Chandrachud
-
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
CJI DY చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు వీడ్కోలు
-
తిరుమల శ్రీవారి సేవలో సీజేఐ
సాక్షి, తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ దర్శించుకున్నారు. అదివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.ముందుగా ఆలయ మహా ద్వారం వద్దకు చేరుకున్న చీఫ్ జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ అధికారులు, అర్చకులు ఇస్తికాఫల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ధ్వజ స్తంభాన్ని స్పృశించి.. ఆలయ ప్రవేశం చేశారు.దర్శన అనంతరం ఆలయ విశిష్టతను జస్టిస్ చంద్రచూడ్‌కు ఆలయ ప్రధాన అర్చకులు వివరించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు జస్టిస్ చంద్రచూడ్‌కు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. -
‘నేను సీజేఐని.. రూ.500 పంపండి’ అంటూ స్కామర్ మెసేజ్!
సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడయా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తాజాగా, తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.సీజేఐ డీ.వై చంద్రచూడ్‌లా తనను తాను ఓ సైబర్ నేరస్తుడు పరిచయం చేసుకుంటూ.. క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగాడు. ఈ విషయం తమ దృష్టికి రావటంతో సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. తనపేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను చేసి.. సీజేఐ అవాక్కయ్యారు. సీజేఐ డీ.వై చంద్రచూడ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.‘‘హలో, నేను సీజేఐని కొలీజియం అత్యవసర సమావేశానికి వెళ్లాలి. నేను కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం మీరు నాకు రూ. 500 పంపగలరా? నేను కోర్టుకు చేరుకున్న తర్వాత వెంటనే డబ్బు తిరిగి ఇస్తాను’’ అని సైబర్ నేరగాడు సీజేఐ పేరుతో డబ్బులు అడిగాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
సెక్యూరిటీని పిలవండి.. అతడిని బయటికి పంపిస్తారు
న్యూఢిల్లీ: ‘నీట్’లో అవకతవకలపై మంగళవారంనాడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా అడ్డుపడిన న్యాయవాది మాథ్యూస్ నెడుంపరపై సీజేఐ డీవై చంద్రచూడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ వాది నరేంద్ర హుడా వాదన వినిపిస్తుండగా నెడుంపర అడ్డుపడ్డారు. తాను ‘అమికస్’నని, బెంచ్ అడిగిన ప్రశ్నకు జవాబిస్తానని చెప్పారు. దానిపై సీజేఐ తాను ఏ ఎమికస్‌ను నియమించలేదన్నారు. దాంతో నెడుంపర ‘‘మీరు నాకు గౌరవం ఇవ్వకుంటే... నేను వెళ్లిపోతా’ అన్నారు. అందుకు సీజేఐ ఆగ్రహంతో ‘మిస్టర్ నెడుంపర... మీరు కోర్టు హాల్లో ఉన్నారు. సెక్యూరిటీని పిలవండి... ఆయనను బయటకు పంపిస్తారు’ అని అన్నారు. దాంతో నెడుంపర తానే వెళ్లిపోతా నన్నారు. వెంటనే సీజేఐ ‘వెళ్లిపోతానని మీరు చెప్పకూడదు. 24 ఏళ్లుగా జ్యుడీషియరీని చూస్తున్నా. కోర్టులో ప్రొసీడింగ్స్‌ను లాయర్లు డిక్టేట్ చేయరు’ అని పేర్కొన్నారు. నెడుంపర కూడా.. ‘1979 నుంచి నేనూ జ్యుడీషియరీని చూస్తున్నా’ అనడంతో సీజేఐ తీవ్రంగా హెచ్చరించారు. దీంతో బయటకు వెళ్లిన నెడుంపర కాసేపటికే తిరిగొచ్చి ‘సారీ.. నేనెలాంటి తప్పూ చేయలేదు, అనుచితంగా ట్రీట్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నా’’ అని చెప్పారు. నెడుంపర కోర్టు విచారణకు అంతరాయం కలిగించిన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.‘నీట్’ రీ టెస్టుకు సుప్రీం నో⇒ పరీక్ష సమగ్రత దెబ్బతినలేదన్న అత్యున్నత న్యాయస్థానం⇒ వ్యవస్థాగత లీక్‌కు ఎలాంటి ఆధారాలు లేవు⇒ పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టీకరణ⇒ సహేతుక తీర్పు వెలువరిస్తామన్న సీజేఐకోర్టు నిర్ణయాల ద్వారా లేదా మెటీరియల్ ఆన్ రికార్డ్ ఆధారంగా నీట్ రద్దు చేయాలని ఆదేశించడం సమర్థ్ధనీయం కాదని భావిస్తున్నాం. ప్రస్తుత దశలో పరీక్ష సమగ్రతకు వ్యవస్థాగత ఉల్లంఘన ఉందని నిర్ధారణకు రావడానికి ఎలాంటి మెటీరియల్ రికార్డులో లేదు. పరీక్ష మళ్లీ నిర్వహించడం సాధ్యం కాదు. – సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సాక్షి, న్యూఢిల్లీ: నీట్–యూజీ 2024 రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రద్దు చేస్తే లక్షలాది మంది అభ్యర్థులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. పేపర్ లీక్ వాస్తవమని, అయితే.. వ్యవస్థాగత పేపర్ లీక్ జరిగిందనడానికి తగిన ఆధారాలు లేనందున పరీక్ష సమగ్రత దెబ్బతిన్నదనడానికి అవకాశాల్లేవని స్పష్టం చేసింది.రద్దుతో వైద్య కళాశాలల్లో ప్రవేశాల షెడ్యూల్‌కు అంతరాయం, వైద్యవిద్యపై ఊహించలేని ప్రభావం పడుతుందని, భవిష్యత్‌లో అర్హత కలిగిన వైద్య నిపుణుల లభ్యతపైనా ప్రభావం చూపుతుందని వెల్లడించింది. ఇది కొందరు అభ్యర్థులకు ప్రతికూలత అవుతుందని తెలిపింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ఎన్టీఏ తరఫున సీనియర్ న్యాయవాది కౌశిక్, పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు నరేందర్ హుడా, సంజయ్ హెగ్డే, మాథ్యూస్ నెడుంపర, ఇతర న్యాయవాదుల సుదీర్ఘ వాదనలు వినిపించారు.నీట్–యూజీ, 2024పై దాఖలైన వేర్వేరు పిటిషన్లను సుదీర్ఘంగా విచారించిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఆదేశాలు వెలువరించింది. సహేతుకమైన తీర్పు తర్వాత వెలువరిస్తామని తెలిపింది. పేపర్ లీక్ వ్యవస్థాగతంగా జరిగిందని, నిర్వహణ లోపాలు ఉన్నాయని పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న వాదనలను కోర్టు తోసిపుచ్చింది.సీబీఐకి దర్యాప్తు బదిలీ తర్వాత జూలై 10, జూలై 17, జూలై 21 తేదీల్లో ఆరు నివేదికలు దాఖలు చేసిందని, విచారణ కొనసాగుతోందని వెల్లడిస్తు న్నప్పటికీ హజారీబాగ్, పట్నాలోని కేంద్రాల నుంచి సేకరించిన 155 మంది విద్యార్థులు లీక్ లబ్ధిదారులుగా గుర్తించిందని తెలిపింది. సీబీఐ విచారణలో ఎక్కువ మంది కళంకిత అభ్యర్థులు, అవకతవకలకు పాల్పడినట్లు తేలితే సదరు విద్యార్థి కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, ఏ దశలోనైనా చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది.సదరు విద్యార్థులు ఎలాంటి క్లెయిమ్‌లు చేసుకోవడానికి అర్హులు కారని స్పష్టం చేసింది. అయితే, హజారీబాగ్, పట్నాల్లో లీక్ వాస్తమని పేర్కొంది. సీబీఐ నివేదిక ప్రకారం ఆ ప్రాంతాల్లో లీక్ లబ్ధిదారులైన అభ్యర్థులు 155 మంది మాత్రమే కాబట్టి, కళంకిత, కల్మషం లేని విద్యార్థులను గుర్తించొచ్చని స్పష్టం చేసింది. భౌతిక శాస్త్రానికి సంబంధించి ఓ అస్పష్ట ప్రశ్నకు ఐఐటీ, ఢిల్లీ నిపుణుల బృందం నివేదికను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.నిపుణుల సూచన మేరకు సదరు ప్రశ్నకు నాలుగు ఆప్షన్‌ను సమాధానంగా గుర్తించి తదనుగుణంగా ఫలితాలు లెక్కించాలని ఎన్టీఏను ఆదేశించింది. సమయం కోల్పోయిన, ప్రశ్నాపత్రం మార్పు, భాషా సమస్యల కారణంగా 1,563 మందికి పరీక్ష తిరిగి నిర్వహించాలన్న డివిజన్ బెంచ్ నిర్ణయాన్ని సమర్థించింది. సుప్రీంకోర్టులో పిటిషన్లను ఉపసంహరించుకొన్న తర్వాత వ్యక్తిగత ఫిర్యాదుల విషయంలో సంబంధింత హైకోర్టుకు వెళ్లడానికి అభ్యర్థులకు అనుమతించింది.నీట్ రద్దు చేయాలన్న పిటిషన్లు తోసిపుచ్చుతూ విచారణ ముగించింది. నీట్–యూజీ నిర్వహణ పటిష్టం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీపై తదుపరి ఆదేశాలుంటాయని తెలిపింది. -
తాళపత్రాల్లోని విజ్ఞానం భావితరాలకు అందాలి
తిరుపతి సిటీ/తిరుమల: తాళపత్ర గ్రంథాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్వీ వేదిక్ యూనివర్సిటీని బుధవారం ఆయన సందర్శించి తాళపత్ర గ్రంథాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేల సంవత్సరాల పూర్వం మహర్షులు, రుషులు, మేధావులు అపారమైన విజ్ఞానాన్ని, శాస్త్ర సాంకేతిక అంశాలను తాళపత్రాల్లో లిఖించారన్నారు. అటువంటి విజ్ఞానాన్ని సంరక్షించి, పరిశోధనలు చేసి భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. వేదిక్ వర్సిటీలో తాళపత్ర గ్రం«థాల సంరక్షణ, డిజిటలైజేషన్ చేయడం ప్రశంసనీయమన్నారు. పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల్లో చాలా విలువైన సమాచారం ఉందని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. పురాతన నాగరికతలో న్యాయశాస్త్ర విద్యాభ్యాసం, న్యాయవ్యవస్థల సమాచారం తాళపత్రాల్లో ఉండటం విశేషమన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న తాళపత్ర గ్రంథాలను సంరక్షించి, పరిశోధనలు, ప్రచురణలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో వేదిక్ వర్సిటీ నడవడం, తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు పెద్దపీట వేయడం శుభపరిణామమన్నారు. అనంతరం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో కలసి ఆయన వర్సిటీలోని వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ శాస్త్ర తాళపత్రగంథాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, ప్రచురణను పరిశీలించారు. అనంతరం వర్సిటీ, టీటీడీ అధికారులు సీజే దంపతులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులను ఘనంగా సన్మానించారు. శ్రీవారి సేవలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న సుప్రీం కోర్ట్, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తులకు టీటీడీ ఆలయ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అధికారులు శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలు, డైరీ, క్యాలెండర్ అందజేశారు. సీజేఐని కలిసిన టీటీడీ చైర్మన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తిరుమల పుష్పగిరి మఠంలో జరిగిన మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దుప్పల వెంకటరమణ కుమారుడు భాను ప్రకాష్ వివాహానికి టీటీడీ చైర్మన్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. -
‘అందరికీ న్యాయం’ మన లక్ష్యం
తిరుపతి సిటీ/తిరుమల: ‘జస్టిస్ ఫర్ ఆల్’ అనేది మన లక్ష్యమని.. అందుకు న్యాయమూర్తులు, న్యాయవాదులు, యువత కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. మంగళవారం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి విచ్చేసిన ఆయన శ్రీనివాస ఆడిటోరియంలో జరిగిన బీఏ ఎల్ఎల్బీ ఇంటిగ్రేటెడ్ కోర్సు పదో వార్షికోత్సవ సభలో విద్యార్థులను ఉద్దేంచి ప్రసంగించారు. ఎస్వీయూను 1982లో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో తన తండ్రి సందర్శించారని చంద్రచూడ్ గుర్తు చేసుకున్నారు. నాణ్యమైన విద్యకు ఈ యూనివర్సిటీ పెట్టింది పేరని, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్ఎల్బీ ద్వారా సమాజానికి అత్యున్నతమైన న్యాయవాదులను అందించడం శుభపరిణామమని అన్నారు. లా కోర్సును గతంలో రెండవ డిగ్రీగా చూసేవారని.. డాక్టర్, ఇంజనీరింగ్ కోర్సులకు ప్రాధాన్యత ఉండేదన్నారు. ప్రస్తుతం యువత న్యాయశాస్త్ర అభ్యసనానికి ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. న్యాయశాస్త్రం క్రమశిక్షణకు మారుపేరన్నారు. విద్యార్థులు విద్యతో పాటు ఆలోచనాశక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. న్యాయమూర్తులు ప్రజల సమస్యలను సావధానంగా పూర్తిస్థాయిలో వినడం నేర్చుకోవాలని.. తద్వారా కొత్త విషయాలను తెలుసుకోవడానికి వీలుంటుందన్నారు. తిరుమల చేరుకున్న సీజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మంగళవారం రాత్రి తిరుమల చేరుకున్నారు. వీరు రాత్రి తిరుమలలో బసచేసి బుధవారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. వీరికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. సోషల్ ఇంజనీర్లుగా న్యాయవాదులు సమాజంలో పెద్దఎత్తున మార్పు వచి్చందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో 50 శాతం పైగా మహిళలు ప్రస్తుతం న్యాయమూర్తులుగా, న్యాయవాదులుగా పనిచేయడం గర్వకారణమని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. సమాజంలో వైద్యులు, ఇంజనీర్ల తరహాలో న్యాయవాదులు సోషల్ ఇంజనీర్లుగా కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. దేశ భవిష్యత్ యువతపై ఆధారపడి ఉందని, ఉన్నత లక్ష్యాలతో విద్యను అభ్యసించి దేశసేవకు అంకితం కావాలని కోరారు. గురువుల మేధస్సు అసాధారణమైందని.. వారు అందించిన జ్ఞానంతోనే తాను చీఫ్ జస్టిస్ స్థాయికి ఎదిగానని చెప్పారు. ఈ సందర్భంగా ఆరుగురు న్యాయాధికారులను ఎస్వీయూ లా కాలేజీ గౌరవ ప్రొఫెసర్లుగా నియమించారు. అనంతరం ఆయనతోపాటు సీజే సతీమణి కల్పనాదాస్ చంద్రచూడ్‌ను వర్సిటీ అధికారులు జ్ఞాపికతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జి యు.దుర్గాప్రసాద్‌రావు, డిజిగ్నేటెడ్ సుప్రీంకోర్టు అడ్వకేట్ మహాలక్ష్మి పావని, వీసీ వి.శ్రీకాంత్‌రెడ్డి, రిజి్రస్టార్ ఒ.మహమ్మద్ హుస్సేన్, ప్రిన్సిపాల్ పద్మనాభం, డీన్ ఆచార్య ఆర్సీ కృష్ణయ్య, హైకోర్టు న్యాయవాదులు, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు హైకోర్టు నిర్మాణానికి భూమిపూజ
సాక్షి, హైదరాబాద్: రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై. చంద్రచూడ్ బుధవారం సాయంత్రం 5.30 గంటలకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధేతోపాటు హైకోర్టు ఇతర న్యాయమూర్తులు పాల్గొననున్నారు. గత డిసెంబర్లో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి, హైకోర్టు సీజేతో భేటీ సందర్భంగా హైకోర్టుకు నూతన భవన నిర్మాణ అంశం ప్రస్తావనకు వచ్చిన విష యం తెలిసిందే. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో నూతన భవనాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకతను ప్రధాన న్యాయమూర్తి, న్యాయవాదులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ముఖ్యమంత్రి సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్‌లో భవ నాన్ని నిర్మించి ఇస్తామని, త్వరలో శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులను అదే రోజు ఆదేశించారు. అలాగే హైకోర్టును ఇక్కడి నుంచి తరలించినా.. ఇప్పుడున్న భవనాన్ని హెరిటేజ్ బిల్డింగ్‌గా పరిరక్షించాల్సిన బాధ్యత తీసుకుంటామని రేవంత్ చెప్పా రు. ఆ భవనాన్ని ఆధునీకరించి సిటీ కోర్టుకు లేదా ఇతర కోర్టులకు వినియోగించుకునేలా చూస్తామని చెప్పిన విష యం విదితమే. ఆ తర్వాత మంత్రులు, న్యాయమూర్తులు భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. కోర్టు నిర్మాణానికి భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం గత జనవరిలో జీవో జారీ చేసింది. ఇదిలాఉండగా, బుధవారం శంకుస్థాపన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొంటుండటంతో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. -
న్యాయ కోవిదుడు నారీమన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ శామ్ నారీమన్ (95) మంగళవారం అర్ధరాత్రి మృతిచెందారు. న్యాయ నిపుణుడుగా పేరుగాంచిన నారీమన్ 1929లో పార్సీ దంపతులైన బైరాంజీ నారీమన్, బానో నారీమన్లకు మయన్మార్‌లో జని్మంచారు. బాంబేలో ప్రాథమిక విద్యాభ్యాసంతోపాటు ప్రభుత్వ న్యాయ కళాశాలలో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తి ప్రారంభించిన నారీమన్ 1971లో సుప్రీంకోర్టులో సీనియర్ హోదా పొందారు. 1972 మే నుంచి 1972 జూన్ 25 వరకూ సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ పనిచేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన పదవికి మరుసటి రోజే రాజీనామా చేశారు. పలు కీలక కేసులు వాదించిన నారీమన్‌ను కేంద్ర ప్రభుత్వం 2007లో పద్మభూషణ్‌తో సత్కరించింది. 1999లో రాజ్యసభ సభ్యుడిగా రాష్ట్రపతి నామినేట్ చేశారు. 1991లో బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా 1994లో ఇంటర్నేషల్ కౌన్సిల్ ఫర్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అధ్యక్షునిగా ఉన్నారు. 1998లో లండన్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్‌లో సభ్యుడయ్యారు. 1995 నుంచి 1997 వరకూ ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ కార్యనిర్వాహక కమిటీకి ౖచైర్మన్‌గా పనిచేశారు. ఫాలీ నారీమన్ కుమారుడు రోహింగ్టన్ నారీమన్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించారు. నిర్ణయమే శాసనం ఫాలీ నారీమన్ చివరి వరకూ తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారుగానీ లాయర్‌గా రాజీ పడలేదు. ఎమర్జెన్సీ సమయంలో కేంద్రాన్ని కాదని అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ)గా రాజీనామా చేసిన ఆయన నర్మద రిహాబిలిటేషన్ కేసులో గుజరాత్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిగా ఉంటూ క్రిస్టియన్లపై దాడులు నిరసిస్తూ ఆ కేసు నుంచి తప్పుకొన్నారు. తొలుత తాను మానవతావాదినని తర్వాతే న్యాయవాదిని అని ఆ సమయంలో అభిప్రాయపడ్డారు. ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని ఎదిరించినందకు నారీమన్‌కు ఇల్లు అద్దెకు ఇవ్వడానికి ఢిల్లీలో ఎవరూ ముందుకురాకపోవడంతో స్థిరమైన నివాసం కోసం ఎంతో కష్టపడ్డారు. ‘వెన్నెముక లేనితనం కంటే నిరాశ్రయమే మేలు’ అని నారీమన్ వ్యాఖ్యానించారు. డిసెంబరు 2009లో జస్టిస్ ప్రసాద్, జస్టిస్ దినకరన్‌ల నియామకాల సమయంలో హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యుల సమీక్ష, బహిరంగ చర్చ అనంతరమే న్యాయ నియామకాలకు సిఫార్సులు చేపట్టాలని భావిస్తున్నట్లు జ్యూడీíÙయల్ అకౌంటబిలిటీపై కమిటీ పేర్కొంది. ఈ ప్రకటనపై రాం జఠ్మలానీ, శాంతి భూషణ్, అనిల్ దివాన్, కామిని జైశ్వాల్, ప్రశాంత్ భూషణ్లతోపాటు నారీమన్ సంతకం చేశారు. కీలక కేసులు వాదన తన సుదీర్ఘ కెరియర్లో నారీమన్ అనేక కీలక కేసులు వాదించారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత కేసులో ఆమె బెయిలు పొందడంలో కీలకవాదనలు చేశారు (అనంతరం ఆ బెయిలు రద్దయింది). భోపాల్ గ్యాస్ ఘటనలో యూనియన్ కార్బైడ్ తరఫున వాదించిన నారీమన్ తన తప్పును తదనంతరం అంగీకరించడానికి వెనకాడలేదు. 47 కోట్ల డాలర్ల పరిహారం కోర్టు వెలుపల బాధితులకు అందించేలా సంస్థతో ఒప్పందం కుదర్చడంలో కీలకపాత్ర పోషించారు. ఏఓఆర్ అసోసియేషన్ కేసులో తన వాదనా పటిమ అనంతరమే ఉన్నత న్యాయవ్యవస్థలో న్యాయమూర్తుల నియామకం సుప్రీంకోర్టు చేపట్టడం ప్రారంభించింది. అయితే తదనంతరం తన ఆత్మకథ ‘బిఫోర్ మెమరీ ఫేడ్స్’లో మాత్రం న్యాయమూర్తుల నియామక విషయంలో ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులు క్లోజ్ సర్క్యూట్ కాకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తులందరినీ సంప్రదించాలని అభిప్రాయపడ్డారు. ‘‘ఫాలీ నారీమన్ అత్యుత్తుమ న్యాయవాదులు, మేధావుల్లో ఒకరు. సామాన్య పౌరులకు న్యాయం జరిగేలా తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన మృతి నన్నెంతో బాధించింది. నారీమన్ ఆత్మకు శాంతి కలగాలి’’ – ప్రధాని నరేంద్ర మోదీ ‘‘నారీమన్ మరణానికి సంతాపం తెలుపుతున్నా. చట్టంలో గొప్ప దిగ్గజమైన నారీమన్ మృతి చాలా విచారకరం’’ సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ -
సమన్యాయ సంకటం
ధర్మం, న్యాయం వేరు... చట్టం వేరు. కాలాన్ని బట్టి సమాజం దృష్టి మారినంత వేగంగా చట్టం మారడం కష్టం. ఒకవేళ మార్చాలన్నా ఆ పని పాలకులదే తప్ప, న్యాయస్థానాల పరిధిలోది కాదు. స్వలింగ వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపునిచ్చేందుకు నిరాకరిస్తూ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం వెలువరించిన తీర్పు ఆ సంగతే తేల్చింది. ‘‘ఈ కోర్టు చట్టం చేయలేదు. ప్రభుత్వం చేసిన చట్టాలను విశ్లేషించి, వ్యాఖ్యానించగలదు. అది అమలయ్యేలా చూడ గలదు’’ అని భారత ఛీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. స్వలింగ వివాహాలను అనుమతించాలంటే చట్టం చేయాల్సింది పార్లమెంటేననీ, అందుకు తగ్గట్టు ‘ప్రత్యేక వివాహ చట్టాన్ని’ (ఎస్ఎంఏ) సవరించే బాధ్యత పాలకులదేననీ అభిప్రాయపడింది. అయితే, ఎల్జీబీటీక్యూ సముదాయ సభ్యులకు కలసి జీవించే హక్కుందనీ, దాన్ని తమ తీర్పు తోసిపుచ్చడం లేదనీ స్పష్టతనిచ్చింది. స్వలింగుల పెళ్ళికి చట్టబద్ధత లభిస్తుందని గంపెడాశతో ఉన్న ఎల్జీబీటీక్యూ లకు ఇది అశనిపాతమే. హక్కులకై వారి పోరాటం మరింత సుదీర్ఘంగా సాగక తప్పదు. నిజానికి, స్వలింగ సంపర్కం నేరం కాదని 2018 జూలైలో సుప్రీమ్ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ఇక తదుపరిగా స్వలింగ జంటల వివాహాలకు చట్టబద్ధమైన గుర్తింపు లభిస్తుందని ఎల్జీబీటీక్యూ వర్గం భావించింది. అందుకు తగ్గట్లే ఆ గుర్తింపును కోరుతూ 21 పిటిషన్లు దాఖలయ్యాయి. పిల్లల్ని దత్తత చేసుకొనే హక్కు, పాఠశాలల్లో పిల్లల తల్లితండ్రులుగా పేర్ల నమోదుకు అవకాశం, బ్యాంకు ఖాతాలు తెరిచే వీలు, బీమా లబ్ధి లాంటివి కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ అంశంపై ఏప్రిల్‌లో పదిరోజులు ఏకబిగిన విచారణ జరిపి, మే 11న తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం మంగళవారం నాలుగు అంశాలపై వేర్వేరు తీర్పులిచ్చింది. స్వలింగ పెళ్ళిళ్ళ చట్టబద్ధత పార్లమెంట్ తేల్చాల్సిందేనంటూ ధర్మాసనం బంతిని కేంద్రం కోర్టులోకి వేసింది. పెళ్ళి చేసుకోవడాన్ని రాజ్యాంగం ఒక ప్రాథమిక హక్కుగా ఇవ్వలేదని ఏకగ్రీవంగా అభిప్రాయపడింది. అయితే, పిల్లల దత్తత సహా స్వలింగ సంపర్కుల ఇతర అంశాలపై అయిదుగురు జడ్జీల మధ్య భిన్నాభిప్రాయా లున్నాయి. దాంతో, ధర్మాసనం 3–2 తేడాతో మెజారిటీ తీర్పునిచ్చింది. వివాహ వ్యవస్థ, స్వలింగ సంపర్కాలపై ఎవరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, జర్మనీ, బ్రిటన్, జపాన్ సహా 34 దేశాలు సమ లైంగిక వివాహాలను చట్టబద్ధం చేశాయి. వచ్చే ఏడాది నుంచి 35వ దేశంగా ఎస్తోనియాలోనూ అది చట్ట బద్ధం కానుంది. ఇవి కాక మరో 35 దేశాలు స్వలింగ సంపర్కులకు పెళ్ళి మినహా అనేక అంశాల్లో చట్టపరమైన గుర్తింపునిచ్చాయి. అమెరికా అయితే సాధారణ వివాహ జంటలకిచ్చే ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ స్వలింగ జంటలకు సైతం 2015 నుంచి అందిస్తోంది. స్వలింగ సంపర్కం, లైంగిక తల విషయంలో ప్రపంచంలో మారుతున్న ఆలోచనా ధోరణులకు ఇది ప్రతీక. అందుకే, మన దగ్గరా ఇంత చర్చ జరిగింది. ఆ మాటకొస్తే, భిన్న లైంగికత అనేది అనాదిగా సమాజంలో ఉన్నదే. మన గ్రంథాల్లో ప్రస్తావించినదే. అందుకే, సాక్షాత్తూ సుప్రీమ్ ఛీఫ్ జస్టిస్ సైతం, ఇదేదో నగరాలకో, ఉన్నత వర్గాలకో పరిమితమైనదనే అపోహను విడనాడాలన్నారు. అందరి లానే వారికీ నాణ్యమైన జీవితాన్ని గడిపే హక్కుందని పేర్కొన్నారు. ఇది గమనంలోకి తీసుకోవాల్సిన అంశం. స్వలింగ జంటల వివాహాలకు పచ్చజెండా ఊపనప్పటికీ, భిన్నమైన లైంగికత గల ఈ సము దాయం దుర్విచక్షణ, ఎగతాళి, వేధింపుల పాలబడకుండా కాపాడాల్సిన అవసరం తప్పక ఉందని సుప్రీమ్ అభిప్రాయపడింది. అందుకు కేంద్రం, రాష్ట్రాలు తగు చర్యలు చేపట్టాలని కూడా కోర్టు ఆదేశాలిచ్చింది. మరోపక్క స్వలింగ సంబంధాల్లోని జంటలకున్న సమస్యలను పరిశీలించేందుకూ, వారికి దక్కాల్సిన హక్కులను చర్చించేందుకూ ఓ సంఘాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పెళ్ళికి చట్టబద్ధత దక్కలేదని నిరాశ కలిగినప్పటికీ, స్వలింగ జంటలకు ఒకింత ఊరటనిచ్చే విషయాలివి. అర్ధనారీశ్వర తత్వాన్ని అనాది నుంచి అర్థం చేసుకొంటూ వస్తున్న భారతీయ సమాజం భిన్న లైంగికతను ఘోరంగా, నేరంగా, నీచంగా చూడడం సరికాదు. ఆ సముదాయం సైతం మన లోని వారేనన్న భావన కలిగించాలి. దీనిపై ప్రజల్లో ప్రభుత్వం చైతన్యం పెంచాలి. శానస నిర్మాతలు లైంగికతలో అల్పసంఖ్యాక సముదాయమైన వీరికి అవసరమైన చట్టం చేయడంపై ఆలోచించాలి. భారతీయ సమాజంలో వైవాహిక, కుటుంబ వ్యవస్థలకు ప్రత్యేక స్థానమున్న మాట నిజం. అది అధిక సంఖ్యాకుల మనోభావాలు ముడిపడిన సున్నితమైన అంశమనేదీ కాదనలేం. స్వలింగ జంటల వివాహం, పిల్లల దత్తత, పెంపకం సంక్లిష్ట సమస్యలకు తెర తీస్తుందనే కేంద్ర ప్రభుత్వ భయమూ నిరాధారమని తోసిపుచ్చలేం. కానీ, ఈ పెళ్ళిళ్ళకు గుర్తింపు లేనందున పింఛన్, గ్రాట్యుటీ, వారసత్వ హక్కుల లాంటివి నిరాకరించడం ఎంత వరకు సబబు? మన దేశంలో 25 లక్షల మందే స్వలింగ సంపర్కులున్నారని ప్రభుత్వం లెక్క చెబుతోంది. కానీ, బురద జల్లుతారనే భయంతో బయటపడిన వారు అనేకులు గనక ఈ లెక్క ఎక్కువే అన్నది ఎల్జీబీటీక్యూ ఉద్యమకారుల మాట. సంఖ్య ఎంతైనప్పటికీ, దేశ పౌరులందరికీ సమాన హక్కులను రాజ్యాంగం ప్రసాదిస్తున్నప్పుడు, కేవలం లైంగికత కారణంగా కొందరిపై దుర్విచక్షణ చూపడం సరికాదు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి, కాలానుగుణంగా పాత చట్టాల్లో మార్పులు చేయాలి. అందరూ సమానమే కానీ, కొందరు మాత్రం తక్కువ సమానమంటే ఒప్పుతుందా? -
లంచం తీసుకున్న చట్టసభ సభ్యులకు విచారణ నుంచి మినహాయింపు ఉండదు
న్యూఢిల్లీ: చట్టసభ సభ్యుడు లంచం తీసుకొంటే తదుపరి విచారణ నుంచి అతడు ఎలాంటి మినహాయింపు, వెసులుబాటు పొందలేడని, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా చట్టం ప్రకారం నడుచుకోవాల్సిందేనని అటార్నీ జనరల్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినప్పటికీ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నప్పటికీ చట్ట ప్రకారం విచారించి, శిక్ష విధించాలని చెప్పారు. లంచం ఇచి్చనా, తీసుకున్నా అవినీతి నిరోధక చట్టం కింద విచారించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చట్టసభల్లో మాట్లాడడానికి, ఓటు వేయడానికి లంచం తీసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు విచారణ నుంచి వెసులుబాటు ఉంటుందంటూ 1998 నాటి జేఎంఎం ముడుపుల కేసులో నాడు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కొన్ని వర్గాల విజ్ఞప్తి మేరకు ఈ తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం పున:పరిశీలిస్తోంది. భాగస్వామ్యపక్షాల వాదనలు వింటోంది. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్ ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. పార్లమెంట్లో ముడుపులు తీసుకున్నట్లు ఒక్క సంఘటన బయటపడినా సరే విచారణ చేపట్టాలని తుషార్ మెహతా అన్నారు. లంచం స్వీకరించిన పార్లమెంట్ సభ్యుడికి రాజ్యాంగంలోని ఆరి్టకల్ 105, 194 కింద విచారణ నుంచి వెసులుబాటు కలి్పంచవద్దని కోర్టును కోరారు. పార్లమెంట్ సభ్యుడికి కలి్పంచిన వెసులుబాట్లు, ఇచి్చన మినహాయింపులు అతడి వ్యక్తిగత అవసరాల కోసం కాదని గుర్తుచేశారు. చట్టసభ సభ్యుడిగా బాధ్యతలను నిర్భయంగా నిర్వర్తించడానికే వాటిని ఉపయోగించుకోవాలని అన్నారు. ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. -
సీజేఐకి మీడియా సంస్థల లేఖ
ఢిల్లీ: న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ సంస్థ చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థను అరెస్టు కూడా చేశారు. అయితే.. ఈ వ్యవహారంపై మీడియా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే జర్నలిస్టులను విచారించేందుకు దర్యాప్తు సంస్థలకు ప్రత్యేక విధివిధానాలు ఉండాలని కోరుతూ 18 మీడియా సంస్థలు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. 'దేశంలో తమపై ప్రతీకార దాడులు జరుగుతాయని జర్నలిస్టులు భయంతో పనిచేస్తున్నారు. కొంతమంది జర్నలిస్టులు రాసే వార్తలను ప్రభుత్వం అంగీకరించడంలేదు. వీరిపై ప్రతికారంతో లక్షిత ప్రతీకార దాడులు జరుగుతాయనే భయభ్రాంతులకు గురిచేస్తోంది. చట్టం నుంచి జర్నలిస్టులకు మినహాయింపు ఇవ్వాలని కోరుకోవడం లేదు. కానీ పత్రికా స్వేచ్ఛను అడ్డుకుంటే ప్రజాస్వామ్య లక్ష్యాలు దెబ్బతింటాయి. ప్రభుత్వానికి సహకరించడానికి సిద్ధంగా ఉంటాం.' అని సీజేఐ చంద్రచూడ్‌కు మీడియా సంస్థలు లేఖ రాశాయి. న్యూస్‌క్లిక్ ఆన్లైన్ పోర్టల్ విదేశాల నుంచి నిధులను అక్రమంగా పొందిందనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఢిల్లీ పోలీసులు న్యూస్‌క్లిక్ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ల్యాప్‌ట్యాప్, మొబైల్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదీ చదవండి: ఢిల్లీ లిక్కర్ స్కాం: నిందితుల జాబితాలో ఆప్! -
కోర్టు తీర్పులపై బాబు, ఎల్లో బ్యాచ్ వక్రభాష్యాలు.. సమాధానం ఇదే..
సాక్షి, ఢిల్లీ: దేశంలో కోర్టులపై వస్తోన్న విమర్శల సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్‌లో కోర్టు తీర్పులపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూటిగా, స్పష్టంగా సమాధానాలిచ్చారు. దీంతో, కోర్టు తీర్పులపై అందరికీ క్లారిటీ ఇచ్చారు. ప్రశ్న: కోర్టుల స్వతంత్రత గురించి మీరేమంటారు?. సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిగా భారతీయ కోర్టులు ఎంత స్వతంత్రంగా పని చేస్తున్నాయి?. ఒక తీర్పు ఇచ్చే సమయంలో మీపై ఏమైనా ఒత్తిడులుంటాయా?. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్: ఒక జడ్జిగా నాకు 23ఏళ్లుగా అనుభవం ఉంది. అత్యంత సుదీర్ఘ సమయం జడ్జిలుగా ఉన్నవారిలో నేనొకరిని. ఈ విషయంలో నేను దేశానికి స్పష్టంగా ఒక విషయం చెబుతున్నాను. మాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. ఈ కేసులో ఇలా ఉండండి, ఇలా తీర్పు చెప్పండి అని ఏ ఒక్కరు మాపై ఒత్తిడి తీసుకురారు, తీసుకురాలేదు. ఈ విషయంలో జడ్జిలందరూ ఒక స్పష్టమైన సూత్రాన్ని నమ్ముతాం. కొన్ని కచ్చితమైన నియమ, నిబంధనలను పాటిస్తాం. - ప్రతీ రోజూ సుప్రీంకోర్టులో ఉదయాన్నే బెంచ్ మీదకు వెళ్లకముందు జడ్జిలందరూ కలిసి కాఫీ తాగుతాం. కానీ, ఏ ఒక్కరు ఇంకొకరి కేసు గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించబోం. - ఇక హైకోర్టులోనయితే ఈ సున్నితమైన పరిస్థితి మరింత ఎక్కువ. కొన్ని సార్లు సింగిల్ బెంచ్‌లో జడ్జి ఇచ్చిన తీర్పును అదే హైకోర్టులోని మరో ఇద్దరు జడ్జిలు సమీక్షించాల్సి ఉంటుంది. ఎన్నో సవాళ్లు ఎదురవుతుంటాయి. అయినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి విషయంలో మరొకరు జోక్యం చేసుకోరు. - ఎవరి కేసునయితే నేను సమీక్షించబోతున్నానో.. అదే జడ్జితో కలిసి భోజనం చేయవలిసిన పరిస్థితి ఉంటుంది. భోజనం షేర్ చేసుకుంటాం. అయితే కేసులను మాత్రం షేర్ చేసుకోం. అది మేం తీసుకున్న శిక్షణలో భాగం. అంతెందుకు మాపై ప్రభుత్వంలో ఉన్న ఏ వ్యవస్థ నుంచి ఒత్తిడి రాదు. ఇది నా ఒక్కరి గురించి చెప్పడం లేదు. మొత్తం దేశంలోని న్యాయవ్యవస్థ గురించి చెబుతున్నాను. - ఒత్తిడి ఉంటుంది. అదేలా అంటే.. అత్యుత్తమమైన న్యాయాన్ని అందించాలన్న ఒత్తిడి ఉంటుంది. మనసు మీద, ఆలోచన మీద ఒత్తిడి ఉంటుంది. మేం నేర్చుకున్న విషయం మీద, మా పరిజ్ఞానం మీద ఒత్తిడి ఉంటుంది. కచ్చితమైన పరిష్కారం కోసం అన్వేషిస్తున్నప్పుడు కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. - సుప్రీంకోర్టునే తీసుకోండి. దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం ముందుకు వచ్చే కేసుల్లో.. చాలా భిన్నమైన కోణాలుంటాయి. 1+1=2 అని చెప్పలేం. మేం ఇచ్చే తీర్పులు ఇవ్వాళ ఒక్క కేసు గురించి కాదు.. భవిష్యత్తులో న్యాయవ్యవస్థ ప్రమాణాల మీద ఆధారపడాలి. ఈ సమాజం భవిష్యత్తులో ఎలా ఉండాలన్నదానికి సుప్రీంకోర్టు తీర్పులు అద్దం పట్టాలి. తీర్పులు ఇచ్చే విషయంలో సమాజం ఎలా స్వీకరిస్తుందన్నదానిపై జడ్జిలకు ఆత్మసమీక్ష ఉండాలి. అది ఒత్తిడి అని చెప్పలేను. అది సత్యాన్వేషణ. అదే నిజమైన పరిష్కారం అని సమాధానమిచ్చారు. -
సుప్రీంకోర్టులో చంద్రబాబుకు చుక్కెదురు..
సాక్షి, ఢిల్లీ: స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు చుక్కెదురైంది. సుప్రీంకోర్టులో చంద్రబాబు లాయర్లు వేసిన పిటిషన్‌ను సీజేఐ ధర్మాసనం వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై వాదనలను మంగళవారానికి ధర్మాసనం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళవారం ఏదో ఒక బెంచ్ ఈ పిటిషన్‌పై విచారిస్తుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. వాడీ-వేడి వాదనలు.. కాగా, చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ సందర్భంగా ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. క్వాష్ పిటిషన్‌పై వెంటనే విచారణ చేపట్టాలని సీజేను కోరారు. ఈ సమయంలో క్వాష్ పిటిషన్‌ను అనుమతించవద్దని సీఐడీ లాయర్లు సీజేను కోరారు. ఈ కేసులో లోతైన విచారణ జరగాలని సీఐడీ తరఫున రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. చంద్రబాబు లాయర్ లాథ్రా వాదనలు వినిపిస్తూ కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టు విచారించకుండా అడ్డుకోవాలని కోరారు. ఈ సందర్బంగా సీజేఐ.. ఏసీబీ కోర్టు విచారణ, పోలీసు కస్టడీ విచారణను తాము అడ్డుకోలేమన్నారు. ఈ పిటిషన్‌పై ఏదో ఒక బెంచ్ మంగళవారం విచారిస్తుందని స్పష్టం చేశారు. అంతకుముందు.. చంద్రబాబు సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు.. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : మీకు ఏం కావాలి? సిద్ధార్థ్ లూథ్రా : చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరపాలి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబుకు రిలీఫ్ కావాలంటే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోండి సిద్ధార్థ్ లూథ్రా : FIRలో పేరు లేకుండా అరెస్ట్ చేశారు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : అక్టోబర్ 3న ఈ కేసును ఏదో ఒక బెంచ్ కు కేటాయిస్తాం సిద్ధార్థ్ లూథ్రా : 17A సెక్షన్ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోలేదు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : ACB కోర్టు విచారణ జరుపుతున్న ఇలాంటి కీలక సమయంలో మేం దర్యాప్తును అడ్డుకోలేం. సిద్ధార్థ్ లూథ్రా : కనీసం CIDకి కస్టడీ ఇవ్వకుండా ఆదేశాలివ్వండి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ : చంద్రబాబు నాయుడిని పోలీస్ కస్టడీ ఇవ్వొద్దన్న ఆదేశాలను ఈ సమయంలో ఇవ్వలేం. ఈ కేసును అక్టోబర్ 3, 2023, మంగళవారానికి వాయిదా వేస్తున్నాం సుప్రీంకోర్టులో CID వాదనలు ► ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున లాయర్ రంజిత్ కుమార్ వాదనలు ► స్కిల్ స్కాం కుట్ర, కుంభకోణం పరిధి చాలా పెద్దవి ► రూ.3300 కోట్ల ప్రాజెక్టు అని చెప్పుకొచ్చారు ► దీంట్లో 90% గ్రాంటు కింద సీమెన్స్ ఇస్తుందని చెప్పారు ► ప్రభుత్వం కేవలం 10% పెడితే చాలంటూ నిధులు విడుదల చేశారు ► ఇక్కడ కథ మలుపు తిరిగింది, 90% మాయమయింది ► ఈ 10% నిధులు మాత్రం ముందుకెళ్లిపోయాయి ► 17A చట్టం సవరణ కంటే ముందే నేరం జరిగింది ► ప్రస్తుత పరిస్థితుల్లో దర్యాప్తును సజావుగా సాగనివ్వాలి ► చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు విజ్ఞప్తి చేసిన లాయర్ రంజిత్ "నాట్ బిఫోర్ మీ" ఎందుకంటే.. చంద్రబాబు కేసు సుప్రీంకోర్టులో విచారణకు రాగానే.. న్యాయమూర్తి భట్టి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయలేదు. నాట్ బిఫోర్ మీ అంటూ నిరాసక్తత వ్యక్తం చేసారు. దీంతో, చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్ సాల్వే ఈ కేసును వెంటనే విచారణకు స్వీకరించాలని కోరారు. కానీ, మరో న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకొని తన సహచర న్యాయమూర్తి భట్టి సుముఖంగా లేకపోవటంతో ఈ కేసును మరో బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించారు. ► జస్టిస్ SVN భట్టి పూర్తి పేరు సరస వెంకట నారాయణ భట్టి ► 2013 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జడ్జిగా సేవలందించిన జస్టిస్ భట్టి ► 14 జులై 2023 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తోన్న జస్టిస్ భట్టి ► ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మ్యాటర్ కాబట్టి ఈ కేసు నుంచి దూరంగా ఉంటున్నానని ప్రకటించిన జస్టిస్ భట్టి ► జస్టిస్ భట్టి నిర్ణయాన్ని గౌరవించాలని సూచించిన జస్టిస్ ఖన్నా. చంద్రబాబు పిటిషన్ వాయిదా ► చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ వాయిదా ► పిటిషన్‌పై వాదనల కంటే ముందే ప్రకటన చేసిన జస్టిస్ ఖన్నా జస్టిస్ ఖన్నా : మా సహచరుడు జస్టిస్ SVN భట్టి ఈ కేసుకు దూరంగా ఉండాలనుకుంటున్నారు హరీష్ సాల్వే : వీలయినంత తొందరగా విచారణకు వచ్చేలా చూడగలరు జస్టిస్ ఖన్నా : వచ్చే వారం చూద్దాం సిద్ధార్థ లూథ్రా ఒక సారి చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్తాను జస్టిస్ ఖన్నా : మీరు కలవొచ్చు. ప్రస్తుతానికి ఈ కేసు వాయిదా వేస్తున్నాను హరీష్ సాల్వే : వాయిదా వేయడం ఒక్కటే మార్గం కాదు జస్టిస్ ఖన్నా : చీఫ్ జస్టిస్‌ను కలిసి మరో బెంచ్ ముందు వాదనలు వినిపిస్తానని లూథ్రా అంటున్నారు హరీష్ సాల్వే : సోమవారం వాదనలకు అవకాశం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సోమవారం అవకాశం లేదు. వచ్చే వారం తప్పకుండా వింటాం సిద్ధార్థ లూథ్రా : ఒక అయిదు నిమిషాలు నాకు సమయం ఇవ్వండి జస్టిస్ ఖన్నా : సరే, నేను ఆర్డర్ పాస్ చేస్తున్నాను. జస్టిస్ ఖన్నా : "ప్రస్తుతం బెంచ్ ముందు ఉన్న ఈ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను వచ్చే వారం విచారణకు స్వీకరిస్తాం. ఆ బెంచ్‌లో మా సహచరుడు SVN భట్టి ఉండేందుకు సుముఖంగా లేరు కాబట్టి మరో జడ్జితో కలిసి ఈ కేసును విచారిస్తాం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ తుది ఆదేశాలకు లోబడి ఈ ఆర్డర్ వర్తిస్తుంది". ► రేపటి నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు సెలవులు. ఈ నేపథ్యంలో మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది. -
ప్రశంసనీయమైన ప్రయత్నం
‘అక్కడ అనాథల ఆక్రందన. అక్కడ అసహాయుల ఆర్తనాదం. అక్కడ పేదల కన్నీటి జాలు. అదే సుమా కోర్టు....’ సుప్రసిద్ధ రచయిత రాచకొండ విశ్వనాథ శాస్త్రి అరవై రెండేళ్లనాటి ‘న్యాయం’ కథలో గుండెల్ని పిండే వాక్యాలివి. ఈ అనాథల్లో, ఈ అసహాయుల్లో, ఈ నిరుపేదల్లో మహిళలకు మరిన్ని కష్టాలు! ఆలస్యంగానైనా మన సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయంలో ప్రశంసనీయమైన పని చేసింది. న్యాయస్థానాల్లో సాగే వాదప్రతివాదాల్లో, విచారణల్లో, తీర్పుల్లో మహిళలకు సంబంధించి దశాబ్దాలుగా ఎంతో అలవోకగా వాడుతున్న పదాలను ఇకపై ఉపయోగించడానికి వీల్లేదంటూ సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆ పదాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పదాలను ఉపయోగించాలో వివరిస్తూ బుధవారం ఒక పుస్తకాన్ని విడుదల చేసింది. వ్యవస్థలన్నీ ఎక్కడినుంచో ఊడిపడవు. సమాజంలో ఉండే అసమానతలు, వివక్ష, ఆధిపత్య ధోరణులు వంటి సమస్త అవలక్షణాలూ వ్యవస్థల్లో కూడా ప్రతిఫలిస్తుంటాయి. న్యాయస్థానాల్లో ఈ పెడధోరణులు ఉండరాదని విశ్వసించి, అందుకోసం కృషి చేసిన న్యాయమూర్తులు లేకపోలేదు. కానీ వ్యక్తులుగా కృషి చేయటం వేరు, వ్యవస్థే తనంత తాను సరిదిద్దుకునేందుకు పూనుకోవడం వేరు. వృత్తి ఉద్యోగాలరీత్యా సరేగానీ... పౌరుల్లో అత్యధికులు కేసుల్లో ఇరుక్కొని కోర్టు మెట్లెక్కాలనీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాలనీ కోరుకోరు. మహిళల్లో ఈ విముఖత మరింత ఎక్కువ. ఇతరచోట్ల కంటే అక్కడ లింగ వివక్ష అధికం కావటమే ఇందుకు కారణం. మరీ ముఖ్యంగా కింది కోర్టుల్లో మహిళల పట్ల ఉపయోగించే భాష, సంబోధనలు అమాన వీయంగా ఉంటాయి. పర్యవసానంగా న్యాయం కోసం వెళ్లేవారికి అవమానాలే మిగులుతున్నాయి. మన రాజ్యాంగం అన్ని అంశాల్లో సమానత్వాన్ని ప్రబోధించింది. లింగ, వర్ణ, జాతి, కుల, మతాలను ఆధారం చేసుకుని వివక్ష ప్రదర్శించరాదని నిర్దేశించింది. ఇందుకు రాజ్యాంగ పీఠిక మాత్రమే కాదు... 14, 15, 16 అధికరణలతోపాటు 325 అధికరణం కూడా సాక్ష్యాలు. ఆదేశిక సూత్రాల్లో సైతం లింగ సమానతను సాధించటానికి ప్రభుత్వాలు పాటుపడాలన్న ఆకాంక్ష వ్యక్తమైంది. లింగ వివక్షకు తావులేకుండా పౌరులందరికీ పనిచేసే హక్కు కల్పించడంతోపాటు, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని 39(డి), 41 అధికరణలు నిర్దేశించాయి. కానీ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లవుతున్నా ఇవి విరగడ కాలేదు. మహిళల విషయంలో ఎలాంటి దురాచారాలు, పెడ ధోరణులు అలుముకుని ఉన్నాయో మన రాజ్యాంగ నిర్మాతలకు సంపూర్ణ అవగాహన ఉంది. అందుకే వాటిని రూపుమాపటానికి పూనుకొన్నారు. దానికి అనుగుణంగా కాలక్రమంలో ప్రభు త్వాలు చాలా చట్టాలు తీసుకొచ్చాయి. కానీ దురదృష్టమేమంటే అమలు చేసే వ్యవస్థలు సైతం పితృస్వామిక భావజాలంలో కూరుకుపోవటంతో సమానత్వం అసాధ్యమవుతోంది. తమ ముందున్న కేసులోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి తీర్పు చెప్పవలసిన న్యాయమూర్తులు సైతం విచారణ క్రమంలో కావొచ్చు, తీర్పుల్లో కావొచ్చు... మహిళలకు సంబంధించి సమాజంలో ఉన్న పెడ ధోర ణులను ప్రతిబింబించే పదాలను వాడుతుంటారు. ఒక్కోసారి వాంఛనీయం కాని వైఖరిని ప్రదర్శి స్తుంటారు. ఉద్దేశపూర్వకం అయినా కాకపోయినా, వాటివల్ల మౌలికంగా న్యాయం తారుమారు కాకపోయినా... మన రాజ్యాంగం నిర్దేశించిన విలువలకు, విధానాలకు ఆ వైఖరి, ఆ పదాల వాడకం విరుద్ధమైనవి. ఈ విషయంలో రెండో మాటకు తావులేదు. వ్యభిచారం కేసుల్లో, వివాహేతర సంబంధంలో ఉన్న పురుషులకు ప్రత్యేక పదాలు లేవు. కానీ స్త్రీ విషయంలో అలా కాదు... వేశ్య, వ్యభిచారిణి, ఉంపుడు కత్తె, కాముకి అనే అర్థాలు వచ్చే రకరకాల పదాలు ఇంగ్లిష్‌లో ఉన్నాయి. కేసుల విచారణ సమయంలో న్యాయవాదులు, న్యాయమూర్తులు వీటిని యధేచ్ఛగా ఉపయోగిస్తున్నారు. అంతేకాదు... రెచ్చగొట్టే దుస్తులు, పెళ్లికాకుండానే తల్లయిన యువతి వంటివి వాడుతున్నారు. 2012 డిసెంబర్లో దేశ రాజధాని నగరంలో కదిలే బస్సులో ఒక యువతిపై మూకుమ్మడి అత్యాచారం జరిగాక కఠినమైన నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అత్యంత అమానవీయమైన, దుర్మార్గమైన ఆ ఉదంతం తర్వాత సమాజపు ఆలోచనల్లో పూర్తి మార్పు వస్తుందనీ, మహిళల పట్ల చిన్నచూపు చూసే ధోరణులు తగ్గుతాయనీ అనేకులు ఆశించారు. కానీ సమాజం మాట అటుంచి న్యాయస్థానాల ఆలోచనా ధోరణే పెద్దగా మారలేదు. ఒక అత్యాచారం కేసులో నేరగాడిని నిర్దోషిగా పరిగణిస్తూ యువతులు శారీరక సుఖాలను ఆశించి తమంత తాము పురుషులతో వెళ్లడానికి సిద్ధపడి ఆ తర్వాత నిందపడుతుందన్న భయంతో కిడ్నాప్, అత్యాచారం కథలల్లుతున్నారని ఒక న్యాయమూర్తి 2013లో వ్యాఖ్యానించారు. సమాజంలో ఇలాంటి ధోరణి పెరుగుతున్నదని ఆయన ఆందోళన కూడా వ్యక్తం చేశారు. అత్యాచారం ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి 2020లో కర్ణాటక హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది! అత్యాచారానికి గురైన యువతి ఆ వెంటనే నిద్రపోయి, మరునాడు కేసు పెట్టిందనీ, కనుక ఆమె ఫిర్యాదులో నిజాయితీ లేదనీ తేల్చారు. నిరంతర చలనశీలత సమాజ మౌలిక లక్షణం. మారుతున్న కాలానికి అనుగుణంగా భాష మారాలి. ప్రవర్తన, వైఖరి సంస్కారవంతం కావాలి. అది న్యాయస్థానాల నుంచే ప్రారంభం కావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ భావించటం ప్రశంసనీయం. 19వ శతాబ్దం నాటి చట్టాలను మారుస్తూ ఈమధ్యే మూడు కొత్త బిల్లుల్ని ప్రవేశపెట్టిన కేంద్రం కూడా ఈ కోణంలో వాటిని పునఃసమీక్షించుకుని లింగ వివక్ష ధోరణులున్న నిబంధనలను సవరించుకుంటే మంచిది. -
రాజ్‌భవన్‌లో బిల్లుల పెండింగ్‌పై 'నేడు సుప్రీంలో విచారణ'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో రాజ్‌భవన్‌లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పలు బిల్లుల వ్యవహారంపై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరగనుంది. గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ నెల 20న సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్... కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపడం తెలిసిందే. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండటంతో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు నోటీసులు జారీ చేయలేమని వ్యాఖ్యానించిన ధర్మాసనం... కేసు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు విషయమై అనుసరించాల్సిన వ్యూహంపై గవర్నర్ తమిళిసై ఢిల్లీలోని న్యాయ నిపుణులతో చర్చించినట్లు రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి. సోమవారం జరిగే విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కేంద్రం అభిప్రాయంతోపాటు రాజ్‌భవన్ వైఖరి సైతం వెల్లడి కానుంది. ఈ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశభావంతో ఉంది. 194 రోజులుగా పెండింగ్‌లో 7 బిల్లులు.. గతేడాది సెప్టెంబర్ 13న శాసనసభ, శాసన మండలి ఆమోదించిన మొత్తం 8 బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపించింది. అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపారు. మిగతా ఏడు బిల్లులు 194 రోజులుగా రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ప్రైవేటు వర్సిటీల బిల్లు ముఖ్యమైనది. ఈ బిల్లుపై గవర్నర్ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబర్ 8న రాజ్‌భవన్‌కు వెళ్లి అనుమానాలను నివృత్తి చేశారు. అయినా బిల్లు పెండింగ్‌లోనే ఉండిపోయింది. మరోవైపు వర్సిటీల్లో బోధన, బోధనేతర విభాగాల కొలువుల భర్తీ జరగక ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ములుగు అటవీ కళాశాల పేరును తెలంగాణ అటవీ యూనివర్సిటీగా మార్పు ప్రతిపాదన బిల్లు, ప్రైవేటు వర్సిటీల చట్టం బిల్లు, పురపాలికల చట్ట సవరణ బిల్లు, ఆజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు, మోటార్ వెహికల్స్ ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 12న శాసనసభ, మండలి ఆమో దించిన ప్రొ.జయశంకర్ వ్యవసాయ వర్సిటీ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. -
మల్లన్నను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
శ్రీశైలం టెంపుల్(నంద్యాల జిల్లా): శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్, కల్పనాదాస్ దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ పీఎస్ నరసింహ, సత్యప్రభ దంపతులు శనివారం రాత్రి దర్శించుకున్నారు. వీరికి ఆలయ రాజగోపురం వద్ద శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న, అర్చకస్వాములు, వేదపండితులు ఆలయ మర్యాదలు, మంగళవాయిద్యాలతో స్వాగతం పలికారు. అనంతరం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దంపతులు, సుప్రీం కోర్టు న్యాయమూర్తి దంపతులు రత్నగర్భ స్వామిని దర్శించుకుకున్నారు. ఆ తర్వాత మల్లికార్జునస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని, అనంతరం భ్రమరాంబాదేవి అమ్మ వారిని దర్శించుకున్నారు. వీరి వెంట పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, శ్రీశైలం శాసన సభ్యుడు శిల్పాచక్రపాణి రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ వై.లక్ష్మణరావు, తెలంగాణ రాష్ట్ర రిజి్రస్టార్ జనరల్ కె.సుజన, దేవదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్‌లాల్, కర్నూలు ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. -
వివక్షతోనే ఆత్మహత్యలు: సుప్రీం సీజే డీవై చంద్రచూడ్
‘‘ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మార్కులను, ఆంగ్ల ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం వంటి ఘటనలు ఉన్నత విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఆంగ్లం రాని వారిని అంటరానివారిగా వివక్షతో చూడటం, అసమర్థులుగా ముద్ర వేయడం వంటి విధానాలకు స్వస్తి పలకాలి. ఇలాంటివాటి వల్ల అణగారిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ బలవన్మరణాల్లో గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులే ఎక్కువని పరిశీలనల్లో తేలింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారిలో ఒత్తిడిని దూరం చేసి, సానుభూతితో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవహరించవచ్చు. ఎదుటివారిని అర్థం చేసుకునే విధానంతో కూడిన విద్యను ఉన్నత విద్యాసంస్థల్లో అందించడం అవసరం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సుప్రీం చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ్చిన జస్టిస్ చంద్రచూడ్ శనివారం నల్సార్ యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ వర్సిటీ చాన్సలర్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణ్యన్, జస్టిస్ పీఎస్ నరసింహతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా వర్సిటీ సంప్రదాయం ప్రకారం స్నాతకోత్సవ ఊరేగింపుతో రిజిస్టార్ కె.విద్యుల్లతారెడ్డి సీజేఐకి స్వాగతం పలికారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణదేవరావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం సీజేసీ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తమకు చదువు చెప్పినవారినే కాదు.. చదువుకున్న సంస్థ అభివృద్ధికి పాటుపడిన సిబ్బంది, కార్మికుల శ్రమను కూడా విద్యార్థులు గుర్తించాలి. న్యాయశాస్త్ర విద్యార్థులు.. లా సబ్జెక్టులతోపాటు సాహిత్యం తదితర అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. నేను చదువుకున్న రోజులతో పోలిస్తే ప్రస్తుత తరం విద్యార్థులకు సమాచారం, విజ్ఞానం పొందేందుకు అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే కాదు. సమాజంపై బాధ్యత కూడా ఉంటుంది. సానుభూతి దయాగుణం అవసరం ఉన్నత–నిమ్న, ధనిక–పేద అనే తేడా లేకుండా అందరినీ న్యాయస్థానాలు సమానంగా చూస్తాయి. ఇదే విధానాన్ని అన్నింటా పాటించాలి. చట్టం అమలు, న్యాయం అందించడంలో సానుభూతి, దయాగుణం, తాతి్వకత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది అన్యాయమైన స్థితి నుంచి న్యాయమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది. పెద్ద సంఖ్యలో మోటార్ ప్రమాద కేసులను పరిష్కరించేటప్పుడు సాంకేతిక అంశాలతో మానవీయ కోణాన్ని సమతూకం వేస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. ఒత్తిడితో కూడిన విద్య మంచిది కాదు మనం విద్యను కూడా సానుభూతి కోణం నుంచే చూడాలి. చదువులో, వృత్తిలో రాణిస్తేనే మన జీవితాలు మెరుగ్గా ఉంటాయని విద్యా సంస్థల్లో మెదళ్లకు ఎక్కిస్తున్నారు. అలాగే విద్యార్థుల మధ్య తీవ్ర పోటీతత్వం, మార్కులు, ర్యాంకుల ఆధారిత విద్య వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థుల సామర్థ్యం ఒకేలా ఉండదన్న విషయం గ్రహించాలి. విద్య నేర్పడంలోనూ సానుభూతి, కరుణ, స్నేహభావం ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం. ఆ మేరకు ప్రమాణాలు మారాలి. ఒత్తిడికి సంబంధించిన విద్యా విధానం మంచిది కాదు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఎదుటి వారికి సాయం చేయాలనే దృక్పథంతో కూడిన విద్యా విధానం లేకపోవడం గమనించాల్సిన విషయం. న్యాయవిద్యలోనూ క్లినికల్ విధానం అవసరం. విద్యా సంస్థలు, బార్ కౌన్సిల్ దీని కోసం ప్రయత్నించాలి. ఆ ఆత్మహత్యలు కలచివేశాయి ముంబై ఐఐటీలో దళిత విద్యారి్థ, ఒడిశా న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేశాయి. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. సామాజిక మార్పు కోసం సమాజంతో చర్చలు జరపడంలో న్యాయమూర్తులు కీలకపాత్ర పోషించాలి. న్యాయ, పరిపాలన వివాదాల పరిష్కారంతోపాటు సమాజం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించేందుకు కూడా సుప్రీంకోర్టు ప్రయత్నిస్తోంది. సీజేఐగా విద్యార్థులు చదువుకునేందుకు ఆరు దశాబ్దాలకు సంబంధించిన తీర్పులన్నింటినీ అందుబాటులో ఉంచాం. ఆటో ఇంటెలిజెన్స్ ద్వారా కోర్టు విచారణను రికార్డు చేస్తున్నాం. దీంతో విద్యార్థులు విచారణ తీరును తెలుసుకోవచ్చు’’ అని జస్టిస్ చంద్రచూడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్ చాన్సలర్ రణబీర్ సింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రీ, జస్టిస్ పీవీ రెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్ రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్డీ (బ్లాక్ గౌన్–రెడ్‌క్యాప్), ఎల్ఎల్ఎం (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), ఎంబీఏ (బ్లాక్ గౌన్–ఎల్లో క్యాప్), బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) (బ్లాక్ గౌన్–మెరున్ క్యాప్)తో పాటు పలు విభాగాల విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. ఆ ఇద్దరికి పతకాల పంట.. నల్సార్ స్నాతకోత్సవంలో బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి తన్వీ ఆప్టేకు ఏకంగా పదకొండు పసిడి పతకాలు లభించాయి. మరో రెండు పసిడి పతకాలను ఉమ్మడిగా పొందారు. ‘‘ఇన్ని గోల్డ్ మెడల్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రుల కృషి మూలంగానే నేను ఈ పతకాలు సాధించగలిగాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని తన్వీ పేర్కొన్నారు. ఇక బీఏ ఎల్ఎల్బీ (ఆనర్స్) విద్యార్థి మంజరి సింగ్‌కు 10 పసిడి పతకాలు లభించాయి. మొత్తంగా స్నాతకోత్సవంలో 58 గోల్డ్ మెడల్స్ పంపిణీ చేశారు. -
దేశంలో అదానీ - హిండెన్‌బర్గ్ ప్రకంపనలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
అదానీ గ్రూప్‌పై హిండెన్ బర్గ్ చేసిన ఆరోపణలతో స్టాక్ మార్కెట్లోని పెట్టు బడిదారులు తీవ్రంగా నష్ట పోయారు. అదానీ గ్రూపు ఆర్థిక అవకతవకలపై చర్చించాలని ప్రతిపక్షాలు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టాయి. ఆదానీ ప్రకంపనలు ఇంకా పార్లమెంట్లో కొనసాగుతున్నాయి. చివరికి ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ - హిండెన్ బర్గ్ వివాదంపై జోక్యం చేసుకోవాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ. పార్థివాలాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇన్వెస్టర్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. నిపుణలతో కమిటీ వేస్తే బాగుంటుందని అభిప్రాయపడింది. హిండెన్‌బర్గ్ నివేదిక వివాదంపై సెబీ, కేంద్రం అభిప్రాయం కోరింది. అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలను పరిశీలించాలని, జడ్జీతో కూడిన నిపుణులైన ప్యానల్ బృందాన్ని ఏర్పాటు చేయాలని కోర్టు సూచించింది. అదానీ అంశంలో కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే వివాదంలోని ప్రస్తుత పరిస్థితులు, పరిశీలన కోసం నిపుణుల కమిటీని ఏర్పాటుకు సూచించామని సీజేఐ చెప్పారు. ఆ కమిటీలో న్యాయమూర్తి, సంబంధిత నిపుణులను చేర్చవలసిందిగా తెలిపారు. రెగ్యులేటరీ ప్రక్రియపై ఆందోళన, గత రెండు వారాల్లో జరిగిన ఈ సంఘటనతో దేశ పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపేందుకు కృషి చేయాలని సొలిసిటర్ జనరల్‌కు సూచించినట్లు పేర్కొన్నారు. తదుపరి విచారణను ఫిబ్రవరి13కు వాయిదా వేసింది. చదవండి👉 మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ సంచలన వ్యాఖ్యలు -
స్తబ్ధత నుంచి చైతన్యంలోకి...
ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో ప్రజలకు బోధించేదీ, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చి దిద్దుకోవాలో చెప్పేదీ రాజ్యాంగమే అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఆ రాజ్యాంగం పాలితులకు బోధలే కాదు, పాలకులకు హితబోధలూ చేసింది. కానీ వాటిని పెడచెవిన పెట్టడమే నేటి దేశ దుఃస్థితికి కారణం. మైనారిటీల ఉనికిని తక్కువ చేసేలా పౌర చట్టాన్ని సవరించే ప్రయత్నం ఇందుకు ఒక ఉదాహరణ. వందిమాగధులుగా ప్రవర్తించేవారినే గవర్నర్లుగా నియమించడం మరొక ఉదాహరణ. నిరసనకారులపై అక్రమ కేసులు బనాయించడం మరో ఉదాహరణ. అయితే దీనికి విరుగుడు మళ్లీ రాజ్యాంగంలోనే ఉంది. దాని వెలుగులో ప్రజలు స్తబ్ధత వదిలించుకోవడంలోనే ఉంది. ‘‘మహాత్మాగాంధీ దేశంలో ఒక గ్రూపునకు వ్యతిరేకంగా మరో గ్రూపును రెచ్చగొట్టే పద్ధతిని ఎన్నడూ అనుసరించలేదు. ఆయన హిందువే కావొచ్చు, కానీ దేశ పౌరులయిన ముస్లింలను దేశ స్వాతంత్య్రానికి ముందు కూడా ప్రేమించారు. గాంధీజీ అనుసరించిన విధానం న్యాయబద్ధమైన సంస్కృతికీ, పౌర నీతికీ, సహృదయంతో కూడిన జాతీయ సమైక్యతకూ నిద ర్శనం. అలాంటిది ఇతర మైనారిటీల పట్ల నేడు అనుసరిస్తున్న ప్రభుత్వ వివక్షాపూరిత విధానాలకు భారతదేశం తలదించుకోవలసి వస్తోంది.’’ – నోబెల్ బహుమాన గ్రహీత,సుప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్యసేన్ (15 జనవరి 2023) ‘చింత చచ్చినా పులుపు’ చావలేదు. రాజ్యాలు అంతరించినా, దేశ పాలకుల్లో తెచ్చిపెట్టుకున్న రాచరికపు లక్షణాలు చావడం లేదు. దేశంలోని అసంఖ్యాక మైనారిటీ జాతుల ఉనికిని, వారి ప్రయోజనాలను తక్కువ చేసేలా పౌర చట్టాన్ని కొత్తగా సవరిస్తూ రూపొందించడం ఇందుకు ఒక ఉదాహరణ. పార్లమెంటులో నిర్దుష్టమైన చర్చ జరక్కుండానే ఆమోదించినట్టు పాలకులు ప్రకటించిన మరునాడే, రాష్ట్రపతి ఆమోద ముద్ర కూడా పొందినట్టు వెల్లడించారు. అయినా చట్టం అమలులోకి రాకుండా ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది? దానికి కారణం–కొత్త చట్టం కింద రూల్స్ రూపొందించలేక పోవడం! కాగా, త్రిపురలోని ఏ వామపక్ష ప్రభుత్వాన్ని, అందులోనూ దేశ వ్యాప్తంగా ప్రశంసలు పొందిన మాణిక్ సర్కార్ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా దేశ పాలకులు కూలదోసి కులుకుతున్నారో– అదే ఢిల్లీ పాలకులకు నిద్ర లేకుండా చేస్తూ త్రిపురలోని అనేక ఆదివాసీ తెగలను సమీకరించి, ‘గ్రేటర్ తిప్రాలాండ్’ (బృహత్ త్రిపుర) పేరిట ‘తిప్రహా దేశీయ అభ్యుదయ ప్రాంతీయ సమాఖ్య’ను ప్రద్యోదత్ విక్రమ్ మాణిక్య దెబ్రమా నెలకొల్పారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ సమాఖ్య ఏర్పడింది. ఈ బృహత్ త్రిపుర 19 తెగల ప్రజా బాహుళ్యం విస్తరించి ఉన్న ప్రాంతం. ఈ ఆదివాసీ ప్రజా బాహుళ్యా నికి ప్రాథమిక హక్కులు ఉన్నప్పటికీ వాటికి రక్షణ లేకపోయినందునే తాజా బృహత్ ఉద్యమానికి వారు సిద్ధమయ్యారు. త్రిపుర రాష్ట్ర సరి హద్దులలోనే ‘గ్రేటర్ తిప్రాలాండ్’ నెలకొల్పుకోవడానికి పూను కున్నారు. త్రిపురలో బీజేపీ–ఆరెస్సెస్ పాలనకు ఇప్పుడీ ‘గ్రేటర్ తిప్రాలాండ్’ ‘దేవిడీమన్నా’ చెప్పడంతో ఢిల్లీ పాలకుల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ(24 నవంబర్ 2022)– చరిత్రను బీజేపీ వక్రీకరిస్తోందని విమర్శకులు చెబితే సరిపోదనీ, నిజానికి భారతదేశ చరిత్రను తిరగ రాయాల్సిన సమయం వచ్చిందనీ చెప్పారు. ఈ దేశంలో 150 సంవత్సరాలకు మించి ఏ ప్రాంతంలో అయినా కనీసం 30 రాజ్యాలు పరిపాలించిన ఉదాహరణలతో పండితులూ, విద్యార్థులూ పరిశోధించి తెల్పడానికి ముందుకు రావాలని విన్నపాలు చేశారు. ‘మన చరిత్ర వక్రీకరణలకు గురైంది. దాన్ని సరి చేయడానికి మనం కష్టపడి పనిచేసి చరిత్రను సరి చేయాలి’ అని అమిత్ షా బాహాటంగానే ప్రకటిస్తున్నారు. పాలకులు ఏది పలికినా శాసనమై కూర్చుంటే, ఇంక వేరే జనవాక్యానికి స్థానమేదీ? అందుకే, అటు పాలకులకూ, ఇటు పాలితులకూ నైతిక విలువలు బోధించేది భారత లౌకిక రాజ్యాంగమేననీ, అదే సర్వులకూ నైతిక విధాన బోధిని అనీ దేశ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ స్వీకారం చేసిన మరుక్షణం నుంచే జస్టిస్ డీవై చంద్రచూడ్ చెబుతూనే వస్తున్నారు. ‘దేశ ప్రజల్ని స్తబ్ధతలో నుంచి చైతన్యంలోకి మేలుకొల్పి, ప్రాథమిక హక్కుల్ని ఎలా కాపాడుకోవాలో బోధించి, తమ దైనందిన జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే గైడ్’ రాజ్యాంగమే అని ఆయన అన్నారు. అందువల్లే ప్రజల దైనందిన అవసరాలతో నిమిత్తం లేకుండా అర్ధంతరంగా పెద్ద నోట్లను రద్దు చేసి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా పాలకులు తీసుకున్న నిర్ణయాన్ని నిశితంగా ఖండించారు. జమ్ము–కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని (370వ అధికరణ) ఎందుకు రద్దు చేయవలసి వచ్చిందో, అవినీతికి దారులు తెరిచే ఎలక్టోరల్ బాండ్స్‌ను ఎందుకు ప్రవేశ పెట్టవలసి వచ్చిందో తెల్పాలని నిగ్గ దీశారు. కొలీజియం వ్యవస్థను రద్దు చేయమని కోరే హక్కును ప్రభుత్వానికి ఎవరిచ్చారని సుప్రీంకోర్టు ప్రశ్నించాల్సిన అవసరం వచ్చిందంటే పాలకుల స్థాయిని అనుమానించవలసి వస్తోంది. ఇక రాష్ట్రాల గవర్నర్ల నియామకంలో వారి ప్రవర్తనను కనిపెట్టి ఉండటంలో దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పాటించిన న్యాయ సూత్రాలు ఇప్పుడు గాలికి ఎగిరిపోయాయి. పాలక పార్టీలకు వందిమాగధులుగా ప్రవర్తించే అవకాశవాద రాజకీయ శక్తులనే గవ ర్నర్లుగానూ, ఉపరాష్ట్రపతులుగానూ నియమించే దుఃస్థితికి పాలకులు దిగజారిపోవడాన్ని చూసి దేశం విస్తుపోతోంది. ఈ పరిస్థితుల్లో జస్టిస్ చంద్రచూడ్ దేశ ప్రధాన న్యాయమూర్తిగా రెండేళ్ల పాటు కొనసాగనుండటం 2024లో రాబోతున్న సాధారణ ఎన్నికల నిర్ణయాలపై పాలకుల ప్రభావానికి గండి కొట్టగల పరిణామంగానే భావించాలి. అంతేకాదు... ఒకనాటి భీమా కోరెగావ్ పోరాటాన్ని గుర్తు చేసు కుంటూ దళిత ప్రజా బాహుళ్యం జరుపుకొన్న ఉత్సవాలలో పాల్గొన్న వామపక్ష నాయకులపై అక్రమ కేసులు బనాయించి వారిని ఏళ్ల తరబడి జైళ్లపాలు చేసి వేధించడం ప్రజలు గమనించారు. ఈ సమస్య కూడా దేశ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి రాగానే ఆయన పాలక పద్ధతుల్ని విమర్శిస్తూ వామపక్ష రాజకీయ ఖైదీల్ని విడుదల చేయడమో, కఠిన శిక్షలను సడలించడమో జరుగుతోంది. అంతేగాదు, ఎల్గార్ పరిషత్, మావోయిస్టుల మధ్య సంబంధాల మిషతో పాలకులు బనాయించిన కేసు నుంచి ఆనంద్ తేల్తుంబ్డేను చంద్రచూడ్ కోర్టు విడుదల చేసింది. అంతకుముందే తేల్తుంబ్డే బెయిల్‌ను సవాలు చేస్తూ ఎన్ఐఏ పెట్టిన దరఖాస్తును సుప్రీం తోసిపుచ్చింది. నేటి తాజా దేశ పరిస్థితుల్ని సమీక్షించుకోవాలంటే – ఎన్నికల కమిషనర్ల దగ్గర నుంచి రాష్ట్రాల గవర్నర్ల వరకు పాలక పక్ష నాయకుల్ని మినహాయించి మరొకర్ని నియమించే సంప్రదాయానికి స్వస్తి చెప్పారు. బహుశా అందుకే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ ‘రాజ్యాంగబద్ధమైన నియామకాల్లో రాజకీయ ఒత్తిళ్లు, రాజకీయ ప్రయోజనాలకు స్థానం ఉండరాదని’ స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయానికి తూట్లు పొడవడానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రయత్నించిన ఫలితంగానే విరుద్ధ పరిణామాలకు చోటు దొరికింది. అలాగే న్యాయమూర్తులే న్యాయమూర్తుల్ని నియమించుకునే సంప్రదాయం మంచిది కాదనీ, కానీ ఇటీవలి కాలంలో ముగ్గురు సుప్రీం ప్రధాన న్యాయమూర్తులుగా వచ్చిన జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ యు.యు. లలిత్, జస్టిస్ డీవై చంద్రచూడ్ వల్ల కోర్టు స్వతంత్ర ప్రతిపత్తికి విలువ వచ్చిందనీ లా కమిషన్ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ, మద్రాసు హైకోర్టుల మాజీ ప్రధాన న్యాయమూర్తి అజిత్ ప్రకాష్ షా అభిప్రాయపడవలసి వచ్చింది. బహుశా అందుకే కాబోలు ఓ మహాకవి మనలో అసలు జబ్బు ఎక్కడుందో చెబుతూ – ‘‘మనల్ని చూసి మనం నవ్వుకోలేక పోవడమే ఏడుపంతటికీ కారణం/ ఇంకా ఎన్నాళ్ళీ ఏడుపు? ఇవాళ సమస్యల్ని పరిష్కరించలేక/ ఆధ్యాత్మికంలోకి పరుగెత్తుతారు/ పద్యాలచే పంటలు పండించగలవా?/ పప్పు రుబ్బించగలవా?’’ అని ప్రశ్నిస్తారు. ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
