పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ | CJI Chandrachud visited Padmavati Ammavaru Tiruchanuru | Sakshi
Sakshi News home page

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ

Published Thu, Dec 29 2022 5:57 AM | Last Updated on Thu, Dec 29 2022 11:30 AM

CJI Chandrachud visited Padmavati Ammavaru Tiruchanuru - Sakshi

కుటుంబ సమేతంగా కళ్యాణ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న జస్టిస్‌ చంద్రచూడ్‌

తిరుచానూరు/చంద్రగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బుధవారం కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లాలోని తిరు­చా­నూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట వారికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బా­రెడ్డి, ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్, జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తదిత­రులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగ­తం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి ధ్వజ­స్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్‌ చంద్రచూడ్‌ దంపతులు కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీ­కల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకు­న్నారు.

ఆలయం ఎదుట ఆయనకు వైవీ సుబ్బా­రెడ్డి, అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగ­తిం­చారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్‌ చంద్రచూడ్‌ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం అందజేసి వేదా­శీర్వాదం చేశారు. సీజేఐకి చైర్మన్, ఈవోలు స్వామి­వారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొని గోవు, దూడకు గ్రాసం తినిపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement