తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ | Supreme Court Hear On Tirumala Laddu Controversy Updates And Top News Headlines In Telugu | Sakshi
Sakshi News home page

Tirupati Laddu Plea Hearing: తిరుమల లడ్డూ వివాదం.. సుప్రీంకోర్టులో విచారణ

Published Mon, Sep 30 2024 7:39 AM | Last Updated on Mon, Sep 30 2024 12:48 PM

Supreme Court Hear On Tirumala Laddu Controversy Updates

సాక్షి, న్యూఢిల్లీ: తిరుమల లడ్డూ వివాదం మీద దాఖలైన పటిషన్లపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ అందుబాటులో లేకపోవడంతో విచారణ మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసింది. లంచ్ సమయంలో కేసును విచారించనుంది. విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్‌ను అందుబాటులో ఉండాలని సుప్రీంకోర్టు తెలిపింది.

తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్థించారు.

ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదికపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్‌ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్‌లో విన్నవించారు.

ఇదీ చదవండి: దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్‌ జగన్‌

నిరాధారమైన త­ప్పు­డు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనో­భా­వాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్‌వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆ­ధారంగా చేసుకుని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నా­రు. అందుకే సుప్రీం­కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్థించారు.

ఇదీ చదవండి: పరిపాలనకు ‘తిరు’క్షవరం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement