గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా జూపాడుబంగ్లా మండలం ఎనేబన్నూరు గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రోషన్(70) రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.