
న్యూఢిల్లీ: దేశ రాజధానికి సంబంధించిన పలు శాఖలపై శాసన, పాలనాపరమైన పెత్తనం విషయమై కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ఇందుకోసం జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనాన్ని ఏర్పాటు చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. జస్టిస్ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈ అంశాన్ని ఢిల్లీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సోమవారం లేవనెత్తారు. ఈ అంశంపై 2019 ఫిబ్రవరి 14న ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్నమైన తీర్పు వెలువరించారు.
విచారణకు స్వీకరిస్తాం
మనీ లాండరింగ్ చట్టంపై తీర్పును పునఃపరిశీలించాలంటూ దాఖలైన పిల్ విచారణ స్వీకరణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. దాన్ని విచారణ కేసుల జాబితాలో చేరుస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment