లో ఎల్బీ శ్రీరామ్, సూర్య, అనితా చౌదరి, ఆదిత్య మీనన్‌లు తమ పరిది మేరకు మెప్పించారు. సాంకేతిక నిపుణులు : స్టార్ వారసులను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా కోసం రొటీన్ ప్రేమ కథను ఎంచుకున్న దర్శకుడు జి. నాగ కోటేశ్వరరావు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. సినిమా మీద భారీ హైప్ ఏర్పడినా ఆ స్థాయికి తగ్గ కథా కథనాలను అందించటంలో తడబడ్డాడు. ముఖ్యంగా హీరో క్యారెక్టర్‌ను తెలివైన కుర్రాడిగా చూపించే సన్నివేశాలు కొన్ని సిల్లీగా అనిపిస్తాయి. కాన్వెంట్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమాలో యూత్‌ను ఆకట్టుకునే స్థాయిలో కామెడీ లేకపోవటం కూడా నిరాశపరిచింది. ద్వితీయార్థంలో ఎంట్రీ ఇచ్చిన నాగ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. రోషన్ సాలూరి సంగీతం బాగుంది, కొత్త కొత్త భాష పాట విజువల్‌గా కూడా అలరిస్తుంది. అన్నపూర్ణ స్టూడియోస్, మ్యాట్రిక్స్ టీం వర్క్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : నాగార్జున రోషన్, శ్రియా శర్మ మైనస్ పాయింట్స్ : బలమైన కథ లేకపోవటం రొటీన్ టేకింగ్ ఓవరాల్‌గా నిర్మలా కాన్వెంట్, రొటీన్ ప్రేమకథే. -
ఇది మా స్నేహంలో కొత్త అడుగు
చిత్ర పరిశ్రమలో కొత్తవారిని ఎంకరేజ్ చేయడానికి ముందుంటారు నాగార్జున. పలు రంగాల్లో కొత్తవారిని ప్రోత్సహిస్తున్న పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్. ఇద్దరూ మంచి స్నేహితులు. వ్యాపారాల్లో భాగస్వాములు. వీరిద్దరూ కలసి నిర్మించిన సినిమా ‘నిర్మలా కాన్వెంట్’. ఈ 16న రిలీజ్ కానున్న ఈ చిత్రంలో హీరోగా శ్రీకాంత్ తనయుడు రోషన్, దర్శకుడిగా జి.నాగకోటేశ్వరరావు, సంగీత దర్శకుడిగా కోటి తనయుడు రోషన్ సాలూరి సహా పలువురు పరిచయమవుతున్నారు. నాగ్, నిమ్మగడ్డ ప్రసాద్ పంచుకున్న విశేషాలు... అమల మెచ్చుకుంది - నాగార్జున ఏడాది క్రితం కాన్సెప్ట్ ఫిల్మ్స్ వాళ్లు ఈ కథను నాకూ, ప్రసాద్‌గారికి వినిపించారు. ఎప్పట్నుంచో ప్రసాద్ గారికి సినిమా నిర్మాణం మీద ఆసక్తి. ‘నాగ్.. మనం కలసి ఓ సినిమా తీద్దాం’ అనేవారు. ఆయన వ్యాపారంలోకి నేను ఎంటరయ్యా. ఇప్పుడు నా వ్యాపారంలోకి ఆయన్ను తీసుకొచ్చాను. వినూత్న ఆలోచనలతో ఏదైనా చేయడమంటే ప్రసాద్‌గారికి ఇష్టం. నాకూ కొత్తదనం అంటే ఇష్టం. ఇద్దరి మనస్తత్వాలు బాగా కలిశాయి. ఆ విధంగా మా స్నేహంలో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమైంది. ప్రసాద్‌గారు బాగా సినిమాలు చూస్తారు. మాకు అందమైన కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. ప్రసాద్‌గారి దగ్గర డబ్బులకు సమస్య లేదు. నాతో కలవాల్సిన అవసరం లేదు. మాది డబ్బుతో ముడిపడిన బంధం కాదు. ఇద్దరం కలసి ఐడియాలు డిస్కస్ చేసుకోవడం, కలసి ప్రయాణించడం చక్కటి అనుభూతి. ఆడియో వేడుకలో హీరో రోషన్ మాట్లాడిన తీరు చూసి ముచ్చటేసింది. చిన్న వయసు లోనే అంత ఎమోషనల్‌గా, మెచ్యూర్డ్‌గా మాట్లాడడం మామూలు కాదు. శ్రీకాంత్, ఊహ కళ్లల్లో నీళ్లు తిరుగుతుంటే నా కళ్లలో నీళ్లు వచ్చేశాయి. సినిమాలో బాగా చేశాడు. ఇప్పటివరకూ ఆల్మోస్ట్ హీరోగానే చేశాను. ఈ సినిమాలో మాత్రం నేను హీరో కాదు. వెరీ ఇంపార్టెంట్ సపోర్టింగ్ రోల్ చేశా. (నవ్వుతూ..) ఈ ఏడాది బెస్ట్ సపోర్టింగ్ రోల్ అవార్డు వస్తుందని ఆశిస్తున్నాను. ఇతర సినిమాల్లో మంచి కథలు, పాత్రలు వస్తే తప్పకుండా సపోర్టింగ్ రోల్స్ చేస్తా. నేను పాడిన పాట సినిమాలో ఉండదు. ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ పాడిన పాట ఉంటుంది. ‘ఇంత బాగా పాడతావ్ అనుకోలేదు’ అని అమల మెచ్చుకుంది. నాకు ప్రేమకథలంటే ఇష్టం. నా సినిమాల్లో ఎక్కువ ప్రేమకథలే. ఏ మనిషైనా ఎప్పు డైనా ప్రేమ అనేది టచ్ చేయక పోతే అతను మనిషే కాదు. ఇది కూడా మంచి ప్రేమకథ. ఈ సినిమాలో కైలాష్ ఖేర్ ‘ముందు నుయ్యి’ అనే పాట పాడారు. కథ విన్నాక ‘పాతాళ భైరవి’లో లాంటి పాట ఉంటే బాగుంటుం దని ప్రసాద్‌గారే సలహా ఇచ్చారు. మరిన్ని సిన్మాలు తీస్తా - నిమ్మగడ్డ ప్రసాద్ నేనూ, నాగార్జున ముందు స్నేహితులం. ఆ తర్వాత వ్యాపారంలో భాగస్యాములయ్యాం. కొత్తవాళ్లతో సినిమా తీయాలని ఇద్దరికీ ఆసక్తి ఉంది. అక్కినేని కుటుంబం, అన్నపూర్ణ స్టూడియోస్‌తో నాకు వ్యక్తిగతంగా చాలా అటాచ్మెంట్. నాకు ఏయన్నార్‌గారితో మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ అటాచ్‌మెంట్‌తో నాగ్, నేనూ ఎప్పుడూ సినిమా ప్రొడక్షన్ గురించి అనుకునేవాళ్లం. నిర్మాతగా మారడానికి అంతకు మించి ప్రత్యేక కారణాలేమీ లేవు. నాగ్ చెప్పినట్లు మా స్నేహంలో కొత్త ప్రయాణం ఇది. ఎవరో మనకు తెలియని హీరోలను మనం చూడాల్సిన అవసరం లేదు. స్నేహితుల్లో, సమాజంలోనో ఎక్కడో మన ముందే హీరోలు ఉంటారు. మ్యాట్రిక్స్ కంపెనీ టేకోవర్ చేసినప్పుడు ఓ ‘ఆర్ అండ్ డీ’ సీనియర్ని ఇంటర్వ్యూ చేశాను. ఐదేళ్ల జీతం డిపాజిట్ చేయమని అడిగాడు. అంత డబ్బులుంటే ఎందుకు సిక్ కంపెనీ కొంటాను. ‘యంగ్‌స్టర్స్‌కి ఎందుకు చాన్స్ ఇవ్వకూడదు’ అని ఆ రోజు అనిపించింది. హెచ్ఆర్ని పిలిచి ఈ వయసులో సైంటిస్ట్‌లు కావాలని చెప్పా. ఓ బిలియన్కి మ్యాట్రిక్స్ అమ్మినప్పుడు ఎంప్లాయిస్ ఏవరేజ్ ఏజ్ 28 ఏళ్లు మాత్రమే. యంగ్‌స్టర్స్‌కి చాన్స్ ఇవ్వడం మొదట్నుంచీ ఉంది. సింగర్‌గా నాగ్ సహా 10 మంది కొత్తవాళ్లు దీంతో పరిచయమవు తున్నారు. ఇది స్వచ్ఛమైన ప్రేమకథ. నాకు సంగీతమంటే ప్రాణం. ఈ పాటలు నా మనసుకు హత్తుకున్నాయి. నాగార్జున ఇంత బాగా పాడతారని అనుకోలేదు. రాజీవ్ కనకాల, సుమల కుమారుడు రోషన్ కూడా ఈ సినిమాతో పరిచయం అవుతున్నాడు. హీరో రోషన్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడిన తీరు న్యాచురల్‌గా అనిపించింది. మా అబ్బాయి మాట్లాడుతున్నట్టు అనిపించింది. చిన్నప్పుడు ఓ మొక్క నాటేటప్పుడు.. ‘నేను మరణించినా చెట్టు నీడలో చాలామంది బతుకుతారు’ అని తాతయ్య చెప్పారు. ఫిల్మ్ ఇండస్ట్రీ మీద హైదరాబాద్‌లో 3 లక్షల మంది బతుకుతున్నారు. కొత్తవాళ్లకి ఛాన్స్‌లిస్తే ఎంతోమంది పైకి వస్తారు. ఫ్యూచర్లో తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను. -
ఫోటోగ్రాఫర్ల వేటలో హృతిక్ రోషన్!
వృత్తి పరంగా ఎప్పుడూ కెమెరా ముందే ఉండే నటీ నటులు... మిగిలిన జీవితంలో దానికి దూరంగా ఉండాలని చూస్తారు. కానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించడం ఇప్పడు సినీరంగంలోని వారికే కాక, అభిమానులకూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. తన నిత్య జీవితంలో ఎప్పుడూ తన వెన్నంటి ఉండేలా కొంతమంది ఫొటోగ్రాఫర్లను ఆయన హైర్ చేసుకోవాలనుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకూ హృతిక్ అలాంటి భిన్నమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారో ఓసారి చూద్దాం. హాలీవుడ్ హీరోలకు ఏమాత్రం తీసిపోని శరీరాకృతితో... బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలకు మారుపేరుగా నిలిచిన హృతిక్ రోషన్.. ఇప్పుడు కొందరు ఫొటోగ్రాఫర్లను తనకోసం నియమించుకుంటున్నారట. ఇకపై తనజీవితంలోని ప్రతి అడుగునూ కెమెరాలో వీడియోలు, ఫొటోల రూపంలో పదిలపరచాలనుకుంటున్నాడట.అందుకోసం ప్రత్యేకంగా కొంతమంది ఫొటో గ్రాఫర్లను నియమించుకొని, షూటింగ్ లతోపాటు, ఇతర సందర్భాల్లోనూ తనతోపాటే ఉండేలా ఏర్పాటు చేసుకుంటున్నాడు. అయితే ఇలా తన డైలీ లైఫ్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలను కేవలం భద్రపరచుకోడానికే తీయించుకోబోతున్నాడా? లేదంటే ఏదైనా ఓ డాక్యుమెంటరీ తీయాలనుకుంటున్నాడా అన్నది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు అశుతోష్ గోవార్కిర్ కాంబినేషన్ లో క్రీస్తు పూర్వం నాటి కథా నేపథ్యం కలిగిన చిత్రం.. మొహెంజోదారో విడుదల కోసం వేచి చూస్తున్న హృతిక్... ఇప్పుడు ఈ ఫుటేజ్ సేకరించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నాడన్నది మాత్రం అందరికీ ప్రశ్నార్థకంగానే కనిపిస్తోంది. -
రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం ఎనేబన్నూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోషన్(70) రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రెహ్మాన్ కుమారుడు అదరగొట్టేశాడు
చెన్నై: తెలుగు సినిమాకోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ.ఆర్.రెహ్మాన్ కుమారుడు అమీన్ స్వరాన్నందించాడు. శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా పరిచయమవుతున్న 'నిర్మలా కాన్వెంట్' సినిమా కోసం తొలిసారి తెలుగు గీతాన్ని ఆలపించాడు. ఈ పాట చాలా అద్భుతంగా వచ్చిందని చిత్ర యూనిట్ తెలిపింది. 'రోషన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం కోసం అమీన్ చాలా బాగా పాడాడు. రికార్డింగ్ చాలా అద్బుతంగా వచ్చింది. మా చిత్ర యూనిట్ అంతా ఇందుకు సంతోషంగా ఉన్నాం' అని చిత్ర వర్గాలు తెలిపాయి. గత సంవత్సరం మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ కాదల్ కన్మణి(తెలుగులో ఓకే బంగారం) అనే తమిళ చిత్రం కోసం తొలిసారి అమీన్ పాడటం ప్రారంభించాడు. నిర్మలా కాన్వెంట్ సినిమాకు సినీ నటుడు నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మాతలుగా ఉన్నారు. దూకుడు తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున కూడా ఈ చిత్రంలో ఓ ప్రత్యేక పాత్ర చేయనున్నారు. -
నిర్మలా కాన్వెంట్లో శ్రీకాంత్ వాళ్ళబ్బాయి
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పరిచయమవుతున్న ‘నిర్మలా కాన్వెంట్’ చిత్రం సెలైంట్‌గా షూటింగ్ జరుపుకొంటోంది. హీరో నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం. జి. నాగకోటేశ్వరరావు దర్శకునిగా పరిచయమవుతున్నారు. ‘దూకుడు’ తదితర చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రేయాశర్మ ఇందులో నాయిక. నాగార్జున ఇందులో ప్రత్యేక పాత్ర చేయనున్నారు. ఫిబ్రవరిలో ఆయన వెర్షన్ షూటింగ్‌తో సినిమా పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, కెమెరా: ఎస్.వి విశ్వేశ్వర్. -
నిర్మల కాన్వెంట్లో ఏం జరిగింది?
-
హీరోగా మరో వారసుడి ఎంట్రీ
తెలుగు చిత్ర పరిశ్రమకు మరో నట వారసుడు పరిచయం కాబోతున్నాడు. ఎంతమంది వచ్చినా మరొకరికి అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌కు మరో హీరో కొడుకు ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. చిన్న చిన్న క్యారెక్టర్స్‌తో వెండితెరకు పరిచయమై తరువాత విలన్ గా అనంతరం హీరోగా మారిన నటుడు శ్రీకాంత్. ఫ్యామిలీ హీరోగా తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ చబ్బీ హీరో కొద్ది రోజులుగా హీరో క్యారెక్టర్స్‌తో పాటు సపోర్టింగ్ రోల్స్‌లోనూ అలరిస్తున్నాడు. స్టార్ హీరోల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్న శ్రీకాంత్... ప్రజెంట్ తన నట వారసుడు రోషన్‌ను పరిచయం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. త్వరలో అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కింగ్ నాగార్జున... స్వయంగా శ్రీకాంత్ తనయుడు హీరోగా ఓ సినిమాను నిర్మించనున్నాడు. ఇప్పటికే కథ కూడా ఓకె అయిన ఈ సినిమాకు 'నిర్మలా కాన్వెంట్' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు మరింత క్రేజ్ తీసుకురావటానికి నాగ్‌తో గెస్ట్ రోల్ చేయించడానికి ప్లాన్ చేస్తోంది చిత్ర యూనిట్. రిలీజ్ కు రెడీ అవుతున్న రుద్రమదేవి సినిమాలో చాళుక్య వీరభద్రుడిగా నటించిన రోషన్ త్వరలో సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే పలు సినిమా ఫంక్షన్లకు హాజరై రోషన్ ...ఎట్రాక్టివ్ లుక్‌తో పలువురిని ఆకర్షించాడు కూడా. హీరో కావటానికి అన్ని క్వాలిటీస్ ఉండటంతో రోషన్ ...కోసం పలువురు శ్రీకాంత్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. మరి శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇస్తున్న రోషన్ తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి. -
సివిల్స్‌లో తెలుగోడి సత్తా
-
ఎర్రకోటలో షాజహాన్ ‘కుమార్తెలు’
న్యూఢిల్లీ: ఈరోజు ఎర్రకోటను సందర్శించే వారికి మొఘల్ యువరాణులు జహాన్ ఆరా, రోషన్ ఆరాలను కలుసుకొనే అవకాశం లభించనుంది. సందర్శకులతో కనీసం ఒకగంట పాటు గడిపే మొఘల్ చక్రవర్తి షాజహాన్ కుమార్తెలు తరాలకు చెందిన వీరగాథలను మీతో పంచుకోనున్నారు. దివాన్-ఇ-ఖాస్‌లో ఆకస్మికంగా మీ మధ్యకు వచ్చి గంటసేపు సందర్శకులతో ఉంటారు. అయితే వీరు నిజంగా షాజహాన్ కుమార్తెలు కారు. నగర పౌరులకు చరిత్ర, వారసత్వ సంపదపై అవగాహనకల్పించేందుకు భారత పురావస్తు విభాగం (ఏఎస్ఐ) ఈ ఏర్పాట్లు చేసింది. ప్రపంచ వారసత్వ వారోత్సవాన్ని (నవంబర్ 19-25) పురస్కరించుకొని ఇద్దరు కళాకారులను ఏఎస్ఐ ఎంపిక చేసింది. మధ్యాహ్నం 2.30-3.30గంటల సమయంలో మొఘల్ కాలంనాటి దుస్తులను ధరించి వచ్చే ఈ కళాకారులు సందర్శకుల వద్దకు వచ్చి చరిత్రను వల్లెవేస్తారు. షాజహాన్ పెద్దకుమార్తె జహాన్ ఆరా బేగం సమాధి దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. సోదరుడు ఔరంగజేబును సింహాసనం ఎక్కించడంలో కీలకపాత్ర పోషించిన రోషన్ ఆరా బేగం షాజహాన్ రెండో కుమార్తె. వీరిద్దరి పాత్రలను కళాకారులు ఎర్రకోటలో శనివారం నాడు ప్రదర్శించనున్నారు. -
ఎస్ఐ వేధింపులు తాళలేక..
పోలీస్ స్టేషన్ ఎదుట యువకుల ఆత్మహత్యాయత్నం కడప అర్బన్ : కడప న గరంలోని టూటౌన్ ఎస్ఐ ఎస్ఐ రోషన్ వేధిస్తున్నాడంటూ ఇరువురు యువుకులు ఆదివారం మధ్యాహ్నం పోలీస్ స్టేషన్ ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వెంటనే పోలీసు సిబ్బంది వీరిని హుటాహుటిన రిమ్స్‌కు తరలించారు. రిమ్స్‌లో యువకులు చికిత్స పొందుతున్న సమయంలో వారి బంధువులు క్యాజువాలిటీ ముందు బైఠాయించారు. ఎస్ఐ రోషన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనపై యువకుల బంధువులు, స్నేహితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బెల్లంమండివీధిలో నివసిస్తున్న షేక్ జమీల్(28) ఏడురోడ్ల వద్ద సెల్‌ఫోన్ దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతని స్నేహితుడు నాగకుమార్(26) సాయిపేటలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. ఎన్నికల సమయంలో ఓ పార్టీకి మద్దతుగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. ఆ సమయంలో టూ టౌన్ ఎస్ఐ ఎస్కె రోషన్ రూ.30వేలు ఒకసారి, రూ.20వేలు మరోసారి తీసుకున్నాడు. అలాగే రూ.14వేలు ఎండీహెచ్ పెట్రోల్ బంకులో బిల్లు చెల్లించారు. తిరిగి ఇటీవల కొంతకాలంగా తనకు రూ.50వేలు నగదుతోపాటు ఐ ఫోన్ కావాలని వేధిస్తున్నాడు. దీంతో ఎస్ వేధింపులు తాళలేక జమీల్, అతని స్నేహితుడు నాగకుమార్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈనెల 12వ తేదీన రాత్రి సమయంలో రామకృష్ణ హైస్కూల్ వద్ద ఉండగా డయల్ 100 నుంచి తమకు ఫోన్ వచ్చిందని, అక్కడున్న వారంతా వచ్చి స్టేషన్లో హాజరుకావాలని ఎస్ఐ పదేపదే జమీల్‌ను, అతని స్నేహితుడు నాగకుమార్, మహేష్, వెంకటేష్‌లను వేధిస్తున్నాడు. ఎస్ఐ వేధింపులతోనే వీరిద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని బాధితుల బంధువులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. క్యాజువాలిటీ ఎదుట బైఠాయింపు : జమీల్, నాగకుమార్లను ఎస్ఐ రోషన్ వేధించడం వల్లనే వారు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని యువకుల స్నేహితులు రిమ్స్ క్యాజువాలిటీ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెంటనే ఎస్ఐని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అతనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రిమ్స్‌కు చేరుకున్న డీఎస్పీ, సీఐలు : సంఘటన జరిగిన వెంటనే జిల్లా ఎస్పీ డాక్టర్‌నవీన్ గులాఠీ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి, అర్బన్ సీఐ బి.శ్రీనివాసులు, రూరల్ సీఐ రాజగోపాల్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ మహబూబ్‌బాషా, తాలూకా ఎస్ఐ బాలమద్దిలేటిలు తమ సిబ్బందితో రిమ్స్‌కు చేరుకున్నారు. సంఘటనకు దారితీసిన కారణాలను యువకుల బంధువులను, స్నేహితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రిమ్స్ క్యాజువాలిటీ వద్ద బైఠాయించిన వారితో మాట్లాడుతూ ఎస్పీ ఆదేశాల మేరకు సంఘటనపై సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసులు ఏమన్నారంటే.. : ఈ సంఘటనపై అర్బన్ సీఐ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన యువకులు, మరికొంతమంది ఈనెల 12వ తేదీ రాత్రి రామకృష్ణ హైస్కూల్ వద్ద గొడవ పడేందుకు సిద్ధమవగా డయల్ 100కు ఫోన్ చేశారని, సంఘటన జరిగిన వెంటనే వారిని ఎస్ఐ స్టేషనకు పిలిపించి విచారించారని, ఆదివారం మధ్యాహ్నం పోలీస్‌స్టేషన్ ఎదుట ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు. సంఘటనపై సమగ్రంగా విచారిస్తామన్నారు. ఎస్ఐ రోషన్ వీఆర్‌కు : సంఘటన గురించి తెలుసుకున్న జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాఠీ టూటౌన్ ఎస్ఐ ఎస్కె రోషన్‌ను వీఆర్‌లో రిపోర్ట్ చేసుకోవాలని వెంటనే ఆదేశాలు జారీచేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ ఎస్కె రోషన్ వీఆర్‌లో రిపోర్ట్ చేసుకున్నారు.