Mohan babu family
-
విష్ణు ఎలాంటి గొడవ చేయలేదు : నిర్మల మోహన్ బాబు
-
మౌనిక నుంచి ప్రాణహాని ? సాక్షి చేతిలో FIR కాపీ..
-
సామాన్య కుటుంబంలో జన్మించి.. అసామాన్యుడిగా నిలిచారు
మహానుభావుల విజయగాథలు ఎందరికో స్ఫూర్తి. ఓ సామాన్య వ్యక్తి నుంచి అసామాన్య శక్తిగా ఎదిగిన మహోన్నత వ్యక్తి. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నిత్య నూతన కళాకారుడు, కళామాతల్లి ముద్దుబిడ్డ ఆయన. నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్, విలన్, హీరో, క్యారెక్టర్ నటుడు, మంచు భక్తవత్సలం నాయుడు, పెదరాయుడు అన్ని ఆయనే. నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న డాక్టర్ మంచు మోహన్ బాబు జన్మదినం ఈ రోజే. చిత్తూరుజిల్లా మోదుగులపాలెం గ్రామంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించారు. ఆయన అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఆయన ప్రాథమిక విద్య యేర్పేడు, తిరుపతిలో సాగింది. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు మోహన్ బాబుకు చిన్నప్పటి నుంచి నాటకాలంటే ప్రత్యేక అభిమానం. అలా నాటకాలతో పాటు నటనపై ఆయనకు ఆసక్తి పెరిగింది. అలా సినిమాల్లో నటించాలనే కల ఎన్నో నిదురలేని రాత్రులని మిగిల్చేలా చేసింది. నటనపై ఆసక్తితో మద్రాసుకు ఆ తర్వాత తన కల నెరవేర్చుకోనేందుకు మద్రాసుకు వెళ్లారు. అక్కడ కొన్ని రోజులు వైఎంసీఏ కాలేజీలో ఫిజికల్ ట్రైనీగా పనిచేశారు. కానీ నటుడవ్వాలనే కోరిక పరుగులు పెట్టించింది. అవకాశాల కోసం ఎండా, వానా, ఆకలి, దప్పికలు లెక్క చేయకుండా అహర్నిశలు శ్రమించారు. అలా ఆయన దర్శకుడు లక్ష్మి దీపక్ దగ్గర పనిచేశారు. తొలి అవకాశమిచ్చిన దాసరి నారాయణరావు 1975లో దాసరి నారాయణరావు కొత్త నటీనటులతో నిర్మించ తలపెట్టిన 'స్వర్గం-నరకం' చిత్రం కోసం జరిగిన ఆడిషన్లో భక్తవత్సలం దాసరి దృష్టిని ఆకర్షించి నటునిగా తొలి ఆవకాశం సంపాదించారు. దాసరి నారాయణరావు.. భక్తవత్సలం నాయుడిని మోహన్ బాబుగా వెండి తెరకు పరిచయం చేశారు. 'స్వర్గం నరకం' చిత్రం ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన మోహన్‌బాబు 573 చిత్రాలకు పైగా నటించారు. ఆయన హీరోగా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాయి. వాటిలో అల్లుడుగారు , అసెంబ్లీ రౌడీ , రౌడీ గారి పెళ్లాం, మోహన్ బాబుని హీరోగా నిలబెట్టాయి. ఆ తరువాత వచ్చిన అల్లరి మొగుడు, బ్రహ్మ , మేజర్ చంద్రకాంత్, సినిమాలతో స్టార్ హీరోగా 'కలెక్షన్ కింగ్' అనే పేరు తెచ్చుకున్నాడు. ఆ తరువాత వచ్చిన 'పెదరాయుడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అంతే కాకుండా పెదరాయుడి సినిమా సాధించిన రికార్డులను ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా తాకలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇక శ్రీ రాములయ్య , అడవిలో అన్నతో మోహన్ బాబు లో మరో నటుడిని ప్రేక్షకులు చూశారు. వీటితో 216 చలన చిత్రాల్లో ప్రధాన పాత్రలో నటించాడు. శ్రీ విద్యానికేతన్ స్థాపన అలాగే 1983లో శ్రీ లక్ష్మిప్రసన్న పిక్చర్స్‌ను స్థాపించి నిర్మాతగా మారి 72కి పైగా చిత్రాలు నిర్మించారు. సక్సెస్ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు. సినీరంగానికే పరిమితం కాకుండా 1992లో విద్యారంగంలోకి ప్రవేశించి చిత్తూరు జిల్లాలోని రంగంపేటలో స్థాపించిన శ్రీ విద్యానికేతన్ ద్వారా పేద విద్యార్థులకు రాయితీ విద్యను అందిస్తున్నాడు. క్రమశిక్షణకు మారు పేరైన మోహన్ బాబు తన ఇంట్లో పిల్లలనే కాదు.. బడిలో పిల్లలను సైతం క్రమశిక్షణగా పెరిగేలా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. వరించిన పద్మశ్రీ కళారంగంలో, విద్యారంగంలో మోహన్‌బాబు చేసిన విశిష్ట సేవలను గుర్తించిన కేంద్రప్రభుత్వం 2007లో ఆయన్ని పద్మశ్రీతో సత్కరించింది. మోహన్ బాబు ప్రెస్, సాంస్కృతిక సంస్థలు, స్క్రీన్, ఫిలిం ఫేర్,, అనేక విభాగాల్లో అనేక పురస్కారాలు పొందాడు. ఆయనకు నటప్రపూర్ణ, డైలాగ్ కింగ్, కల్లెక్షన్ కింగ్ 'యాక్టర్ ఆఫ్ ది మిలీనియం' లాంటి పలు బిరుదులు పొందారు. వీటితో పాటు తెలుగు ఫిలింఫేర్ అవార్డ్స్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డ్ ఇచ్చింది. ఇవే కాకుండా 'నటవాచస్పతి' 2015లో 'స్వర్ణకనకం', 2016లో నవరస నటరత్నం అవార్డులు పొందారు. 1995లో యన్టీఆర్ సహకారంతో 2001వరకు రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. మోహన్ బాబు బాటలో పిల్లలు ఆయన మాత్రమే కాదు ఆయన పిల్లలైన మంచు విష్ణు , లక్ష్మీప్రసన్న, మనోజ్ సైతం క్రమశిక్షణగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకుల ప్రేమను పొందుతున్నారు. పెద్ద కుమారుడు విష్ణు సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం పలు సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకవైపు సినిమాలు.. మరో వైపు విద్యాసంస్థల బాధ్యతలు చూసుకుంటూ మా అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా గెలిచి సినిమా ఆర్టిస్టులకు తన వంతు సేవ చేస్తున్నారు. ఇక మంచు లక్ష్మి సైతం తండ్రి మోహన్ బాబు బాటలోనే నడుస్తోంది. సినిమాలు మాత్రమే కాదు సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారామె. గతేడాది యాదగిరిగుట్ట పరిధిలోని కొన్ని ప్రభుత్వ పాఠశాలలను కూడా దత్తత తీసుకొని తండ్రి పెంపకం అంటే నిరూపించారు. అలాగే సినిమాల్లో రాణిస్తూనే.. సమాజంలో అడబిడ్డలపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వారి కుటుంబం తరుపున నిలబడి న్యాయం కోసం నిలబడే మరో డైనమిక్ మంచు మనోజ్. ఇలా మంచు మోహన్ బాబు ఆయనే కాకుండా కుటుంబం అంత సమాజ స్పృహ ఉన్నవారే కావడం గొప్పవిషయం. కళను, కళాకారులను అమితంగా అభిమానించే మోహాన్ బాబు సొంత బ్యానర్లో సినిమాలు నిర్మించడంతో పాటు ఆయనే హీరోగా, ప్రధాన పాత్రలు చేస్తూ పలు సినిమాల్లో నటిస్తున్నారు. వెండితెరపై అదే ఉత్సాహంతో ఇలాగే మరిన్ని చిత్రాల్లో నటిస్తూ మనల్ని ఎప్పుడు అలరించాలని కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. -
నా ఇల్లు కూడా అమ్ముకున్నా.. కానీ: మోహన్ బాబు
వెండితెరపై విలక్షణ నటుడు ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు మోహన్ బాబు. 1970లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. దాసరి నారాయణరావు తెరకెక్కించిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. తన నటనతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్ గా, నిర్మాతగా, విద్యావేత్తగా, రాజకీయ నాయకుడిగా మెప్పించిన ఏకైక నటుడు ఆయనే. తన దశాబ్దాల సినీ ప్రస్థానంలో మోహన్ బాబు స్వయంకృషితోనే ఎదిగారు. ఎక్కడో రాయలసీమలోని ఒక మారుమూల గ్రామం నుంచి ఇండస్ట్రీకి వచ్చిన తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌తో ‘మేజర్ చంద్రకాంత్’ మూవీ మోహన్ బాబు కెరీర్లోనే ఎవర్ గ్రీన్. ఆ తర్వాత పెదరాయుడు, శ్రీరాములయ్య, అడవిలో అన్న లాంటి సినిమాలు మోహన్ బాబు స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఆ తర్వాత శ్రీవిద్యానికేతన్ సంస్థల అధినేతగా మోహన్ బాబు విద్యారంగంలోనూ సక్సెస్ అయ్యారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాళెంలో 1952 మార్చి 19న మోహన్ బాబు జన్మించాడు. ఆదివారం ఆయన 71 వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు మోహన్ బాబు హాజరయ్యారు. తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేసేందుకు ఏ ఒక్కరూ కూడా ముందుకు రాలేదని మోహన్ బాబు తెలిపారు. ఇంటర్వ్యూలో మోహన్ బాబు మాట్లాడుతూ..' పగవాడికి కూడా నాలా కష్టాలు రాకూడదు. సినీ కెరీర్లో ఎదురైన ఇబ్బందుల వల్ల నా ఇల్లు కూడా అమ్ముకున్నా. కానీ ఏ ఒక్కరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదు. సన్నాఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు ఫెయిల్యూర్‌గా నిలిచాయి..' అని అన్నారు. -
మనోజ్‌ను దూరం పెట్టారా? విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ
మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారామె. ఈమధ్య మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, మనోజ్‌ను కుటుంబం దూరం పెట్టిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తనపై వచ్చే ట్రోల్స్, కుటుంబంలో విభేదాలపై స్పందించింది. 'ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని ఏ పనీపాటా లేకుండా కామెంట్స్ చేసేవాళ్లని నేను పట్టించుకోను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే.. అవన్నీ మా పర్సనల్. మా ఇంట్లో ఏం జరుగుతుందన్నది మా కుటుంబ విషయం. సమయం వచ్చినప్పుడు మేమంతా కలిసే కనిపిస్తాం. నేనూ, మనోజ్ ఎక్కువగా కలుస్తుంటాం. విష్ణు మా ఇద్దరి కంటే భిన్నమైన వ్యక్తి. తన పిల్లలు, బిజినెస్, వర్క్‌పైనే ఎక్కువ ఫోకస్ పెడ్తాడు. అన్నీ సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
గౌతమ్ రెడ్డిని చూసి కన్నీరు మున్నీరు అయిన మంచు ఫ్యామిలీ
-
తిరుమలలో అవినీతి రహిత పాలన: మోహన్‌బాబు
సాక్షి, తిరుమల: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం విఐపీ విరామ సమయంలో కుమార్తె మంచు లక్ష్మీతో కలిసి స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. (చదవండి: కొండవీడు కోటలో ‘బజార్ రౌడీ’) ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ... తిరుమలలో అవినీతి రహిత పాలన జరుగుతుందని, అవినీతికి తావులేకుండా అందరికీ ఒకే విధంగా దర్శనభాగ్యం కల్పించడం సంతోషకరమన్నారు. భోగి మంటల్లో కరోనా భస్మం అయిపోయిందన్నారు. మంచు లక్ష్మీ మాట్లాడుతూ... నూతన సంవత్సరంలో శ్రీవారిని రెండు సార్లు దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. (చదవండి: అమ్మ ఒడి లబ్ధిదారుల్లో బీసీలే అత్యధికం) -
చంద్రబాబుని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ
హైదరాబాద్: తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడిని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆహ్వానించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసానికి మోహన్ బాబు ఆయన ఫ్యామిలీ చేరుకున్నారు. వారిని చంద్రబాబు దంపతులు సాధరంగా ఇంట్లోకి తీసుకువెళ్లారు. అనంతరం మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని చంద్రబాబు కుటుంబసభ్యులను మోహన్‌బాబు ఫ్యామిలీ ఆహ్వానించింది. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ ముహూర్తం మే 20 వ తేదీగా పెద్దలు నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం హైదరాబాద్‌లో జరగనుంది. ప్రణతి రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకున్నారు. ఆ విషయం తెలిసిన ఇరు కుటుంబాల పెద్దలు వారి ప్రేమను అంగీకరించారు. -
మోదీని కలిసిన మోహన్ బాబు ఫ్యామిలీ
-
మోదీని కలిసిన మోహన్‌బాబు ఫ్యామిలీ
న్యూఢిల్లీ: తన ద్వితీయ కుమారుడు మంచు మనోజ్ వివాహానికి హాజరుకావాలని భారత ప్రధాని నరేంద్ర మోదీని టాలీవుడ్ ప్రముఖ నటుడు మోహన్‌బాబు ఆహ్వానించారు. మంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నివాసంలో మోదీని కలిసి మోహన్‌బాబు పెండ్లి శుభలేఖను అందజేశారు. మోహన్‌బాబు వెంట ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. మంచు మనోజ్, ప్రణతి రెడ్డిల నిశ్చితార్థం మార్చి 4, ఉదయం 10.30 గంటలకు జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహ ముహూర్తం మే 20 వ తేదీగా పెద్దలు నిర్ణయించారు. మే 20వ తేదీ ఉదయం 9.10 గంటలకు వీరి వివాహం జరగనుంది. ప్రణతి రెడ్డి, మనోజ్ గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిరువురి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్‌బాబు ఆయన కుటుంబసభ్యులు మోదీని స్వయంగా కలసి తమ సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే.