
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేయబోయిన కారు.. అదుపుతప్పి బావిలోకి పడిపోయింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట దగ్గర ఈ ప్రమాదం జరిగింది. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళుతున్న కారు వ్యవసాయ బావిలో పడటంతో అందులో ప్రయాణిస్తున్న నలుగురు మృత్యువాతపడ్డారు. బావిలో నీరు ఎక్కువ ఉండటంతో కారు మొత్తం మునిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు కారును బావిలోంచి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment