Padmavati amma vari Temple
-
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సీజేఐ
తిరుచానూరు/చంద్రగిరి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం కుటుంబ సమేతంగా తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట వారికి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జిల్లా జడ్జి వీర్రాజు, టీటీడీ సీవీఎస్వో నరసింహ కిషోర్, తదితరులు పూర్ణకుంభంతో సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు కుంకుమార్చన సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆశీర్వాద మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం సీజేఐ కుటుంబసమేతంగా చిత్తూరు జిల్లా శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయం ఎదుట ఆయనకు వైవీ సుబ్బారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతించారు. ధ్వజస్తంభానికి మొక్కుకున్న అనంతరం జస్టిస్ చంద్రచూడ్ దంపతులు స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు శేషవస్త్రం అందజేసి వేదాశీర్వాదం చేశారు. సీజేఐకి చైర్మన్, ఈవోలు స్వామివారి ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీజేఐ దంపతులు ఆలయంలో గోపూజలో పాల్గొని గోవు, దూడకు గ్రాసం తినిపించారు. -
తిరుచానూరు : శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
-
అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్
తిరుచానూరు : పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం ఎదుట రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు జీ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, వరప్రసాద్, అజయ్‌కుమార్, సామంచి శ్రీనివాస్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో సతీసమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆయనకు ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాల ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నీటి సమస్య నెలకొందని, సకాలంలో వర్షాలు కురిసి దేశ ప్రజల దాహార్తి తీరాలని, అలాగే పాడిపంటలు వృద్ధి చెంది దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని శ్రీవారు, అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు.