
సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. (చదవండి: కొండవీడు కోటలో ‘బజార్ రౌడీ’)
ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. (చదవండి: అమ్మ ఒడి లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికం)
Comments
Please login to add a commentAdd a comment