Manchu Lakshmi Responds On Clashes With Manchu Manoj And Vishnu, Deets Inside - Sakshi
Sakshi News home page

Manchu Lakshmi : మంచు ఫ్యామిలీలో విభేదాలపై స్పందించిన మంచు లక్ష్మీ

Published Sat, Dec 24 2022 3:21 PM | Last Updated on Sat, Dec 24 2022 4:10 PM

Manchu Lakshmi Responds On Clashes With Manchu Manoj And Vishnu - Sakshi

మంచు మోహన్‌బాబు కూతురు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తుంటారామె. ఈమధ్య మంచు కుటుంబంలో విభేదాలు తలెత్తాయని, మనోజ్‌ను కుటుంబం దూరం పెట్టిందంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు లక్ష్మీ తనపై వచ్చే ట్రోల్స్‌, కుటుంబంలో విభేదాలపై  స్పందించింది.

'ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. నేను మాట్లాడే విధానంపై చాలామంది విమర్శలు చేస్తుంటారు. ఇంట్లో కూర్చొని ఏ పనీపాటా లేకుండా కామెంట్స్‌ చేసేవాళ్లని నేను పట్టించుకోను. ఇక నా ఫ్యామిలీ విషయానికి వస్తే.. అవన్నీ మా పర్సనల్‌. మా ఇంట్లో ఏం జరుగుతుందన్నది మా కుటుంబ విషయం.

సమయం వచ్చినప్పుడు మేమంతా కలిసే కనిపిస్తాం. నేనూ, మనోజ్‌ ఎక్కువగా కలుస్తుంటాం. విష్ణు మా ఇద్దరి కంటే భిన్నమైన వ్యక్తి. తన పిల్లలు, బిజినెస్‌, వర్క్‌పైనే ఎక్కువ ఫోకస్‌ పెడ్తాడు. అన్నీ సోషల్‌ మీడియాలో పెట్టాల్సిన అవసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement