Bojjala Gopala krishna Reddy
-
బాబు గారూ.. మీ ఎమ్మెల్యే నుంచి కాపాడండి!
సాక్షి టాస్క్‌ఫోర్స్: శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వ్యాపారం చేయాలంటే ఎమ్మెల్యే బొజ్జలకు కప్పం కట్టాలి. లేదంటే ఊరు విడిచి అయినా పోవాలి. ఈ రెండింట్లో దేనికో ఒక దానికి సిద్ధపడకపోతే మాత్రం ఎమ్మెల్యే అనుచరుల చేతిలో చావు దెబ్బలు తప్పవు. ఇప్పటికే అన్ని రకాలుగా వసూళ్ల పర్వానికి తెరలేపిన ఆ ఎమ్మెల్యే దాదాగిరి గురించి వేధింపులకు గురైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రాజీపూర్ జిల్లాకు చెందిన సుశీల్ చౌదరి అనే స్క్రాప్ వ్యాపారి బయట పెట్టారు. ఈ మేరకు బాధితుడు తిరుపతిలోని ఓ ప్రైవేటు నివాసంలో శుక్రవారం మీడియాతో మాట్లాడారు.ఆ వివరాలు అతని మాటల్లోనే..‘ఎనిమిదేళ్లుగా నేను తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లోని వివిధ కర్మాగారాల్లో స్క్రాప్‌ను సేకరించి ఇతర ప్రాంతాల్లో విక్రయించి వ్యాపారం చేస్తున్నా. జూన్‌లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి నాకు ఫోన్ చేసి, నియోజకవర్గంలో తన అనుమతి లేకుండా ఎలాంటి వ్యాపారం చేయకూడదని ఆదేశించారు. వ్యాపారం చేసుకోవాలంటే తనకు ప్రతి నెలా కొంత మొత్తం చెల్లించాలని బెదిరించాడు. కొద్ది రోజుల తర్వాత నన్ను హైదరాబాద్‌కు పిలిపించి మాట్లాడారు. ప్రతి నెలా రూ.50 లక్షల నుంచి రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేశారు.అయితే నా వ్యాపారం అంతంత మాత్రమేనని, అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేనని ప్రాధేయపడ్డాను. దీంతో నియోజకవర్గంలో ఎక్కడా స్క్రాప్ తీసుకోవద్దని హెచ్చరించారు. నాకు స్క్రాప్ అమ్మకూడదని ఫ్యాక్టరీల యజమానులను కూడా బెదిరించారు. అప్పటి నుంచి నేను వ్యాపారం మానేసి ఖాళీగా ఉన్నాను. అయితే ఎమ్మెల్యే అనుచరుడు వికృతమాలకు చెందిన పూల హేమాక్షి తరచూ నాను ఫోన్ చేసి, ఎమ్మెల్యేకు డబ్బులు కట్టాలని డిమాండ్ చేసేవాడు. తిరుపతి వదిలిపెట్టి వెళ్లిపోవాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించాడు.రెండు రోజుల కిందట హేమాక్షి నా వద్దకు వచ్చి డబ్బులు ఇవ్వాలని దారుణంగా కొట్టాడు. నా సెల్ ఫోను లాక్కుని, ఈ విషయం ఎక్కడైనా చెబితే చంపేస్తామని బెదిరించి వెళ్లిపోయాడు. ఈ విషయమై నేను రేణిగుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను. అయితే వారు పట్టించుకోలేదు. ఎమ్మెల్యే వల్ల నాకు ప్రాణహాని ఉంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, జిల్లా ఎస్పీ స్పందించి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సు«దీర్‌రెడ్డి చెర నుంచి నన్ను రక్షించాలి’ అని వేడుకున్నారు. ఇది కూడా చదవండి: మాతో పెట్టుకుంటే కాల్చిపారేస్తాం!.. అనంతలో మళ్లీ రక్త చరిత్ర -
బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. బొజ్జల కుటుంబసభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనారోగ్యం కారణంగా బొజ్జల.. హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత -
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. శ్రీకాళహస్తి నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలిచారు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఆయన స్వగ్రామం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా బొజ్జల పనిచేశారు. చదవండి: ఉత్తరాంధ్రపై మరోసారి అక్కసు వెల్లగక్కిన చంద్రబాబు 1994-99లో రోడ్లు భవనాలు శాఖ మంత్రిగా ఆయన పనిచేశారు. 2014లో చంద్రబాబు క్యాబినెట్లో అటవీ శాఖ మంత్రిగా బొజ్జల పని చేశారు. 2004-09లో కాంగ్రెస్ నేత ఎస్సివి నాయుడు చేతిలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డి శ్రీ కాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. -
‘మరో లోకేష్ బాబు వచ్చారు’.. మాజీమంత్రి కుమారుడికి చేదు అనుభవం
మీ నాన్న 30 ఏళ్లు మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. ఏ రోజైనా ఇటు వచ్చారా? సమస్యలు విన్నారా? మేము దళితులమనే మా ప్రాంతాన్ని చిన్నచూపు చూశారు. కనీసం కట్టుకున్న ఇళ్లు కూడా దక్కకుండా చేశారు. ఇప్పుడు అధికారం లేదని సమస్యలు పరిష్కరిస్తామంటున్నారు. ఇదేనా ప్రజాసేవ అంటే..? ఇలాంటి పనికిమాలిన రాజకీయాలు చేయడమెందుకు..? అంటూ శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్‌ను స్థానికులు నిలదీయడంతో ఆయన కంగుతిన్నారు. అక్కడి నుంచి జారుకున్నారు. ఈ ఘటన శ్రీకాళహస్తిలో చర్చనీయాంశమైంది. సాక్షి, తిరుపతి / శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడు సుధీర్‌రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ప్రభుత్వంపై బురదజల్లేందుకు వచ్చి ప్రజావ్యతిరేకతతో అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. శ్రీకాళహస్తి సమీపంలోని రామచంద్రాపురం వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 1,748 మందికి ఇందిరమ్మ గృహాలు మొదటి విడత కింద మంజూరు చేశారు. ఆ ప్రాంతానికి రాజీవ్‌నగర్ కాలనీగా నామకరణం చేసి, ఇంటి నిర్మాణాలు ప్రారంభించారు. ఆయన హఠాన్మరణంతో గృహనిర్మాణాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయిన సమయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగారు. ఆయన మంత్రిగా పలు కీలక పదవులు అలంకరించారు. ఆ సమయంలో రాజీవ్‌నగర్ అభివృద్ధి చేసే అవకాశం ఉన్నా వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరొస్తుందనే దురుద్దేశంతో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పక్కాగృహాలు అసంపూర్తిగా దర్శనమిస్తుండడంతో అధికారులు పట్టాలను రద్దుచేయడంతోపాటు ముందుగానే నోటీసులిచ్చి లబ్ధిదారులకు తెలియజేశారు. ఇది ఎవరికీ గుర్తుండవనుకుని నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బొజ్జల సుధీర్ ప్రభుత్వంపై బురదజల్లేందుకు శ్రీకాళహస్తిలో పర్యటనకు సిద్ధపడ్డారు. పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒకరు పద్మాలయ చెరువును ఆక్రమించి రాత్రికి రాత్రే అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. ఇది తెలుసుకున్న అధికారులు ఆ నిర్మాణాలను తొలగించి పద్మాలయ చెరువులో బోర్డులు నాటారు. ఇది జరిగి పది రోజులైంది. అయితే గత సోమవారం శ్రీకాళహస్తికి చేరుకున్న బొజ్జల సుధీర్‌రెడ్డి హడావుడిగా వెళ్లి పద్మాలయ చెరువు ఆక్రమణల విషయమై నానాయాగీ చేశారు. అంతేకాకుండా రాజీవ్‌నగర్‌లో లబ్ధిదారులకు అండగా ఉంటానంటూ మంగళవారం ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఉదయం కొంత మందితో అక్కడికి చేరుకున్నారు. అయితే స్థానికుల నుంచి వ్యతిరేకత రావడంతో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో.. టీడీపీ ప్రభుత్వంలో రాజీవ్నగర్ని నిర్మించామని బొజ్జల సుధీర్ నోరు జారారు. బొజ్జల మాట విన్న స్థానికులు కొందరు ‘మరో లోకేష్ బాబు వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడడంతో ఆయన చిన్నగా అక్కడి నుంచి జారుకోవడం గమనార్హం. -
ఓటేస్తే చంపేస్తాం..!
సాక్షి, తిరుపతి: ప్రజాస్వామ్య ప్రక్రియలో పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ఓటుహక్కును వినియోగించుకోనివ్వకుండా మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత ఊరు ఊరందూరులో పెత్తందార్లు అడ్డుకున్నారు. ఎస్టీ, ఎస్టీలే లక్ష్యంగా బొజ్జల సుధీర్‌రెడ్డి అనుచరులు శనివారం పోలింగ్ కేంద్రం వద్ద రచ్చ చేశారు. ఓటేస్తే చంపేస్తామంటూ బెదిరింపులకు దిగారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చేందుకు తమ గ్రామాన్ని శ్రీకాళహస్తి మునిసిపాలిటీలో విలీనం చేసినందుకు పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్టు హకుం జారీ చేశారు. గ్రామ కట్టుబాట్లను పాటించాలని హెచ్చరించి మధ్యాహ్నం వరకు ఎవరూ పోలింగ్‌లో పాల్గొనకుండా కాపు కాశారు. కాగా, ఈ విషయాన్ని కొందరు ఓటర్లు ‘సాక్షి’ దృష్టికి తేవడంతో ప్రతినిధి బృందం ఊరందూరు ఎస్సీ కాలనీకి చేరుకుని ఎన్నికల అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసుల సహకారంతో కాలనీకి చెందిన 12 మంది దళితులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండల పరిధిలో ఆరు గ్రామాలకు చెందిన ఎస్సీలను 35 ఏళ్లుగా ఓటుహక్కు వినియోగించుకోకుండా అడ్డుకున్న ఘటన 2019 సార్వత్రిక ఎన్నికల్లో వెలుగు చూడటం తెలిసిందే. మాకు నచ్చిన పార్టీకి ఓటు వేశాం: ఊరందూరు దళితులు సాక్షి, పోలీసుల సహకారంతో మా ఓటు హక్కును వినియోగించుకున్నాం. మాకు నచ్చిన పార్టీకి చెందిన నాయకుడికి ఓటు వేసినందుకు ఆనందంగా ఉంది. -
అయ్యోరు రాసిన రక్తచరిత్ర
భావిపౌరులను తీర్చిదిద్దాల్సిన పవిత్ర వృత్తిలో ఉండి నేరప్రవృత్తిని చాటుకున్నాడు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడే హత్యా రాజకీయాలకు తెరతీశాడు. పాఠాలు చెప్పాల్సిన వాడు ప్రాణాలు తీసేందుకు తెగబడ్డాడు. ఆధిపత్యం కోసం మానవత్వాన్నే మరిచాడు. దాడులు, దౌర్జన్యాలకు దిగుతూ చివరకు మనిషిని చంపే స్థాయికి దిగజారాడు. వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్ హత్య కేసులో ప్రధాన ముద్దాయి పద్మనాభం కిరాతక నైజాన్ని గ్రామస్తులు వివరిస్తున్నారు. – సాక్షి, తిరుపతి ఉపాధ్యాయుడిగా ఉంటూ పద్మనాభం రాజకీయాలపైనే ఆసక్తి చూపేవాడు. 9ఏళ్ల క్రితం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందాడు. వృత్తిని అడ్డుపెట్టుకుని తెరచాటు రాజకీయాలు నడిపేవాడు. ఉడమలపాడు పంచాయతీ శెనగమిట్ట హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్నా విధులకు తరచుగా డుమ్మాకొట్టేవాడు. అధికారులు ఆకస్మికంగా తనిఖీలకు వస్తే తన గుట్టు బయటపడకుండా ఉండేందుకు ముందస్తు లీవ్ లెటర్‌ను స్కూల్లోనే ఉంచేవాడు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గెలుపునకు అహర్నిశలు పనిచేశాడు. అనంతరం ఆయన సహకారంతో పలు కాంట్రాక్ట్ పనులను చేజిక్కించుకున్నాడు. 2019 ఎన్నికల్లో సైతం బొజ్జల సుధీర్‌రెడ్డి తరపున పనిచేశాడు. సుధీర్ ఘోరంగా ఓడిపోవడం, అదే సమయంలో గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో నియోజకవర్గానికి దూరం కావడంతో బీజేపీని ఆశ్రయించాడు. తన బంధువులు, అనుచరులకు స్థానిక బీజేపీ నేత కోలా ఆనంద్ సమక్షంలో కాషాయ కండువా కప్పించాడు. ఎన్నికల తర్వాత బీజేపీ కండువా కప్పుకుంటున్న పద్మనాభం మేనల్లుడు (ఫైల్) ఆధిపత్యం కోసమే.. ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా వెంకటేష్ ఉడమలపాడు పంచాయతీ పరిధిలో ఎదుగుతుండడాన్ని పద్మనాభం ఓర్వలేకపోయాడు. తన మేనల్లుడు, బంధువులు, అనుచరులతో కలిసి వెంకటేష్‌తో తరచూ గొడవలకు దిగేవాడు. దీనిపై వెంకటేష్, స్థానికులు కూడా పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పద్మనాభం ఉద్యోగానికి ఇబ్బంది అవుతుందని స్థానికులు మానవత్వంతో ఆలోచించి కేసు నుంచి అతడ్ని తప్పించేవారు. ఇదే అలుసుగా తీసుకుని పద్మనాభం తన బంధువులు, అనుచరుల సహకారంతో రాజకీయ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయేవాడు. చదవండి: టార్గెట్ వైఎస్సార్సీపీ! పంచాయతీ పరిధిలో తన ఆధిపత్యమే కొనసాగాలనే ఉద్దేశంతో వెంకటేష్‌ను అడ్డు తప్పించేందుకు పథకం వేశాడు. అందులో భాగంగా గ్రామంలో గొడవలు సృష్టించి పోలీసుల సహకారంతో వెంకటేష్‌ని ఊరు నుంచి వెళ్లగొట్టించాడు. భార్య, పిల్లల కోసం వచ్చి వెళుతున్న విషయం తెలుసుకుని నిఘా పెట్టాడు. సోమవారం దారి కాచి వెంకటేష్‌ను దారుణంగా హత్య చేసి, పద్మనాభం తన అనుచరులతో కలిసి పరారైనట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. తప్పించుకోలేరు దొమ్మరపాలెంకు చెందిన వెంకటేష్ హత్యలో పాల్గొన్న వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాం. పద్మనాభం, ఆయన అనుచరుల కోసం ప్రత్యేక బృందాలతో తిరుపతి, శ్రీకాళహస్తితో పాటు పట్టణానికి ఆనుకుని ఉన్న నెల్లూరు జిల్లాలోనూ గాలిస్తున్నాం. త్వరలోనే వారిని అరెస్టు చేస్తాం. – నాగేంద్రుడు, డీఎస్పీ, శ్రీకాళహస్తి -
టార్గెట్ వైఎస్సార్సీపీ!
పాత కక్షలు పురివిప్పాయి.. వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.. హత్యా రాజకీయాలు ఓ కుటుంబాన్ని వీధిన పడేశాయి. ఎన్నికల్లో ఓటమిని ఓర్వలేని టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులకు దిగుతున్నాయి. నిండు ప్రాణాలను సైతం హరించేందుకు తెగబడుతున్నాయి. ప్రశాంతమైన పల్లెల్లో అరాచకం సృష్టించేందుకు దిగజారుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నాయి. పక్కా ప్రణాళికతో ప్రత్యర్థుల ఉసురు తీసేస్తున్నాయి. – సాక్షి, తిరుపతి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీ, బీజేపీ స్థానిక నేతలు ఏకమై రెచ్చిపోతున్నారు. ప్రశాంతంగా ఉండే పల్లెల్లో పగ, ప్రతీకారాలను పెంచి పోషిస్తున్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి అనుచరులను టార్గెట్ చేశారు. స్థానిక ఎన్నికల సమయంలో తొట్టంబేడు మండలం ఈదులగుంటకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు బత్తెయ్యను హత్య చేసేందుకు యత్నించారు. ఈ ఘటనలో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తి రూరల్ మండలానికి చెందిన బొజ్జల వర్గీయుడు రాంబాబు, ఆయన అనుచరులు పలుమార్లు వైఎస్సార్సీపీ కార్యకర్తలు, వలంటీర్లపై దాడులు చేశారు. ఆస్పత్రి వద్ద రోదిస్తున్న వెంకటేష్ కుటుంబ సభ్యులు, మృతుడు సాలాపక్షి వెంకటేష్ (ఫైల్) స్థానిక ఎన్నికల వేళ టీడీపీ, బీజేపీ నేతలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. రెవెన్యూ కార్యాలయం వద్ద బైఠాయించి నానా యాగీ చేశారు. బస్సు అద్దాలను పగలగొట్టి, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దౌర్జన్యానికి దిగారు. బొజ్జల సుధీర్‌రెడ్డి ఏకంగా పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకెళ్లి బెదిరింపులకు పాల్పడ్డారు. స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం కొనసాగుతుండడంతో టీడీపీ, బీజేపీ శ్రేణులు దాడులనే ప్రత్యామ్నాయంగా ఎంచుకున్నారు. తాజాగా శ్రీకాళహస్తి రూరల్ మండలం ఉడమల పంచాయతీ దొమ్మరపాళానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకటేష్‌ను అతి కిరాతంగా చంపేశారు. ఇందులో టీడీపీ, బీజేపీ కార్యకర్తల ప్రమే యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటన జిల్లావ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. చదవండి: ‘నిమ్మగడ్డ’ నియామకంపై మరో పిటిషన్ 3నెలల క్రితమే ప్లాన్..? సాలాపక్షి వెంకటేష్ వైఎస్సార్సీపీలో చురుకైన కార్యకర్త. చుట్టుపక్కల ఎస్సీ కాలనీల్లో మంచి గుర్తింపు ఉంది. వెంకటేష్ ఎదుగుదలను స్థానిక టీడీపీ నేత సాలాపక్షి పద్మనాభం ఓర్వలేకపోయాడు. పలు మార్లు తన అనుచరులైన శ్రావణ్‌కుమార్, సుకుమార్, అంకయ్య, రమేష్, హరితో కలసి వెంకటేష్‌తో ఘర్షణకు దిగాడు. మూడు నెలల క్రితం ఇరు వర్గాల మధ్య గొడవ జరిగిన సమయంలో ఓ పోలీస్ అధికారి జోక్యం చేసుకున్నాడు. టీడీపీ, బీజేపీ నేతలతో కుమ్మక్కై వెంకటేష్‌ను బెదిరించాడు. ఊరు వదలి వెళ్లాల్సిందిగా ఆదేశించాడు. లేకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరించాడు. దీంతో వెంకటేష్ గ్రామం విడిచివెళ్లిపోయాడు. భార్య, పిల్లలను చూసుకునేందుకు అప్పుడప్పుడు ఊరి పొలిమేరకు వచ్చి వారిని పిలిపించుకుని మాట్లాడి వెళ్లేవాడు. ఈ క్రమంలో వెంకటేష్ కదలికలపై పద్మనాభం, అతడి అనుచరులు నిఘా పెట్టారు. సోమవారం ఉదయం వెంకటేష్ వస్తున్నట్లు తెలుసుకుని దారి కాచారు. ఊరి పొలిమేరలో అడ్డుకుని కత్తులు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశారు. ఈ హత్య వెనుక ఓ పోలీస్ అధికారి పాత్ర సైతం ఉన్నట్లు మృతుడి బంధువులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు. చదవండి: యువతి కోసం గ్యాంగ్ వార్ -
వలంటీర్లపై మూకుమ్మడి దాడి
శ్రీకాళహస్తి రూరల్ (చిత్తూరు జిల్లా): మాజీ మంత్రి, టీడీపీ నేత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుల దాడిలో ముగ్గురు గ్రామ వలంటీర్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరంలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి రూరల్ సీఐ గుడికాటి విజయ్‌కుమార్ కథనం మేరకు.. మన్నవరం పంచాయతీలో కొల్లం వంశీ (21), సి.జయప్రకాష్ (24), సి.శ్రీనివాసులు (24) గ్రామ వలంటీర్లుగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించడానికి వారు గురువారం పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లారు. అప్పటికే స్థానిక టీడీపీ నేత, శ్రీకాళహస్తి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి తీసుకుపోయాడు. తాళాలు అడిగినా ఇవ్వలేదని చెంచయ్య నాయుడుపై వలంటీర్లు ఎంపీడీవో బాలాజీ నాయక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెచ్చిపోయిన చెంచయ్య నాయుడు, అతడి అనుచరులు వలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన సెల్ఫోన్లు లాక్కుని వెళ్లిపోయారు. ఎంపీడీవో ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేస్తుండగా.. మరోమారు టీడీపీ నేతలు చెంచయ్య నాయుడు, రాంబాబు నాయుడు, చెంచుకృష్ణయ్య, వెంకటేశ్వరావు, శ్రీనివాసులు, శివ తదితరులు మూకుమ్మడిగా వలంటీర్లపై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వలంటీర్లు రక్షించాలంటూ ఆర్తనాదాలు చేయడంతో వైఎస్సార్సీపీ కార్యకరలు.. చెంచయ్య నాయుడు, కోటి, నరేష్ దాడులకు పాల్పడుతున్న వారిని అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు వారిపై కూడా దాడికి దిగారు. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డవారిని స్థానికులు శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు వలంటీర్‌గా పనిచేస్తున్న తనను కులం పేరుతో దూషించి, దాడి చేశారని కొల్లం వంశీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దాడి చేసిన రంగినేని చెంచయ్యనాయుడు, రాంబాబు నాయుడు, తదితరులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ విజయ్‌కుమార్ తెలిపారు. వలంటీర్ల విధులకు ఆటంకం కలిగించారంటూ ఎంపీడీవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. కాగా, విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా తమపై విచక్షణారహితంగా దాడులు చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామని వలంటీర్లు తెలిపారు. గ్రామంలోకి వెళ్తే తమను చంపే ప్రమాదం ఉందని విలపించారు. -
చిత్తూరు జిల్లాలో టీడీపీకి భారీ షాక్..
-
టీడీపీకి గుడ్‌బై చెప్పిన మరో కీలకనేత
సాక్షి, చిత్తూరు : సార్వత్రిక ఎన్నికల వేళ టీడీపీకి మరో భారీ షాక్ తగిలింది. శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడు పార్టీకి గుడ్‌బై చెప్పారు. రేపు నెల్లూరు జిల్లా గూడూరులో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరతానని ప్రకటించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కార్యకర్తల సూచల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నమ్మించి మోసం చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి వల్ల గత ఐదేళ్లుగా అనేక అవమానాలకు గురయ్యానన్నారు. శ్రీకాళహస్తితో పాటు గూడూరులలో టీడీపీని చిత్తుగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. -
టికెట్లపై ఇంకా సస్పెన్స్.. టీడీపీ సిట్టింగ్‌లకు హైటెన్షన్!
సాక్షి, చిత్తూరు : ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపట్ల రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లలగక్కి.. పార్టీని వీడుతుంటే.. మరి కొంతమంది అంతర్గతంగా తమ నిరసనను తెలుపుతున్నారు. స్థానిక నేతల అభిప్రాయాలు తీసుకోకుండా ధనబలం చూసి ఎమ్మెల్యే టికెట్లు కేటాయిస్తున్నారని పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ పార్టీకి సేవ చేసిన నేతలను కాదని చివరి నిమిషంలో ఇతరులకు కేటాయిస్తున్నారని మండిపడుతున్నారు. పార్టీ క్యాడర్ కాదన్న వ్యక్తులను టికెట్ ఇస్తూ సిట్టింగ్‌లను అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీలో రాజుకున్న అసమ్మతి సెగలు తాజాగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని ఘోర అవమానానికి గురిచేశారు చంద్రబాబునాయుడు. ఎమ్మెల్యే టికెట్ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ రెండు రోజలుగా తిరుగుతున్న పట్టించుకోలేదు. కుటుంబంతో సహా రెండు రోజులుగా అమరావతిలో పడిగావులు పడ్డ కనికరించలేదు. చంద్రబాబు తీరుపై బొజ్జల వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాగా శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎస్పీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. ఒక వేళ ఎస్పీవీ నాయుడుకి శ్రీకాళహస్తి టికెట్ ఇస్తే కచ్చితంగా ఓడిస్తామని స్థానిక నేతలు, కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిలో కూడా సస్పెన్షన్ నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిత్యను పక్కనపెట్టే యోచనలో చంద్రబాబు ఉన్నారు. సత్యవేడు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే హేమలత తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాగా ఆదిత్య, హేమలతను కాదని జేడీ రాజశేఖర్వైపు చంద్రబాబు మొగ్గు చూపుతున్నారు. జేడీ రాజశేఖర్‌కు టికెట్ ఇవ్వడాన్ని టీడీపీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. -
నువ్వా..నేనా?
శ్రీకాళహస్తి టీడీపీ టికెట్ కోసం మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు హోరాహోరీగా పోటీపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టికెట్ తమదేనంటూ ఎవరికి వారు అనుచరుల వద్ద చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. సాక్షి, చిత్తూరు ,తిరుపతి: శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ టికెట్ తన కుటుంబానికి ఇస్తానని అధినేత హామీ ఇచ్చారని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెబుతున్నారు. చినబాబు లోకేష్ తనకు హామీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న విషయం తెలిసిందే. అసెంబ్లీ టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. జిల్లాలో రెండు, మూడు అసెంబ్లీ స్థానాలు మినహా మిగిలిన నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు కాలేదు. ఇందులో సిటింగ్ ఎమ్మెల్యేలకే టీడీపీ అధినేత టికెట్లు ఖరారు చేయలేదు. అందులో శ్రీకాళహస్తి ఒకటి. ఇక్కడ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఈసారి పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే శ్రీకాళహస్తి నుంచి భార్య బృందమ్మ లేదా కుమారుడు సుధీర్‌రెడ్డికి టికెట్ ఇవ్వమని అధినేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ మేరకు బొజ్జల కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే గోపాలకృష్ణారెడ్డి తన అనుచరుల వద్ద చెప్పుకుంటున్నారు. తన కుటుంబంలోని వారికి తప్ప మరెవరికీ ఇవ్వరని ఆయన తన అనుచరుల వద్ద గట్టిగాచెప్పుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా బొజ్జల కుమారుడు సుధీర్‌కి టికెట్ ఇప్పిస్తానని మాటిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీకాళహస్తి టికెట్ నాదే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా తానే పోటీ చేస్తున్నానని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు. తనకు మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల తంగేడుపాళెంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో స్వయంగా ఎస్సీవీ నాయుడు తనకే టికెట్ వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ఆ మేరకు సీఎం చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని చెప్పుకొచ్చారు. అదేవిధంగా మంత్రి నారా లోకేష్ కూడా గట్టిగా చెప్పినట్లు ఎస్సీవీ నాయుడు తన అనుచరుల వద్ద వెల్లడించినట్లు తెలిసింది. ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రచారం కూడా చేసుకోమని సూచించినట్లు సమాచారం. ఎన్నికల్లో ఖర్చుకు అవసరమైన నిధుల కోసం ఏకంగా తన ఎస్సీవీ కేబుల్‌ని విక్రయించిన ట్లు ప్రచారం సాగుతోంది. లోకేష్ బాబు మాట ఇవ్వడం, ఆ నమ్మకంతోనే కేబుల్ నెట్వర్క్ని విక్రయించినట్లు తెలుస్తోంది. ఎస్సీవీ నాయుడు తన అనుచరుల వద్ద చెబుతున్న సమాచారం మేరకు అసెంబ్లీ టికెట్ ఖరారు అయ్యిందనే ప్రచారం సాగుతోంది. దీంతో శ్రీకాళహస్తి టీడీపీ శ్రేణులు ఎవరివైపు వెళ్లాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నాయి. -
సీనియర్‌కు ఇదా గౌరవం?
సాక్షి, చిత్తూరు, తిరుపతి: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఈసారి పార్టీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపించ లేదు. జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాలు మినహా మిగిలిన స్థానాలకు అభ్యర్థులను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రకటించిన నియోజకవర్గాల్లో శ్రీకాళహస్తి ఒకటి. ఈ నియోజకవర్గానికి చెందిన బొజ్జల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు. ఎన్టీఆర్ హయాం నుంచి పార్టీలో ఉన్నారు. మామకు వెన్నుపోటు పొడిచిన సమయంలో చంద్రబాబు పక్షాన కీలకభూమిక పోషించిన వారిలో ఈయన ఒకరు. అలిపిరి సంఘటనలో గోపాలకృష్ణారెడ్డి కూడా తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. 1999 నుంచి 2014 ఎన్నికల వరకు ఆరు పర్యాయాలు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2004లో మినహా అన్నిసార్లూ గెలిచారు. అలాంటి సీనియర్ నాయకుడ్ని మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి తప్పించారు. దీంతో ఆయన పార్టీలో ముభావంగా ఉన్నారు. ఇదే తరుణంలో సీఎం ఆయనపై మరో పిడుగు వేశారు. వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తన సామాజిక వర్గానికి చెందిన వారిని తెచ్చుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారనిటీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. బొజ్జలకు మొండిచేయి.. బొజ్జల కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీన్ని సాకుగా చూపించి ఎస్సీవీ నాయుడికి టికెట్ ఇచ్చేందుకు సీఎం సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసి బొజ్జల కుమారుడు సుధీర్‌రెడ్డి సీఎం చంద్రబాబును కలిసి తన తండ్రికే తిరిగి టికెట్ ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. అయినా అధిష్టానం నుంచి ఎటువంటి స్పందనా కనిపించలేదు. ఇప్పటికే ఎస్సీవీ నాయుడికి కాంట్రాక్టు పనులు కట్టబెట్టారనే ప్రచారం జరుగుతోంది. రాజధాని అమరావతితో పాటు జిల్లాలో సుమారు రూ.300 కోట్లు విలువ చేసే పనులు అప్పజెప్పారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎంత ఖర్చైనా పెట్టుకునేలా ఎస్సీవీ నాయుడుకి సహాయ సహకారాలు అందిస్తున్నట్లు పార్టీలో అంతర్గత చర్చ నడుస్తోంది. ఇబ్బందుల్లో ఉన్న బొజ్జలకు అండగా నిలవాల్సిందిపోయి పక్కనబెట్టడంపై గోపాలకృష్ణారెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జక్కంపూడి రామ్మోహన్రావు మంత్రిగా ఉన్నారు. ఆయన తీవ్ర అనారోగ్యంతో మంచం పట్టినా మంత్రిగానే కొనసాగించటంతో పాటు జక్కంపూడి కుటుంబానికి వైఎస్సార్ అండగా నిలిచారని టీడీపీ కార్యకర్తలే గుర్తు చేసుకోవడం గమనార్హం. -
టీడీపీలో భగ్గుమన్న వర్గవిభేదాలు
సాక్షి, తిరుపతి : శీకాళహస్తి టీడీపీలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ సీనియర్ నాయకుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. అన్నాక్యాంటీన్ ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపలేదంటూ పార్టీ సీనియర్ నేత మోహన్ ఆందోళన చేపట్టారు. అనుచరులతో కలిసి ప్రారంభోత్సవానికి వచ్చిన బొజ్జల వాహనాన్ని అడ్డుకున్నారు. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని సీనియర్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఆందోళన మధ్యే ఎమ్మెల్యే బొజ్జల అన్నా క్యాంటీన్ ప్రారంభించి వెళ్లిపోయారు. -
జన్మభూమిలో టీడీపీ నేతల చిందులు
-
జన్మభూమిలో ‘గున్నా మామిడి’
సాక్షి, శ్రీకాళహస్తి (చిత్తూరు) : ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జన్మభూమి మా ఊరు కార్యక్రమం అధికార పార్టీ నేతల చిందులకు వేదికగా మారింది. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిర్దేశించిన కార్యక్రమంలో టీడీపీ నేతలు ‘గున్నా మామిడి’ పాటకు జోరుగా డాన్స్ వేశారు. ఈలలు వేస్తూ, ఒళ్లు మరిచిపోయి నృత్యాలు చేశారు. టీడీపీ నాయకుల నిర్వాకంపై స్థానికులు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా డాన్సులు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పచ్చబాబుల డాన్స్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శ్రీకాళహస్తి నియోజవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లో గెలుపొందారు. ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల జోక్యం తొలినాళ్ల నుంచి తెలిసిందే. దీంతో ప్రజల పాలిట కామధేనువు కావాల్సిన జన్మభూమి అపహస్యం పాలవుతోంది. ఐదో విడత జన్మభూమి కార్యక్రమం జనవరి 2-11 మధ్య రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. కాగా, ఐదో విడత జన్మభూమి కార్యక్రమంలో పలు చోట్ల గ్రామ ప్రజల నుంచి ప్రభుత్వం ప్రతిఘటన ఎదుర్కొన్న విషయం తెలిసిందే. -
ఏమిటీ ప్రకటనలు..?
► తండ్రా ... తనయుడా ? ► శ్రీకాళహస్తిలో మా నాయకుడెవరో ! ► టీడీపీ నాయకుల్లో అయోమయం శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీ చేస్తారా....లేదా ఆయన తనయుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి బరిలో ఉంటా రా...అనే అంశంపై పార్టీలో తీవ్రమైన చర్చసాగుతోంది. రెండు రోజుల క్రితం బొజ్జల తనయుడు బొజ్జల వెంకటసుధీర్రెడ్డి పట్టణంలోని పంచాయతీ అతిథి భవనంలో విలేకరుల ఏర్పాటు చేసి వచ్చే ఎన్నికల్లో తానే టీడీపీ నుంచి శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పోటీలో ఉంటానని...ఆ మేరకు మంత్రి నారా లోకేష్ తనకు హామీ ఇచ్చారని తెలిపారు. అయితే ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ సమావేశంలో ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సమక్షంలో దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ తరఫున బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పోటీలో ఉంటారని...ఆయన నామినేషన్ వేసి ఇంట్లో ఉన్నా.... కుప్పంలో సీఎం చంద్రబాబునాయుడులాగే గోపాలకృష్ణారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పార్టీ నేతలకు సూచించారు. దాంతో పార్టీ నేతలు ఇంతకీ తమ నాయకుడు తండ్రా ... ? తనయుడా ? అనే డోలాయమానంలో పడ్డారు. తండ్రీకొడుకులు చర్చించుకుని ఈ విషయంపై స్పష్టత ఇవ్వకుంటే ఇబ్బందిపడాల్సి వస్తుందని నాయకులు ఆందోళన చెందుతున్నారు. -
బొజ్జల, ఎంపీ శివప్రసాద్ గైర్హాజరు
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం చిత్తూరు జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశానికి మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, ఎంపీ శివప్రసాద్ గైర్హాజరు అయ్యారు. కేబినెట్ నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జల అలకబూనగా, తమను పట్టించుకోవడం లేదంటూ ఎంపీ శివప్రసాద్ బాహాటంగానే ముఖ్యమంత్రిపై తన అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. కాగా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెర మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్న విషయం తెలిసిందే. అయితే బుజ్జగింపుల పర్వంలో బొజ్జల మాత్రం తన రాజీనామాను వెనక్కి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరూ సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం గమనార్హం. -
మంత్రి లోకేశ్ కు చేదు అనుభవం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చిత్తూరు జిల్లా మునగలపాళెంలో చేదు అనుభవం ఎదురైంది. ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు. ఇసుక మాఫియాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. లోకేశ్ సమక్షంలోనే బొజ్జలపై బాధిత మహిళ విరుచుకుపడింది. ‘మీ వెనుకున్నవారే ఇదంతా చేశారు. బొజ్జల అనుచరుల వల్లే ఊరు వల్లకాడుగా మారింది. పది లక్షలిస్తా నా భర్తను తీసుకొస్తారా’ అంటూ నిలదీయడంతో సమాధానం చెప్పలేక అక్కడ నుంచి బొజ్జల వెనుదిరిగారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు. -
అవమాన భారం
► నిన్న బొజ్జల, నేడు ఎంపీ శివప్రసాద్ ► టీడీపీ నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి ► సరైన ప్రాధాన్యత లేదంటూ ఆక్రోశం ► జిల్లాలో రగిలిపోతున్న దళిత సంఘాలు ► ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో టీడీపీ నేతల్లో అంతర్మథనం మొదలైంది. చిత్తూరు జిల్లాలో పార్టీ పరంగా సీనియర్లకు ఎదురవుతున్న వరుస అవమానాలపై పరస్పర చర్చ మొదలైంది. నిన్న మొన్నటి వరకూ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అనారోగ్యం పేరిట పార్టీ అధిష్టానం ఆయనను మంత్రి పదవి నుంచి పక్కన పెట్టడంతో మనస్తాపానికి గురైన బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలో ఈ వేడి చల్లారక ముందే సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తెర మీదకు వచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించినందుకు ఆయనపై సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడ మే కాకుండా ఏకంగా టెలీకాన్ఫరెన్సు ఏర్పాటు చేసి మంత్రుల సమక్షంలో భగ్గుమన్నారు. ఎంపీ శివప్రసాద్ తీరుపై మండిపడ్డారు. అంతటితో ఆగకుండా హథీరాంజీ మఠం భూముల సిఫార్సులను పరిగణనలోకి తీసుకోనందునే ఎంపీ శివప్రసాద్ పార్టీపై ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. దీంతో వెంట నే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసిన ఎంపీ తన ఆక్రోశాన్నీ, ఆవేదననూ రెండోసారి వెళ్లగక్కి తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తే ఎందాకైనా తాను సిద్ధమేనంటూ తెగేసి చెప్పారు. ఈ పరిణామాలన్నీ పార్టీ నేతలను విస్మయానికి గురి చేయడమే కాకుండా వాస్తవాలపై దృష్టి పెట్టేలా చేశాయి. తిరుపతి: జిల్లాలో టీడీపీ నేతలు చాలామంది ఏడాదిగా అసంతృప్తితోనే ఉన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మండల, జిల్లాస్థాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తమ పనులేమీ కావడం లేదని ఆ పార్టీ ఎమ్మెల్యేలు భగ్గుమంటున్నారు. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన జిల్లా అధికారులెవ్వరూ తమ సిఫార్సులను ఖాతరు చేయడం లేదని ఒక సందర్భంలో టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు సీఎం చంద్రబాబునాయుడు దగ్గర మొర పెట్టుకున్నారు. పార్టీ ఎమ్మెల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు పలుమార్లు జిల్లా పాలనపై మండిపడడమే కాకుండా జరుగుతున్న తప్పిదాలపై ఆగ్రహం వ్యక్తంచేసిన సందర్భాలూ ఉన్నాయి. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ, ఉద్యోగాల బదిలీల్లోనూ పార్టీ అధిష్టానం తమకు సముచిత ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి దాదాపు పార్టీ నేతలందరిలోనూ ఉంది. జిల్లాలో సీఎంతో పాటు, ఆయన తనయుడు లోకేష్‌బాబు మాటే చెల్లుతుంది. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రుల మాటకు పెద్దగా విలువ లేనట్లే. ఈ పరిస్థితులను పదేపదే అవలోకనం చేసుకుంటున్న పార్టీ నాయకులు ఏ పని కోసమైనా విజయవాడ వెళ్లి సీఎంను లేదా లోకేష్‌ను కలుస్తూ వస్తున్నారు. చిచ్చు రేపిన మంత్రివర్గ విస్తరణ ఇటీవల జరిగిన రాష్ట్ర కేబినెట్ విస్తరణ జిల్లా టీడీపీలో అసంతృప్తికి ఆజ్యం పోసింది. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న గాలి ముద్దు కృష్ణమనాయుడు, ఎమ్మెల్యే ఆదిత్య, శంకర్ వంటి వారు ఒక సందర్భంలో నిరాశకు లోనయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తన కుమారుడు లోకేష్‌ను జిల్లా ప్రాధాన్యత కిందే మంత్రిని చేయడంతో ఆశావహుల్లో నీళ్లు పోసినట్లయ్యింది. ఇకపోతే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని తప్పించడం ద్వారా ఇచ్చే రెండో మంత్రి పదవిని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకు కట్టబెట్టడం కొంత మంది నాయకుల్లో తీవ్ర అసంతృప్తిని రేపింది. పార్టీ కష్టకాలంలో జెండాను మోయడమే కాకుండా కేడర్‌ను నడిపించిన నాయకులను విస్మరించి కీలకమైన పదవులను మధ్యలో వచ్చిన నాయకులకు కట్టబెట్టడం ఎంతో మందికి నచ్చలేదు. అయినప్పటికీ అధినేతకు ఎదురు చెప్పలేక, తమలోని ఆవేదనను బయటకు చెప్పలేక మౌనం వహించారు. అయితే సీఎంకు సన్నిహితుడైన ఎంపీ శివప్రసాద్ మాత్రం అంబేడ్కర్ జయంతి రోజున కడుపులోని బాధను కక్కేశారు. దీన్ని జీర్ణించుకోలేని పార్టీ అధిష్టానం సర్దిచెప్పడం మాని అభాండాలు వేయడానికి ప్రయత్నించింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులతో ప్రెస్మీట్లు పెట్టించి ఎంపీ శివప్రసాద్‌పై దండెత్తేలా ఆదేశాలిచ్చింది. మంత్రి జవహర్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సొంత పార్టీ ఎంపీని తప్పుబట్టారు. దీంతో జిల్లాలోని టీడీపీ దళిత నాయకులంతా ఒక్కటయ్యారు. వీరికి దళిత సంఘాలు కూడా తోడయ్యాయి. ఎంపీ శివప్రసాద్ వాదనను బలపరుస్తూ, బుద్దా వెంకన్న వాఖ్యలను ఖండిస్తూ ఆది, సోమవారాల్లో ఆందోళనలు చేపట్టారు. ఎంపీ శివప్రసాద్‌కు అండగా నిలబడ్డారు. ఈ పరిణామాలన్నీ టీడీపీకి ఇబ్బందికరంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ సీనియర్లకు జరుగుతున్న అవమానాలకు అడ్డుకట్ట వేయకపోతే భవిష్యత్తులో పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని వీరు హెచ్చరిస్తున్నారు. -
‘ప్రాణం ఉన్నంతవరకూ టీడీపీలోనే’
తిరుపతి: మంత్రివర్గం నుంచి తొలగించడంతో అలకబూనిన మాజీ మంత్రి,శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకష్ణారెడ్డి ఎట్టకేలకు తన రాజీనామాపై వెనక్కి తగ్గారు. తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతానని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. బొజ్జల ఈరోజు ఉదయం కాళహస్తిలో తన అనుచరులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. వారితో చర్చల అనంతరం టీడీపీలోనే కొనసాగుతానని ప్రకటన చేశారు. ప్రాణం ఉన్నంతవరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉంటానని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. అలాగే పార్టీ పదవులకు రాజీనామా చేసిన నేతలు వాటిని వెనక్కి తీసుకోవాలని సూచించారు. కాగా మంత్రి వర్గం నుంచి ఉద్వాసన పలకడంతో బొజ్జలతో పాటు ఆయన అనుచర వర్గమంతా రగిలిపోయిన విషయం తెలిసిందే. మంత్రి వర్గ విస్తరణ మరుక్షణమే బొజ్జల తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. -
ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం
శ్రీకాళహస్తి: మంత్రివర్గం నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను కేబినెట్ నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై ఈ నెల 15న తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని ఆయన తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, అయితే ఈ కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఈ చర్యకు బాధపడే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని మీడియకు తెలియచేస్తానని బొజ్జల తెలిపారు. -
బొజ్జల తనయుడి ఆవేదన
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యం సరిగా లేదని మంత్రి పదవి నుంచి తొలగించడం బాగోలేదని మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్ అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధకరమన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ కుటుంబానికి మంత్రి పదవి కొత్తేమి కాదని, తన తాత దగ్గర నుంచి మంత్రులుగా వ్యవహరించారన్నారు. 35 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన వ్యక్తిని డీ గ్రేడ్ చేయడం ఆవేదన కలిగిస్తోందన్నారు. మంత్రులందరి కంటే తన తండ్రి ఎక్కువగా తిరిగారని చెప్పారు. మంత్రిగా పనికిరానప్పుడు ఎమ్మెల్యేగా ఎందుకని రాజీనామా చేశారన్నారు. తన తండ్రికి మద్దతుగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజక వర్గంలోని జెడ్పీటీసీ సభ్యుల నుంచి ఆలయ కమిటి చైర్మన్ల వరకు అందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేశారని చెప్పారు. ఇదే విషయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ సీఎం రమేష్‌లకు వివరించామన్నారు. ఇదంతా ప్రశాంత వాతావరణంలో జరిగితే, తన తల్లి వారిపై ఆగ్రహించినట్టుగా సోషల్ మీడియాలో రావడం బాధాకరమన్నారు. ఈ దుష్ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. రెండు మూడు రోజుల్లో నియోజకవర్గంలోని కార్యకర్తలతో తన తండ్రి సమావేశమవుతారని, తదుపరి కార్యచరణపై నిర్ణయం తీసుకుంటారని ఆయన వివరించారు. -
మంత్రివర్గ విస్తరణ ‘దేశం’లో మంటలు
-
శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా
⇒శ్రీకాళహస్తిలో దేశం కనుమరుగే అంటున్న నేతలు ⇒ ప్రస్తుతం 300 మంది..రేపటికల్లా 100 శాతం మంది రాజీనామాలు ⇒ఆలయ కమిటీ చైర్మన్ గురవయ్యనాయుడు, మున్సిపల్ వైస్‌చైర్మన్ పార్థసారథి వెల్లడి శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీశాఖ మంత్రి పదవి నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని చంద్రబాబు తొలగించడంతో ఆదివారం శ్రీకాళహస్తి టీడీపీ నాయకులు, నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి వరకు చంద్రబాబునాయుడు గొప్ప నాయకుడు అని పొగిడిన వాళ్లే ఆదివారం వెన్నుపోటుదారుడు అంటూ అరిచి గగ్గోలు పెడుతున్నారు. మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన ఘనుడు చంద్రబాబు అని అలాంటి వ్యక్తికి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన సేవలు గుర్తుకు రావంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబుతో ప్రయాణం చేస్తు అలిపిరి ఘాట్ వద్ద బాంబు ప్రమాదంలో బొజ్జల తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. నాడు ఎన్టీఆర్‌ను కాదని చంద్రబాబు నడిచిన విషయం ఆయన గుర్తుంచుకోకపోవడం దారుణమని పలువురు నాయకులు బహిరంగంగానే సీఎంను దుమ్మెత్తి పోస్తున్నారు. తిరిగి బొజ్జలను మంత్రివర్గంలో తీసుకోకపోతే శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి నామరూపాలు ఉండవంటూ నేతలు హెచ్చరించారు. 5 సార్లు ఎమ్మెల్యే.. 3 సార్లు మంత్రి..అయినా పక్కన పెట్టేశారు.. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందిన బొజ్జల 2004లో మినహా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మూడుసార్లు మంత్రిగా పనిచేశారు. ఇంత సీనియర్ నేతను మంత్రి పదవి నుంచి తొలగించడం పార్టీకే చేటుగా టీడీపీ సీనియర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. బొజ్జలతోనే తామంతా.. నియోజకవర్గంలో కేవలం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కృషితో వచ్చిన పదవులే తప్ప.. అధిష్ఠానం గుర్తించి ఇచ్చినవి కాదని దేవస్థానం చైర్మన్ పోతుగుంట గురవయ్యనాయుడు అన్నారు. శనివారం రాత్రి ఆరోసారి టీడీపీ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయిలో పార్టీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పోతుగుంట గురవయ్యనాయుడు మాట్లాడుతూ పార్టీ ప్రారంభం నుంచి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనసాగుతున్నారని చెప్పారు. దాంతోనే వరుసగా నియోజకవర్గంలో అందరు రాజీనామాలు చేస్తున్నారని.. ఇప్పటికే 300 మందికి పైగా ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేశారని తెలిపారు. మరోసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డితో చర్చించి అవసరమైతే తానూ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తొట్టంబేడు మండలంలో జెడ్పీటీసీ అనçసూయమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు గాలి అనసూయమ్మ, ఎంపీపీ పోలమ్మ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామాంజులు నాయుడు, సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు గాలి మురళీనాయుడు తదితరులు రాజీనామా చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి మాట్లాడుతూ దశాద్దాలుగా పార్టీని నమ్ముకున్న వారి పదవులు తొలగించి.. వైఎస్సార్సీపీలో గెలుపొంది పార్టీ ఫిరాయించి వచ్చిన నలుగురుకి మంత్రి పదవులు కట్టబెట్టడం సిగ్గు చేటన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే పదవుల్లో ఉన్న 80 శాతం మంది రాజీనామా చేశారని.. రేపటికల్లా 100 శాతం రాజీనామాలు చేస్తారని ఆయన వెల్లడించారు. సింగల్‌విండో చైర్మన్ తాటిపర్తి రవీంద్రనాథ్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చెంచయ్యనాయుడు, టౌన్‌బ్యాంక్, పాలసోసైటీ తదితర అన్ని కమిటీల వారు మూకుమ్మడిగా రాజీనామా చేశారని తెలిపారు. సమావేశంలో ముఖ్యమైన పార్టీ నేతలు కొండుగారి శ్రీరామమూర్తి, తాటిపర్తి ఈశ్వర్‌రెడ్డి, దందోలు భక్తవత్సలరెడ్డి, ఆలయ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పార్టీ నేతలు తదితరులు పాల్గొన్నారు. -
అసంతృప్తి సెగ
⇒అమర్‌కు అందలం, బొజ్జలకు పరాభవం ⇒ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన గోపాలకృష్ణా రెడ్డి ⇒అంతర్మథనంలో గాలి ముద్దుకృష్ణమనాయుడు ⇒అలకపాన్పెక్కిన తంబళ్లపల్లె, చిత్తూరు శాసనసభ్యులు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జిల్లా టీడీపీలో అసంతృప్తులకు ఆజ్యం పోసింది. రాష్ట్ర మంత్రివర్గంలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి చోటు దక్కడంపై ఆ పార్టీ జిల్లా నేతలు రగిలిపోతున్నారు. సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డిని పక్కన పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేయడాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గ నాయకులు ముక్తకంఠంతో సమర్థిస్తున్నారు. మీ వెంటే మేమంటూ రాజీనామాల పర్వానికి పూనుకోవడం కలకలం రేపింది. పలమనేరు: జిల్లా టీడీపీలో అసంతృప్తులు, అలకపాన్పులు మొదలయ్యాయి. మంత్రివర్గంలో చోటు కోల్పోయిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తన ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు రాజీనామా బాట పట్టారు. చివరిదాకా రేసులో ఉన్న ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు సైతం మంత్రి పదవి దక్కకపోవడంతో అంతర్మథనంలో ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పదవిని ఆశించిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్, చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం అధినేత తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద అమరనాథరెడ్డికి మంత్రి పదవిని కట్టబెడ్డం జిల్లాలోని ఆపార్టీలో చిచ్చును రేపి వర్గపోరుకు ఆజ్యం పోసింది. వైశ్రాయ్ హోటల్నుంచి బాబు వెంటే.. బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తొలినుంచి చంద్రబాబు వెంటే ఉన్నారు. నాడు ఎన్టీఆర్‌పై తిరుగుబావుటా ఎగురవేసిన వైశ్రాయ్ హోటల్ వ్యవహారం నుంచి బాబుతో జతకట్టిన బొజ్జల ఇంతవరకు సొంత జిల్లావాసిగా ఆయనకు వెన్నుదన్నుగా ఉన్నారు. అలిపిరి బాంబు పేలుడు ఘటనలోనూ ఆయనతోపాటు గాయడ్డారు. చివరకు అనారోగ్య కారణం చూపి తనను మంత్రి పదవినుంచి తొలగించడాన్ని బొజ్జల జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసం తనను పక్కనబెట్టి పార్టీ ఫిరాయించిన అమర్నాథ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. దీంతో మనస్థాపానికి గురైన బొజ్జల తాను అనారోగ్యంతో మంత్రి పదవికి పనికిరానప్పుడు ఎమ్మెల్యే పదవికి మాత్రం ఎందుకంటూ తన రాజీనామాను స్పీకర్‌కు పంపారు. ఆయనకు మద్దతుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ నేతలు పలువురు తమ పదవులకు రాజీనామా చేశారు. ధర్నాలకు దిగారు. సోమవారం మరికొందరు రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. ఆ ముగ్గురి తీవ్ర నిరాశ కమ్మ సామాజిక వర్గం నుంచి సీనియర్ టీడీపీ నేత ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు మంత్రిపదవిని ఆశించారు. అయితే జిల్లాకే చెందిన లోకేష్‌కు మంత్రి పదవిని ఇచ్చి మళ్లీ అదే సామాజికవర్గానికి కుదరదనే తలంపుతో తనను పక్కన పెట్టడంతో ఆయన రగిలిపోతున్నారు. ఇప్పటికే తన అనుచరులతో బాధను వెలగక్కినట్టు సమాచారం. మరోవైపు గత కొన్నాళ్లుగా మంత్రి పదవి రేసులో ఉన్న చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ సైతం ముఖ్యమంత్రిపై లోలోపల అసంతృప్తితో ఉన్నారు. కాపు సామాజిక వర్గంనుంచి తనకు మంత్రి పదవి దక్కుతుందని ఆమె పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలోని పడమటి ప్రాంతానికి చెందిన తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ బీసీ కోటాలో మంత్రి పదవి ఆశించారు. చివరికి అది దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. పార్టీ కోసం కష్టపడిన తమను కాదని పార్టీ ఫిరాయించిన వారికి మంత్రివర్గంలో చోటు కల్పించడాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా టీడీపీలో వర్గపోరు మంత్రి పదవి విషయంలో రేగిన మంటలు జిల్లా టీడీపీలో వర్గపోరుకు ఆజ్యం పోశాయి. కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రికి వ్యతిరేకంగా మంత్రి పదవిని ఆశించి భంగపడిన ఎమ్మెల్యేలు జతకట్టే అవకాశాలున్నాయి. ఇప్పటికే పలమనేరులో అమర్నాథ్ రెడ్డికి నియోజకవర్గ ఇన్చార్జ్ సుభాష్ చంద్రబోస్‌కు మధ్య అంతర్యుద్ధం సాగుతోంది. ఆది నుంచి తన వర్గానికి ప్రాముఖ్యతనిచ్చే అమర్ మనస్తత్వం జిల్లాలోనూ వర్గపోరుకు బీజం వేయడం ఖాయమని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. అంతర్గత వర్గపోరుతో భవిష్యత్తులో కొందరు టీడీపీని వీడే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆత్మరక్షణలో పడిన బాబు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడల్లా సొంత జిల్లాలో టీడీపీకి మెజారిటీ ఎమ్మెల్యే స్థానాలు దక్కనేలేదు. దీనికితోడు ప్రస్తుతం జిల్లాలో వైఎస్సార్సీపీ బలంగా ఉండడంతోనే బాబు ఆత్మరక్షణలో పడి అమర్నాథ రెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టాల్సి వచ్చిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
‘దేశం’లో మంటలు
♦ చిచ్చురేపిన మంత్రివర్గ విస్తరణ ♦ రగిలిపోతున్న టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు సాక్షి నెట్వర్క్: మంత్రివర్గ విస్తరణ అధికార తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపింది. దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తున్న తమను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడం పట్ల సీనియర్లు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మోసపూరిత వైఖరిపై దుమ్మెత్తి పోస్తున్నారు. తమను తీవ్రంగా అవమానిం చిన టీడీపీలో ఇక ఉండబోమంటూ రాజీనామాలు చేస్తున్నారు. ఇలా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అవసరమైతే తానే సొంతంగా పార్టీ పెడతా నని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. మంత్రి పదవి నుంచి ఉద్వాసనకు గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బొజ్జల అనుచరులంతా ఆయన బాటలోనే పార్టీని వీడుతున్నారు. చింతమనేని రాజీనామా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన పితాని సత్యనారాయణకు మంత్రి పదవి ఇవ్వడంపై పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆదివారం దెందులూరు నియోజకవర్గ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అనుచరులతో సమావేశమయ్యారు. తనకు ప్రజాప్రతినిధిగా కొనసాగడం ఇష్టం లేదని చెప్పారు. వేరే పార్టీలోకి వెళ్లనని, కావాలంటే సొంతంగా పార్టీ పెడతానని ప్రకటించారు.చింతమనేని ఏలూరు నుంచి నేరుగా విజయవాడ వెళ్లారు. అక్కడ అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణ ఇంటికి వెళ్లి, వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు చెప్పి రాజీనామా లేఖను ఇచ్చారు. తర్వాత సీఎం తో భేటీ అయ్యారు. అజ్ఞాతంలోకి ఎమ్మెల్యే బండారు విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి తాజా విస్తరణలో చోటు దక్కలేదు. దీంతో ఆయన తన గన్‌మెన్, వ్యక్తిగత కార్యదర్శిని సరెండర్ చేశారు. తన జాడ కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తనను కనీసం పరిగణనలోకి తీసుకోక పోవడం బాధాకరమని బండారు ‘సాక్షి’ ప్రతినిధితో ఫోన్లో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. అనిత, సర్వేశ్వరరావు,ఎంవీవీఎస్ మూర్తి అసంతృప్తి మంత్రివర్గంలో చోటు కోసం చివరి నిమిషం వరకూ ప్రయత్నించిన పాయకరావుపేట ఎమ్మెల్యే అనిత, అరుకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావులతోపాటు సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి అసంతృప్తితో రగిలిపోతున్నారు. శ్రీకాళహస్తి టీడీపీ నేతల రాజీనామా రాష్ట్ర మంత్రివర్గంలో పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథరెడ్డికి చోటు దక్కడం చిత్తూరు జిల్లా టీడీపీలో సెగలు పుట్టిస్తోంది. తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు ఆవేదన చెందుతున్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ, తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాద వ్ సైతం అధినేతపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ నేతలు ఆదివారం దాదాపు 300 మంది టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. టీడీపీ పదవికి ఎమ్మెల్యే గోరంట్ల రాజీనామా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖను టీడీపీ చంద్రబాబుకు,పార్టీ వ్యవహారాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ వీవీవీఎస్ చౌదరికి పంపించారు. ఆ లేఖను వాట్సాప్‌లో మీడియా ప్రతినిధులకు పంపారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. లేఖలోని అంశాలను ప్రస్తావించారు. కాగా, గోరంట్ల కు మంత్రి పదవి ఇవ్వకపోవడాన్ని నిరసిస్తూ రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు ప్రకటించారు. దూళిపాళ్ల, మోదుగుల,యరపతినేని అసంతృప్తి గుంటూరు జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు మంత్రి పదవులు ఆశించి భంగపడ్డారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌కు పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పొన్నూరు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు ధూళిపాళ్ల నివాసం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే నరేంద్ర స్పందిస్తూ.. రెండు రోజుల్లో శ్రేణుల్లో ఉన్న అసంతృప్తిని సీఎం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు సమావేశమై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంత్రి పదవి ఆశించిన గురజాల ఎమ్మెల్యే యరపతినేని కూడా బాబు తీరుపై లోలోన మధనపడుతున్నారు. దళితుడు అయినందుకే రావెలను తొలగించారు ‘‘కేబినెట్లో నేరచరిత్ర ఉన్నవాళ్లు, అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి జోలికి వెళ్లకుండా, కుల రాజకీయం చేసి, మచ్చలేని మనిషి రావెల కిషోర్‌బాబుపై వేటు వేయడం ఏమిటి? కుల వివక్షతోనే చంద్రబాబు ఇలా చేశారు. దీని పర్యవసానం ఎలా ఉంటుందో 2019 ఎన్నికల్లో చూపిస్తాం’’ అని అంటూ దళితులు తేల్చిచెప్పారు. రావెలను మంత్రి పదవి నుంచి తొలగించడంను నిరసిస్తూ ఆదివారం గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో దళితులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. -
టీడీపీలో విస్తరణ చిచ్చు.. ఎమ్మెల్యే రాజీనామా
-
టీడీపీలో విస్తరణ చిచ్చు.. ఎమ్మెల్యే రాజీనామా
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మంత్రి వర్గ విస్తరణ అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. మంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర అసంతృప్తికి గురైన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, స్పీకర్ కోడెల శివప్రసాద్ రావుకు ఆయన రాజీనామా లేఖ పంపారు. బొజ్జల ప్రాపర్ ఫార్మాట్లోనే రాజీనామా లేఖ పంపారు. మంత్రి పదవి నుంచి బొజ్జలను తొలగించడంతో ఆయన వర్గీయులు రగిలిపోతున్నారు. బొజ్జల నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ఆందోళనకు సిద్ధమవుతున్నారు. పార్టీని నమ్ముకుంటే బొజ్జలపై వేటు వేస్తారా అని ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జెడ్పీటీసీ అనసూయమ్మ, ఎంపీపీ పోలమ్మ రాజీనామా చేశారు. చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు ఇవ్వడంపై టీడీపీ నేతలు భగ్గముంటున్నారు. ఇక మంత్రివర్గ విస్తరణలో అవకాశం రాని సీనియర్లు మండిపడుతున్నారు. గౌతు శివాజీకి మంత్రి పదవి దక్కకపోవడంపై ఆయన కూతురు శిరీష.. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. -
విస్తరణం
►ఏప్రిల్ 2నరాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ►పరిశీలనలో గాలి ముద్దుకృష్ణమ పేరు ►ఉద్వాసన జాబితాలో మంత్రి బొజ్జల ? ►బయటపడుతున్న గ్రూపుల పోరు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీలో మరోమారు వర్గపోరు బహిర్గతమవుతోంది. జిల్లా మంత్రి బొజ్జల స్థానంలో ఈ దఫా తమ నేతకు మంత్రివర్గం లో స్థానం కల్పించాలని గాలి ముద్దుకృష్ణమనాయుడి వర్గం అధినేతపై ఒత్తిడి తెస్తోంది. సొంత జిల్లాకు చెందిన రెండు, మూడు వర్గాల ఒత్తిడితో చంద్రబాబు తలపట్టుకుంటున్నారు. తిరుపతి : రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు తేదీ ఖరారు కావడంతో జిల్లాలోని ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. రెండు నుంచి మూడు గ్రూపులుగా విడిపోయిన పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు తమదైన పైరవీలు ప్రారంభించారు. ఉగాదికి ముందే విస్తరణకు సంబంధించిన ఊహాగానాలు తెరమీదకు వచ్చినప్పటికీ గురువారం సాయంత్రం విస్తరణ అంశం కొలిక్కి రావడంతో మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్లో ఉత్కంఠ మొదలైంది. ఏపీ మంత్రి వర్గ విస్తరణకు ఏప్రిల్ రెండో తేదీని నిర్ణయించడంతో జిల్లాలోని టీడీపీ నాయకుల్లో రాజకీయ అలజడి మొదలైంది. ప్రస్తుతంఉన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఉద్వాసన ఖాయమని ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చెబుతున్నాయి. పైగా టీడీపీ అధిష్టానం సూచన ప్రాయంగా తెలియజేసిన జాబితాలో కూడా బొజ్జల పేరు వినిపిస్తోంది. బొజ్జల స్థానంలో జిల్లాకు చెందిన మరొకరికి అవకాశం కల్పించడం మంచిదని రెండు నెలల కిందటే పార్టీ అధిష్టానానికి జిల్లా నేతలు తెలియజేశారు. అంతేకాకుండా సీఎం సొంత జిల్లా కావడంతో సమర్థుడైన నేతకు మంత్రి పదవి కట్టబెట్టాలని పార్టీ యోచిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న గాలి ముద్దుకృష్ణమనాయుడు ఎప్పటినుంచో మంత్రి పదవిపై ఆశ పెట్టుకున్నారు. తనకున్న శక్తియుక్తులన్నీ ఉపయోగించి చంద్రబాబునాయుడు దగ్గర మార్కులు కూడా కొట్టేసినట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఉన్న మంత్రి బొజ్జలను కేబినెట్ నుంచి తొలగిస్తే అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని మరో వర్గం సూచిస్తోంది. దీంతో వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన అమరనాథ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని బాబు ఆలోచించారు. అయితే అమరనాథరెడ్డి పేరును పార్టీలోని మరోవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పార్టీని నమ్ముకుని ఎన్నికల్లో పనిచేసిన వారిని కాదని పార్టీ మారిన నేతకు పట్టం కడితే కేడర్ నిరుత్సాహానికి గురవుతుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా కసరత్తు చేస్తున్నారని సమాచారం. ఇదిలా ఉండగా మంత్రి పదవిని ఆశిస్తున్న నాయకుల మధ్య పోటీ పెరిగిన నేపథ్యంలో గ్రూపుల వివాదాలు కూడా తెరమీదకు వస్తున్నాయి. పార్టీ అధిష్టానం దగ్గర ఒకరిపై మరొకరు అనూహ్యంగా ఫిర్యాదులు చేసుకుంటున్నారని పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చంద్రబాబు తన తనయుడు లోకేష్ బాబుకు మంత్రి పదవి ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో ఈ జిల్లాలో మరో వ్యక్తికి ఇవ్వకుంటే బాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్టు కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు. నేడో రేపో నిర్ణయం మంత్రి పదవి ఎవరిని వరిస్తుందో అన్న విషయంపై తీవ్రంగా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో శుక్ర, శనివారాల్లో ఏవరో ఒకరి పేరు ఖరారయ్యే వీలుందని సమాచారం. -
మంత్రి బొజ్జల తనయుడి నుంచి నాకు ప్రాణహాని!
తిరుపతి: వైఎస్ఆర్ సీపీ నేతను ఆరు నెలల్లో లేపేస్తానంటూ ఏపీ మంత్రి తనయుడు వార్నింగ్ ఇవ్వడం కలకలం రేపింది. రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు తెర తీశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డిపై సుధీర్ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యపు మధుసూదన్ రెడ్డి, వైఎస్ఆర్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నారాయణస్వామితో సహా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఆరు నెలల్లో లేపేస్తానని సుధీర్ రెడ్డి తనకు వార్నింగ్ ఇచ్చాడని, ఆయన నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని బియ్యపు మధుసూదన్ రెడ్డి ఎస్పీని కోరారు. టీడీపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకోలేదని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గతంలో శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో భ్రమరాంబపై విరుచుకు పడ్డ విషయం తెలిసిందే. 'ఆలయంలో పాలనా వైఫల్యాలపై మాకు సూచనల వరకు ఒకే గానీ మీరే స్వయంగా తనిఖీలు చేయవద్దు' అంటూ మంత్రి సతీమణికి ఈవో స్పష్టం చేయగా.. బృందమ్మ మాత్రం అదే తీరుగా వ్యవహరించడంతో ఈవో సెలవుపై వెళ్లడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. తరచుగా టీడీపీ నేతలు, మంత్రులు.. వారి సన్నిహితులు మహిళలు, అధికారులపై దాడులకు పాల్పడుతూ రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. -
తిరుపతి–వాస్కోడిగామా రైలు ప్రారంభం
తిరుపతి అర్బన్: తిరుపతి–వాస్కోడిగామా(గోవా) మధ్య ఎక్స్‌ప్రెస్ రైలును రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం సాయంత్రం తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తిరుపతికి రైల్వే పరంగా తక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు. ప్రస్తుతం ఈ పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు. కొత్త రైళ్లు వస్తున్నాయని, అభివృద్ధి పనులు వేగం పుంజుకున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. ఎంపీ వరప్రసాద్ మాట్లాడుతూ తిరుపతి రైల్వేస్టేషన్ ఆధునీకరణ, దక్షిణం వైపు టీటీడీ సహకారంతో చేపట్టనున్న రైల్వే అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. -
15 కోట్ల మొక్కలు పెంపకం
రేణిగుంట: హరితాంధ్రప్రదేశ్ సాధన దిశగా డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో 15 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని మామండూరు అటవీప్రాంతంలో మంగళవారం సామాజిక వనవిభాగం నిర్వహించిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో 98,350 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందన్నారు. అడవుల విస్తీర్ణం 23 శాతం నుంచి 33శాతానికి పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విలువైన సంపద ఎరచ్రందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లభించని ఈ ఎరచ్రందనం చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో లభిస్తుందని, విలువైన సంపద కొందరి అక్రమాల వలన అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక వనభోజన కార్యక్రమం అందరినీ ఒక్కటిగా చేస్తుందని, ఇలాంటి సాంప్రదాయం భావితరాలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమాన్ని మరో 10 రోజుల్లో జిల్లా అంతటా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వనాల ఆవశ్యకతపై నిర్వహించిన వ్యాసరచన, డ్రారుుంగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం-మనం, ప్రకృతి పిలుస్తోంది వంటి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ చలపతిరావు, డీఎఫ్‌వో శ్రీనివాసులు, సర్పంచ్ ఈశ్వరమ్మ, ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ సభ్యురాలు లీలావతి, డీఎస్పీ నంజుండప్ప పాల్గొన్నారు. -
ఆధార్ కార్డుతో బినామీ రుణాలకు చెక్
అమరావతి: ఇకపై ఆధార్‌కార్డును ఆధారంగా చేసుకుని రైతులకు రుణాలు మంజూరు చేస్తామని రాష్ట్ర అటవీ, సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాల్లోని ప్రాధమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు, బ్యాంకుల్లోని బినామీ రుణాలను అరికట్టేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కొంత మంది వ్యాపారులు రైతుల పేరుపై వ్యవసాయ రుణాలను తక్కువ వడ్డీకి తీసుకుంటున్నారని, మరి కొందరు రైతులు వేర్వేరు ప్రాంతాల్లో రుణాలు తీసుకుంటూ లబ్దిపొందుతున్నారని, దీని వలన మిగిలిన అర్హులకు రుణాలు అందుబాటులోకి రావడం లేదని వివరించారు. ఆధార్‌కార్డు వినియోగంతో వీటిని పూర్తిగా నియంత్రించే అవకాశం ఉండటంతో బ్యాంకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. బుధవారం సచివాలయంలోని ఆయన ఛాంబర్లో సహకార శాఖపై సమీక్ష జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలోని 2500 సహకార సంఘాలను దశల వారీగా కంప్యూటరీకరణ చేయనున్నామని, తొలిదశలో లాభాల్లో కొనసాగుతున్న 600 సంఘాలను పూర్తి చేస్తామని చెప్పారు. తమిళనాడులోని దాదాపు అన్ని సహకార సంఘాలు, బ్యాంకుల్లో కంప్యూటరీకరణ పూర్తయిందని, అక్కడి ఉన్నతాధికారులు వచ్చే నెల రాష్ట్రంలోని సహకార సంఘాలకు శిక్షణ ఇచ్చేందుకు విజయవాడ రానున్నారని తెలిపారు. రుణమాఫీకి సంబంధించి సహకార శాఖలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, జిల్లాల్లో ప్రత్యేకంగా ఏర్పాటైన సెల్స్‌తో సహకార శాఖ అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు. వడ్డీ రాయితీ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.431 కోట్లు రావాల్సి ఉందని, ఆప్కాబ్ ఈ వడ్డీ రాయితీని సహకార బ్యాంకులు, సంఘాలకు చెల్లించిందని, అయితే ఆ మొత్తాన్ని రాష్ట్ర ఫ్రభుత్వం ఆప్కాబ్‌కు చెల్లించాల్సి ఉందన్నారు. ఇటీవలనే ముఖ్యమంత్రి చంద్రబాబుకు వడ్డీ రాయితీ విడుదలపై విజ్ఞప్తి చేశామని చెప్పారు. మిగిలిన జిల్లాలతో పోల్చితే ఉభయ గోదావరి జిల్లాల కేంద్ర సహకార బ్యాంకులు బాగా పనిచేస్తున్నాయని, లాభాల బాటలో ఉన్నాయని సంతృప్తిని వ్యక్తం చేశారు. -
శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల భూకబ్జా
-
జిల్లా అధికారులపై మంత్రి బొజ్జలకు ఫిర్యాదు
జిల్లా అధికారులపై మంత్రి బొజ్జలకు ఫిర్యాదు చిత్తూరు(రూరల్): జిల్లాలో చేపట్టాల్సిన అభివద్ధి పనులకు జిల్లా స్థాయి అధికారులు సహకరించడం లేదని పలువురు ప్రజాప్రతినిధులు రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. చిత్తూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన జిల్లాలోని ప్రజాపతినిధులు, నాయకులతో సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సమావేశంలో వారు స్థానిక సమస్యలను ఆయన దష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా జిల్లా కలెక్టర్‌తో తలనొప్పిగా మారిందని, తాము చెప్పిన పనిచేయడం ఆయనకు తెలిపారు. పార్టీలో నాయకులకు గుర్తింపు లేదని సమావేశాలు, ప్రారంభోత్సవాలకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదని వాపోయారు. దీంతో పాటు మరిన్ని సమస్యలను ఆయన చెప్పుకొచ్చారు. ఇందుకు స్పందించిన మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఎంపీ శివప్రసాద్, జడ్పీ చైర్ పర్సన్ గీర్వాణీ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, ఎమ్మెల్యే సత్యప్రభ, డిప్యూటీ మేయర్ సుబ్రమణ్యం, టీడీపీ నాయకులు నాని, బద్రి తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి బొజ్జలకు బెదిరింపు ఫోన్ కాల్
చిత్తూరు (అర్బన్): రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డికి బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ విజయకుమార్, ఎస్ఐ రాజశేఖర్, ఉమామహేశ్వర్లు యువకుడిని అరెస్టు చూపించి, వివరాలు వెల్లడించారు. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం తిప్పరాజుపల్లె గ్రామానికి చెందిన జగన్‌రెడ్డి (20) అనే యువకుడు హైదరాబాదులో సీపెట్ కోర్సు చేస్తున్నాడు. ఇతను ఇంటర్నెట్లో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రుల ఫోన్ నంబర్లు సేకరించాడు. ‘ మీ అక్రమ సంపాదన, అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలు నా వద్ద ఉన్నాయి. ఇవి మీడియాకు ఇవ్వకుండా ఉండాలంటే రూ.30 వేలు ఇవ్వాలి..’ అంటూ ఎస్ఎంఎస్లు పెట్టాడు. దీనిపై ఎవరూ స్పందించలేదు. ఈనెల 3న మంత్రి బొజ్జల మెసేజ్ చూసి, వివరాలు తెలుసుకోమని తన కుమారుడికి పురమాయించాడు. అనంతరం బొజ్జల కుమారుడు నిందితుడితో మాట్లాడగా ఓ బ్యాంకు అకౌంట్ నంబరు ఇచ్చి, ఇందులో రూ.30 వేలు జమ చేయాలని చెప్పాడు. జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వన్‌టౌన్ ఎస్ఐ రాజశేఖర్, జగన్‌రెడ్డిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. -
అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి నితిన్
తిరుచానూరు : పద్మావతి అమ్మవారిని గురువారం ఉదయం కేంద్రమంత్రి నితిన్ జైరామ్ గడ్కరి దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం ఎదుట రాష్ట్రమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, టీటీడీ బోర్డు సభ్యులు జీ భానుప్రకాష్‌రెడ్డి, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్ల, బీజేపీ నాయకులు చంద్రారెడ్డి, వరప్రసాద్, అజయ్‌కుమార్, సామంచి శ్రీనివాస్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. కుంకుమార్చన సేవలో సతీసమేతంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆశీర్వాద మండపంలో ఆయనకు ఆలయాధికారులు అమ్మవారి తీర్థప్రసాదాల ను అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో నీటి సమస్య నెలకొందని, సకాలంలో వర్షాలు కురిసి దేశ ప్రజల దాహార్తి తీరాలని, అలాగే పాడిపంటలు వృద్ధి చెంది దేశ ప్రజలు సుఖశాంతులతో జీవించాలని శ్రీవారు, అమ్మవార్లను ప్రార్థించినట్లు తెలిపారు. -
కొల్లేరు సమస్యలపై చర్యలు తీసుకోండి
కేంద్ర మంత్రి జవదేకర్‌కు వెంకయ్య విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ: కొల్లేరు అభయారణ్యం పరిధిని ఐదో కాంటూరు నుంచి మూడో కాంటూరుకు తగ్గించే అంశంపై తాత్కాలికంగా ఉపశమన చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మరో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను కోరారు. రాష్ట్ర అసెంబ్లీ దీనిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని గుర్తుచేశారు. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఇంకా సమయం పడుతున్నందున ఉపశమన చర్యలు చేపట్టాలని కోరారు. ఏపీ వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్, అటవీ, పర్యావరణ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, ఏలూరు ఎంపీ మాగంటి బాబులతో కూడిన బృందం సోమవారమిక్కడ వెంకయ్య నాయుడుతో భేటీ అయింది. అనంతరం కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సోమవారం తన చాంబర్‌కు పిలిపించుకొని కొల్లేరు సమస్యలపై వెంకయ్య నాయుడు చర్చించారు. జలగం వెంగళరావు సీఎంగా ఉన్న సమయంలో కొల్లేరు ప్రాంతంలో స్థాపించిన 136 మత్స్యకార సంఘాలను పునరుద్ధరించాలని జవదేకర్‌ను వెంకయ్య కోరారు. ఇందుకు జవదేకర్ సూత్రప్రాయంగా అంగీకరించారు. -
జన్మభూమిలో మంత్రి బొజ్జల తిట్లపురాణం
చిత్తూరుజిల్లా: నగరిలో ఆదివారం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా టీడీపీ నాయకులను నిలదీశారు. దీంతో అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహనికి లోనయ్యారు. రోజాపై బొజ్జల తిట్ల పురాణాన్ని మొదలుపెట్టారు. దీంతో అధికార, విపక్ష నాయకుల నినాదాలతో జన్మభూమి కార్యక్రమం గందరగోళంగా మారింది. సాక్ష్యాత్తూ మంత్రి నోటి నుంచే తిట్ల దండకం వెలువడడంతో అధికారులు, నాయకులు విస్తుపోయారు. పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. -
'సీఎంను చూస్తే పీఎంకు భయం'
కుప్పం రూరల్(చిత్తూరు): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చూసి ప్రధాని నరేంద్ర మోదీకి భయం పట్టుకుందని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జలగోపాలకృష్ణారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో శనివారం నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న అభివృద్ధి పథకాలు చూసి ఎక్కడ తనకు పోటీ అవుతాడోనని మోదీకి భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు అంచలంచెలుగా రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువస్తున్నారని చెప్పుకున్నారు. -
మున్సిపల్ ఆఫీసులో మంత్రికి చేదు అనుభవం
శ్రీకాళహస్తి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి శుక్రవారం శ్రీకాళహస్తి మున్సిపల్ ఆఫీసులో చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ చైర్మన్ రాధారెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నటువంటి టీడీపీ కౌన్సిలర్లు మంత్రిని నిలదీశారు. రాధారెడ్డి విషయంలో మంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ఊహించని పరిణామంతో నివ్వెరపోయిన మంత్రి.. సాయంత్రం కలిసి ఈ విషయంపై మాట్లాడుతానని చెప్పి మున్సిపల్ ఆఫీసు నుండి వెళ్లిపోయారు. -
'బీజేపీ వల్లే టీడీపీకి ముస్లింలు దూరం'
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ వల్లే తెలుగుదేశం పార్టీకి ముస్లింలు దూరమయ్యారని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలోని ముస్లింలను మంత్రి బొజ్జల కలిశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. -
'ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో 5 లక్షల ఉద్యోగాలు'
రేణిగుంట : ఆంధ్రప్రదేశ్‌ను పూర్తిస్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన రాష్ట్రంగా చేయడమే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కులో రూ.7.5 కోట్లతో నూతనంగా నిర్మించిన ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో అనేక కంపెనీలు స్థాపిస్తారని తెలిపారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని విద్యార్థులకు ఐటీ రంగం ద్వారా పలు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నామని తెలిపారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల్లో సాంకేతిక విప్లవం వచ్చిందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం లేకపోతే భావితరాల వారి పరిస్థితి మృగ్యమవుతుందని తెలిపారు. రేణిగుంట, తిరుపతి, చెన్నై ప్రాంతాలకు అనుగుణంగా ఐటీ ఇంకుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారని హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్, ఐటీ స్పెషల్ సెక్రటరీ కిషోర్, ఐటీ సీఈవో నిఖల్ అగర్వాల్, మహిళా యూనివర్శిటీ వీసీ వరలక్ష్మి, ఏపీఐఐసీ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
కాణిపాకంలో టీడీపీ నేతల అత్యుత్సాహం
చిత్తూరు: కాణిపాకం వినాయకుడికి పట్టువస్త్రాలు సమర్పించిన కార్యక్రమంలో గందరగోళం నెలకొంది. గణేశుడికి మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి గురువారం పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ కార్యక్రమం జరిగే సమయంలో బోర్డు సభ్యులను కూడా దగ్గరకు రానివ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన ఛైర్మన్, పాలకవర్గం, అధికారులు కార్యక్రమాన్ని బహిష్కరించారు. -
ప్రత్యేక ప్యాకేజీపై బొజ్జల సంచలన వ్యాఖ్యలు
తెనాలి : ప్రత్యేక ప్యాకేజీపై రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే ముందు లాభపడేది టీడీపీయేనని, ఆ తర్వాత ఆంధ్రులని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం ఏర్పాటు చేసిన ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రూ.లక్ష కోట్లు ఇవ్వటానికి అంగీకరించినట్లు సమాచారం ఉందన్నారు. ఇంకా ఎక్కువ ఇచ్చిన ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదన్నారు. తమకు కేంద్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు యాచించటానికైనా, దోచిపెట్టడానికి కూడ వెనుకాడబోమన్నారు. అటవీ సంపదను రక్షించేందుకు, భూ ఆక్రమణలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
అక్కడే బైఠాయించిన వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు
చిత్తూరు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేశారు. అధికార పక్షం నుంచి ఎటువంటి స్పందనాలేదు. దాంతో వైఎస్ఆర్ సీపీ ప్రజాప్రతినిధులు జిల్లాపరిషత్ సమావేశ హాలులోనే బైఠాయించారు. పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక, సహకార శాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సమావేశాన్ని వాయిదావేసి వెళ్లిపోయారు. -
ఏకగ్రీవ పంచాయతీలకు నిధులు
తిరుచానూరు : జిల్లాలోని 293 మైనర్ గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌లను ఎన్నుకున్నారని, ఒక్కో పంచాయతీకి రూ.7లక్షలు చొప్పున మొత్తం రూ.20.51కోట్లు నిధులను 13వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. తిరుచానూరులోని ఓ కల్యాణమండపంలో శుక్రవారం జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో 23వ జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొజ్జల మాట్లాడుతూ ఏపీ పంచాయతీరాజ్ చట్టాన్ని 1994నుంచి అమలులోకి తీసుకొచ్చారన్నారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా మూడంచెల పంచాయతీరాజ్ సంస్థల ద్వారా ఏర్పాటై 23 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో కంప్యూటరీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయాల్లో అన్ని మండల ప్రజాపరిషత్‌లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేశారన్నారు. జిల్లాలోని 2,100పంచాయతీల్లో ఈ-పంచాయతీ కార్యక్రమం అమలుచేయనున్నట్లు తెలిపారు. స్మార్ట్ గ్రామం కార్యక్రమం కింద బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలుగా తయారుచేయడం, పరిశుభ్రమైన గ్రామాలుగా తీర్చిదిద్దడం, రక్షిత తాగునీరు అందజేయడం తదితర కీలక అంశాలను స్థానిక ప్రభుత్వాలే నిర్వహించనున్నట్లు తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ క్లస్టర్ విధానాన్ని తొలగించి ప్రతి గ్రామ పంచాయతీకి రెగ్యులర్ కార్యదర్శిని నియమించాలని మంత్రుల దృష్టికి తెచ్చారు. అలాగే 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం 29శాఖలకు సంబంధించి నిధులు, విధులు, సిబ్బంది పంచాయతీ ఆధీనంలోనే ఉండాలని కోరారు. ఈ విధానాన్ని అమలు చేస్తున్న కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి రాష్ట్రాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్, రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడు సుబ్బరామయ్య, జెడ్పీ సీఈవో వేణుగోపాల్‌రెడ్డి, డెప్యూటీ సీఈవో మాలతికుమారి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్.ప్రభాకర్‌రావు, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, జెడ్పీ ఏవో వెంకటరత్నం, డీఎల్పీవో సురేష్‌నాయుడు, ఈవోపీఆర్డీ నీలకంఠేశ్వరరెడ్డి, తిరుచానూరు ఈవో జనార్దన్‌రెడ్డి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
'నా వ్యాఖ్యలు వక్రీకరించారు'
తిరుపతి : శేషాచలం ఎన్కౌంటర్ నేపథ్యంలో అంతం కాదు ఇది అరంభం అంటూ తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. శేషాచలం ఎన్కౌంటర్లో మృతదేహల వద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సదరు సెల్ ఫోన్ నెంబర్లు ఆధారంగా నిందితులను సాధ్యమైనంత త్వరగా అరెస్ట్ చేస్తామన్నారు. రాష్ట్రంలో అడవులను సంరక్షించేందుకు రూ. 100 కోట్లు కేటాయిస్తామని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. -
'ఇక ఉద్యోగాల భర్తీలేదు'
చిత్తూరు : రానున్న కాలంలో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఉండబోదని ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఉన్న రాష్ట్ర ఆదాయం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్, జీతభత్యాలకే సరిపోతుందని తెలిపారు. దీంతో కొత్త ఉద్యోగాల భర్తీ కష్టంగా మారిందని, వారికి జీతాలు ఇవ్వలేమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నఅదనపు ఉద్యోగులను గుర్తించేందుకు త్వరలోనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు. అలా గుర్తించిన ఉద్యోగులను ప్రాధాన్యత ఉన్న శాఖల్లో నియమిస్తామని బొజ్జల చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు త్వరలోనే ఒక నూతన ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తేనున్నట్లు మంత్రి తెలిపారు. (బి.కొత్తకోట) -
తమిళులను మరింత రెచ్చగొట్టిన బొజ్జల
అగ్నికి ఆజ్యం పోసేలా టీవీ ఇంటర్య్వూలో మంత్రి వ్యాఖ్యలు చెన్నై, సాక్షి ప్రతినిధి: ఎర్రచందనం కూలీల ఎన్కౌంటర్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంటేనే తమిళులు మండిపడుతున్న తరుణంలో ఏపీ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఒక ప్రముఖ తమిళ టీవీలో సోమవారం ప్రసారం అయిన బొజ్జల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన తీరుతో తమిళ రాజకీయ పార్టీలు మరోసారి మండిపడ్డాయి. ఆ టీవీ ఇంటర్వ్యూలో ‘‘శేషాచల అడవుల్లో జరిగిన కాల్పుల్లో మరణించినవారంతా ఎర్రచందనం స్మగ్లర్లే. వీరిని తెలుగువారు, తమిళులు అని విభజించరాదు. కోట్లాది రూపాయల విలువైన ఎర్రచందన వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. పర్యాటకులుగా ఇక్కడకు వస్తే పరవాలేదు, అటవీ సంపదను హరించడానికి వస్తే హతమారుస్తాం’’ అని బొజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై తమిళపార్టీల నేతలు మండిపడ్డారు. బాబు దిష్టిబొమ్మల దహనం మంత్రి బొజ్జల వ్యాఖ్యలతో తమిళనాడులో సోమవారం మళ్లీ ఆందోళనలు రేగాయి. చెన్నై ఐనవరంలోని హెరిటేజ్ సూపర్‌మార్కెట్‌పై నలుగురు దుండగులు పెట్రోబాంబు విసిరారు. అదృష్టవశాత్తు అది పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వీసీకేకు చెందిన నలుగురిని అరెస్ట్ చేశారు. డాక్టర్ అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థులు సోమవారం చెన్నైలో చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. బొజ్జల వ్యాఖ్యలను నిరసిస్తూ కోయంబత్తూరులో మిదితేన్ విద్యార్థుల సంఘం రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు, బొజ్జల దిష్టిబొమ్మలను దహనం చేశారు. -
కలెక్టరేట్ ముట్టడిస్తామని వైగో హెచ్చరిక
-
'బొజ్జల సినిమా డైలాగులు మాట్లాడుతున్నారు'
చిత్తూరు : ఎర్ర చందనం కూలీల ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చిత్తూరు కలెక్టరేట్ ముట్టడికి ఎండీఎంకే అధినేత వైగో శుక్రవారం వేలూరు నుంచి భారీ ర్యాలీగా బయల్దేరారు. ఆయనతో పాటు తమిళనాడులోని ఇతర పార్టీ నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైగో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు మానవత్వానికి దూరంగా ఉన్నాయన్నారు. అంతం కాదు...ఆరంభం మాత్రమే అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సినిమా డైలాగులు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్కౌంటర్లో మృతి చెందిన కూలీల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఒక్కొక్కరికీ రూ.20 లక్షలు చెల్లించాలని వైగో డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం కావాలనే బయట ఉన్న కూలీలను తీసుకువెళ్లి ఎన్కౌంటర్ చేసిందని ఆయన ఆరోపించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జైళ్లలో ఉన్న కూలీల బాధ్యతను తమిళనాడు ప్రభుత్వానిదే అని వైగో అన్నారు. కాగా తమిళనాడు-ఏపీ సరిహద్దుల్లో పోలీసులు భారీగా మోహరించారు. ర్యాలీగా వస్తున్న వైగో సహా పలువురు కార్యకర్తలను వేలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
'వాళ్లంతా.. గడ్డి కోసుకోవటానికొచ్చారా?'
తిరుపతి : తిరుపతి ఎన్కౌంటర్లో మృతి చెందినవారంతా ఎర్ర చందనం దొంగలేనని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఎన్‌కౌంటర్‌పై వస్తున్న ఆరోపణలను ఆయన బుధవారమిక్కడ ఖండించారు. ఎర్రచందనం దొంగలు కాకుంటే.. వారంతా గడ్డి కోసుకోవటానికి ఏమైనా తమిళనాడు నుంచి శేషాచలం అడవులకు వచ్చారా అని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. ఇందులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరనేది విచారణలో తేలుతుందని బొజ్జల అన్నారు. ఎర్ర చందనం స్మగ్లర్లు ఎంతటి వారైనా, ఏ పార్టీ వారైనా వదిలేది లేదని ఈ సందర్భంగా బొజ్జల స్పష్టం చేశారు. మృతదేహాలను తమిళనాడుకు పంపిస్తామని ఆయన తెలిపారు. మరోవైపు ఎన్కౌంటర్లో మృతి చెందిన 20మంది ఎర్రచందనం కూలీల మృతదేహాలకు తిరుపతి రూయా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. -
మంత్రిగారి భార్యా మజాకా
చిత్తూరు: అసలే మంత్రిగారు. అటు ప్రభుత్వం, ఇటు ప్రవేటుగా అనేక కార్యక్రమాలతో నిత్యం మహాబిజీగా ఉంటారు. ఇక అలాంటి వారికి ఆసుపత్రులు, దేవాలయాలు... వాటిని తనిఖీలు నిర్వహించాలంటే సమయం ఉండదు. దాంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మంత్రిగారి భార్య తనిఖీలను తమ భుజానికి ఎత్తుకున్నారు. మంత్రిగారి సొంత నియోజకవర్గంలోని అత్యంత ప్రముఖ దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన కాళహస్తి పట్టణంలో చోటు చేసుకుంది. స్థానిక ఎమ్మెల్యే, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ గురువారం రాహు - కేతు దేవాలయంలో తనిఖీలు నిర్వహించారు. అందులోభాగంగా రాహు కేతు మండపం, ప్రసాదాల పోటు, వివిధ విభాగాలను తనిఖీలు నిర్వహించారు. దాంతో ఆలయ అధికారులు, సిబ్బంది హడలిపోయి... ఆమె వెంట పరుగులు తీశారు. అయితే బృందమ్మ తీరుపై స్థానికంగా, భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఏ హోదాలో బృందమ్మ తనిఖీలు నిర్వహించరని భక్తులు ప్రశ్నిస్తున్నారు. -
బొజ్జల అనుచరుడి 'సెల్ చల్'
చిత్తూరు: గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో ఎక్కడబడితే అక్కడ చెలరేగుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు రాంబాబు సోమవారం 'సెల్ చల్' చేశాడు. భక్తులందరూ బుద్ధిగా వరుసలో నిల్చుంటే రాంబాబు మాత్రం తన సెల్ ఫోన్ తో ఆలయం ఫోటోలు తీస్తూ హడావుడి చేశాడు. ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదానికి దిగాడు. రాంబాబు వైఖరితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పవిత్రస్థలంలో ఇవేం పనులంటూ భక్తులు తిట్టుకున్నారు. -
మినిస్టర్ హోమ్ మినిస్టర్
*శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంత్రి సతీమణి హల్చల్ *పట్టు కోసం పాకులాట *వచ్చే ఎన్నికల్లో ఆమె అభ్యర్థి అంటూ ప్రచారం ఆయన రాష్ట్ర అటవీశాఖ మంత్రి. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాత్రం ఆయన సతీమణి బృందమ్మదే పెత్తనం. ఆమె అంటే అధికారులందరికీ హడల్. పంచాయితీలు.. ఆస్పత్రులు.. హాస్టళ్లు.. దేవస్థానం.. ఒక్కటని లేదు అన్నింటిలోనూ తలదూర్చుతూ హల్చల్ చేస్తున్నారు. ఆమెకు అడ్డొచ్చే అధికారులు.. పాలకులపై ‘పవర్’ పంచ్‌లేస్తూ పక్కనబెట్టిస్తున్నారు. ఒకప్పుడు గడపదాటి బయటకురాని ఆమె ఇటీవల తనిఖీల పేరుతో తడాఖా చూపిస్తున్నారు. ఈ ‘హోం’ మినిస్టర్ దూకుడు మరెంతకాడికి దారితీస్తుందో వేచిచూడాలి. శ్రీకాళహస్తి : రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పవర్‌తో శ్రీకాళహస్తిలో ఆయన సతీమణి బృందమ్మ పరిపాలన సాగుతోంది. ఆలయంతో పాటు అన్ని శాఖల్లో పట్టుకోసం ఆమె పాకులాడుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బృందమ్మే బరిలో ఉంటారని.. ఆమె సహచరులు బాహాటంగా చెబుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో బిజీబిజీగా ఉంటే, ఆయన సతీమణి ఇక్కడ పరిపాలనలో తలములకలవడం కనిపిస్తోంది. ఒకరోజు కూడా ఖాళీగా ఉండకుండా ఆలయంతో పాటు అన్ని విభాగాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆయా శాఖల్లో ఆదాయ వ్యయూల వివరాలతో పాటు ఉద్యోగస్తుల వివరాలను సేకరిస్తూ.. ముందుకు సాగుతున్నారు. మంత్రికి అత్యంత సన్నిహితులుగా పేరొందిన పాల సొసైటీ చైర్మన్ రావిళ్ల మునిరాజానాయుడు.. మంత్రి మాజీ పీఏ రాంబాబునాయుడు ఆమె వెంటే నడుస్తున్నారు. శ్రీకాళహస్తి మండలంతో పాటు తొట్టంబేడు, ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో చిన్నపాటి సమాచారాన్ని సైతం మేడమ్‌కు వారు చేరవేస్తున్నారు. సోమవారం శ్రీకాళహస్తిలో ప్రభుత్వాస్పత్రిలో తనిఖీలు చేశారు. ఆదాయ వ్యయాలతోపాటు ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. అనే సమాచారాన్ని ఎప్పటికప్పడు ఆమె దృష్టికి తీసుకెళుతున్నారు. ఆ ఖాళీల్లో ఆమె తమ అనుచరులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులుగా నియమించేస్తున్నారు. తాజాగా ఆలయంలోని అన్నదానంతో పాటు ఉద్యానవనంలో 20మందికిపైగా టీడీపీ కార్యకర్తలను ఉద్యోగాల్లో నియమించినట్లు సమాచారం. ఇటీవల మద్యం షాపుల వారు మామూళ్లు ఇస్తే సిండికేట్ రూపంలో ఇష్టం వచ్చిన ధరలకు విక్రయాలు చేసుకునే అవకాశం కల్పిస్తామని సంకేతాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. వారి అండదండలతోనే పలువురు ఎమ్మార్పీకి కాకుండా అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం. పెద్దల హస్తం ఉందని సంబంధిత అధికారులు ఉదాశీన ంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. బృందమ్మ ముందుగా పట్టు సంపాదించుకోవడం పదేపదే తనిఖీలు చేయడం... ఖాళీగా ఉన్న చోట కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను నియమించడం పరిపాటిగా మారిందనే విమర్శలున్నాయి. రెండు రోజుల క్రితం ఆలయంలో తనిఖీలు చేసిన ఆమె ఇద్దరు ఉద్యోగస్తులను సస్పెండ్ చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాదు శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి చిన్న చిన్న పనులు (రంగులు, సున్నం, పందేళ్లు తదితర) సైతం రూ.1.5కోట్లతో టీడీపీ కార్యకర్తలకే దక్కేలా ఆమె సహకరించినట్లు తెలుస్తోంది. పట్టణంలోని ఏరియా ఆస్పత్రి.. స్కిట్ కళాశాల, హాస్టళ్లు తదితర ప్రాంతాల్లో బృందమ్మ తనిఖీలు జోరుగా సాగాయి. ఏ అధికారంతో ఆమె తనిఖీలు చేస్తున్నారు ? ఉద్యోగులను సస్పెండ్ చేరుుస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నారుు. అయితే ఆమె అవేమీ పట్టించుకోవడంలేదు. బృందమ్మ ప్రధాన అనుచరుడుగా ఉన్న రావిళ్ల మునిరాజానాయుడు చెప్పిందే శాసనంగా పలుచోట్ల నడుస్తోంది. మరో అనుచరుడు రాంబాబు నాయుడు తాజాగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ఆయన బావమరిది చెంచయ్య నాయుడుకు ఆమె ఆశీస్సులతోనే కట్టబెట్టారు. మొత్తం మీద శ్రీకాళహస్తిలో పెత్తనం ఆమె గుప్పెట్లోకి వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు సైతం గోపాలన్న కన్నా బృందమ్మే మిన్న అంటూ.. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు ఉపక్రమిస్తున్నారు. పెద్దాస్పత్రిలో బృందమ్మ తనిఖీ తొట్టంబేడు : శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దాస్పత్రిని వుంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీవుణి బొజ్జల బృందవ్ము సోవువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో రోగులకు అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. ఆపరేషన్ థియేటర్ (ఓటీ), ల్యాబ్, రక్తపరీక్ష కేంద్రాలకు వెళ్లి పరిశీలించారు. ఆపరేషన్ థియేటర్లో పరికరాలు తుప్పు పట్టి ఉండటాన్ని గుర్తించి వైద్యులపై వుండిపడ్డారు. ఆస్పత్రిలో రోగుల తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆర్వో సిస్టమ్ పనిచేయుడం లేదని సిబ్బంది చెప్పడంతో వారం రోజుల్లో వురవ్ముతులు చేరుుంచాలని ఆదేశించారు. అనంతరం రక్తపరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీలు చేశారు. షింక్ అధ్వానంగా ఉందని, గది శుభ్రంగా లేదని ల్యాబ్ టెక్నీషియున్పై వుండిపడ్డారు. ఆస్పత్రి నిర్వహణే సక్రవుంగా లేకుంటే ఇక రోగులకు ఎంతవూత్రం వైద్యం అందిస్తారో అర్థవువుతోందని ఆర్ఎంవో, సూపరింటెండెంట్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆలయపరిపాలన గాడిలో పెట్టడం కోసమే శ్రీకాళహస్తి దేవస్థానం పరిపాలనను గాడిలో పెట్టడం కోసమే బొజ్జల బృందమ్మ ఆలయాన్ని పరిశీలన చేసి.. తగు సూచనలు ఇచ్చారు. ఆమె కాదు ఎవరైనా ఆలయంలో తనిఖీలు చేసి సూచనలు ఇవ్వవచ్చు. ప్రధానంగా కాంట్రాక్టర్లు ఇస్తున్న సరుకుల్లో మోసాలు జరుగుతుంటాయి. భక్తులను మోసం చేసి సిబ్బంది దోచుకుంటుంటారు. దీనికితోడు శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి. ఆలయంతో పాటు పట్టణంలోని ఏరియా ఆస్పత్రి, హస్టళ్లు, పాఠశాలలను ఆమె తనిఖీలు చేస్తున్నారు. అందులో తప్పేముంది. - బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, రాష్ట్ర అటవీశాఖమంత్రి పెత్తనం కోసమే పాకులాట టీడీపీ నాయకులు పెత్తనం కోసమే పాకులాట. అంతేతప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడం కోసంకాదు. ఆమెతో(బృందమ్మ) పాటు వారి అనుచరులను తీసుకుని పోయి మనవాళ్లు అయితే ఓకే.. లేదంటే మిగిలిన వారికి హెచ్చరికలు జారీ చేయడం.. ఆలయంతో పాటు పలుకీలకమైన శాఖలను ఆమె గుప్పిట్లోకి తెచ్చుకోవడం కోసం పాకులాడుతున్నారు. మంత్రి హైదరాబాద్‌లో ఉంటే స్థానికంగా ఆమె పట్టుసంపాదించుకోవడం కోసం జోరు తనిఖీలు చేస్తున్నారు. అయినా అధికారం వారిది నాలుగేళ్లు భరించాల్సిందే. - సత్రవాడ మునిరామయ్య, మాజీ ఎమ్మెల్యే పరిపాలించడానికి మంత్రి ఉన్నారు కదా.. ఆమెందుకో? పరిపాలించడానికి ప్రజలు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఎంచుకున్నారు. మళ్లీ పరిపాలనను గాడిలో పెట్టడానికి ఆయన సతీమణి బృందమ్మ ఎందుకో అర్థం కావడంలేదు. తనిఖీలు చేసి టెండర్లు.. ఉద్యోగాలు టీడీపీ వాళ్లకు అప్పగించడమే తప్ప ఆలయాన్ని గాడిలో పెట్టడానికి కాదు. ఇప్పటికే అనేకమందికి ఉద్యోగాలు ఇప్పించారు. టెండర్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. అంతేగాని ఒరగబెట్టేది ఏమీలేదు. - డాక్టర్ బత్తెయ్యనాయుడు, పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్‌పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి -
'ఎన్నికల కోడ్ ఉంటే నాకేంటి'
చిత్తూరు: శ్రీకాళహస్తిలో అటవీశాఖ మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి సతీమణి మరోసారి హల్ చల్ చేశారు. ఆమె సోమవారం తన బృందంతో కలిసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు తెలియజేసినా ఆమె వారి మాట పట్టించుకోకుండా తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి బొజ్జల
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశాలు, ప్రభుత్వ కళాశాలలో పుస్తకావిష్కరణల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ మేరకు వుంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయూల్లో అధికారిక కార్యక్రవూలు నిర్వహించరాదు. రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పట్టణంలోని రాజీవ్‌నగర్‌లోని ప్రభుత్వ గిరిజన కళాశాలలో నిర్వహించిన యానాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి విద్యాహక్కు చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఊరందూరు పెద్దాయన ఇక లేరు
మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగ సుబ్బరామిరెడ్డి కన్నుమూత పలువురు నాయకుల సంతాపం శుక్రవారం అంత్యక్రియలు శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీశాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తండ్రి, మాజీ ఎమ్మెల్యే బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి (95) బుధవారం స్వగ్రామం ఊరందూరులోని తమ నివాసంలో కన్నుమూశారు. వెంటనే ఆయన చిన్న కుమారుడు హరినాథరెడ్డి హైదరాబాద్‌లో ఉన్న మంత్రి గోపాలకృష్ణారెడ్డికి సమాచారం ఇచ్చారు. బుధవారం ఉదయం గంగసుబ్బరామిరెడ్డి కారులో రోడ్డుపక్కనే ఉన్న పంట పొలాలను పరిశీలించడంతో పాటు, పట్టణంలోని బంధువుల ఇంటికి వెళ్లి పలకరించారు. సాయంత్రం ఆరుగంటల సమయంలో శ్వాస అందక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆయన భార్య బొజ్జల విశాలాక్ష్మి 1995లోనే మరణించారు. శ్రీకాళహస్తి మండలం ఊరందూరు గ్రామంలో 1920 మే 14 వ తేదీన బొజ్జల గంగిరెడ్డి, పోలమ్మ దంపతులకు బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి జన్మించారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన ఆయన తొమ్మిదో తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేశారు.ఆయనకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రెండో సంతానం. రాజకీయ ప్రస్థానం ఊరందూరు గ్రామ కమిటీ చైర్మన్‌గా గంగసుబ్బరామిరెడ్డి 1957లో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. గ్రామంలోని చెన్నకేశవస్వామి, నీలకంఠేశ్వరస్వామి ఆలయాలకు పదేళ్ల పాటు చైర్మన్‌గా పనిచేశారు. 1964లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1967లో ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి, అప్పటి విద్యాశాఖ మంత్రి అద్దూరు బలరామిరెడ్డిపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో గంగ సుబ్బరామిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఇండిపెండెంట్ అభ్యర్థి బలరామిరెడ్డి చేతిలోనే ఓడిపోయారు. గంగసుబ్బరామిరెడ్డి మృతికి సంతాపం మాజీ ఎమ్మెల్యే గంగ సుబ్బరామిరెడ్డి మృతికి పలువురు సంతాపం తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రీకాళహస్తి సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డితో పాటు పార్టీ నాయకులు గుమ్మడి బాలకృష్ణయ్య, మిద్దెల హరి, అంజూరు శ్రీనివాసులు, కొట్టేడి మధుశేఖర్, బర్రి హేమభూషణ్‌రెడ్డి, బర్రి సుదర్శన్‌రెడ్డి, వయ్యాల క్రిష్ణారెడ్డి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటిపర్తి చెంచురెడ్డి ఊరుందూరుకు వెళ్లి గంగసుబ్బరామిరెడ్డి కుటుంబసభ్యులను ఓదార్చారు. టీడీపీ నాయకుడు, మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి, కొండుగారి శ్రీరామమూర్తి, పోతుగుంట గురవయ్యనాయుడు, రాంబాబు, తాటిపర్తి ఈశ్వరరెడ్డి, చెలికం పాపిరెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, కంఠారమేష్, షాకీర్ అలీ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. రేపు అంత్యక్రియలు బొజ్జల గంగసుబ్బరామిరెడ్డి మూడో సంతానమైన కుమార్తె విజయలక్ష్మి అమెరికాలో ఉన్నారు. దీంతో ఆయన అంత్యక్రియలు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించాలని భావించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు, పలువురు మంత్రులు, వివిధ పార్టీల నాయకులు అంత్యక్రియలకు హాజరు కానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాలు...
సహకార సంఘాల్లో అవినీతి నిజమే ఏపీ సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 39 సహకార పరపతి సంఘాలలో రైతులకు, వారి కుటుంబాలకు తెలియకుండా సిబ్బంది రుణాలు తీసుకున్న మాట నిజమేనని సహకార శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంగీకరించారు. శనివారం శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్ అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఈ అంశంపై చర్చ సందర్భంలో మాట్లాడిన అప్పలనాయుడు, శ్రావణ్‌కుమార్‌లు పీసీసీ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కడప జిల్లాకు చెందిన గంగిరెడ్డి పేర్లను ప్రస్తావించారు. గంగిరెడ్డితో సంబంధాలున్నాయంటూ తమ నాయకులపై పదేపదే ఆరోపణలు చేయడం పట్ల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శ్రీనివాసులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒక్క విశాఖ సిటీయే కాదు మా ఊళ్లూ దెబ్బతిన్నాయి.. హుద్‌హూద్ తుపానుపై మాట్లాడే వారందరూ ఒక్క విశాఖ సిటీనే ప్రస్తావిస్తున్నారని, అరకు, పాడేరు నియోజకవర్గాలలో కూడా మరణించిన వారున్నారని, వారినీ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి కోరారు. తుపాను సాయం చాలా చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం ఈ గిరిజన ప్రాంతాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తుపాను పీడిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలకు తమ ప్రభుత్వం ఏమేం చర్యలు చేపట్టిందీ, కేంద్రానికి ఎటువంటి ప్రతిపాదనలు పంపిందీ మంత్రి చినరాజప్ప సుదీర్ఘంగా వివరించారు. మురుగునీళ్లే విజయవాడ ప్రజలతో తాగిస్తున్నాం.. విజయవాడ ప్రజలతో కలుషిత నీరే తాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. భూగర్భ మురుగు కాలువల నుంచి వచ్చే నీరు కృష్ణా, ఇతర ప్రధాన కాలువలలోకి విడుదలై, వాటినే దిగువ ప్రాంతాల ప్రజలు తాగుతున్నారని మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఐదు జిల్లాల్లో సౌరవిద్యుత్ ఉత్పత్తి: అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో సంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించనున్నట్టు మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక జవాబిస్తూ.. అనంతపురం జిల్లా ఎస్పీ కుంట, కడప జిల్లా గాలివీడు, కర్నూలు జిల్లా పిన్నాపురంలో 2500 మెగావాట్ల సామర్థ్యం ఉన్న విద్యుత్ పార్కులను అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. సౌరవిద్యుత్ విధానాన్ని ప్రకటించనున్నామన్నారు. చర్చలో కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా మాట్లాడుతూ.. ఈ పార్కుల కోసం పంట భూముల్ని తీసుకుంటున్నారని ఆరోపించారు. -
‘పచ్చ’ మార్క్.. బది‘లీల’లు
* టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసిన ఉన్నతాధికారుల నియామకం * డ్వామా పీడీ నియామకంలో చక్రం తిప్పిన మాజీ మంత్రి గల్లా అరుణకుమారి * జెడ్పీ సీఈవోగా చంద్రమౌళిని నియమించడంపై మంత్రి బొజ్జల తీవ్ర అసహనం సాక్షి ప్రతినిధి, తిరుపతి: జిల్లా ఉన్నతాధికారుల బదిలీల ప్రక్రియ అధికార టీడీపీలో ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. కీలకస్థానాల్లో ఆడించి నట్టల్లా ఆడే అధికారిని నియమించుకుంటే పాల నను గుప్పిట్లో పెట్టుకోవచ్చన్నది టీడీపీ ప్రజాప్రతినిధుల ఎత్తుగడ. తద్వారా అటు పార్టీపై.. ఇటు జిల్లాపై ఆధిపత్యం చెలాయించవచ్చన్నది వారి వ్యూహం. మొన్న డీఆర్వో నియామకం మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమల మధ్య నిప్పు రాజేస్తే.. ఇప్పుడు జెడ్పీ సీఈవో బదిలీ మంత్రి బొజ్జల, మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తోంది. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పరిపాలనను గుప్పిట్లో పెట్టుకునేందుకు అధికారుల బదిలీలకు శ్రీకారం చుట్టింది. కలెక్టర్ నుంచి గ్రామ కార్యదర్శి వరకూ తమ మాట వినేవారినే నియమించుకోవడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇది ఆ పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరుకు దారితీసింది. జిల్లా రెవెన్యూ అధికారిగా విజయ్‌చందర్‌ను నియమించాలని మాజీ మంత్రి గాలి, ఎం.వెంకటేశ్వరరావును నియమించాలంటూ మంత్రి బొజ్జల పట్టుబట్టారు. ఈ ఇద్దరి మధ్య వివాదం కొనసాగుతుండగానే.. అత్యంత కీలకమైన జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీగా రాజశేఖర్‌నాయుడిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నియామకంపై మంత్రి బొజ్జల కన్నెర్ర చేశారు. మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన రాజశేఖర్‌నాయుడిని డ్వామా పీడీగా నియమించడంపై కినుక వహించిన బొజ్జల.. జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ పీడీ తదితర కీలక స్థానాల్లో తన మాట వినే అధికారులను నియమించుకోవడానికి వ్యూహం రచించారు. జెడ్పీ సీఈవోగా వేణుగోపాల్రెడ్డినే కొనసాగించాలని చైర్పర్సన్ గీర్వాణి చేసిన ప్రతిపాదనకు బొజ్జల అంగీకరించారు. ఈలోగా జెడ్పీ సీఈవోను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వేణుగోపాల్‌రెడ్డి స్థానంలో గతంలో జిల్లాలో డీఆర్డీఏ పీడీగా పనిచేసిన చంద్రమౌళిని నియమించింది. ఈ నియామకం విషయంలోనూ మాజీ మంత్రి గల్లా హస్తం ఉన్నట్లు బొజ్జల వర్గీయులు చెబుతున్నారు. జెడ్పీ సీఈవోగా చంద్రమౌళి నియామకంపై కన్నెర్ర చేసిన బొజ్జల.. వేణుగోపాల్‌రెడ్డిని రిలీవ్ చేయొద్దంటూ కలెక్టర్‌ను ఆదేశించారు. దాంతో చంద్రమౌళి జెడ్పీ సీఈవోగా బాధ్యతలు చేపట్టకుండా మోకాలడ్డినట్లయింది. డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్రెడ్డికీ స్థానభ్రంశం కల్పించడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు పావులు కదుపుతున్నారు. డ్వామా పీడీగా నియమితులైన రాజశేఖర్‌నాయుడు డీఆర్డీఏ పీడీ పోస్టును దక్కించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు డీఆర్డీఏ పీడీగా తన మాట వినే అధికారినే నియమించుకోవడానికి అటు ఎంపీ శివప్రసాద్.. ఇటు మాజీ మంత్రి గల్లా.. మరో వైపు మంత్రి బొజ్జల ప్రయత్నిస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల ఆధిపత్య పోరుకు ఉన్నతాధికారుల నియామకం వేదికగా మారడంతో పరిపాలన అస్తవ్యస్తంగా మారిపోయిందని అధికారవర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. -
కేసీఆర్, హరీశ్‌లకు మతిభ్రమించింది
చిత్తూరు: తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన మేనల్లుడు, మంత్రి హరీష్‌రావులపై ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం చిత్తూరులో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.... కేసీఆర్, హరీశ్‌రావులకు మతిభ్రమించిందని ఆయన ఆరోపించారు. అందుకే తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం, మంత్రులుగా పదవుల్లో ఉన్న వారిద్దరు పద్దతి లేకుండా మాట్లాడటం భావ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబే ప్రధాన కారకుడని సీఎం కేసీఆర్, హరీశ్‌రావులు అసెంబ్లీ సమావేశాలలో ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు చంద్రబాబే కారణమంటే ఏట్లా అని ఏపీ మంత్రులు ఇప్పటికే సీఎం కేసీఆర్, ఆయన మంత్రి వర్గాన్ని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. -
బొజ్జల వర్సెస్ గాలి
ఎత్తుకు పైఎత్తులు డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు చివరి నిమిషంలో చక్రం తిప్పిన బొజ్జల ఈ వ్యవహారంలో ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తిరుపతి తుడా: అధికార పార్టీ ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. జిల్లా డీఆర్వో పోస్టు వ్యవహారం ఇందుకు వేదికైంది. తమకు నచ్చిన.. మెచ్చిన అధికారిని ఆ పోస్టులోకి తీసుకొచ్చేందుకు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. ముందుగా డీఆర్వో పోస్టులోకి జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నంలో మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు సఫలమయ్యారు. తాను మంత్రిగా ఉండగా జిల్లా ఉన్నతాధికారి నియామకం తాను చెప్పిన వారికే దక్కాలని మరో అధికారి ఎం.వెంకటేశ్వరరావు పేరును బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెరపైకి తీసుకొచ్చారు. డీఆర్వోగా విజయ్‌చందర్ పేరు ఖరారు జిల్లాకు చెందిన విజయ్‌చందర్‌ను డీఆర్వోగా దాదాపు పేరు ఖరారైందని మంగళవారం జోరుగా ప్రచారం సాగింది. స్థానికుడైన విజయ్‌చందర్‌ను జిల్లా పోస్టులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను తీసుకొచ్చి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళుతూ డీఆర్వోగా విజయ్‌చందర్ పేరును ఖరారు చేసి వెళ్లారు. మరుసటి రోజు బుధవారం కల్లా ఆ జీవోను పక్కన పెట్టించిన మంత్రి మరో జీవో సిద్ధం చేయించినట్టు సమాచారం. సీఎం లేని సమయంలో ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి అండతో గోపాలకృష్ణారెడ్డి ఈ పోస్టు కోసం చక్రం తిప్పినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి తిరిగి వచ్చేవరకు డీఆర్వో నియామక జీవోను(పాత) పక్కన పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలిసింది. తాను చెప్పిన ఎం.వెంకటేశ్వరరావు (తిరుపతి పూర్వ ఆర్డీవో) పేరుతో తయారు చేసిన జీవోను విడుదల చేయించేందుకు మంత్రి తీవ్రంగా ప్రయత్నిం చేయనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ముద్దుకృష్ణమకు తెలియడంతో మంత్రిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుంది. ముఖ్యమంత్రి సింగపూర్ నుంచి తిరిగి వచ్చాక ఎవరి మాట చెల్లుతుందో తేలనుంది. అధికారుల బదిలీల్లోనూ.. జిల్లాకు చెందిన అధికారుల బదిలీల్లోనూ మంత్రి గోపాలకృష్ణారెడ్డి, మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు ఎవరికి వారు పోటీ పడుతు పడుతున్నారని ఆ పార్టీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారుల బదిలీల్లో తమకు అనుకూలమైన వారిని వారు కోరుకన్న స్థానాలకు బదిలీ చేయాలని ఇద్దరూ ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. -
ఓ పులి వందమందితో సమానం
తిరుపతి(మంగళం): అక్రమార్కులను కట్టడి చేయడానికి వందమంది సిబ్బంది ఉండడం కంటే ఓ పులి మేలు చేస్తుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. అడవుల్లో పులి జోన్లు పెంచాలని ఆయన ఆదేశించారు. అటవీ సంపద కాపాడే యత్నంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్ అంటూ అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి సెల్యూ ట్ చేశారు. తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్) వద్ద అటవీశాఖాధికారులు అమరవీరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని, ఎస్వీజూ స్థాపించిన స్వర్గీయ సీఎం ఎన్టీ.రామారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఐఎఫ్ఎస్ ఆఫీసర్‌ను ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అతి దారణంగా చంపాడని, 13 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని స్మగ్లర్లు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలోని అమరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. 1993లో ఎన్టీఆర్ 350 హెక్టార్లలో ఎస్వీ జూపార్క్‌ను ఏర్పాటు చేశారని, ఆయన జ్ఞాపకార్ధం ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆయుధాలు అందించడంలో విఫలం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు కావాల్సిన ఆయుధాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏనుగుల దాడుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిచాలన్నారు. స్వీ జూపార్క్ సిబ్బందికి ఆరు నెలల వేతనబకాయిలు చెల్లిం చాలన్నారు. లేకుంటే జూపార్క్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు అటవీశాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఏవీ. జోసెఫ్, పీసీఎఫ్ రవికుమార్, జూ క్యూరేటర్ యశోదాబాయ్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఈస్ట్ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, రవిశంకర్, పవ న్‌కుమార్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ శెల్వకుమార్, డాక్టర్ అరుణ్, టీడీపీ నాయకులు నరిసింహయాదవ్, శ్రీధర్‌వర్మ, కొండా రాజు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణ
తిరుపతి/కర్నూలు: ఏపీలో మంత్రులు వరుసపెట్టి ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తున్నారు. వెలుగోడు జలాశయం వద్ద ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. తిరుపతి జూపార్కు వద్ద అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. ** -
వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానో...లేదో !
శ్రీకాళహస్తి : ‘ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవు... వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉంటానో ఉండనో నాకే తెలియదు.... అయినా ప్రజాసమస్యలు తెలుసుకుని... వాటిని పరిష్కరించడానికే జన్మభూమికి హాజ రయ్యూన’ని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చెప్పారు. గురువారం పట్టణంలోని 28, 29, 30 వార్డుల్లో జరిగిన జన్మభూమి-మా ఊరు గ్రామసభల్లో మంత్రి పాల్గొన్నారు. సాధారణంగా నాయకులు ఎన్నికల సమయాల్లో మాత్రమే కనిపిస్తారని, అయితే ఐదేళ్ల వరకు ఎన్నికలు లేనప్పటికీ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలనే లక్ష్యంతో తాను హాజరైనట్లు తెలిపారు. అర్హులందరికీ పెన్షన్లు అందేలా చూడాలని మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి, కమిషనర్ సన్యాసరావును ఆదేశిం చారు. అయితే పట్టణంలో పలువురు పురుషులు, వితంతువుల పెన్షన్లు తీసుకుంటున్నారని వాటిని రద్దు చేయాల్సి ఉందన్నారు. పట్టణాన్ని ప్రత్యేక లైటింగ్‌తో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. సోమశిల-స్వర్ణముఖికాలువ పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రధానంగా పెన్షన్లు, మురుగుకాలువలు, రోడ్లు, తాగునీరు తదితర మౌలిక వసతులు కల్పించాలని మంత్రిని ఈ సందర్భంగా కొందరు కౌన్సిలర్లు కోరారు. మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి మాట్లాడుతూ అభివృద్ధే ధేయ్యం గా...పట్టణాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోతామని చెప్పారు. టీడీపీ సీనియర్ నాయకుడు పోతుగుంట గురవయ్యనాయుడు, బీజేపీ నాయకుడు కోలా ఆనంద్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మిద్దెల హరి, వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారథి, ఇన్చార్జి కమిషనర్ సన్యాసరావు,కో-ఆప్షన్ సభ్యుడు షాకీర్‌ఆలీ,కౌన్సిలర్లు విజయకుమార్‌నాయుడు, ప్రసాద్‌నాయుడు, సుప్రజ పాల్గొన్నారు. స్థానికులు వారివారి సమస్యలను అర్జీల రూపంలో అందజేశారు. -
చంద్రబాబు ప్రధానమంత్రి స్థాయి నేత
అటవీ మంత్రి బొజ్జల సాక్షి ప్రతినిధి, తిరుపతి: సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి స్థాయి నేత అని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కొనియాడారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఏడు మిషన్లు.. ఐదు గ్రిడ్లను ఏర్పాటుచేసి సమగ్రంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. బుధవారం చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లులో ‘జన్మభూమి- మా ఊరు’ లో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రికి ఉండాల్సిన లక్షణాలన్నీ చంద్రబాబులో ఉన్నాయన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు చంద్రబాబు తీసుకెళ్తుంటే ప్రతిపక్షం మాత్రం ఈ రోజున ధర్నాలు చేస్తోందన్నారు. ఎన్నికల్లో రుణ మాఫీ చేయలేం, ఎలా రుణ మాఫీ చేస్తారు అంటూ ప్రశ్నించిన విపక్షం ఇప్పుడు తక్షణమే రుణ మాఫీ చేయాలి అంటూ ధర్నాలు చేయడం విడ్డూరమన్నారు. 97 శాతం మంది రైతుల రుణాలను మాఫీ చేస్తున్నామని, విపక్షం తక్కిన మూడు శాతం రైతుల రుణ మాఫీ చేయాలని కోరుతోందని.. ఆదాయం పన్ను కట్టేవాళ్ల రుణాలను కూడా మాఫీ చేయాలంటే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే భూప్రకంపనలు రేగాయన్నారు. గతంలో ఎర్రచందనాన్ని యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తే.. ఇప్పుడు పట్టుకుంటున్నామని చెప్పారు. ఎర్రదొంగల అంతుచూస్తామని.. అణచివేస్తామని పునరుద్ఘాటించారు. -
పార్టీ సంగతి మీరు .. అధికారుల సంగతి మేము ...
చిత్తూరు: పాలన సంగతి దేవుడెగురు... ముందు పనులు చక్కబెట్టుకుంటే చాలన్నట్లు ఉంది.. అధికార పార్టీ నేతల తీరు. అధికారపార్టీ నేతలను మెప్పించిన అధికారులే ఉంటారని అందుకు ఇష్టపడని అధికారులను సాగనంపుతామని సాక్షాత్తు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బహిరంగంగా చెప్పిన విషయం అందుకు అద్దంపడుతోంది. సోమవారం చిత్తూరులో జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ అంశం బయటపడింది. పార్టీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తోపాటు మంత్రి బొజ్జల హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అధికారుల బదిలీలపై బహిరంగంగానే ప్రసంగించారు. ఇక నుంచి మీకు నచ్చిన, మెచ్చిన అధికారులే ఉంటారు.. నచ్చని వారిని సాగనంపుతాం.. అంటూ స్పష్టం చేశారు. నాలుగు నెలల పాలనలో బదిలీలు ఆలస్యమైన మాట నిజమే. ఇక అలా జరగదు. నచ్చని అధికారులను పంపేందుకు సిద్ధంగా ఉన్నామంటూ టీడీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇక నుంచి తహశీల్దార్ పలకలేదు... ఎస్ఐ మాట వినలేదు... అంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఫిర్యాదులు ఉండకుండా చూస్తామన్నారు. అన్నీ మీరు చెప్పినట్లే చేస్తాం.. మీకు నచ్చిన అధికారులనే ఉంచుతాం. అంటూ మంత్రి తేల్చి చెప్పారు. అధికారుల సంగతి మేము చూసుకుంటాం.. గ్రామాల్లో పార్టీ సంగతి మీరు చూసుకోవాలి అంటూ చెప్పారు. రాబోవు కాలంలో గ్రామాల్లో అధికార సపోర్టుతో టీడీపీకి ఎదురులేకుండా చూడాలని మంత్రి నేతలకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో టీడీపీ నేతలకు అధికారులు పలకడం లేదంటూ ముఖ్యమంత్రికి ఫిర్యాదులందాయని మంత్రి చెప్పారు. ఈ విషయం సీఎం తనతో కూడా చర్చించారన్నారు. అధికారులతో మాట్లాడాలంటూ తనను ఆదేశించినట్లు బొజ్జల బహిరంగంగానే చెప్పారు. నచ్చని అధికారుల జాబితాలు మాకు చేర్చండి. వారిని సాగనంపే విషయం తాను చూసుకుంటానంటూ మంత్రి పాత్రికేయుల సమక్షంలో పార్టీ కార్యాలయంలో చెప్పడం విశేషం. మంత్రి మాటలు విన్న అక్కడ ఉన్న కొందరు అధికారులు ఔరా మంత్రి...! అంటూ ముక్కున వేలేసుకున్నారు. -
'కేసీఆర్.. దమ్ముంటే బెజవాడలో నిరూపించు'
చిత్తూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణమని విజయవాడలో నిరూపించాలని సవాల్ విసిరారు. కుప్పం ప్రాంతంలో ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా అడవుల్లోనే ఆహారం, నీరు ఏర్పాటు చేస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు కొత్త రేట్లను నిర్ణయించి పరిహారం చెల్లిస్తామని బొజ్జల హామీ ఇచ్చారు. కాగా చంద్రబాబు నాయుడు మోసాలపై విజయవాడలో బహిరంగ సభ పెట్టి ఆంధ్ర రైతాంగానికి తెలియచేస్తామని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. -
'తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను ఛీకొడుతున్నారు'
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుపై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మండిపడ్డారు. నీటి హక్కులకు సంబంధించిన జీవోలపై కేసీఆర్‌కు ఏమాత్రం అవగాహన లేదని, అందుకే ఆయనలా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌ను ఛీకొడుతున్నారని, ఇప్పటికైనా కేసీఆర్ తన పద్ధతి ఆమర్చుకోవాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సూచించారు. రాయలసీమకు నీటి విడుదల విషయంలో కేసీఆర్ తీరును ఆయన విమర్శించారు. -
ఆయుధమే లేదు..యుద్ధమెలా?
శేషాచలం అడవులు ఆధ్యాత్మికతకు, ఎర్రచందనం వృక్షాలకు పెట్టింది పేరు. ఇక్కడి వృక్షాలు ఎంతో విలువైనవి. ఇదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు స్మగ్లర్లకు, ఎర్ర కూలీలకు స్థావరాలుగా మారాయి. ఎక్కడ చూసినా గొడ్డళ్ల చప్పుళ్లే. మోడువారిన వృక్షాలే.. తమిళ తంబీల దాటికి పోలీసులు సైతం అశువులు బాసుతున్నారు. బండలు ఎర్రబడుతున్నాయి. వీరిని కట్టడి చేయడానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అడవుల్లో సీసీ కెమెరాల నుంచి పోలీసులకు అత్యాధునిక ఆయుధాల వరకు సమకూర్చుతామని నాయకులు మాటిచ్చారు. అయితే ఇంతవరకు ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. కూంబింగ్‌కు వెళ్లిన అధికారులు, పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బందిపై ఎర్రచందనం దొంగలు మారణాయుధాలతో తెగబడుతున్నారు. వారిపై ఆయుధాలు లేకుండా యుద్ధమెలా సాధ్యమో ఆ దేవుడికే తెలియాలి. సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని సీఎం చంద్రబాబు.. అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రకటనలిచ్చారు. స్మగ్లర్లు.. వారికి సహకరించే అధికారులపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించి జైళ్లలో పెడతామని హెచ్చరిం చారు. అటవీ, పోలీసుశాఖలతో ప్ర త్యేక దళాన్ని ఏర్పాటుచేసి శేషాచలం అడవులను జల్లెడ పడతామన్నారు. ఇస్రో(భారత అంతరిక్ష పరిశోధన సం స్థ) సహకారంతో శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేసి.. ఎర్రచందనం వృక్షాలను నరికివేయకుండా అ డ్డుకట్ట వేస్తామన్నారు. వృక్షాలు విస్తారంగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి.. వాటిని అనుసంధానం చేసి నిఘా ఏర్పాటుచేస్తామని స్పష్టీకరించారు. అటవీశాఖ అధికారులకు అధునాతన ఆయుధాలను అం దిస్తామన్నారు. ఎర్రచందనం స్మగ్లిం గ్‌కు అడ్డుకట్ట వేసేందుకు ఎన్‌కౌం టర్లకు కూడా వెనుకాడమని సంకేతాలు పంపారు. వారి మాటలన్నీ కార్యరూపం దాల్చి ఉంటే ఒక్క ఎర్రచందనం దుంగా శేషాచలం అడువుల నుంచి బయటకు వచ్చేది కాదని అటవీశాఖ అధికారవర్గాలే చెబుతున్నారు. అధికమైన స్మగ్లింగ్.. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట పడడం కాదు కదా.. నాలుగు నెలల్లో మరింత అధికమైంది. వృక్షాలను నరకివేస్తున్న కూలీలను అడ్డుకోవడానికి వెళ్లిన అటవీశాఖ అధికారులపై దాడులకు పాల్పడుతున్నారు. అటవీ అధికారుల వద్ద ఎలాంటి ఆయుధాలు లేకపోవడంతో కూలీలను అడ్డుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఇద్దరు అటవీ అధికారులు కూలీల చేతిలో హతమయ్యారు. అటవీ అధికారులను ఎర్ర కూలీలు, స్మగ్లర్లు పొట్టన పెట్టుకున్నాక పోలీసులు ఎన్‌కౌం టర్లకు తెరతీశారు. ఇప్పటిదాకా మూడు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఎర్ర కూలీలను కాల్చి చంపారు. కానీ.. ఎర్రచందనం వృక్షాల నరికివేతకు మాత్రం అడ్డుకట్ట పడలేదు. దీనికి ప్రధాన కారణం.. శేషాచలం అడవులపై నిఘా లేకపోవడమే. శేషాచలం అడవులపై శాటిలైట్‌తో నిఘా వేయించడానికి ఇప్పటికీ ఇస్రో సహకారం కోరకపోవడాన్ని బట్టి చూస్తే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏ పాటితో అర్థం చేసుకోవచ్చు. ఇక సీసీ కెమెరాల ఏర్పాటు ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. అటవీ అధికారులకు అధునాతన ఆయుధాలను అందించలేదు. కూంబింగ్‌ను దాదాపుగా నిలిపేశారు. ఫలితంగా స్మగ్లర్లు తమిళ కూలీలతో యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికివేయిస్తున్నారు. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె అడవుల్లో ఎర్రచందనం వృ క్షాలను నరుకుతున్న 75 మంది తమిళ కూలీలను అడ్డుకోవడానికి అటవీశాఖ అధికారులు మంగళవా రం రాత్రి ప్రయత్నించారు. ఆయుధాలు లేకపోవడంతో అటవీ అధికారులపై కూలీలు దాడి చేశారు. రెండు రోజుల క్రితం మురకంబట్టు వద్ద శేషాచలం అడవుల్లో ఎర్రచంద నం వృక్షాలను నరికివేయడానికి వస్తున్న తమిళ కూలీలను అడ్డుకోవడానికి పోలీసులు విఫలయత్నం చే శారు. కూలీలు పోలీసులు దాడిచేసి తప్పించుకుని శేషాచలం అడవుల్లో కి అడుగుపెట్టి యథేచ్ఛగా ఎర్రచందనం వృక్షాలను నరికేస్తున్నారు. కూలీలకు అడ్డుకట్ట వేయలేరా? తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా లో జివ్వాజిమలై, పోలూరు, తిరువళ్లూరు జిల్లాలో ఆర్కే పేట, పుదుమే డు, విల్లుపురం జిల్లాలో శంకరాపురం, వేలూరు జిల్లాలో గుడియాత్తం, పేర్నంబట్టు ప్రాంతాల్లోని గిరిజనులను ఎర్రచందనం వృక్షాలను నరికి.. రవాణా చేయడానికి స్మగ్లర్లు కూలీలు గా వాడుకుంటున్నారు. ఎర్రచందనం వృక్ష సంపదను పరిరక్షించడానికి ఏడాదిగా శేషాచలం అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎర్రకూలీల దా డి.. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఇప్పటిదాకా ఎనిమిదిమంది కూలీలు, ఇద్ద రు అటవీశాఖ అధికారులు మృతి చెందారు. ఎర్రచందనం కూలీలను శేషాచలం అడవుల్లోకి ప్రవేశించకుండా చేసేందుకు ప్రధాన రహదారులు, రైల్వే స్టేషన్లపై పోలీసులు నిఘా వే శారు. కూలీలు నివాసం ఉంటున్న ప్రాంతాలకు వెళ్లి.. ఎన్కౌంటర్ చేసిన ఫొటోలతో కూడిన వాల్‌పోస్టర్లను పోలీసులే అతికించారు. ఎర్రకూలీ లుగా వస్తే ఎన్కౌంటర్ చేస్తామని ెహ చ్చరించి.. గిరిజనులను చైతన్యం చేయడానికి ప్రయత్నించామని పో లీసులు చెబుతున్నారు. పోలీసులు వేసిన ఎత్తును ఎర్రదొంగలు ధనాస్త్రంతో చిత్తు చేస్తున్నారు. ఎన్కౌంటర్ లో చనిపోయిన కూలీ కుటుంబానికి రూ.పది లక్షల వంతున పరిహారం చెల్లిస్తున్నారు. గాయపడిన కూలీకి రూ.50 నుంచి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తున్నారు. రోజువారీ కూలీ కింద రూ.ఐదు వేలను ఒక్కో కూలీకి చెల్లిస్తున్నారు. ఎర్రకూలీలు నివాసం ఉండే ప్రాంతంలో రోజువారీ కూలీగా రూ.150కి మించి ఇవ్వడం లేదు. స్మగ్లర్ల ధనాస్త్రానికి ఎర్రకూలీలు లొంగుతున్నారు. పోలీసుల ఎత్తులను చిత్తు చేస్తూ శేషాచలంలోకి ప్రవేశించి.. స్మగ్లర్ల కనుసైగల మేరకు ఎర్రచందనం వృక్షాలను నరికేసి, అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండడం గమనార్హం. -
స్వర్ణముఖి ఒడ్డున రూ.10కోట్లతో రోడ్డు
రూ.4కోట్లతో భరధ్వాజతీర్థం రోడ్డు చెన్నై తరహాలో టాయిలెట్స్ తిరుమలలోలాగా నిత్య అన్నదానం ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు శ్రీకాళహస్తి : స్వర్ణముఖి నది ఒడ్డున శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సన్నిధివీధి, జయరామరావు పార్కు, దుర్గమ్మకొండ, నీటిపారుదలశాఖ కార్యాలయం మీదుగా నాయుడుపేట రోడ్డును కలుపుతూ రూ.10 కోట్లతో నూతనంగా రోడ్డు ఏర్పాటు చేయడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జ ల గోపాలకృష్ణారెడ్డి సూచనల మేరకు ఆలయ ఇన్చార్జి ఈవో శ్రీనివాసరావు గురువారం పలు ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి ఆలయాధికారులతో తన చాంబర్లో సమావేశమయ్యూరు. ప్రధానంగా ట్రాఫిక్ సమస్యలను అధిగమిం చడంతో పాటు భక్తుల సౌకర్యం కోసం స్వర్ణముఖినది అంచున రూ.10 కోట్లతో రోడ్డు ఏర్పాటు చేయడానికి నిర్ణరుుం చారు. భరధ్వాజ తీర్థం మీదుగా 60అడుగుల రోడ్డున రూ.4కోట్లతో కైలాసగిరికొండ అవతలివైపు ఉన్న ఆలయభూముల్లోకి రోడ్డు ఏర్పాటు చేయనున్నారు. ఆ ప్రాంతంలో సత్రాలు, వసతిగృహాలు నిర్మించడానికి ముందుగా రోడ్డు సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక రూ.30 లక్షలతో చెన్నై తరహాలో పన్నెండు టాయిలెట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. ఆ మేరకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తిరుమల తరహాలో నిత్యం అన్నదానం,ఉచిత ప్రసాదాలు అందజేయలనే ఆలోచనతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. స్వామివారి సన్నిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ధ్వజస్తంభానికి రాగిరేకును అమర్చడానికి తీర్మానం చేశారు. ఆలయానికి చెందిన రూ.15కోట్లతో అభివృద్ధి పనులు చేయడానికి అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ఆలయ ఏఈవో శ్రీనివాసులురెడ్డి, ఈఈ రామిరెడ్డి, ఆలయ స్తపతి లక్ష్మీ నరసింహస్వామి, ఆలయ ప్రధాన అర్చకుడు బాబు గురుకుల్ పాల్గొన్నారు. -
అనర్హులకు పైసా ఇచ్చే ప్రసక్తే లేదు
నగరి : అనర్హులుగా తేలిన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదని అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం నగరి మున్సిపాలిటీలోని 7వ వార్డులో కౌన్సిలర్ మునికృష్ణయ్య అధ్యక్షతన ఇన్చార్జి కమిషనర్ ప్రసాద్ నిర్వహించిన జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చైర్పర్సన్ శాంతికుమార్ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ పింఛన్లు తొలగించేశారని పలువురు విమర్శిస్తున్నారని అర్హులకు ఎవరికీ తొలగించలేదన్నారు. అనర్హులైన వారికి పైసా కూడా ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. అర్హులైన వారికి తొలగిపోయివుంటే వారికి తప్పక ఇప్పిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమాన్ని సమస్యలు తెలుసుకోవడానికే నిర్వహిస్తున్నామన్నారు. లక్షన్నరదాకా రుణమాఫీ తప్పకచేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు కూడా తప్పక న్యాయం చేస్తామన్నారు. మరో అతిథి మాజీ ఎమ్మెల్యే ముద్దుకృష్ణమనాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరగడం కారణంగా తీవ్రమైన ఆదాయపు లోటు ఏర్పడిందన్నారు. ఈ దశలోను ముఖ్యమంత్రి హామీలు నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. చైర్పర్సన్ శాంతికుమార్ స్మగ్లర్లను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని మంత్రికి వినతిపత్రం సమర్పించారు. సమావేశ ప్రాంగణంలో మంత్రి గోపాలకృష్ణారెడ్డి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో పెంచలకిషోర్, డీఎస్పీ కృష్ణకిషోర్ రెడ్డి, తహశీల్దార్ వెంకటరమణ, వైస్‌చైర్మన్ పీజీ నీలమేఘం, మాజీ చైర్మన్ కేజేకుమార్, జడ్పీటీసీ సభ్యులు వెంకటరత్నం, ఎంపీపీ మీరా, మాజీ సర్పంచ్ శ్రీహరినాయుడు, సహకార బ్యాంకు చైర్మన్ బాలసురేష్, వైద్యాధికారి సుభాషిణి, మున్సిపల్ కౌన్సిలర్లు, వ్యవసాయ అధికారి రమేష్‌రాజు, పశువైద్య, ఐకేపీ, అగ్నిమాపక అధికారులు పాల్గొన్నారు. -
ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి
అర్హులందరికీ పింఛన్లు జన్మభూమి-మాఊరు ప్రారంభసభలో మంత్రి బొజ్జల ఎన్ఆర్ పేటలో ఎన్టీఆర్ సుజలస్రవంతి ప్రారంభం చిత్తూరు (టౌన్): ప్రజల భాగస్వామ్యంతోనే జన్మభూమి-మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర అటవీ, సహకారశాఖల మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతి సందర్భంగా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల జిల్లా అధికారులతో కలిసి చిత్తూరులో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జన్మభూమి-మాఊరు కార్యక్రమాన్ని అక్కడే లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమమూ విజయవంతం కాదన్నారు. అందుకే చంద్రబాబు వారిచేతనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించే విధంగా రూపకల్పన చేశారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పెంచిన పింఛన్లను అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారన్నారు. గతంలో ఇస్తున్న పింఛన్ మొత్తాన్ని పెంచినట్టు వివరించారు. గతంలో పింఛన్ల మంజూరులో అవకతవకలు జరిగినట్టు తెలియడంతో వాటిపై సర్వేచేసి అనర్హులకు రద్దుచేశామన్నారు. అర్హులకు ఎక్కడైనా పింఛన్ రద్దయివుంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొస్తే పరిశీలించి మంజూరు చేస్తారన్నారు. జన్మభూమి స్పెషలాఫీసర్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారన్నారు. పేదరికాన్ని నిర్మూలించాలనే ముఖ్య సిద్ధాంతంతో మాఊరు కార్యక్రమాన్ని సీఎం ప్రవేశపెట్టారన్నారు. కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ మాట్లాడుతూ గ్రామాలను బాగుచేయాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి మాఊరు కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి తీర్చడం కోసం ప్రభుత్వం సూక్ష్మప్రణాళికను అమలు చేస్తోందన్నారు. అందరూ విజన్ మోడ్‌తో పనిచేసిన నాడే అది సాధ్యమన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ మాట్లాడుతూ గాంధీ జయంతి రోజు జన్మభూమి కార్యక్రమాన్ని చేపట్టడం శుభపరిణామమన్నారు. చంద్రబాబు నాయుడు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజాసమస్యలను తెలుసుకోగలిగారన్నారు. వాటి పరిష్కారం కోసమే నేడు జన్మభూమి కార్యక్రమాన్ని చేపడుతున్నారన్నారు. అంతకుముందు జన్మభూమి ర్యాలీని మంత్రి ప్రారంభించారు. జెడ్పీ చైర్పర్సన్ శ్రీరామనేని గీర్వాణి, మేయర్ కటారి అనురాధ, జాయింట్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా, ఏజెసీ వెంకటసుబ్బారెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ శ్రీనివాసులు, జెడ్పీ సీఈవో వేణుగోపాలరెడ్డి, ఆర్అండ్బీ ఎస్ఈ శివకుమార్, వ్యవసాయశాఖ జేడీ రవికుమార్, పశుసంవర్థకశాఖ జేడీ శ్రీనివాసరావు, ఎసీడీఎస్ పీడీ ఉషాఫణికర్,డీఎంఅండ్‌హెచ్‌వో దశరథరామయ్య, డీసీహెచ్ఎస్ కనకదుర్గ, డ్వామా పీడీ గోపీచంద్, డీఆర్డీఏ పీడీ రవిప్రకాష్‌రెడ్డి, డీఈవో ప్రతాప్‌రెడ్డి, ఎస్ఎస్ఏ పీవో లక్ష్మి, డీపీవో ప్రభాకర్‌రావు, సాంఘిక సంక్షేమశాఖ డీడీ ధనుంజయరావు, చిత్తూరు మున్సిపల్ కమిషనర్ రాజేంద్రప్రసాద్, చిత్తూరు ఆర్డీవో పెంచల కిశోర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం చిత్తూరు రూరల్ మండలంలోని ఎన్ఆర్ పేటలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని మంత్రి ప్రారంభించారు. -
'ప్రభుత్వ భూమి ఆక్రమించిన బొజ్జల అనుచరుడు'
శ్రీకాళహస్తి: ‘మంత్రిగారూ.. మీ నియోజకవర్గంలో భూకబ్జాలు పెరిగిపోతున్నాయి. మీ అనుచరులే కబ్జాచేసి ఇతరులకు లీజుకిస్తున్నారు.’ అంటూ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డిని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ దుయ్యబట్టారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో భూ ఆక్రమణలపై సీపీఐ నాయకుల ఆధ్వర్యంలో భూసదస్సు నిర్వహించా రు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ మాట్లాడుతూ పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన టీడీపీ నాయకులు భూదాహంతో పరితపించిపోతున్నారన్నారు. మంత్రి బొజ్జల అనుచరుడు, టీడీపీ సీనియర్ నాయకుడు 300 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు వాసులకు లీజుకివ్వడం సిగ్గుచేటన్నారు. సత్యవేడు నియోజకవర్గంలోని వరదయ్యపాళెం, బుచ్చినాయుడుకండ్రిగ, కేవీబీపురం, సత్యవేడు మండ లాల్లోని ప్రభుత్వ భూములను ఆయా మండలాల నాయకులు ఆక్రమించి తమిళనాడు వాసులకు విక్రయిస్తున్నారని విమర్శించారు. -
మంత్రి బొజ్జల ఆదేశాలకు చుక్కెదురు!
బెరైడ్డిపల్లె పీఏసీఎస్ పీఐసీలు విధాన నిర్ణయాలు తీసుకోకూడదు ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి ప్రభుత్వం కౌంటర్ దాఖలకు రెండు వారాల గడువు ఆదేశాలిచ్చిన హైకోర్టు ధర్మాసనం పలమనేరు: పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్చార్జి కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర సహకారశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జారీ చేసిన అదేశాలకు కోర్టులో చు క్కెదురు అరుు్యంది. పలమనేరు నియోజకవర్గంలోని బెరైడ్డిపల్లె ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్)లో ఇటీవల ఏర్పాటైన పర్సన్ ఇన్చార్జ్ కమిటీ(పీఐసీ)లు తదుపరి ఉత్తర్వులు వచ్చేదాకా ఆ పీఏసీఎస్‌కు సంబంధించి ఎటువంటి విధానపరమై న నిర్ణయాలు తీసుకోరాదని హైకోర్టు ధర్మాసనం తీ ర్పు నిచ్చింది. ఆ మేరకు ఈ ఉత్తర్వు కాపీలు శుక్రవా రం పిటీషనర్‌తో పాటు కలెక్టర్, జిల్లా సహకార శాఖ అధికారి తదితరులకు అందాయి. బెరైడ్డిపల్లె పీఏసీఎస్ కి సంబంధించి మంత్రి ఆదేశాలతో ఏర్పాటైన పీఐసీల నియమాపకం న్యాయసమ్మతం కాదని బెరైడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నేత మొగసాల కృష్ణమూర్తి హై కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కో ఆపరేటివ్ కార్యదర్శి, కమిషనర్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కో-ఆపరేటివ్ సొసైటీస్, కలెక్టర్, జిల్లా సహకారశాఖ అధికారి, సంబంధిత పీఏ సీఎస్ కార్యదర్శి, పీఐసీ సభ్యులు సుబ్రమణ్యం, అమరనాథరెడ్డి, రాజగోపాల్‌ను ప్రతివాదులుగా చేస్తూ రిట్ పిటిషన్ (డబ్ల్యూపీ 27269/14) దాఖలు చేశారు. ఈ పీఏసీఎస్‌కు సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రి కృష్ణారెడ్డి ఆదేశాలతో జరగాల్సిన ఎన్నికలు వా యిదా పడ్డాయని, ఆపై ఈ ఏడాది జూలై 4న ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైతే జూలై 28న మంత్రి గోపాలకృష్ణారెడ్డి ఆదేశాలతో ఇవి వాయిదా పడ్డాయని అందులో పేర్కొన్నారు. ఒక్కసారి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తరువాత మధ్యలో వాయిదా ఆదేశాలు చె ల్లవని సహకార శాఖలోని జీవోఎం ఎస్ నెంబర్ 150 చెబుతోందని తన వాదనలో పేర్కొన్నారు. వీటిని వి న్న జస్టిస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక తిరిగి వాయిదా వేయాల్సిన అవసరమేముందని, ఈ ఎన్నికల ప్రక్రియ ఎక్కడ ఆగిందో అ క్కడి నుంచి తిరిగి కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఏర్పాటైన పీఐసీ సభ్యులు సంఘానికి సంబంధించిన ఎటువంటి విధానపరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకోరాదని ఆదేశించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం రెండు వా రాల్లో కౌంటర్ దాఖలు చేయాలని అందులో పేర్కొం ది. దీంతో సహకారశాఖ మంత్రి బొజ్జలకు చుక్కెదురైంది. మరోవైపు మంత్రి ఆదేశాలతో వాయిదాపడిన బయప్పగారిపల్లె పీఏసీఎస్‌పై కూడా కొందరు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. -
ఇన్‌స్పైర్‌లో టీడీపీ సొంత డబ్బా!
తిరుచానూరు : సొంత డబ్బా కొట్టుకునేందుకు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ వేదికయింది. వంద రోజుల పాలన గురించి మంత్రి ప్రభుత్వాన్ని, సీఎం ను పొగడ్తలతో ముంచెత్తుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని రాజకీయ కార్యక్రమంలా మార్చివేశారు. విద్యార్థులకు నాలుగు మంచి మాటలు చెప్పాల్సింది పోయి సొంత డబ్బాకే అధిక ప్రాధాన్యమిచ్చారు. మంత్రి వర్గం బాగా పనిచేస్తోందని కితాబిచ్చారు. ఎటువంటి పరిస్థితులైనా తనకు అనుకూలంగా మార్చుకునే నేర్పు సీఎం చంద్రబాబుకే సొంతమన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు రాష్ట్రంలో మార్పుకు శ్రీకారం చుడుతున్నారని, అవినీతి రహిత రాష్ట్రంగా, లంచగొండితనాన్ని రూపుమాపేందుకు ఆయన నిర్విరామంగా పనిచేస్తున్నారని, అలాగే అధికారులతో పనిచేయిస్తున్నారని పేర్కొన్నారు. భోజనాలు లేక అవస్థలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ ప్రారంభిం చారు. అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే అధికారుల చేతకానితనం వల్ల ఎగ్జిబిషన్‌కు వచ్చిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు భోజనాలు అందక అవస్థలు పడ్డారు. దీనికి తోడు మంత్రి ఆలస్యంగా రావడం, సమావేశం పూర్తవ్వడానికి మధ్యాహ్నం ఒంటిగంట పైగా కావడంతో ఇబ్బం దులు ఎదురయ్యాయి. మధ్యాహ్నం 3 గం టలైనా భోజనాలు చాలా మందికి అందలేదు. దీంతో పలువురు హోటల్స్‌లో తినాల్సి వచ్చిం ది. దీనికి తోడు ఒకే ప్రాంతంలో అన్నం వడ్డిం చడం, అక్కడే తినాల్సి రావడంతో తొలిరోజే అందరూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ఇన్స్పైర్ ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకులకు ఆటవిడుపు కోసం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ప్రముఖ కళాకారుడు, నటుడు శాంబోలా హరినాథ్ మిమి క్రీ, కీలుగుర్రం ప్రదర్శనలు అలరించాయి. వేదికంతా పసుపు చొక్కాలే ప్రభుత్వ కార్యక్రమమైన ఇన్‌స్పైర్‌కు పసుపు రంగు అంటుకుంది. వేదికపై మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చోవాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతల మెప్పు పొందేందుకు టీడీపీ నాయకులను ఆహ్వానించి వేదికపై కూర్చోబెట్టడంతో విద్యాశాఖ అధికారులు విమర్శల పాలయ్యారు. ఇరుకైన గదుల్లో నమూనాలు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎగ్జిబిషన్‌ను ఇరుకైన గదుల్లో ఏర్పాటుచేశారు. దీంతో విద్యార్థులు తమ నమూనాలను ఇరుకైన గదుల్లోనే ఏర్పాటుచేసుకున్నారు. పట్టుమని పది మంది సందర్శకులు నమూనాలను తిలకించలేని పరిస్థితి ఎదురయ్యింది. దీనికి తోడు వర్షం కురవడంతో పాఠశాల ఆవరణం బురదమయంగా మారింది. -
నేనే కాదు, చంద్రబాబూ అసంతృప్తిగానే ఉన్నారు
హైదరాబాద్ : వంద రోజుల పాలనపై మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. తానే కాదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం అసంతృప్తిగా ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా బాగా చేయాలని అనుకుంటున్నామని బొజ్జల తెలిపారు. ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. అటు ప్రజలకు, ఇటు పార్టీ కేడర్‌కు నిరాశ కలిగించింది. ఎన్నికల సమయంలో ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రోజుకో కొత్త మాట చెబుతూ ఇంకా ప్రజలను నమ్మించే యత్నంలోనే ఉన్నారు. ఇదే చివరి ఎన్నిక...ఇప్పుడు అధికారంలోకి రాకపోతే పార్టీయే ఉండద’ని కేడర్‌ను రెచ్చగొట్టి సీఎం అయిన తరువాత వారికి ఉపయోగపడే నిర్ణయం ఒక్కటీ తీసుకోలేదు. ప్రభుత్వ కార్యాలయా ల్లో కూడా పనులు కావడం లేదనే బాధను ఆ పార్టీ కేడర్ వ్యక్తం చేస్తోంది. ఈ ఏడాది జూన్ ఎనిమిదవ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట గ్రౌండ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సమయంలో చేసిన ఐదు సంతకాల్లో ఒక్క దానిని అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారనే విమర్శలు ఎక్కువగా వినపడుతున్నాయి. -
మంత్రి గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారు
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నేతలు వెయ్యి ఎకరాల భూకబ్జాకు పాల్పడ్డారని వైఎస్ఆర్ సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి అన్నారు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణ అనుచరులే కబ్జా చేశారని ఆయన అన్నారు. దళితుల పొట్టగొట్టి టీడీపీ నేతలు రూ.కోట్లు సంపాదిస్తున్నారని మధుసూదన్ రెడ్డి ధ్వజమెత్తారు. వెయ్యి ఎకరాల భూకబ్జాపై సీబీపీ విచారణ చేయించాలంటూ తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేతలు గురువారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బియ్యపు మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ దళిత రైతులకు న్యాయం జరిగేవరకు వైఎస్ఆర్ సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత మండలంలో టీడీపీ నాయకులు సుమారు వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించుకోవడం రాష్ట్రంలో ఇదే ప్రథమం అన్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. -
తెలుగు తమ్ముళ్లు.. కబ్జాకోరులు..
శ్రీకాళహస్తి: రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సొంత మండలం శ్రీకాళహస్తిలో తెలుగుతమ్ముళ్లు భూరంగం సృష్టిస్తున్నారు. పదేళ్లపాటు అధికారానికి దూరంగా ఉన్న తెలుగుతమ్ముళ్లు భూదాహంతో తపించిపోతున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే శ్రీకాళహస్తి మండలంలోని మన్నవరం వైఎస్సార్పురం ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టుకు పది కిలోమీటర్ల చుట్టూ పది గ్రామా ల్లో వెరుు్య ఎకరాల భూములను మంత్రి అనుచరులు ఎంచక్కా ఆక్రమించి మినుముపంట సాగుచేయడానికి సిద్ధం చేస్తున్నారు. సామాన్యుడు సెంటు భూమి ఆక్రమిస్తే కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేస్తున్న రెవెన్యూ అధికారులు తెలుగుతమ్ముళ్ల విషయంలో ఉదాసీనతగా వ్యవహరిస్తున్నారు. కార్యాలయంలో టీడీపీ నాయకులతో కబ్జాలపై గంటల కొద్దీ రెవెన్యూ అధికారులు చర్చలు సాగిస్తున్నారు. అంతేకాదు కమీషన్లకు కక్కుర్తిపడి ప్రభుత్వ మిగులు భూముల వివరాలను నాయకులకు ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. మండలంలో టీడీపీ నాయకుల భూభాగోతమే ఓ హాట్‌టాపిక్‌గా మారింది. భూములు ఆక్రమిస్తే రాళ్లతో తరిమికొట్టాలని ఓ వైపు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ‘మీ వద్దకు మీ మున్సిపాలిటీ’ సమావేశాల్లో ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే ఆయన చుట్టూ తిరుగుతూ ఉండేనాయకులే ఇష్టారాజ్యంగా వందల ఎకరాలు ఆక్రమిస్తున్నా...దాన్ని ఖండించకపోవడం గమనార్హం. జిల్లాలో ఎక్కడా లేని విధంగా శ్రీకాళహస్తి మండలంలో మన్నవరం వద్ద ఎన్బీపీపీఎల్ ప్రాజెక్టు, కాపుగున్నేరి వద్ద కోకకోలా, రాచగున్నేరి వద్ద ల్యాంకో, మంత్రి స్వగ్రామం ఊ రందూరు వద్ద విష్ణుకెమికల్స్, గుంటకిందపల్లె వద్ద ఫై కర్మాగారం లాంటి మేజర్ ఫ్యాక్టరీలు స్థాపించడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎకరం రూ.5లక్షల నుంచి రూ.30లక్షల వరకు పలుకుతోంది. మండలంలో మిగులు భూములు కూడా ఎక్కువగా ఉండడంతో ఇదే అదునుగా తెలుగుతమ్ముళ్లు ఖాళీగా కనిపిస్తే చాలు కబ్జా చేస్తున్నా రు. ఇప్పటికే వెరుు్య ఎకరాలు ఆక్రమించినట్లు తెలుస్తోంది. ఆక్రమణలివీ.. ప్రధానంగా శ్రీకాళహస్తి మండలంలో టీడీపీ నాయకుల ఆక్రమణలు చూస్తే ఇనగలూరు గ్రామంలో 1769 హెకార్ల భూముల్లో 181బ్లాక్‌లోని 397.15 ఎకరాల్లో 449 నుంచి 454, 488 నుంచి 501, 524 నుంచి 532 సర్వేనెంబర్లలోని 273.52 ఎకరాలు ఆక్రమించి లీజుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే విధంగా సర్వే నెంబర్ 455 నుంచి 460 వరకు 53.27 ఎకరాలు, 481 నుంచి 487 వరకు 70.36 ఎకరాలు పేదల పేర్లతో కబ్జా చేసినట్లు సమాచారం. ఇక 190 బ్లాక్‌లో 953 ఎకరాల (గోవిందరావుపల్లె, నిమ్మరాళ్లపల్లె, రేపల్లె, మామిడిగుంటలో) ప్రభుత్వ మిగులు భూములు ఉన్నాయి. ఇందులో ఓ టీడీపీ నాయకుడు 150 ఎకరాలు బినామీలతో కలసి ఆక్రమించారు. మన్నవరం సర్వే నెంబర్లు 87,88లో 80 ఎకరాలు మరో నాయకుడి చేతిలో ఉన్నాయి. ఇక కలవగుంట గ్రామంలో సర్వే నెంబర్ 1బ్లాక్‌లో 60 ఎకరాలను మరో టీడీపీ నాయకుడు మొక్కలు తొలగించి కబ్జాకు సిద్ధం చేసుకుంటున్నారు. వెలంపాడులో 166-3 చిన్న చెరువు 10 ఎకరాలు, 185 బ్లాక్‌లో 80 ఎకరాలు, రేపల్లెలోని 190 బ్లాక్‌లో చిన్న చెరువు 8 ఎకరాలు ఆక్రమించారు. గంగలపూడి గ్రామంలో స్థానికేతరుల పేర్లతో 393-2, 393-4, 393-1, 394-4, 394-4, 388-2, 388-3, 388-4, 388-5, 392-1, 392-2, 392-3, 386-1, 386-2 సర్వే నెంబర్లలో 30 ఎకరాల భూములు ఆక్రమించి మినుముపంట సాగుచేస్తున్నారు. ఈ ప్రాంతంలో అధికంగా(1000 కుటుంబాలు) యానాదులు నివాసం ఉన్నారు. వారికి ఎక్కడా సెంటు భూమి లేదు. కానీ తెలుగుతమ్ముళ్లు మాత్రం భూదాహంతో వీరంగం సృష్టిస్తున్నారు. -
గోపాలా.. కొల్లేరు గోడు ఆలకించయ్యా..!
నేడు అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కైకలూరు రాక సమస్యలు వివరించేందుకు కొల్లేరు వాసులు సిద్ధం కైకలూరు : పాలకులు మారిన ప్రతిసారి తమకు న్యాయం జరుగుతుందేమోనని ఆశగా ఎదురు చూడటం కొల్లేరు ప్రాంత వాసులకు ఆనవాయితీగా మారింది. మంత్రులు, నాయకులు వచ్చినప్పుడు సమస్యలను వివరించడం పరిపాటిగా మారింది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, సహకార, శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మంగళవారం తొలిసారిగా కైకలూరు రానున్నారు. ఈ సందర్భంగా కొల్లేరు తీర ప్రాంత సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లడానికి లంక గ్రామాల ప్రజలు సిద్ధమవుతున్నారు. కొల్లేరు వాసుల డిమాండ్లు ఇవీ.. కొల్లేరు ఆపరేషన్ సమయంలో కైకలూరు, మండవల్లి మండలాల్లో అదనంగా ధ్వంసం చేసిన 7,500 ఎకరాలను తిరిగి పంపిణీ చేయాలి. కొల్లేరు ఆపరేషన్‌లో ధ్వంసమైన జిరాయితీ భూమలకు నష్టపరిహారం అందించాలి. సరస్సును +5 కాంటూరు నుంచి +3 కాంటూరు వరకు కుదించాలి. మిగిలిన భూమిని పేదలకు పంచాలి. కొల్లేరులో వలసల నివారణకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి. కొల్లేరులో వేటపై ఆంక్షలు ఎత్తేయాలి. కొల్లేరు ప్రాంత ప్రజలను మత్య్సకారులుగా గుర్తించి పథకాలు అమలు చేయాలి. కొల్లేరు ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యే నిధులు కేటాయించాలి. -
అటవీ అనుమతుల గుట్టు..గోపాలుడికే ఎరుక!
అటవీ అనుమతులు లేక అనుప్పల్లి-పనబాకంరహదారి పనుల నిలిపివేత రూ.4.59 కోట్ల నాబార్డ్ నిధులు వెనక్కి పరదరామి, కీనాటంపల్లి రిజర్వు ఫారెస్టులో గ్రానైట్ తవ్వకానికి అటవీశాఖ అనుమతి! ఇద్దరు గ్రానైట్ వ్యాపారులు మంత్రికి సన్నిహితులు కావడం వల్లే అనుమతులు వచ్చాయంటున్న అధికారవర్గాలు..! సాక్షి ప్రతినిధి, తిరుపతి: అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలకు రహదారుల నిర్మాణానికి ఆ శాఖ అనుమతించడం లేదు. కానీ.. అటవీ భూముల్లో నిక్షిప్తమైన సహజసంపదను బడా వ్యక్తులకు దోచిపెట్టడానికి మాత్రం ఆశాఖ తలుపులు బార్లా తెరుస్తోంది. రామచంద్రాపురం మండలంలో అనుప్పల్లి-పనబాకం రోడ్డు నిర్మాణానికి అటవీ శాఖ అనుమతించలేదు. ఎంత ప్రయత్నించినా అటవీశాఖ అనుమతించకపోవడంతో చేసేదిలేక ఆ రోడ్డును రహదారులు, భవనాలశాఖ అధికారులు రద్దు చేశారు. యాదమరి మండలంలో కీనాటంపల్లి, పరదరామి రిజర్వు అటవీ భూముల్లో అత్యంత విలువైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మాత్రం ఇద్దరు టీడీపీ నేతలకు ఆ శాఖ అనుమతి ఇచ్చేసింది. అటవీశాఖ మంత్రి బొజ్జలకు ఆ ఇద్దరు సన్నిహితు లు కావడం వల్లే అనుమతి ఇచ్చిందని అధికారవర్గాలు స్పష్టీకరిస్తున్నాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి విజయం సాధించి, చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖను దక్కించుకున్నారు. అటవీ శాఖమంత్రి జిల్లాకు చెందిన నేతే కావడంతో ఆశాఖ అనుమతులు రాక ఆగిపోయిన అభివృద్ధి పనులు శరవేగంగా సాగే అ వకాశం ఉందని అధికారవర్గాలు భావించాయి. ప్రజలూ అదే ఆశించారు. ఆ ఆశలను అటవీశాఖ అడియాశలు చేస్తోంది. జనం ఆశలపై నీళ్లు.. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలో రామచంద్రాపురం మండలంలోని ఆర్కే పల్లి రోడ్డు 0/0 కిమీ నుంచి 9/4 కిమీ వరకూ అనుపల్లి నుంచి గోకులాపురం మీదుగా పనబాకం వరకూ రోడ్డు నిర్మాణానికి ఆగస్టు 1, 2011న ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు రూ.4.59 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేసింది. 9.4 కిమీల పొడవు ఉన్న రోడ్డును.. 4.30 కిమీల మేర రిజర్వు అటవీ ప్రాంతంలో నిర్మించాల్సి ఉంది. ఇందుకు అటవీశాఖ అనుమతి తప్పనిసరి. అనుపల్లి-పనబా కం రోడ్డు నిర్మాణం కోసం రహదారులు భవనాలశాఖ అధికారులు అటవీశాఖ అనుమతి కోసం ప్రయత్నించారు. మూడేళ్లపాటు అటవీశాఖ ప్రధాన కార్యాలయం చుట్టూ రహదారు లు, భవనాలశాఖ అధికారులు కాళ్లరిగేలా తిరిగారు. చివరకు అటవీశాఖ మంత్రి బొజ్జల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కానీ.. ఆ రహదారి నిర్మాణానికి అటవీ శాఖ అనుమతిం చలేదు. దాంతో చేసేదిలేక ఆ రోడ్డు నిర్మాణాలను ఆపేశారు. పనులు చేసిన మేరకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించి.. తక్కిన నిధులను నాబార్డుకు వెనక్కి పంపాలని ఆ శాఖ ప్రధాన కార్యదర్శి బి.శ్యాంబాబు ఆగస్టు 13న ఉత్తర్వులు(జీవో ఆర్టీ నెం: 618)ను జారీ చేశారు. ఇది అనుపల్లి, గోకులాపురం, పనబాకం గ్రామాల ప్రజలను తీవ్రంగా కలచివేసింది. గ్రానైట్ వ్యాపారులపై ప్రేమ.. యాదమరి మండలం పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలోని 213 కంపార్ట్మెంట్లో 4.90 హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతించాలని టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్ జూన్ 14, 2007న దరఖాస్తు చేసుకుంది. అదే మండలంలో కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాం తంలోని 228 కంపార్ట్మెంట్లో ఏడు హెక్టార్లలో నిక్షిప్తమైన బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి మరో టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్ జూన్ 7, 2008న దరఖాస్తు చేసుకుంది. రిజర్వు అటవీ భూముల్లో గనుల తవ్వకానికి ఆశాఖ అనుమతించలేదు. ఏడేళ్లుగా టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నించినా నిరాశే ఎదురైంది. కానీ.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ శాఖ మంత్రి పదవి దక్కించుకోగానే ఆ ఇద్దరి నేతల ఫైళ్లు చకచకా కదిలాయి. కీనాటంపల్లి రిజర్వు అటవీ ప్రాంతంలో ఏడు హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్ తవ్వుకోవడానికి టీడీపీ నేతకు చెందిన గుల్షన్ గ్రానైట్స్‌కు అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 73) జారీచేశారు. ఇక మరో టీడీపీ నేతకు చెందిన సిద్ధార్థ్ గ్రానైట్స్‌కు పరదరామి రిజర్వు అటవీ ప్రాంతంలో 4.90 హెక్టార్లలో బ్లాక్ గ్రానైట్‌ను తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఈనెల 4న అటవీశాఖ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఉత్తర్వులు(జీవో ఎంఎస్ నెం: 74) జారీచేశారు. ఏడేళ్లుగా అనుమతించని అటవీశాఖ ఇప్పుడు ఒక్కసారిగా తలుపులు బార్లా తెరవడం వెనుక మతలబేమిటన్నది గోపాలుడికే ఎరుక. -
రసాభాస
గందరగోళంగా జెడ్పీ మీట్ సమస్యలు ప్రస్తావించిన వైఎస్ఆర్ సీపీ సభ్యులపై అధికార పార్టీ దౌర్జన్యం అడుగడుగునా అడ్డగింపులు జెడ్పీ చరిత్రలో తొలిసారిగా పోలీసుల రంగప్రవేశం సభ్యులుకానివారు సభలోకొచ్చి వీరంగం సృష్టిస్తున్నా పట్టించుకోని అధికారులు అర్ధాంతరంగా ముగిసిన సమావేశం చిత్తూరు (టౌన్): జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. సమావేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. సమస్యలను ప్రస్తావించిన వైఎస్ఆర్ సీపీ జెడ్పీటీసీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగడంతో దాన్ని ప్రతి ఘటించే క్రమంలో సభ ఆద్యంతం అరుపులు, కేకలు, వాగ్వాదాలు, తోపులాటల మధ్య సాగింది. అధికారపార్టీ సభ్యులకు మద్దతుగా సభ్యులు కానివారు సభలోకొచ్చి టీడీపీ సభ్యులకు మద్దతిచ్చేలా నినాదాలు చేస్తున్నా నిలువరించాల్సిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సైతం చూస్తూ మిన్నకుండి పోయారు. దీంతో మంత్రి, ఇన్చార్జి కలెక్టర్ పాల్గొన్న సభలో మహిళలని కూడా చూడకుండా వైఎస్ఆర్ సీపీ మహిళా సభ్యులపై అధికారపార్టీ సభ్యులు అప్రజాస్వామ్యంగా వ్యవహరించి, వారి హక్కులను హరింపజేసేవిధంగా వ్యవహరిం చారు. దీంతో సభ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసేవరకు అరుపులు, కేకలు, వాగ్వాదాలతోనే కొనసాగింది. సభలో పాల్గొన్న మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అధికారపార్టీ సభ్యులకు మద్దతిచ్చే విధంగానే వ్యవహరించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు, వారికి మద్దతుగా ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు గొంతుకలపడంతో విధిలేక అధికారపార్టీ సభ్యులు కొంత వెనక్కి తగ్గారు. జెడ్పీ మీటింగ్ హాలులో ఆదివారం జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి అధ్యక్షతన జిల్లాపరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. అయితే ఇది తొలిసమావేశం కావడంతో జరగాల్సిన సమయాని కన్నా కొంత ఆలస్యంగా జరిగింది. సభ ప్రారంభంలోనే పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి కల్పించుకుని జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీని పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని చైర్‌పర్సన్‌ను కోరారు. ఇంతలోనే అధికారపార్టీ జెడ్పీటీసీ సభ్యులు పలువురు కల్పించుకుని అజెండా ప్రకారం సభను జరిపించాలని పట్టుబట్టారు. ఇంతలో పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ నియోజకవర్గంలో తా గునీటి సమస్య తీవ్రంగా ఉందని, గొంతెండుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. దీంతో అధికార పార్టీ సభ్యులు ఎదురుదాడికి దిగుతూ ఎమ్మెల్యే ఏమి మాట్లాడుతున్నారో వినిపించకుండా ఇస్టానుసారంగా అరవడం మొదలుపెట్టారు. దీంతో మంత్రి కల్పించుకుని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేల దగ్గరున్న మైకులను తీసేసుకోండంటూ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వైఎస్ఆర్ సీపీ సభ్యుల నుంచి కూడా నిరసనలు ఎదురయ్యాయి. పీలేరు, చంద్రగిరి ఎమ్మెల్యే లు కల్పించుకుని తమ గొంతులు నొక్కేస్తారా అంటూ మంత్రిని ప్రశ్నించారు. అయినా మంత్రి నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. దీంతో చంద్రగిరి, పలమనేరు ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అమరనాథరెడ్డి క ల్పించుకుని మంత్రిగారే చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. తాము రాజకీయాలు చేసేందు కు ఇక్కడకు రాలేదని, నిధుల మంజూరులో తమ జెడ్పీటీసీ సభ్యులున్న ప్రాంతాలకు వివక్ష చూపారని ప్రశ్నిం చడానికి వచ్చామన్నారు. సమస్యలపై మాట్లాడితే కూ డా తప్పంటే మరి మమ్మల్ని సమావేశాలకు ఎందుకు ఆహ్వానించారంటూ ప్రశ్నించారు. ఇంతలో అధికారపార్టీ సభ్యులు అడ్డుపడి అరుపులకు దిగడంతో మళ్లీ సభలో గందరగోళం నెలకొంది. దీంతో మంత్రి జోక్యం చేసుకుని ఇది తొలిమీటింగ్ ఇలాగయితేఎలా, మీరు గొడవకనే వచ్చినట్టున్నారు, దానికోసమే వచ్చినట్టుం టే బయటకు వెళ్లి అరుచుకోండంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. అయినా పరిస్థితి సర్దుబాటు కాకపోవడంతో ‘సీఈవో గారు..ఇద్దరు ముగ్గురిని సస్పెండ్ చేయకపోతే పరిస్థితి సర్దుబాటు కాదు, సభ సజావుగా జరగదు, వీరిలో కొందరినైనా సస్పెండ్ చేయండి’ అంటూ ఆదేశించారు. దాంతో అప్పటివరకు మౌనంగా ఉన్న నగరి, చంద్రగిరి ఎమ్మెల్యేలు రోజా, చెవిరెడ్డి భాస్కర్ కల్పించుకుని సభ్యుల వద్ద కెళ్లి పరిస్థితిని సర్దుబాటు చేశారు. దీంతో సభ కొంత సర్దుబాటైంది. ఇంత లో మళ్లీ మంత్రి జోక్యం చేసుకుని ‘మాకు తెలుసు సభ ను ఎలా నిర్వహించాలో’ అని వ్యంగ్యంగా అనడంతో సభ మధ్యలో కూర్చుండిన వైఎస్ఆర్ సీపీ సభ్యులు చేతిలోని వాటర్‌బాటిళ్లను చూపుతూ తమకు నీళ్లు కావా లి, అందరితో సమానంగా తమకూనిధులివ్వండని గట్టిగా అరవడంతో వారి అరుపులు వినబడకుండా అధికారపార్టీ సభ్యులు కూడా అరుపులకు దిగడంతో ఇరుపార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం పెరిగి తోపులాట లవరకు దారితీసింది. కొందరు బల్లలు గుద్దడం, అం తా గుమికూడడంతో సభలో ఏమి జరుగుతోందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపుతప్పుతుందని గుర్తించిన మంత్రి పోలీసులను పిలిపిం చండని పక్కనే వున్న ఇన్చార్జి కలెక్టర్ శ్రీధర్‌కు చెప్పడంతో ఆయన డీఎస్పీ..డీఎస్పీ అంటూ పలుమార్లు పిలిచినా ఎవరూ లోపలికి రాలేదు. చివరికి టూటౌన్ సీఐ రాజశేఖర్ ఒకరిద్దరు ఎస్ఐలు, సిబ్బందితో లోపలికొచ్చి సభ్యులను వారివారి సీట్ల వద్దకు పంపారు. ఇలా ఆరేడుసార్లు సభలో వైఎస్ఆర్ సీపీ, అధికారపార్టీ సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో తోపులాటల వరకు దారితీసింది. అయితే గొడవలను సర్దుబాటు చేయాల్సిన మంత్రి తాము ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇలాగే సమస్యలను ఎదుర్కొన్నాం, ఇప్పుడు మీకూ పదేళ్లపాటు తప్పదు అంటూ పదేపదే చెప్పడంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులపై అధికారపార్టీ సభ్యులు దూకుడు పెంచారు. సమావేశం ముగిసే సమయంలో గంగధరనెల్లూరు ఎంపీపీ ప్రగతీకరుణాకర్ మాట్లాడేందుకు మైకు తీసుకోగా ఆమెను మాట్లాడనివ్వకుండా 15 నిమిషాలపాటు అడ్డుపడ్డారు. ఇంతలో వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆమెకు మద్దతివ్వగా అధికారపార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. ఇంతలో సభ్యులుకాని అధికారపార్టీకి చెందిన వ్యక్తులు లోపలికొచ్చి మంత్రి, ఇన్చార్జి కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్లు కూర్చొని ఉన్న వేదికపెకైక్కి పదేళ్లు మీకిది తప్పదు, మేము చెప్పిందే జరుగుతుంది, మాదే రాజ్యం అంటూ నినాదాలు చేశారు. దాంతో గంగాధరనెల్లూరు ఎంపీపీ కంటతడిపెట్టినా మంత్రికాని, ఇన్చార్జి కలెక్టర్ కాని అధికారపార్టీ సభ్యులను, బయటి వ్యక్తులను వారించలేకపోయారు. చివరకు అజెండాలోని పది అంశాలపై చర్చ జరగకుండానే సభను ముగిస్తున్నట్లు చైర్పర్సన్ ప్రకటించి వెళ్లిపోయారు. -
'తిరుపతిని మెగాసిటీగా మారుస్తాం'
తిరుమల : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తిరుపతి నగరాన్ని మెగాసిటీగా మారుస్తామని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తిరుపతిలో వెల్లడించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి మంచి ఆదాయం వస్తుందని కేఈ తెలిపారు. ప్రజల కష్టాలను తీర్చడంమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి చెప్పారు. భవిష్యత్తులో పూర్తిస్థాయిలో ఎర్రచందనం అక్రమ రవాణాను అరికడతామని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు మీడియా సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను చాలా వరకు అరికట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వద్ద నిల్వ ఉన్న బి,సి గ్రేడ్ ఎర్రచందనాన్ని ఆన్లైన్ ద్వారా వేలం వేస్తామని బొజ్జల చెప్పారు. అంతకు ముందు తిరుమలలో శ్రీవారిని కేఈ కృష్ణమూర్తి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలు దర్శించుకున్నారు. వీరికి టిటిడి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగానాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 5 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. -
'బొజ్జల గోపాలకృష్ణారెడ్డిదే ఐరన్ లెగ్ '
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా మారిపోయారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. ఎవరైనా ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఈ కార్యకర్తలు బెల్టు షాపుల్లోంచి తీసుకెళ్లి మరీ ఇస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆమె గురువారం మాట్లాడారు. మధ్యలో టీడీపీ సభ్యులు, మంత్రులు పదే పదే కలగజేసుకుని ఆమెకు అంతరాయాలు కలిగించగా దీటుగా సమాధానాలు ఇచ్చారు. 'నా నోటికి అసలే మంచిమాటలు రావు. నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి' అని గట్టిగా చురక అంటించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రోజాను 'ఐరన్ లెగ్' అని వ్యాఖ్యానించారు. దాంతో ఐరన్ లెగ్ తనది కాదని, గోపాలకృష్ణారెడ్డిదేనని ఆమె అన్నారు. చంద్రబాబు మీద బాంబుదాడి జరిగినప్పుడు ఆ కారులో ఆయనే ఉన్నారని, అలాగే వైఎస్ మరణానికి ముందు రోజు కూడా క్యాంపు కార్యాలయంలో బొకేతో వెళ్లినది ఆయనేనని మండిపడ్డారు. అంతకుముందు రోజా సభలో మాట్లాడుతూ... ''టీడీపీ కార్యకర్తలు మద్యం డోర్ డెలివరీ ఏజెంట్లుగా అయిపోయారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే మద్యాన్ని ఇళ్లకు తీసుకెళ్లి మరీ ఇచ్చేంత స్థాయికి దిగిపోయారు. ఇది మహిళా సంక్షోభ ప్రభుత్వమని మొదటి బడ్జెట్లోనే తెలిసిపోయింది. స్వయం సహాయక గ్రూపులు, డ్వాక్రా గ్రూపుల రుణాలను అణాపైసలతో సహా తీసేస్తామన్నారు. ఇప్పుడు కుంటిసాకులు చూపించి, బడ్జెట్లో డ్వాక్రా సంఘాల బలోపేతానికి లక్ష రూపాయలు ఇస్తామన్నారే తప్ప రుణాల గురించి చెప్పలేదు. రుణమాఫీ చేయాల్సిందేనని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు సొంత జిల్లా కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలంలో మహిళలు ఐకేపీ అధికారుల మీద తిరగబడ్డారు. రుణాలు మాఫీ చేయాల్సిందేనని, తాము కట్టేది లేదని అంటున్నారు. డ్వాక్రా సంఘాలు తమ గొప్పేనంటున్నారు.. గతంలోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని ప్రవేశపెట్టింది. మహిళలకు గోరంత సాయం చేస్తే వాళ్లు కొండంత ఎదుగుతారని తెలుసుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ మీద పోటీ చేస్తానని చెప్పి , ఆ తర్వాత ఇల్లరికపు అల్లుడిగా మారి అదే పార్టీని తన చంకలో పెట్టుకుని వెళ్లిపోయారు. అలాంటి పార్టీకి చెందినవాళ్లు మమ్మల్ని వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉంటామన్నది ముఖ్యం కాదు.. మహిళల సంక్షేమం కోసం పోరాడతాం. ఎక్కడ ఉన్నా, ఎప్పుడైనా మహిళల కోసం పోరాడిన చరిత్ర నాకుందని చెబుతున్నా. అప్పు మాత్రమే మహిళలు చెల్లిస్తే సరిపోతుందని, వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని ఒక జీవో ఉంది. కానీ, ఈ ప్రభుత్వం వచ్చాక వడ్డీ కూడా కట్టాలంటూ సర్క్యులర్లు జారీచేశారు. ఇది మహిళలను మోసం చేయడం కాదా అని ప్రశ్నిస్తున్నా. అంగన్వాడీ, ఆశా వర్కర్లు గొడ్డు చాకిరీ చేస్తున్నారు. తమకు వేతనాలు పెంచాలని అడిగితే గుర్రాలతో తొక్కించి, లాఠీ ఛార్జీ చేసిన ఘనత కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది. వైఎస్ హయాంలో రెండుసార్లు వేతనాలు పెంచారు. కేంద్రం ఇచ్చే వేతనాలతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా వేతనాలిచ్చారు'' అన్నారు. -
'ఎర్రచందనం విక్రయానికి గోబల్ టెండర్లు ఆహ్వానించాం'
హైదరాబాద్: ఎర్రచందనం విక్రయానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఎర్రచందనం అంశంపై చర్చ జరిగింది. ఈ సందర్బంగా బొజ్జల మాట్లాడుతూ... 4160 టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేందుకు గ్లోబల్ టెండర్లు ఆహ్వానించినట్లు చెప్పారు. ఇప్పటి వరకు 8493 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అటవీశాఖ, పోలీసుల ఎన్కౌంటర్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వివరించారు. -
గోపాలా.. ఏమిటీ గోల?
z భూసేకరణ వివాదం తేలకపోవడంతో పనులను అడ్డుకుంటున్న అధికారులు వివాదాన్ని పరిష్కరించడంపై ఏమాత్రం దృష్టి పెట్టని అటవీశాఖ మంత్రి బొజ్జల సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను పూర్తిచేస్తా.. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ నీళ్లందిస్తా’నని ఎన్నికల ప్రచారంలో బీరాలు పలికిన అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇప్పుడు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి ప్రాజెక్టు పనులను సొంత శాఖ అధికారులే అడ్డకుం టున్నా బొజ్జల చోద్యం చూస్తున్నారు. ఓటు దాటాక బొజ్జల వ్యవహరిస్తున్న తీరుపై శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. చిత్తూరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోని రాపూరు, డక్కిలి, వెంకటగిరి, శ్రీకాళహస్తి, ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో 87,734ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడం.. 316 చెరువుల కింద కొత్తగా 23,266 ఎకరాలకు నీళ్లందించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రూ.300 కోట్ల వ్యయంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును 2006లో చేపట్టారు. నెల్లూరు జిల్లాలో సోమశిల రిజర్వాయర్ నుంచి 5.26 టీఎంసీల నీటిని లింక్ కెనాల్ ద్వారా తరలించి.. ఆయకట్టుతోపాటూ 1.11 లక్షల ఎకరాలకు సాగు నీరందించి, 2.50 లక్షల మంది ప్రజల దాహార్తిని కూడా తీర్చాలని నిర్ణయించారు. ఇందుకు సోమశిల రిజర్వాయర్ నుంచి స్వర్ణముఖి నది వరకూ 111 కిలోమీటర్ల మేర కాలువ తవ్వడానికి అప్పట్లోనే టెండర్లు పిలిచారు. ఈ లింక్ కెనాల్‌కు అవసరమైన ప్రణాళిక సంఘం, అటవీ, హైడ్రలాజికల్ అనుమతులను అప్పట్లోనే తెచ్చారు. సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ తవ్వకానికి 1450 ఎకరాల ప్రైవేటు భూమి, 980 ఎకరాల ప్రభుత్వ భూమి, 2,600 ఎకరాల రిజర్వు ఫారెస్ట్ భూమిని సేకరించాలని అధికారులు తేల్చారు. ప్రభుత్వ, ప్రైవేటు భూమిని సేకరించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ.. అటవీశాఖ భూమిని సేకరించాలంటే అందుకు ప్రతిఫలంగా భూమితోపాటూ, భూసేకరణలో పోయే ప్రతి చెట్టుకూ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ప్రతిఫలంగా కేటాయించిన భూమిలో అడవి పెంపకానికి నిధులు కేటాయించాల్సి ఉంటుంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠన్మరణంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు గ్రహణం పట్టుకుంది. ఆ హామీ ఏమైనట్టు? ఎన్నికల్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ప్రచారాస్త్రంగా చేసుకన్నారు. ఈ లింక్ కెనాల్‌ను పూర్తిచేయడం ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన బొజ్జలకు చంద్రబాబు మంత్రివర్గంలో అటవీశాఖ దక్కింది. అటవీశాఖ బొజ్జలకు దక్కిందిలే.. ఇక సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులు పరుగులెత్తుతాయని శ్రీకాళహస్తి ప్రజలు భావించారు. కానీ.. ప్రజల ఆశలను బొజ్జల అడియాశలు చేశారు. శ్రీకాళహస్తి అటవీ ప్రాంతంలో 190 కంపార్ట్మెంట్లో 640 ఎకరాల అటవీ భూమి స్వర్ణముఖి-సోమశిల లింక్ కెనాల్ తవ్వకానికి అవసరం అవుతుంది. ఆ మేరకు అటవీశాఖకు మరో చోట భూమి చూపించి.. పరిహారం అందిస్తే అనుమతి ఇస్తుంది. కానీ.. ప్రభుత్వం అటవీశాఖకు మరో ప్రాంతం 640 ఎకరాల భూమిని చూపించలేదు. పరిహారంగా చెల్లించాల్సిన మొత్తాన్నీ చెల్లించలేదు. భూసేకరణ వివాదం తేలకపోవడంతో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు అటవీశాఖ అధికారులు అడ్డు తగలుతున్నారు. ఇటీవల మూడు పర్యాయాలు పనులను అడ్డుకున్నారు. తాజాగా మంగళవారం ఏర్పేడు మండలం చింతలపాళ్యం, అముడూరుల్లో లింక్ కెనాల్ పనులను అటవీశాఖ అధికారులు అడ్డుకున్నారు. సొంత శాఖ అధికారులే లింక్ కెనాల్ పనులను అడ్డుకుంటున్నా అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి నోరుతెరవడం లేదు. వివాదాన్ని తెరదించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. అటకెక్కించే ఎత్తుగడ..: అటవీ భూవివాదాన్ని సాకుగా చూపి సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ ప్రాజెక్టును అటకెక్కించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తులు వేస్తోందని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు పనులకు రూ.150 కోట్లు కేటాయించాలని ఆశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనలను ప్రభుత్వం పరిగణనలోకి కూడా తీసుకోలేదు. ఈనెల 20న శాసనసభలో 2014-15 బడ్జెట్లో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్ పనులకు ఒక్క పైసా కూడా కేటాయించకపోవడమే అందుకు తార్కాణం. నిధులు కేటాయించని నేపథ్యంలో సోమశిల-స్వర్ణముఖి లింక్ కెనాల్‌పై చంద్రబాబు ప్రభుత్వం శీతకన్ను వేసినట్లు స్పష్టమవుతోంది. అటవీ వివాదాన్ని సాకుగా చూపి ఈ ప్రాజెక్టును అటకెక్కించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ వివాదాన్ని పరిష్కరించాల్సిన మంత్రి బొజ్జల నోరుమెదపకపోవడం ఇందుకు బలం చేకూర్చుతోంది. -
టీడీపీలో రాజధాని ప్రకంపనలు!
రాజధాని అంశం అధికార టీడీపీలో చిచ్చు రాజేసింది. నూతన ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై మంత్రులు చేస్తున్న ప్రకటనలు సైకిల్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నిపుణుల కమిటీ నివేదిక రాకుండానే రాజధాని ఇక్కడ అని ఒకరు, అక్కడొద్దని మరొకరు అంటూ సిగపట్లు పడుతున్నారు. మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తమ ప్రాంతంలోనే పెట్టాలని ఒకరు, కాదు మా ప్రాంతంలోనే పెట్టాలని మరొకరు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ-గుంటూరులో రాజధాని ఉండొచ్చని ఏపీ పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ప్రకటించడంతో అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు రేగాయి. రాయలసీమ నాయకులు నారాయణ ప్రకటనను తప్పుబట్టారు. ఆయన తొందరపాటు ప్రకటన వల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని రెవెన్యూ మంత్రి, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన ప్రభుత్వ భూమి విజయవాడ, గుంటూరు మధ్య లేదని తెలిపారు. రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తామని ఆయన స్పష్టం చేశారు. విజయవాడలో రాజధాని ఏర్పాటు సమస్యాత్మకం అవుతుందని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. రాయలసీమ వాసులంతా తమ ప్రాంతంలో రాజధాని నగరం ఉంటే బాగుంటుందని భావిస్తున్నారని జేసీ చెప్పారు. మాచర్లను రాజధాని చేస్తే బాగుంటుందని సూచించారు. అయితే, తమ మాట నెగ్గదని ఆయన వాపోయారు. తమ పెరట్లోనే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి సహచరులకు చురక అంటించారు. భూములు, నీటి లభ్యత ఉన్న చోటే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధానిపై తలో మాట మాటాడొద్దని అధినేత వారించినా మంత్రులు పట్టించుకోకపోవడం గమనార్హం. రాజధాని అంశం టీడీపీ ఇంకా ఎన్ని ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాలి. -
తమ పెరట్లోనే రాజధాని ఉండాలంటే ఎట్లా ?
గుంటూరు: భూములు, నీటి లభ్యత ఉన్న చోటు రాష్ట్ర రాజధానిని తమ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆంధ్రప్రదేశ్ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం గుంటూరు జిల్లా మాదలలో మొక్కల నాటే కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం బొజ్జల మాట్లాడుతూ... రాష్ట్ర రాజధాని ఏర్పాటు ఎక్కడే అనే విషయంపై ప్రభుత్వం ఇంకా ఓ కొలిక్కి రాలేదని చెప్పారు. తమ పెరట్లోనే రాజధాని ఉండాలనుకోవడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తమకు దగ్గరలోనే రాష్ట్ర రాజధాని ఉండాలని వివిధ ప్రాంతాల ప్రజలు కోరుకుంటున్నారని విలేకర్ల అడిగిన ప్రశ్న మంత్రి బొజ్జలపై విధంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రభుత్వం ప్రకటించింది. అలాగే విజయవాడలోనే రాజధాని అంటూ ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా ప్రకటించారు. అయితే విజయవాడలో రాజధాని ఏర్పాటుపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. విజయవాడ - గుంటూరు నగరాల మధ్య కేవలం 500 ఏకరాలు మాత్రమే ప్రభుత్వం స్థలం ఉందని... కర్నూలు జిల్లాలో అయితే వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని కృష్ణమూర్తి వెల్లడించారు. దాంతో ప్రతి ఒక్కరు తమ ప్రాంతానికి దగ్గరలోనే రాజధాని ఏర్పాటు చేయాలని వస్తున్న డిమాండ్‌పై బొజ్జల తీవ్ర అసంతృప్తి చేశారు. -
కష్టపడదాం ప్రగతి సాధిద్దాం
ఏడు మిషన్ల ద్వారానే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుంది సమైక్యాంధ్ర ఉద్యమకారులపై నమోదైన కేసులను ఎత్తేస్తాం పట్టణ, పల్లెప్రాంతాల్లో 24 గంటల విద్యుత్తు సరఫరాకు చర్యలు చేపట్టాం ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం తెలుగుగంగ, హంద్రీ-నీవా, గాలేరు-నగరి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి 68వ స్వాతంత్య్ర సంబరాల్లో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సాక్షి, చిత్తూరు : ‘‘అభివృద్ధికోసం ప్రభుత్వం ప్రాధాన్య రంగాలను గుర్తించి ఏడు మిషన్లుగా విభజించింది. వీటి అమలుతో ఇటు జిల్లా అభివృద్ధి, అటు రాష్ట్ర అభివృద్ధి సుసాధ్యమవుతుంది. ఆదాయవనరులు పెంచుకుని, జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుని ఐదేళ్లలో ‘ఏడు మిషన్ల’ లక్ష్యాన్ని సాధించాలి. విజన్ 2029లో పొందుపరిచిన లక్ష్యాలను 2022కే చేరుకోవాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తిస్థాయిలో పనిచేసి లక్ష్యసాధనకు శ్రమించాలి.’’ అని పర్యావరణ, అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. 68వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని ఆయన శుక్రవారం చిత్తూరు పోలీసుపరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయపతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా ప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశస్వాతంత్య్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన త్యాగమూర్తులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు అభినందనలు తెలిపారు. ఆపై జిల్లా అభివృద్ధి, ప్రభుత్వ లక్ష్యాలను ఆయన సోదాహరణంగా వివరించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.‘‘రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్థాయి ప్రమాణాలతో రాష్ట్రాభివృద్ధికి చర్యలు చేపడుతున్నాం. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమఫలాలను అందించే పాలన వ్యవస్థను సిద్ధం చేస్తున్నాం. లక్ష్యాలను నిర్ధిష్ట కాలపరిమితిలో పూర్తిచేసి ఫలితాలు రాబట్టేందుకు ఏడు ప్రాధాన్య రంగాలను గుర్తించాం. వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం,ఉత్పాదకత పెంచడం, పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక రంగం అభివృద్ధి, స్కిల్ డెవలప్మెంట్ , స్త్రీశిశు సంక్షేమ ఆరోగ్యం, విద్య, తాగునీరు, పారిశుద్ధ్య కల్పన అంశాలతో మిళితమైన ఁసెవెన్మిషన్*ను అనుకున్న కాలపరిమితిలో పూర్తిచేస్తే జిల్లాతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యమకారులపై నమోదైన కేసులన్నీ ఎత్తేస్తాం. అందరికీ అనువైన రాజధాని ఏర్పాటు చేస్తాం. నాయుడుపేట-విజయవాడ, విశాఖపట్నం-విజయవాడ నాన్‌స్టాప్ రైళ్లు ఏర్పాటు చేస్తున్నాం. ఎన్నికష్టాలు ఎదురైనా రుణమాఫీ చేస్తాం : ఈ ఏడాది మార్చి 31 వరకూ తీసుకున్న రుణాల్లో ఒక్కో కుటుంబానికి 1.5లక్షల రూపాయల వరకూ మాఫీ చేస్తాం. డ్వాక్రా గ్రూపుల్లో ఒక్కో సంఘానికి లక్ష రూపాయలు మాఫీ చేస్తాం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరుతాం. పంటలబీమా గడువును సెప్టెంబర్ 15 వరకూ పెంచాం. రైతులంతా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. పల్లెలు, పట్టణాల్లో 24 గంటల విద్యుత్ సరఫరాకు ఇప్పటికే చర్యలు తీసుకున్నాం. ఈ ఏడాది 14,637 హెక్టార్లలో డ్రిప్, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసేందుకు లక్ష్యం నిర్ధేశించుకున్నాం. వాటర్షెడ్లు, ఫాం పాండ్లు, చెక్‌డ్యాంలు, నీరు-చెట్టు కార్యక్రమాలకు 436కోట్ల రూపాయలతో ప్రణాళికలు రూపొందించాం. ఈ ఏడాది ఎన్.టి.ఆర్ సుజల స్రవంతి ద్వారా 2రూపాయలకు 20 లీటర్ల శుద్ధిజలాన్ని అందిస్తాం. ఇప్పటికే చిత్తూరు, శ్రీకాకాళం మునిసిపాలిటీలో ప్రక్రియ ప్రారంభించాం. ఈ ఏడాది తెలుగుగంగకు 85కోట్లు, హంద్రీ-నీవాకు 205.70కోట్లు, గాలేరు-నగరి ప్రాజెక్టు పనులకు 100కోట్ల అంచనాతో పనులు చేపట్టనున్నాం. రాష్ట్రంలోనే మల్బరీసాగులో జిల్లా ప్రథమస్థానంలో ఉంది. పాడిఉత్పత్తిలో రాష్ట్రంలో అగ్రగామిగా ఉన్నాం. వీటి అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. అంతర్జాతీయ విద్యాకేంద్రంగా తిరుపతి : ప్రసిద్ధపుణ్యక్షేత్రం తిరుపతిని అంతర్జాతీయ విద్యాకేంద్రంగా అభివృద్ధి చేస్తాం.ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లను తిరుపతిలో ఏర్పాటు చేసేందుకు భూసేకరణ చేస్తున్నాం. రాష్ట్రంలో మూడు మెగాసిటీల అభివృద్ధి ప్రక్రియలో తిరుపతి కూడా ఉండటం జిల్లావాసులందరికీ గర్వకారణం. ఆరోగ్యశ్రీ స్థానంలో త్వరలో ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీకార్డులు జారీ చేస్తాం. జిల్లాలో ఆధార్‌సీడింగ్ 85శాతం పూర్తయింది. వంద శాతం పూర్తిచేస్తాం. విద్యార్థుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు 100కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకున్నాం. ఎర్రచందనం అడవుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. జిల్లా అభివృద్ధికి శ్రమిస్తున్న అధికార యంత్రాంగానికి , శాంతిభద్రతల కోసం శ్రమిస్తున్న పోలీసులకు అభినందనలు. మంత్రి ప్రసంగం అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. తర్వాత పలు ప్రభుత్వశాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకరించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ చూపిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. అయితే ఉద్యోగుల తరఫున ఆయా శాఖాధిపతులకు మాత్రమే వేడుకల్లో ప్రశంసాపత్రాలు అందించడం ఉద్యోగులను తీవ్రంగా బాధించింది. వేడుకల్లో కలెక్టర్ సిద్ధార్థ్ జైన్, జెడ్పీ చైర్పర్సన్ గీర్వాణి, ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే డీఏ సత్యప్రభ, మేయర్ కఠారి అనురాధతో పాటు అన్ని ప్రభుత్వశాఖల అధికారులు పాల్గొన్నారు. -
ఇలాగైతే కేసీఆర్ ఎక్కువ రోజులు సీఎంగా ఉండరు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుపై మండిపడ్డారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవడం మంచిదని, లేకపోతే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా కొనసాగలేరని హెచ్చరించారు. హైదరాబాద్ శాంతిభద్రతలు గవర్నర్ చేతిలో ఉండటమే సబబు అని గోపాలకృష్ణా రెడ్డి అన్నారు. ఈ నిర్ణయం గత యూపీఏ ప్రభుత్వం తీసుకుందని మంత్రి వ్యాఖ్యానించారు. అప్పుడు మౌనంగా ఉన్న కేసీఆర్ ఇప్పుడు విమర్శలు చేయడం సరికాదని అన్నారు. -
వైఎస్సార్సీపీకి పనిచేశారా.. సమావేశం నుంచి వెళ్లిపోండి
‘ఏమ్మా నీవు ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి అనుకూలంగా పనిచేశావంట కదా..? సమావేశం నుంచి వెళ్లిపో’ అంటూ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ‘నాకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేశాను. మా వీధిలో సమస్యలపై సమావేశం ఏర్పాటు చేశారు. నా సమస్యలు చెప్పాకే వెళతాను’ అంటూ ఐకేపీ సభ్యురాలు తేల్చిచెప్పారు. శ్రీకాళహస్తి : పట్టణంలోని హరిహరబావివీధి వద్ద మంగళవారం ‘మన వద్దకు మన మున్సిపాలిటీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథి గా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 9వ వార్డు టీడీపీ కౌన్సిలర్ సుప్రజ మాట్లాడుతూ ఐకేపీ ఆర్పీ మాధవి, పొదువు సభ్యురాలు ముని లక్ష్మి ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనిచేశారని మంత్రికి వివరించారు. స్పందించిన ఆయన బహిరంగ సభ నుంచి వెళ్లిపోవాలని పొదువు సభ్యులను ఆదేశించారు. అందుకు వారు ఎందుకు వెళ్లాలంటూ నిలదీశారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వా దం తీవ్ర స్థాయికి చేరింది. ఇంతలో షామియానా కుప్పకూలింది. అది మంత్రిపై పడకుండా అక్కడే ఉన్న టీడీపీ నాయకులు పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. సంభాషణ వారి మాటల్లోనే.. కౌన్సిలర్ సుప్రజ: ఐకేపీ ఆర్పీ మాధవి, మరో పొదు వు సభ్యురాలు మునిలక్ష్మి మొన్న ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనిచేశారు. ఇప్పుడు ఈ సమావేశానికి హాజరయ్యూరు అంటూ మంత్రికి ఫిర్యాదు చేశారు. ఆర్పీ మాధవి : అది నేను చేసిన తప్పా.. అనవసరంగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్.. నేను సమావేశానికి ఎందుకు హాజరుకాకూడదు? నేను ఈ వార్డులో ఒక ఓటరును. కౌన్సిలర్ సుప్రజ : ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్‌రెడ్డి గెలుస్తారంటూ...అందరికీ చెప్పి వైఎస్సార్సీపీకి ఓట్లు వేయించారన్నా. ఆర్పీ మాధవి : ఎన్నికలు ఎప్పుడో అయిపోయాయి.... వార్డులోని సమస్యల కోసం సమావేశం పెట్టారు. ఎన్నిక లు, ఓట్లు ఆ విషయాలు ఇప్పుడు చర్చించడం తగదు.. నేను ఏదో నేరం చేసినట్లు బహిరంగ సభలో ఇలా అడగడం ఎంతవరకు సమంజసం చెప్పండి. మంత్రి గోపాలకృష్ణారెడ్డి: ఆర్పీ మాధవి చిన్నగా మాట్లాడు.. నువ్వు మాట్లాడుతుంటే రెండు ఫ్యాన్ల శబ్దం వస్తోంది. మీరు ఇద్దరూ సమావేశం నుంచి వెళ్లిపోండి ఎందుకు గొడవ. ఆర్పీ మాధవి : ఇదేంది సార్.. మీరు మా ఎమ్మెల్యే.. పైగా రాష్ట్ర మంత్రి కూడా.. మా సమస్యలు తెలుసుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేశారు. మమ్మల్ని వెళ్లిపోవాలని చెప్పడం ఎంతవరకు న్యాయం సార్..? నేనెందుకు వెళ్లాలి...నా ఓటును నాకు ఇష్టం వచ్చిన వాళ్లకు వేసుకున్నా.. నేను ఏ పార్టీకీ అనుకూలంగా పనిచేయలేదు. మంత్రి (ఆగ్రహం వ్యక్తం చేస్తూ..): నీవల్ల ఇక్కడ రచ్చలు వస్తున్నాయి. ముందు నీవు వెళ్లిపోమ్మా... ఆర్పీ మాధవి : నేను సమావేశం నుంచి ఎందుకు పోతా ను సార్.. మా సమస్యలు చెప్పుకునేందుకు వచ్చా. చెప్పాకనే వెళ్లిపోతా... కడుపు చేతపట్టుకుని జీవనం సాగించే పేదోళ్లం. మాపై ఎందుకు సార్ కక్షలు. మంత్రి: ఆర్పీగా మాధవిని పొదువు నుంచి తొలగించి వేరేవాళ్లను పెట్టుకోండి...వివాదాలు ఉండవు.. -
ఈ-టెండర్ల ద్వారా ఎర్రచందనం వేలం
హైదరాబాద్ : అటవీశాఖ గిడ్డంగులోని ఎర్రచందనం నిలువలను వేలం వేయడానికి కేంద్రం అనుమతి ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. ఆయన సోమవారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ 8,584 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని విక్రయించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎర్రచందనం నిల్వల విక్రయానికి 15 రోజుల్లోగా గ్లోబల్ టెండర్లను ఆహ్వానించాలని ఆదేశించారు. తొలివిడతగా నాలుగు వేల టన్నుల ఎర్ర చందనాన్ని వేలం వేయనున్నట్లు బొజ్జల తెలిపారు. ఈ-ఆప్షన్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు. వారంలోగా టెండర్లు ఆహ్వానిస్తామన్నారు. అయిదు లక్షల హెక్టార్లలో ఎర్రచందనం విస్తరించి ఉందని ఆయన చెప్పారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు అడ్డుకట్ట వేస్తామని ఆయన తెలిపారు. -
'ఏం చేస్తారో నాకు తెలీదు ... దొంగలను పట్టుకోండి'
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి అటవీశాఖ గోడౌన్ నుంచి లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలు మాయమైనాయి. దాంతో అటవీశాఖ ఉన్నతాధికారులు శనివారం పట్టణంలోని రెండవ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అటవీశాఖ ఉద్యోగులే ఈ ఎర్రచందనం దుంగలను మాయం చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగా పోలీసులు విచారిస్తున్నారు. గోడౌన్ నుంచి మాయమైన ఎర్రచందనం విలువు రూ. 50 లక్షలు ఉంటుందని అటవీశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. గోడౌన్ నుంచి ఎర్రచందనం దుంగలు మాయమైన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడవులు, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి అటవీశాఖ అధికారులపై మండిపడ్డారు. అటవీశాఖ మంత్రిగా ఉన్న తన సొంత నియోజకవర్గంలోనే అరకోటి విలువైన ఎర్రచందనం మాయం ఏలా అయిందంటూ సదరు అధికారులపై బొజ్జల నిప్పులు తొక్కారు. ఏం చేస్తారో నాకు తెలీదు. దొంగలను వెంటనే పట్టుకోండి అంటూ అటవీశాఖ అధికారులను బొజ్జల ఆదేశించారు. -
‘ఎన్టీఆర్ సుజల స్రవంతి’ ప్రారంభం
శ్రీకాళహస్తి: నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్ట మొదటి పథకాన్ని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో తన చేతులమీదుగా ప్రారంభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ ఈ పథకం ద్వారా రెండు రూపాయలకే 20 లీటర్ల క్యాన్ వాటర్‌ను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మొదట శ్రీకాళహస్తిలో ఈ పథకాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందని మంత్రి చెప్పారు. -
మర్మమేమిటి గోపాలా?
ఎర్రచందనం స్మగ్లర్‌తో ములాఖత్ అయిన మంత్రి బొజ్జల స్మగ్లర్ టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ వద్దంటూ ఆదేశాలు స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ స్మగ్లర్తోనే సమావేశంపై విమర్శలు మాటలకు చేతలకు పొంతన కుదరకపోవడం అంటే ఇదేనేమో. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టిస్తానంటూ బీరాలు పలుకుతున్న అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ స్మగ్లర్తోనే రహస్యంగా సమావేశం కావడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. సదరు స్మగ్లరు టీడీపీ నేత కావడంతో పీడీ యాక్ట్ ప్రయోగించవద్దని ఆదేశించడంతో ఆయన చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థమవుతోంది. సీఎం చంద్రబాబునాయుడు సోమవారం కుప్పం పర్యటన నేపథ్యంలో అటవీ శాఖ మంత్రి బొజ్జల అక్కడికి పయనమయ్యారు. మార్గమధ్యంలో చిత్తూరులో ఎమ్మెల్యే డీకే.సత్యప్రభ ఇంటికెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అదే సమయంలో చిత్తూరుకు చెందిన బుల్లెట్ సురేష్ ఎమ్మెల్యే సత్యప్రభ ఇంటికి చేరుకుని బొజ్జలతో రహస్యంగా మంతనాలు జరిపారు. బుల్లెట్ సురేష్‌పై తొమ్మిది క్రిమినల్ కేసులున్నాయి. రౌడీషీట్ కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్‌లో ఆయనది అందెవేసిన చేయి అని టీడీపీ వర్గాలే స్పష్టీకరిస్తున్నాయి. క్రిమినల్ కేసులు మూడుకు మించి ఉంటే పీడీ యాక్ట్‌ను వర్తింపజేయవచ్చు. పైగా టీడీపీ నేతలే బుల్లెట్ సురేష్‌ను ఎర్రచందనం స్మగ్లర్‌గా అభివర్ణిస్తున్న నేపథ్యంలో ఆయనపై పీడీ యాక్ట్‌ను అమలుచేయవచ్చు. బుల్లెట్ సురేష్ స్వేచ్ఛగా సంచరిస్తున్నా ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎర్రచందనం స్మగ్లర్లు ఏ పార్టీకి చెందిన వారైనా వదలబోమని ప్రకటించిన 24 గంటల్లోనే మంత్రి బొజ్జల చిత్తూరులో సోమవారం బుల్లెట్ సురేష్‌తో రహస్యంగా సమావేశమయ్యారు. అరగంట మంతనాలు జరిపారు. సమావేశం పూర్తయిన తర్వాత పోలీసుల ముందే బుల్లెట్ సురేష్ తన వాహనంలో వెళ్లిపోయారు. ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత బొజ్జల ఉన్నతాధికారులకు ఫోన్ చేసి ఆయనపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అందువల్లే పోలీసులు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. టీడీపీకి చెందిన ఎర్రచందనం స్మగ్లర్లను అటవీ శాఖ మంత్రి రక్షిస్తున్నారనడానికి ఇదే తార్కాణం. -
హామీల అమలు వదిలేసి జగన్‌పై విమర్శలా?
బొజ్జల తీరుపై చెవిరెడ్డి ధ్వజం తిరుపతి : ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై దృష్టిపెట్టకుండా వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయడం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వంటి సీనియర్ నాయకుడికి తగద ని చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. బుధవారం తిరుపతిలో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్రెడ్డిపై బొజ్జల చేసిన అవినీతి ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో 11 చార్జ్షీట్లు దాఖలు చేసిన సీబీఐ ఒక్క అభియోగా న్ని కూడా నిరూపించలేదని, జగన్మోహన్రెడ్డి అవి నీతిపరుడని ఏ కోర్టూ చెప్పలేదన్నారు. అయితే గతం లో జగన్ లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ పదేపదే ఆరోపించి తమకు అనుకూలమైన పత్రికల్లో పనిగట్టుకుని కథనాలు రాయించిన టీడీపీ నాయకులు మళ్లీ పాతపాట పాడుతున్నారని చెవిరెడ్డి విమర్శించారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసి 24 గంటలైనా గడవక ముందే చ ంద్ర బాబు మంత్రివర్గంలో ప్రాధాన్యం కలిగిన పోర్ట్‌పోలియో కోసమే జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేసినట్లుందన్నారు. అమాసకు, ఆడికి ఒకసారి నియోజకవర్గం పక్క తొంగిచూసే గోపాలకృష్ణారెడ్డి గురించి, ఇసుక మాఫియాలతో ఆయనకు గల సంబంధాల గురించి జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయ గాలిగోపురం కూలిపోతే నియోజకవర్గానికి చెందిన బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడిగా గోపాలకృష్ణారెడ్డి ఏనాడైనా పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. హుందాగా వ్యవహరించండి సీనియర్ నాయకులుగా ఉన్న బొజ్టల గోపాలకృష్ణారెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు లాంటి వారు హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి హితవు పలికారు. తొలి సంతకాలను సంతకాలకే పరిమితం చేసి ఏ ఒక్కటీ అమలు దిశగా చర్యలు చేపట్టని టీడీపీ పాలనపట్ల అప్పుడే ప్రజలు పెదవి విరుస్తున్నారని, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశామేమోనని పశ్చాత్తాప పడుతున్నారన్నారు. వైఎస్. రాజశేఖరరెడ్డి తన తొలి సంతకంతోనే వ్యవసాయానికి ఉచిత విద్యుత్, విద్యుత్ బకాయిలను రద్దు చేసిన సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. చంద్రబాబు ఆచరణ సాధ్యంకాని అంశాలకు సంబంధించి తొలి ఐదు సంతకాలు చేయడంకన్నా ‘ఇచ్చిన హామీలను అమలు చేయలేకపోతున్నా.. క్షమించండి’ అంటూ రాసిన ఫైలుపై ఒకే ఒక సంతకం చేసి ఉంటే బాగుండేదని చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. అందుకే జగన్మోహన్రెడ్డి తాను అమలు చేయగలనన్న నమ్మకం ఉన్నవాటినే ప్రజలకు చెప్పారన్నారు. ప్రజలు వాస్తవాలను త్వరలోనే గ్రహించి వారిని ఛీకొట్టే రోజులు వస్తాయన్నారు. రాజధాని నిర్మాణంతో పాటు, ప్రజాసమస్యలపై వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రతిపక్షనేతగా ఉన్నపుడు వ్యవహరించినట్లే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణాత్మక పోత్ర పోషిస్తుందని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తెలిపారు. -
బొజ్జలకు అడవులు, పర్యావరణం
జిల్లాకు రెండోసారి అటవీ శాఖ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ శాఖకు ప్రాధాన్యం తిరుపతి : టీడీపీ సీనీయర్ నేత, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి అడవులు, పర్యావరణ శాఖలు కేటాయిస్తూ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు బుధవారం ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల ఎనిమిదో తేదీన చంద్రబాబు సహా 19 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ శాఖలు కేటాయించని విషయం తెలిసిందే. నాలుగు రోజుల వ్యవధి తరువాత మంత్రి బొజ్జలకు అడవులు, పర్యావరణ శాఖలు కేటాయించారు. రాష్ట్ర మంత్రివర్గంలో జిల్లాకు అటవీ శాఖ కేటాయించడం ఇది రెండోసారి. 2009 శాసనసభ ఎన్నికల తరువాత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ైవె ఎస్.రాజశేఖరరెడ్డి తన కేబినెట్లో జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అటవీ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. తిరిగి చంద్రబాబు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇదే శాఖకు మంత్రిగా నియమించారు. గతంలో రెండుసార్లు చంద్రబాబు కేబినెట్లో గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఆర్ అండ్ బీ, డ్వాక్రా, ఐటీ శాఖలు నిర్వహించారు. కాగా జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బొజ్జలకు ఈ శాఖను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శేషాచలం అడవుల్లో పలు దఫాలు స్మగ్లర్లకు, అటవీ అధికారులకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఎర్రదొంగలు హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బొజ్జలకు అటవీ శాఖను కేటాయించడం ద్వారా స్మగ్లింగ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం అవుతోంది. రాయలసీమలో సుమారు నాలుగున్నర లక్షల హెక్టార్లలో శేషాచల అడవి ఉంది. అయితే సిబ్బంది కొరత, ఆయుధాల వినియోగానికి అవకాశం లేకపోవడంతో అటవీశాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకే చెందిన వ్యక్తి మంత్రిగా నియమితులు కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు తదితర ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఏనుగుల దాడిలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న గోపాలకృష్ణారెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది. బొజ్జలకు అడవులు, పర్యావరణం రామచంద్రారెడ్డికి అటవీ శాఖను కేటాయించిన విషయం తెలిసిందే. తిరిగి చంద్రబాబు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇదే శాఖకు మంత్రిగా నియమించారు. గతంలో రెండుసార్లు చంద్రబాబు కేబినెట్లో గోపాలకృష్ణారెడ్డి మంత్రిగా వ్యవహరించారు. అప్పట్లో ఆయన ఆర్ అండ్ బీ, డ్వాక్రా, ఐటీ శాఖలు నిర్వహించారు. కాగా జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాలు విస్తృతంగా ఉన్న నేపథ్యంలో బొజ్జలకు ఈ శాఖను కేటాయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. శేషాచలం అడవుల్లో పలు దఫాలు స్మగ్లర్లకు, అటవీ అధికారులకు మధ్య కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. ఇటీవల ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఎర్రదొంగలు హతమయ్యారు. ఈ పరిస్థితుల్లో బొజ్జలకు అటవీ శాఖను కేటాయించడం ద్వారా స్మగ్లింగ్ నిరోధానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు స్పష్టం అవుతోంది. రాయలసీమలో సుమారు నాలుగున్నర లక్షల హెక్టార్లలో శేషాచల అడవి ఉంది. అయితే సిబ్బంది కొరత, ఆయుధాల వినియోగానికి అవకాశం లేకపోవడంతో అటవీశాఖ అధికారులు ఇబ్బంది పడుతున్నారు. సిబ్బంది నియామకానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం వద్ద ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. జిల్లాకే చెందిన వ్యక్తి మంత్రిగా నియమితులు కావడంతో ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. అదేవిధంగా జిల్లాలోని కుప్పం, పలమనేరు తదితర ప్రాంతాల్లో ఏనుగుల గుంపులు పంటలను నాశనం చేస్తున్న విషయం కూడా తెలిసిందే. ఏనుగుల దాడిలో పంటలు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వడంలోనూ ప్రభుత్వాలు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు చేపడుతున్న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని జిల్లా ప్రజానీకం ఆశిస్తోంది. -
చంద్రబాబును బొజ్లల నిలదీయాలి: చెవిరెడ్డి
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం నాయకులపై ప్రజల తిరుగుబాటు తప్పదని చెవిరెడ్డి అన్నారు. దమ్ముంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమని చంద్రబాబును బొజ్జల ప్రశ్నించాలని చెవిరెడ్డి సూచించారు. కేవలం కీలక మంత్రి పదవిని ఆశించడానికే జగన్‌పై బొజ్జల ఆరోపణలు చేశాడని చెవిరెడ్డి విమర్శించారు. అయినా చంద్రబాబు చేతిలో ఆయనకు భంగపాటు తప్పలేదని చెవిరెడ్డి అన్నారు. -
బొజ్జలపై మండిపడ్డ చెవిరెడ్డి
-
12న ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ
ఈ నెల 19 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ఆయన, గంటా శ్రీనివాసరావు విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 12న విశాఖపట్నం నగరంలో ఆంధ్రప్రదేశ్ తొలి కేబినెట్ భేటీ ఉంటుందని బొజ్జల చెప్పారు. ఆంధ్రయూనివర్శిటీలోని టీఎల్ఎన్ సభా వేదిక తొలి కేబినెట్ భేటీకి వేదిక అవుతుందన్నారు. రాష్ట్ర ప్రజలను సంతృప్తి పరిచే విధంగా మంత్రుల పనితీరు ఉండాలని తమకు తమ పార్టీ నాయకుడు, సీఎం చంద్రబాబు సూచించారని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. తమకు ఏ శాఖ ఇచ్చిన ఆనందంగా పని చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 8వ తేదీన గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదుట ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు నాయుడు, పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. -
మూడో సారి...
ముఖ్యమంత్రిగా జిల్లావాసి చంద్రబాబు కొత్త రాష్ట్రం తొలి సీఎంగా రికార్డు రాష్ర్ట మంత్రిగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జిల్లా నుంచి ఒక్కరికే కేబినెట్లో చాన్స్ సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) తొలి ముఖ్యమంత్రిగా జిల్లావాసి ఎన్.చంద్రబాబునాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా బా ధ్యతలు చేపట్టడం ఇది మూడోసారి. అంతా ఊహించిన విధంగానే ఈ దఫా ఆయన కేబినెట్లో జిల్లా నుంచి సీనియర్ శాసనసభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి ఒక్కరికే అవకాశం దక్కింది. బొజ్జల కూడా మూడోసారి మంత్రి పదవి పొందడం గమనార్హం. ముఖ్యమంత్రిగా తాను జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నందున అన్ని సమీకరణల తరువాత ప్రస్తుతానికి బొజ్జలకు మాత్రమే బాబు కేబినెట్లో చోటు కల్పించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ అధికారంలోకి వస్తే టీటీడీ చైర్మన్ పదవిని బలిజ సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చదల వాడ కృష్ణమూర్తికి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో బాబు ప్రకటించారు. దీంతో జిల్లాలో బలిజ సామాజికవర్గం నుంచి ఇద్దరు శాసనసభ్యులు ఎన్నికైనప్పటికీ వారికి కేబినెట్లో అవకాశం కల్పించే పరిస్థితి లేకపోయిందని భావిస్తున్నారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా జి.శంకర్‌యాదవ్ ఎన్నికయ్యారు. ఇతర జిల్లాల నుంచి బీసీలకు అవకాశం ఇవ్వడం, శంకర్ తొలిసారిగా శాసనసభకు ఎన్నికైనందున ఆయన పేరును పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన సత్యవేడు నుంచి యువకుడైన తలారి ఆదిత్య తొలిసారి శాసనసభలో అడుగుపెడుతున్నారు. దీంతో ఆయనకు కూడా అవకాశం లేకుండా పోయింది. బాబు సామాజికవర్గానికి చెందిన సీనియర్లు ముద్దుకృష్ణమనాయుడు, గల్లా అరుణకుమారి ఓటమిపాలైన విషయం తెలిసిం దే. అయితే ముద్దుకృష్ణమనాయుడుకు మంత్రి పదవి ఇచ్చి శాసనమండలికి పంపుతారనే ప్రచారం జరిగింది. పార్టీలో అసంతృప్తులు వచ్చే ప్రమాదం ఉండటంతో ఈ ప్రయోగానికి చంద్రబాబు మొగ్గుచూపలేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు ప్రస్థానం.. విద్యార్థి దశ నుంచీ రాజకీయాల పట్ల మొగ్గు చూపిన నారా చంద్రబాబునాయుడు 1978లో తొలిసారిగా చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి రాజకీయ దిగ్గజం పాటూరు రాజగోపాల్‌నాయుడు ప్రోత్సాహంతో కాంగ్రెస్‌పార్టీ తరఫున పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యారు. అంతేకాకుండా పదవీకాలం చివరిలో సినిమాటోగ్రఫీ మంత్రిత్వశాఖ ఆయనను వరించింది. ఆ తరువాత 1983లో మామ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చంద్రబాబు పోటీ చేసి టీడీపీ చేతిలో పరాజయం పాలయ్యారు. కొద్దిరోజుల తరువాత చంద్రబాబు టీడీపీలో చేరి కీలకంగా వ్యవహరించడం ప్రారంభించారు. 1989లో కుప్పం నియోజకవర్గాన్ని ఎంచుకుని అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన అన్ని ఎన్నికల్లోనూ ఆయన విజయం సాధిస్తూనే ఉన్నారు. 1995 సెప్టెంబర్‌లో మామ ఎన్టీఆర్‌ను గద్దెదించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లోనూ వాజ్‌పేయి హవాతో రాష్ట్రంలో టీటీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు రావడం, వాటిని ఎదుర్కోవడంలో చంద్రబాబు విఫలమయ్యారు. అన్ని వర్గాల ప్రజల్లో నూ వ్యతిరేకత వ్యక్తమయింది. 2004లో జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోయారు. 2009లోనూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హవాతో తెలుగుదేశం అధికారంలోకి రాలేకపోయింది. పదేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న చంద్రబాబు 2014 ఎన్నికల్లో మాత్రం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మూడోసారి ముఖ్యమంత్రిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. బొజ్జలను మూడోసారి వరించిన మంత్రిపదవి శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి ఆరు దఫాలు పోటీ చేసి ఐదు సార్లు శాసనసభకు ఎన్నికైన సీనియర్ సభ్యులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మరోసారి మంత్రి పదవి వరించింది. 1996, 2001 సంవత్సరాల్లో ఆయన చంద్రబాబు కేబినెట్లో మంత్రి పదవులు అలంకరించారు. తొలుత చిన్ననీటిపారుదల, ఆర్ అండ్ బి శాఖల మంత్రిగాను రెండోసారి ఐటీ, డ్వాక్రా, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. -
బొజ్జల, గల్లాకు చుక్కెదురు
ఈ ఇద్దరూ జిల్లాలోనే సీనియర్ రాజకీయ నాయకులు. మంత్రిపదవులూ వెలగబెట్టారు. ఎన్నికలవగానే నియోజకవర్గాల ముఖం చూడడం మానేశారు. ఫలితంగా ఎక్కడి సమస్యలు అక్కడ పేరుకుపోయాయి. తాజాగా ఎన్నికలు రావడంతో ఆ ఇద్దరు నేతలకు నియోజకవర్గాలు మళ్లీ గుర్తొచ్చాయి. ఓట్ల వేటలో భాగంగా ప్రజల్లోకి వచ్చారు. ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ప్రజలు వారిని నిలదీశారు. రేణిగుంట/చంద్రగిరి న్యూస్‌లైన్: ‘‘ఐదేళ్ల ముందు వచ్చావు..బోరు వేయిస్తానన్నావు..బాలబడి, గుడి, మురుగునీటి కాల్వలు నిర్మిస్తానన్నావు..అవేమీ చేయకుండా ఇప్పుడు వచ్చావు.. ఏమి మాట్లాడాలి నీతో.’’ అంటూ మాజీ మంత్రి, శ్రీకాళహస్తి టీడీపీ అభ్యర్థి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని మహిళలు నిలదీశా రు. బొజ్జల శనివారం రేణిగుంట మండలంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కృష్ణాపురం నుంచి ఆయన ప్రచారం మొదలెట్టారు. ఆయన గ్రామంలో ఒకచోట కూర్చుని అక్కడకు వచ్చిన టీడీపీ కార్యకర్తలతో మాట్లాడి వెళ్లిపోతున్నారు. దీనిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లవరం సమీపంలోని ఎల్ఎన్ కండ్రిగకు చేరుకున్న బొజ్జలను మహిళలు నిలదీశారు. గత ఎన్నికలప్పుడు గ్రామానికి వచ్చి బోలెడన్ని హామీలిచ్చారని, అప్పటి నుంచి సమస్యలు పరిష్కరించకుండా ఇప్పుడు ఐదేళ్ల తర్వాత గ్రామానికి ఓట్ల కోసం వచ్చారని నిలదీశారు. గ్రామానికి చెందిన జయంతి, ఏకదంతం, వాసంతి గ్రూపులకు చెందిన రాణెమ్మ, మునిలక్ష్మి, గౌరి, లక్ష్మమ్మలతోపాటు మరికొంత మంది మహిళలు ఎమ్మెల్యేను నిలదీశారు. మహిళలు అడిగిన దానికి ఆయన సరైన సమాధానం చెప్పకుండా దాటవేసే ప్రయత్నం చేశారు. ఈ సారి తెలుగుదేశం పార్టీ వస్తే మీ సమస్యలు పరిష్కరిస్తానని, ఏ పని కావాలన్నా జరిగిపోతుందని చెబుతూ అక్కడ నుంచి వెళ్లి పోయారు. బొజ్జల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ నుంచి దిగువ మల్లవరం వెళ్లిన ఆయనకు పార్టీ నాయకులే సమస్యలు ఏకరువు పెట్టారు. ఇరవై ఏళ్లుగా గ్రామానికి రోడ్డు లేకుండా అవస్థలు పడుతున్నామని మొరపెట్టుకున్నారు. ఎన్నికలైన తర్వాత చూద్దాంలే అంటూ వెళ్లిపోయారు. అనంతరం ఆయన మల్లవరం, కుమ్మరపల్లె, సుబ్బయ్యగుంట, వెదళ్లచెరువు గ్రామాల్లో పర్యటించారు. గల్లాతో గ్రామస్తుల గలాట మాజీ మంత్రి గల్లా అరుణకుమారికి తన సొంత నియోజకవర్గంలో చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారం లో భాగంగా శనివారం ఆమె పాకాల మండలం సామిరెడ్డిపల్లెకు వెళ్లారు. ఊహించని విధంగా గ్రామస్తులు ఎదురు తిరిగారు. ‘‘మేము వైఎస్ అభిమానులం, మూడుసార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాం. ఇప్పుడు నీదారి నువ్వు చూసుకున్నావు.. మేం ఎవరినైతే ఓడిం చామో వారితోనే చేతులు కలిపావు.. మా గ్రామంలోకి రావద్దు’’ అంటూ అడ్డుకున్నారు. గ్రామస్తుల వైఖరితో గల్లా కంగుతిన్నారు. ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి సానుభూతి పొందాలని భావించారు. తన వాహన శ్రేణిలో ఉన్న అనుచరులను, తమ ఫ్యాక్టరీ ఉద్యోగులను గ్రామస్తులపైకి ఉసిగొలిపారు. దీంతో వారు రెచ్చిపోయారు. గ్రామంలో సభ ఏర్పాటు చేయించారు. తమ అనుచరులు, తమ ఫ్యాక్టరీ సిబ్బందితో పెద్దఎత్తున నినాదాలు, రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయించారు. టపాకాయలు పేల్చి, గ్రామమంతా జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. దీంతో గ్రామస్తులు స్పందించారు. ఇలా చేయడం సరికాదని నిలదీశారు. దీంతో గల్లా గ్రామస్తులపై కన్నెర్రచేశారు. ‘‘మీరెవ్వరు నన్ను రావద్దనడానికి’’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆపై తిట్ల పురాణం అందుకున్నారు. ఈ నేపధ్యంలో గల్లా అనుచరులకు, గ్రామస్తుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ తోపులాటలో గల్లా వాహనం వెనుక అద్దం పగిలిపోయింది. దీంతో చిర్రెత్తిన గల్లా అనుచరులు గ్రామస్తులపై రాళ్లదాడికి దిగారు. కాసేపటికి గొడవ సద్దుమణగడంతో గల్లా అనుచరులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గంట తర్వాత గల్లా అనుచరులు, ఆమె ఫ్యాక్టరీ సిబ్బంది 300 మంది వరకు మళ్లీ గ్రామస్తులపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. తోటపల్లె రహదారిపై గల్లా, ఆమె అనుచరులు ధర్నా చేశారు. గంట పాటు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. తుమ్మలగుంటలోనే ఎత్తుగడ తనను తుమ్మలగుంటలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీనాయకులు అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని చేసేందుకు గల్లా ఎత్తుగడ వేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె రెండు రోజుల క్రితం తుమ్మలగుంటకు వచ్చారు. గ్రామ నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు, జెండాలు, తోరణాలు కట్టించారు. దీన్ని గ్రామస్తులు ప్రశ్నిస్తారని, తద్వారా తనను తుమ్మలగుంట గ్రామంలో అడ్డుకున్నారనే దుష్ర్పచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కుట్రపన్నారు. ఈ విషయంపై గ్రామస్తులు స్పందించకపోవడంతో ఆమె వ్యూహం బెడిసికొట్టింది. -
బొజ్జలపై బహిరంగంగా మండిపడ్డ బాబు
శ్రీకాళహస్తి: సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదరణ కరువవుతోంది. ఆయన ప్రసంగాలు వినేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. మంగళవారం శ్రీకాళహస్తిలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో జనం లేక వెలవెలబోయింది. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సరైన మైకు కూడా ఏర్పాటు చేయలేకపోయారంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిపై బహిరంగంగా మండిపడ్డారు. చంద్రబాబు తన పర్యటనలో అసంతృప్తులను బుజ్జగించేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు కనబడుతోంది.