సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
ముందుగా ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజ స్తంభాన్ని స్పృశించి.. ఆలయ ప్రవేశం చేశారు.
దర్శన అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు జస్టిస్ చంద్రచూడ్‌కు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment