అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ | Minister Nitin Jairam Gadkari visit in thiruchanoor | Sakshi
Sakshi News home page

అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్

Published Fri, May 6 2016 2:44 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM

అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్ - Sakshi

అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్

తిరుచానూరు : పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం ఎదుట రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు జీ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, వరప్రసాద్, అజయ్‌కుమార్, సామంచి శ్రీనివాస్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో సతీసమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆశీర్వాద మండపంలో ఆయనకు ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాల ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నీటి సమస్య నెలకొందని, సకాలంలో వర్షాలు కురిసి దేశ ప్రజల దాహార్తి తీరాలని, అలాగే పాడిపంటలు వృద్ధి చెంది దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని శ్రీవారు, అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement