
నిర్మల కాన్వెంట్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశాడు రోషన్. ఈ సినిమా తర్వాత ఇటీవలె పెళ్లి సందD సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరి రోణంకి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేకపోయినా రోషన్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. దీంతో తాజాగా ఈ యంగ్ హీరో తన పేరులోని స్పెల్లింగ్‌ను “Roshann” గా మార్చుకున్నాడు.
న్యూమరాలజీ ప్రకారం తన పేరుకు అదనంగా ‘n’ని జోడించాడు. మరి ఈ లాజిక్ రోషన్ కెరీర్‌కు ప్లస్ అవుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇంతకుముందు తమన్నా, సాయి ధరమ్ తేజ్ సహా పలువురు సెలబ్రిటీలు న్యూమరాలజీ ప్రకారం తమ పేరును మార్చుకొని అదృష్టాన్ని పరీక్షించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment