
సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు.
Actor Srikanth Visits Tirumala Temple With His Family: సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ ఉన్నారు. వీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ కుటుంబాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం బయటకు వచ్చిన శ్రీకాంత్, రోషన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎరుపురంగు లంగావోణీలో మేధ, సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాంత్, రోషన్, రోహన్ ఆకర్షించారు. కాగా తెలుగు చిత్రసీమకు మొదట విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ ఒకరు. 'పీపుల్స్ ఎన్‌కౌంటర్' సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ వన్ బై టు మూవీతో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 1997లో సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్
హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్..
నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు