ఓ పులి వందమందితో సమానం
తిరుపతి(మంగళం): అక్రమార్కులను కట్టడి చేయడానికి వందమంది సిబ్బంది ఉండడం కంటే ఓ పులి మేలు చేస్తుందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. అడవుల్లో పులి జోన్లు పెంచాలని ఆయన ఆదేశించారు. అటవీ సంపద కాపాడే యత్నంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు జోహార్ అంటూ అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి సెల్యూ ట్ చేశారు.
తిరుపతి శ్రీవెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల(ఎస్వీ జూపార్క్) వద్ద అటవీశాఖాధికారులు అమరవీరుల జ్ఞాపకార్థం స్థూపాన్ని, ఎస్వీజూ స్థాపించిన స్వర్గీయ సీఎం ఎన్‌టీ.రామారావు కాంస్య విగ్రహాన్ని సోమవారం ఆవిష్కరించారు. ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్‌ను ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ అతి దారణంగా చంపాడని, 13 మంది అటవీ శాఖ అధికారులు, సిబ్బందిని స్మగ్లర్లు హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ర్టంలోని అమరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. 1993లో ఎన్టీఆర్ 350 హెక్టార్లలో ఎస్వీ జూపార్క్‌ను ఏర్పాటు చేశారని, ఆయన జ్ఞాపకార్ధం ఇక్కడ ఎన్‌టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు.
ఆయుధాలు అందించడంలో విఫలం
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ అటవీశాఖ అధికారులకు కావాల్సిన ఆయుధాలు అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. అమరవీరుల కుటుంబాలకు అన్ని వసతులు కల్పిం చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఏనుగుల దాడుల్లో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిచాలన్నారు. స్వీ జూపార్క్ సిబ్బందికి ఆరు నెలల వేతనబకాయిలు చెల్లిం చాలన్నారు.
లేకుంటే జూపార్క్ వద్ద ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవడంతో పాటు అటవీశాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) ఏవీ. జోసెఫ్, పీసీఎఫ్ రవికుమార్, జూ క్యూరేటర్ యశోదాబాయ్, వైల్డ్‌లైఫ్ డీఎఫ్‌వో శ్రీనివాసులు, ఈస్ట్ డీఎఫ్‌వో శ్రీనివాసులురెడ్డి, రవిశంకర్, పవ న్‌కుమార్, జూ అసిస్టెంట్ క్యూరేటర్ శెల్వకుమార్, డాక్టర్ అరుణ్, టీడీపీ నాయకులు నరిసింహయాదవ్, శ్రీధర్‌వర్మ, కొండా రాజు పాల్గొన్నారు.