సీజేఐతో సీఎం వైఎస్ జగన్ భేటీ
-
సీజేఐ చంద్రచూడ్‌తో సీఎం జగన్ మర్యాదపూర్వక భేటీ
విజయవాడ: మూడు రోజుల తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని విజయవాడకు చేరుకున్నారు భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్. శుక్రవారం పలు కార్యక్రమాల్లో పాల్గొనే క్రమంలో.. ఈరోజు(గురువారం) రాత్రికి విజయవాడలో బసచేయనున్నారు. ఈ క్రమంలోనే నోవాటెల్ హోటల్‌కు చేరుకున్న సీజేఐ చంద్రచూడ్‌ను సీఎం జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా, తిరుపతి జిల్లా పర్యటన ముగించుకున్న సీజేఐకు సాదర వీడ్కోలు లభించాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను సీజేఐకి అందచేశారు. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఏపీ హైకోర్టు లక్ష్మణరావు, టిటిడి చైర్మన్ వై వి సుబ్బారెడ్డి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, మూడవ అడిషనల్ జిల్లా జడ్జి వీర్రాజు, ప్రోటోకాల్ మేజిస్ట్రేట్ కోటేశ్వరరావు, శ్రీకాళహస్తి ఆర్డీవో రామారావు, డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ కులశేఖర్, ప్రోటోకాల్ సూపరింటెండెంట్ ధనుంజయ నాయుడు, జిల్లా బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దినకర్ తదితరులు సీజేఐకి వీడ్కోలు పలికిన వారిలో ఉన్నారు. -
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుచానూరు/చంద్రగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తదితరులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఆయనకు వైవీ సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం అందజేసి వేదాశీర్వాదం చేశారు. సీజేఐకి చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొని గోవు, దూడకు గ్రాసం తినిపించారు. -
మూన్‌లైటింగ్‌పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు
ఒకచోట ఉద్యోగం చేస్తూనే రహస్యంగా మరొక ఉద్యోగం కూడా చేస్తుండటాన్ని ‘మూన్‌లైటింగ్’ అంటారు. అయితే టెక్ కంపెనీల చట్టం ప్రకారం ఒకేసారి రెండేసి ఉద్యోగాలు చేయకూడదన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారన్న కారణంతోనే విప్రో 300 మంది ఉద్యోగుల్ని ఫైర్ చేసింది. ఆ తొలగింపులే ఐటీ రంగంలో ప్రకంపనలు పుట్టించి, ఆ ఐటీ దిగ్గజం చేసిన పని సమంజసమేనా అనే చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో భారత నూతన ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ యశ్వంత్ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వారం సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన సీజేఐ చంద్రచూడ్ మూన్‌లైటింగ్‌పై స్పందించారు. తాను ఆల్ ఇండియా రేడియో(ఏఐఆర్)లో రేడియో జాకీగా పనిచేసే సమయంలో మూన్‌లైటింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఓవైపు లాయర్‌గా పనిచేస్తూనే ఏఐఆర్‌లో ‘ప్లే ఇట్ కూల్, ఏ డేట్ విత్ యూ, సండే రిక్వెస్ట్’ అనే షోస్‌గా వ్యవహరించినట్లు ఓ సమావేశంలో చెప్పారు. ఆ వీడియోని బార్ అండ్ బెంచ్ ట్విటర్ పేజీలో పోస్ట్ చేసింది. అదనపు ఆదాయం కోసం సంస్థలో పనిచేస్తూ..మరో సంస్థలో మరో జాబ్ చేయడానికి మూన్‌లైటింగ్ అంటారు?. అయితే కాన్ఫరెన్స్‌లో సీజేఐ మాట్లాడుతూ..అప్పట్లో దీని గురించి (మూన్‌లైటింగ్) చాలా మందికి తెలియదు. నా 20 ఏళ్ల వయసులో నేను మూన్‌లైటింగ్ చేశా. రేడియో జాకీగా పైన పేర్కొన్న ప్రోగ్రామ్స్ చేసినట్లు తెలిపారు.‘ఈ సందర్భంగా తన అభిరుచిల్ని బయటపెట్టారు.నేటికీ సంగీతంపై నాకున్న అభిమానం కొనసాగుతోంది. అందుకే ప్రతిరోజూ న్యాయ విధులు నిర్వహిస్తూనే..ఇంటికి వెళ్లి మ్యూజిక్ వింటున్నట్లు వెల్లడించారు. మూన్‌లైటింగ్ అంటే మోసం చేయడమే ఇటీవల మనదేశంలో పలు కంపెనీలు మూన్‌లైటింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఐటీ కంపెనీ హ్యాపిహెస్ట్ మైండ్స్ టెక్నాలజీస్ రెండో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. విప్రో ఛైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ట్విటర్లో మూన్‌లైటింగ్ అంటే సంస్థల్ని మోసం చేయడంతో సమానమేనని అన్నారు. అప్పటి నుంచి దేశీయ ఐటీ పరిశ్రమలో మూన్‌లైటింగ్ చర్చంశనీయంగా మారింది. Did you know CJI DY Chandrachud moonlighted as a RADIO JOCKEY in his early 20's - Do listen to him#SupremeCourt #SupremeCourtofIndia #cjichandrachud Video Credit - BCI pic.twitter.com/EdvRqntXST — Bar & Bench (@barandbench) December 4, 2022 చదవండి👉 ‘మీ ఉద్యోగం పోయింది కదా..మీకెలా అనిపిస్తుంది?’ -
రేప్ బాధితురాళ్లపై అలాంటి పరీక్షా? ఆపేయండి!
న్యూఢిల్లీ: బాధితురాళ్లపై లైంగిక దాడి/అత్యాచార నిర్ధారణ పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘టూ ఫింగర్ టెస్ట్’ విధానాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. అంతేకాదు.. తక్షణమే ఈ విధానం నిలిచిపోయేలా చూడాలంటూ కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం.. ఓ అత్యాచార కేసు విచారణ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేసింది. అత్యాచార నిర్ధారణ పరీక్షగా పేరొందిన టూ ఫింగర్ టెస్ట్ విధానాన్ని సుప్రీం కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విధానానికి ఎలాంటి శాస్త్రీయత లేదని, పైగా మహిళలను మళ్లీ గాయపర్చడంతో పాటు.. వాళ్ల మానసిక స్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపెడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇక నుంచి బాధితురాలి మీద ‘టూ ఫింగర్ టెస్ట్’ గనుక నిర్వహిస్తే.. దుష్ప్రవర్తన కిందకు వస్తుందని, అలాంటి పరీక్షలను నిర్వహించే వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. "కేవలం లైంగికంగా చురుకుగా ఉన్నందువల్లే ఆమె అత్యాచారానికి గురైందని నిర్ధారించడం హేయనీయమని.. అది నమ్మశక్యం కాదని.. అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల పాఠ్యాంశాలను సమీక్షించాలని, స్టడీ మెటీరియల్స్ నుంచి ‘టూ ఫింగర్ టెస్ట్’ విధానాన్ని తొలగించాలని ఆదేశించింది. మరోవైపు.. ఆరోగ్య శాఖను ఈ విధానానికి ముగింపు పలికే విధంగా హెల్త్ వర్కర్స్కు ప్రత్యామ్నాయ పద్ధతుల మీద వర్క్‌షాపులతో అవగాహన కల్పించాలని కోరింది. ఇదిలా ఉంటే 2013లోనూ సుప్రీం కోర్టు టూ ఫింగర్ టెస్ట్‌ను తప్పుబట్టింది. ఇది మహిళల గౌరవం, గోప్యతలను దెబ్బ తీస్తుందని పేర్కొంది.