Visits Tirumala
-
తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజ స్తంభాన్ని స్పృశించి.. ఆలయ ప్రవేశం చేశారు.దర్శన అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు జస్టిస్ చంద్రచూడ్‌కు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ కుటుంబం..
Actor Srikanth Visits Tirumala Temple With His Family: సినీ నటుడు, సీనియర్ హీరో శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం (జున్ 28) ఉదయం మెట్ల మార్గంలో కొండెక్కి మరీ స్వామివారిని దర్శనం చేసుకున్నారు. శ్రీకాంత్‌తోపాటు భార్య ఊహ, కుమారులు రోషన్, రోహన్, కుమార్తె మేధ ఉన్నారు. వీరు శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కొండపైకి వెళ్తూ అన్ని మెట్లకు పసుపు కుంకుమలతో పూజ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీకాంత్ కుటుంబాన్ని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందించారు. దర్శనాంతరం బయటకు వచ్చిన శ్రీకాంత్, రోషన్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఎరుపురంగు లంగావోణీలో మేధ, సాంప్రదాయ దుస్తుల్లో శ్రీకాంత్, రోషన్, రోహన్ ఆకర్షించారు. కాగా తెలుగు చిత్రసీమకు మొదట విలన్‌గా ఎంట్రీ ఇచ్చి తర్వాత హీరోగా మారిన వారిలో శ్రీకాంత్ ఒకరు. 'పీపుల్స్ ఎన్కౌంటర్' సినిమాతో నటుడిగా పరిచయమైన శ్రీకాంత్ వన్ బై టు మూవీతో హీరోగా మారాడు. తర్వాత వచ్చిన 'తాజ్ మహల్' చిత్రంతో హీరోగా పాపులారిటీ సంపాదించుకున్నాడు. 1997లో సహనటి ఊహని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చదవండి: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్ హార్ట్ సింబల్స్‌తో సమంత ట్వీట్.. నెట్టింట వీడియో వైరల్.. నటుడి ఆత్మహత్య.. డ్రగ్స్ కేసులో నిందితుడు -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కంగనా రనౌత్..
Kangana Ranaut Visits Tirumala Temple: బాలీవుడ్ బ్యూటీ, కాంట్రవర్సీ క్వీన్ కంగనా రనౌత్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. తాను నటించిన తాజా చిత్రం ధాకడ్ విడుదల కానున్న సందర్భంగా విజయం సాధించాలని మొక్కుకున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్ ఘయ్ దర్శకత్వం వహించిన 'ధాకడ్' మూవీలో కంగనా రనౌత్ ఏజెంట్ అగ్నిగా నటించింది. ఇదివరకు విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదిరిపోయే యాక్షన్స్ సీన్లలో కంగనా మెస్మరైజ్ చేసింది. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో 'ధాకడ్' తెరకెక్కింది. ఇందులో విలన్ రోల్లో అర్జున్ రాంపాల్ చేయగా మరో కీలక పాత్రలో దివ్యా దత్త నటించింది. మరీ ఏజెంట్ అగ్నిగా కంగనా రనౌత్ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలంటే మే 20 వరకు ఆగాల్సిందే. చదవండి: అక్షయ్, అజయ్‌పై కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్.. మహేశ్ బాబు అన్నదాంట్లో తప్పేముంది? సపోర్ట్‌గా నిలిచిన కంగనా View this post on Instagram A post shared by Kangana Dhaakad (@kanganaranaut) var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
తిరుమల శ్రీవారి సేవలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్
-
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే ఆర్కే రోజా..
సాక్షి, చిత్తూరు: తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని నగరి ఎమ్మెల్యే రోజా దర్శించుకున్నారు. బుధవారం(నవంబర్ 17)తన.. జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నట్లు ఆర్కే రోజా తెలిపారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు ఎమ్మెల్యే రోజాకు ప్రత్యేక ఆశీర్వాచనలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు ఎమ్మెల్యే రోజా తెలిపారు. -
తిరుమలలో అవినీతి రహిత పాలన: మోహన్‌బాబు
సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. (చదవండి: కొండవీడు కోటలో ‘బజార్ రౌడీ’) ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. (చదవండి: అమ్మ ఒడి లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికం) -
స్విమ్స్ వైద్యసేవలు భేష్: మంత్రి ఆళ్ల నాని
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారిని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్న అనంతరం మంత్రిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. తిరుమలలో అల్పాహారం అనంతరం ఆయన తిరుపతి కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైద్యులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. (రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోనిదే: కేంద్రం) దేశంలో ఎక్కడాలేని విధంగా మన రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుఅవుతున్నా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఆసుపత్రిలో కరోనా బాధితులకు అందుతున్న వైద్యసేవలపై సీఎం వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు తిరుపతి కోవిడ్ ఆసుపత్రిని పరిశీలించానని తెలిపారు. అన్ని వార్డుల్లో తిరిగి, బాధితులతో వ్యక్తిగతంగా మాట్లాడానని పేర్కొన్నారు. స్విమ్స్‌లో వైద్యసేవలు చాలా బాగున్నాయని, మంచి ఆహారం అందిస్తున్నారని రోగులు చెబుతున్నారని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. -
తిరుమలలో రాష్ట్రపతి కోవింద్
తిరుమల/రేణిగుంట(చిత్తూరు జిల్లా)/సాక్షి, అమరావతి: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం రాత్రి తిరుమల చేరుకున్నారు. సతీమణి సవితా కోవింద్‌తో కలసి తిరుమలలోని పద్మావతి అతిథిగృహానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ దంపతులు, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, ఎంపీ విజయసాయిరెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ప్రత్యేకాధికారి ధర్మారెడ్డి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. శనివారం రాత్రికి రాష్ట్రపతి తిరుమలలోనే బస చేశారు. ఆదివారం ఉదయం వరాహస్వామి దర్శనానంతరం శ్రీవేంకటేశ్వర స్వామివారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. రాష్ట్రపతికి ఇస్తికఫాల్ మర్యాదలతో శ్రీవారి దర్శనం కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అన్ని ఏర్పాట్లు చేసింది. శ్రీవారి దర్శనానంతరం రాష్ట్రపతి పద్మావతి అతిథిగృహానికి చేరుకుని అల్పాహారం స్వీకరించాక తిరుగు ప్రయాణమవుతారు. రేణిగుంటలో ఘన స్వాగతం.. : అంతకుముందు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి శనివారం సాయంత్రం 5.10 గంటలకు చేరుకున్న రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. ఎంపీలు విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బల్లి దుర్గాప్రసాద్, ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, నవాజ్‌బాష, జంగాలపల్లి శ్రీనివాసులు, ఆదిమూలం, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు, డీసీసీబీ చైర్మన్ సిద్దాగుంట సుధాకర్‌రెడ్డి, చిత్తూరు కలెక్టర్ నారాయణభరత్‌గుప్త, డీఐజీ కాంతిరాణ టాటా తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక వాహనశ్రేణిలో రోడ్డు మార్గాన తిరుచానూరుకు చేరుకున్న రాష్ట్రపతి దంపతులు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. తదుపరి తిరుపతిలోని కపిలేశ్వరస్వామిని దర్శించుకుని తిరుమలకు వెళ్లారు. శనివారం చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలుకుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో గవర్నర్ దంపతులు రేణిగుంట విమానాశ్రయం లాంజ్‌లో గవర్నర్ నరసింహన్‌తో ముచ్చటిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి. -
శ్రీవారిని దర్శించుకున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే
-
శ్రీవారి సేవలో 'శాతకర్ణి' చిత్ర బృందం