
సాక్షి, ఢిల్లీ: తిరుమల లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.
ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘టీటీడీ లడ్డూ విషయంలో గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాము. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నాము. పొలిటికల్ కామెంట్ చేయొద్దు అని కోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యల కారణంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేయడం జరిగింది. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము.
నా హయాంలో ఏఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. ఎన్నికల సమయంలో టెండర్ ఆమోదించారు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయి అన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దు అన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మాపై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మేము ఉన్న సమయంలో కల్తీ జరగలేదు. లడ్డులను ఇంతవరకు టెస్ట్ చేయలేదు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: ‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment