సోషల్ మీడియాను ఆసరాగా చేసుకుని ఈ మధ్య సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడయా ప్రముఖుల పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేసి డబ్బులు అడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రులు, మంత్రుల పేర్లతో తమను తాము పరిచయం చేసుకుంటున్నవారు.. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని టార్గెట్ చేశారు. తాజాగా, తనను సీజేఐగా పరిచయం చేసుకొని డబ్బులు అడగిన ఉదంతం చర్చనీయాంశంగా మారింది.
సీజేఐ డీ.వై చంద్రచూడ్‌లా తనను తాను ఓ సైబర్ నేరస్తుడు పరిచయం చేసుకుంటూ.. క్యాబ్ ఛార్జీల కోసం డబ్బులు అడిగాడు. ఈ విషయం తమ దృష్టికి రావటంతో సైబర్ నేరగాడిపై సుప్రీంకోర్టు మంగళవారం ఢిల్లీ సైబర్ క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేసింది. తనపేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను చేసి.. సీజేఐ అవాక్కయ్యారు. సీజేఐ డీ.వై చంద్రచూడ్ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు భద్రతా విభాగం సైబర్ క్రైమ్ విభాగంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
‘‘హలో, నేను సీజేఐని కొలీజియం అత్యవసర సమావేశానికి వెళ్లాలి. నేను కన్నాట్ ప్రాంతంలో చిక్కుకున్నాను. క్యాబ్ కోసం మీరు నాకు రూ. 500 పంపగలరా? నేను కోర్టుకు చేరుకున్న తర్వాత వెంటనే డబ్బు తిరిగి ఇస్తాను’’ అని సైబర్ నేరగాడు సీజేఐ పేరుతో డబ్బులు అడిగాడు. ప్రస్తుతం ఈ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment